English | Telugu
అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సర్కార్ ఝలక్
Updated : Jun 17, 2020
అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సందేహాలకు తావిస్తోంది. 2019 ఎన్నికల సమయం లో అగ్రిగోల్డ్ బాధితులతో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి బడ్జెట్‌లో రూ. 1150 కోట్లు కేటాయించి అందరికీ పంపిణీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఐతే మొదటి బడ్జెట్ వచ్చింది అందులో 1150 కోట్ల కేటాయింపులు కుడా చేసారు కానీ 264 కోట్లు మాత్రమే పంచారు. ఈ సొమ్ము కూడా గత టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం వేసి సిద్ధం చేసిన సొమ్ము. ఈ నిధులకు అదనంగా ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇపుడు తాజాగా రెండో బడ్జెట్ లో 200 కోట్లు కేటాయించారు. ఐతే ఈ మొత్తాన్ని ఎప్పుడు పంపిణి చేస్తారో తెలియని పరిస్థితి. దీంతో అగ్రిగోల్డ్ బాధితులు చలో అసెంబ్లీ పేరుతొ మరోసారి ఉద్యమానికి సిద్ధం కాగా వారిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కోర్టు పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మివేసి బాధితులందరికి పంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికి కోర్టు కూడా అనుమతులు ఇచ్చింది. కానీ ఆస్తుల అమ్మకం మాత్రం జరగడం లేదు. మరి ఏపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు ఎప్పటికి తీరుస్తుందో వేచి చూడాలి.