English | Telugu
హైకోర్టు వేసిన ప్రశ్నకు ఆర్డినెన్స్ తో జవాబు చెప్పిన కేసీఆర్ సర్కార్
Updated : Jun 17, 2020
గడిచిన మూడు నెలలుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతమే ఇస్తూ వస్తోంది. ఐతే వైద్య సిబ్బంది, పోలీసులకు మాత్రం పూర్తి జీతాలు ఇస్తోంది. మిగిలిన వారందరికీ మాత్రం కోతలు పెడుతోంది. ఐతే పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వం తన ఉద్యోగులకు రెండు నెలల పాటు సగం జీతాలే ఇచ్చినా...ఈ నెల నుండి పూర్తి జీతాలు ఇస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం.. కోతలను మరికొంత కాలం కొనసాగించాలని డిసైడ్ అయింది. ఐతే దీనిని ఎవరూ ప్రశ్నించకుండా ఉండడానికి నేరుగా చట్టం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపుగా మెరుగుపడడం తో పాటు మద్యం అమ్మకాలు కూడా ప్రారంభం కావడంతో ప్రభుత్వం శాలరీలు పూర్తిగా ఇస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశల పై ఈ ఆర్డినెన్స్ నీళ్లు చల్లింది.