ఏపీలో గత 24 గంటల్లో 15,188 శాంపిల్స్‌ను పరీక్షించగా 275 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో ఇద్దరు మరణించారు. కర్నూలులో ఒకరు, గుంటూరులో ఒకరు కరోనా కారణంగా మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,555 కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 90కి చేరింది. ఇప్పటివరకు 2,906 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 2,559 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.