Facebook Twitter
సిటీబస్ బాబూ సిటీ బస్

సిటీబస్ బాబూ సిటీ బస్....

భాగ్యనగరం ...అన్నిటా బంగారు నగరం

స్త్రీల పయనాలకు మాత్రం దౌర్భాగ్యనగరం

గమ్యమెంత దగ్గరైనా తప్పనిసరి తగలాటం

పడుతూ లేస్తూ పరుగులెత్తించే బస్సు ల ఇరకాటం

బ్రతుకు తెరువుకై ఉపాధి తలచి

గూడును విడిచి అలసట మరచి

ఆదరాబాదరా పరుగెత్తుకొచ్చి

బస్సులెక్కే మహిళామణులూ...

చంటిపిల్లల్ని చంకనేసుకుని

ఒంటి కాలిపై నిలబడుతుండే చిట్టితల్లులు

చోటు చేసుకుంటూ తాకిడిలిచ్చే తాతలూ

ఏమెరుగనట్లు చేతులేస్తుండే నడివయసు రోతలూ

తాకిన చేతిని కాల్చేయాలనున్నా

ఏం చేయలేని నిస్సహాయతలో

చూపులతో హద్దులు దిద్దే వయసు హరిణలూ

కల్ళ నీళ్ళతో పక్కకు తొలగే ఇల్లాళ్ళూ

థూ...లెక్కెట్టేందుకు ఏళ్ళొచ్చిన ఎదవల మూక

ఏడ చెలీ చెల్లీ మనకు భద్రతనిచ్చే కేక

స్వాతంత్ర్య భారతీ...

ఏమిటి తల్లీ నీ బిడ్డలకీ దుర్గతీ.....

పద్మా శ్రీరామ్...