Facebook Twitter
నేను? - డా.ఎన్.కిశోర్ కుమార్

నేను


డా.ఎన్.కిశోర్ కుమార్, జర్మనీ

 

నేను నవ్వులు చిందిస్తాను

నిప్పులూ కురిపిస్తాను!

నేను హాయినిస్తే శీతలపవనాన్ని

మాడ్చివేసే వడగాలి వీచికని!

ఇట్టే కరిగే వెన్నని

చలనం లేని శిలని!

ప్రభాత కిరణాన్ని

చిమ్మచీకటిని!!

చల్లని వెన్నెలని

చండప్రచండ సూర్యకిరణాన్ని!

పిల్ల కాలువను

మహాసంద్రాన్ని!!

అందివచ్చిన అవకాశాన్ని

పొంచిఉన్న ప్రమాదాన్ని!

సుతిమెత్తని తివాచీని

నడువజాలని ముళ్ళబాటని!!

మధురమయిన సంగీతాన్ని

భాయోత్సత ప్రళయ ఘోషను!

నా గుండెలోతుల్లో

ప్రణయం కనిపిస్తుంది

ప్రళయం గోచరిస్తుంది

అర్థమయ్యే ఓ సిద్ధాంతాన్ని

అంతుబట్టని ఓ వేదాంతాన్ని!!