English | Telugu

సీఎం కేసీఆర్ అడిగారు.. పీఎం మోడీ క్లారిటీ ఇచ్చారు

ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలను ప్రధానికి వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని, మరణాల రేటు కూడా తక్కువగానే ఉందని కేసీఆర్‌ అన్నారు. కరోనా‌ వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే కరోనా‌ కేసులు నమోదవుతున్నాయని, ఇక్కడ కూడా వైరస్ వ్యాప్తి కొద్ది రోజుల్లో అదుపులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరుతో కరోనా మహమ్మారిపై తప్పక విజయం సాధిస్తామనే విశ్వాసం ఉందని కేసీఆర్ అన్నారు.

దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, దీనిపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని కేసీఆర్ కోరారు. దీనిపై స్పందించిన ప్రధాని.. దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ ఉండదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అన్‌లాక్‌ 1.0 నడుస్తోంది. అన్‌లాక్‌ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై చర్చించుకోవాలి అని ప్రధాని స్పష్టం చేశారు.

ఓ వైపు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.. మరోవైపు ప్రధానేమో లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే.. ప్రభుత్వ తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటది. కానీ, చివరికి ప్రజలే జాగ్రత్తగా ఉంటూ.. ఎవరి ఆరోగ్యం వారు కాపాడుకోవాలని అర్థమవుతోంది.