Facebook Twitter
మనస్సు - మురళీ

మనస్సు


- మురళీ

 

కలల అలల-కడలి నీవు

ఆశనిరాశల-పడవనీవు

ఆనందాల-ఆర్జవమీవు

విషాదాల-నిశీధినీవు

వివాదాల-మసీదు నీవు

ఆలోచనల-అంబుధినీవు

అభ్యుదయపు-వారధినీవు

అనంతభావాల-సాగరమీవు

అనుభవాల-ఆకలినీవు

ఆవేశాల-కేకవి నీవు

స్నేహానికి-ప్రాణంనీవు

ప్రేమకు-ప్రతిరూపంనీవు

అనురాగపు-బానిసనీవు

పగకోసం-వగచేవీవు

అద్భుతాల-ఆమని నీవు

నీవే నా జీవన-తొలి ఉషన్సు

నీ కోసమే- నా ఈ తపస్సు

నువ్వదుపులో ఉంటే-మోదం

అదుపుతప్పితే-ఖేదం

ఇన్ని రూపాలున్న

ఓ నా మనస్సూ-నీకో నమస్సూ

 

తొలివలపు

 

తలపుల వీణియపై-వలపుల తేనేలూరగా

ఆ మధువుల మధువనిలో-సుధలొలికే సింధువుగా

నాజీవన అమనిలలో-సమ్మోహన కామినివై

నా ఆశల సుమవనంలో - కుసుమంలా విరబూయగ

రావా ఓ నా చెలియా-ప్రేమ బాసలే చేయ

మదిలో-సవ్వడిగా-నెమ్మదిగా

హరివిల్లులా-చిరుజల్లులా-సిరిమల్లెలా

తొలి ప్రేమలో-తడబాటులా-సరిబాటలా

యెద పొంగగా-మనసూగగా-మూగగా

ప్రశాంత కాంతి-యామినిలో

అనంత శాంతి-కౌముదిలా

వాలే ఆ నయనాలు-అదిరే ఆ అధరాలు

తెలుపకనే తెలిపెనులే-తొలి వలపు ప్రేమనే