రాజ్యసభ ఎన్నికలు.. నాలుగు స్ధానాల్లో వైసీపీ విజయం
ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ నాలుగు స్ధానాల్లో విజయం సాధించింది. రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు వైసీపీ అభ్యర్ధులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ విజయం సాధించారు.