Facebook Twitter
కాలం ఒక ప్రవాహం
కాలం ఒక ప్రవాహం..
కాలం ఒక ప్రవాహం..
అది నిత్యం పరిగెడుతుంది..
తనలో ఎన్నో మార్పులు ప్రతిక్షణం

గతించిన కాలం లో ....
మనిషి తన నీడల్ని వెతుకుతున్నాడు..
చరిత్ర లో తన పేజీలు ఉన్నాయేమో అని చూస్తున్నాడు

ముందు ఆదిమ కాలం
అక్కడ తనకు గుడ్డలే లేవు
సిగ్గేసి వచ్చేశాడు

తర్వాత రాచరిక కాలం
బానిసత్వపు ఛాయలు చూసి
బాధేసింది

ప్రజాస్వామ్య కాలం
చాలా బాగుంది అనుకున్నాడో లేదో
ఎక్కడొ అవినీతి కంపు మొదలైంది..

ఇక వెతకడం పిచ్చి పని
అనుకున్నాడో ఏమో...
వెతకడం మానేసి...
కన్నీటిని రాల్చాడు...
చిత్రం గా ఆ కన్నీరు కూడ...
ఆ ప్రవాహం లోనే..............


రచన - పవన్ కుమార్
pavanjalla@gmail.com