నేను నవ్వులు చిందిస్తాను నిప్పులూ కురిపిస్తాను! నేను హాయినిస్తే శీతలపవనాన్ని మాడ్చివేసే వడగాలి వీచికని!
Mar 5, 2012
మనసా! తెలుసా? - వడ్డెపల్లి కృష్ణ
మనిషి పుట్టిన నాడు తిరిగి గిట్టిన నాడు ఏడుపే ఎదురౌను మనసా! మధ్యలో కలిగేటి భోగభాగ్యలన్ని మిధ్యమే మరి నీకు తెలుసా?
Jan 21, 2012
మెరీనాబీచ్ - డాక్టర్ మణిగోపాల్
కవిత్వం లేని ఊరు అక్షరాలు వలసపోతాయి కలని చిత్రించే కలాలు ఇంకిపోతాయి కవిత్వం లేని ఊళ్ళో అమ్మకూడా పదినెలలు నిన్ను మోసిన కూలీయే! అక్కడ 'రక్తసంబంధం' సినిమా ఆడదు
Jan 21, 2012
మనసా! తెలుసా? - వడ్డెపల్లి కృష్ణ
ఒడ్డు చేరేదాక ఎవడైన గానీయి తెడ్డు వేయంటాడు మనసా! ఏరు దాటంగనే ఏమిటో గాని మరి ఎవరు నీవంటాడు తెలుసా
Jan 20, 2012
మొబైల్ పక్షులు నగరం నిండా పక్షులు ఒక్కో కువకువనీ చిదుగులా ఏరుకొచ్చి మాటల గూడు కట్టుకున్న పక్షులు హలో రాగాల హంసధ్వనుల నుంచి బైబై ముక్తాయింపుల ఆనందభైరవులు!
Jan 20, 2012
కలల అలల-కడలి నీవు ఆశనిరాశల-పడవనీవు ఆనందాల-ఆర్జవమీవు విషాదాల-నిశీధినీవు వివాదాల-మసీదు నీవు
Jan 20, 2012
పల్చటి ఉదయం కాలపు ఎండరంగులా నీ ఉనికి........ నా కనురెప్పల మధ్య స్వప్నంలా చిక్కుకుని, నీ ఆలోచన్ల రుచి -
Jan 19, 2012
'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి
కలయికలో ఎడబాటుంది ఎడబాటులో విరహం వుంది కలయిక ఎడబాటుల మధ్య జీవితం కొట్టుమిట్టాడుతుంది
Jan 19, 2012
'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి
తలుపుల్లేని హృది గదికి వలపుల తలుపులే నివాసం! బంధాల్లేవి జీవితానికి బర్లాతెరిచిన ఆకాశమే ఆవాసం
Jan 19, 2012
'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి
కలల పాదాల్లో అనుమానం గుచ్చుకుంటుంది కనుల నదుల్లో కల్వరవనం విచ్చుకుంటుంది.
Jan 19, 2012
'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి
ఆమె ఆత్మీయత ముందు అవనతవదనుణ్ణవుతాను భూమాతయందు మట్టి మనిషిలా! దేవత సన్నిధిలో భక్తుడిలా!!
Jan 19, 2012
'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి
ఆమె హృదయం పొయ్యి మీద పాలు పొంగుతాయి నేను పెదాల పంచదారను కలుపుతాను కనుల కప్పుల్లోంచి తేనీరు సేవిస్తాము
Jan 19, 2012
'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి