ఆలీకి బ్రహ్మనందం సత్కారం

      టాలీవుడ్ స్టార్ కామెడియన్ ఆలీ ఇటీవల డాక్టరేట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో టాలీవుడ్ సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందం తన ఇంట్లో ఆలీ ని సత్కరించారు. తెలుగులోని ఇతర హాస్యనటులు, బ్రహ్మనందం దంపతుల సమక్షంలో ఈ సత్కారం జరిగింది. ''అలీకి గౌరవ డాక్టరేట్ రావడం ఆనందదాయకం, మన పరిశ్రమలో గౌరవ డాక్టరేట్ కు అర్హులైన వారు ఇంకా చాలామంది ఉన్నారు, అలీతో ఆ పరంపర మొదలైందని అనుకుంటున్నాను” అని బ్రహ్మనందం అన్నారు. అలీ నాకు తమ్ముడి లాంటి వాడు, ఇంకా ఇలాంటి పురస్కారాలెన్నో ఆయన అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.   గౌరవ డాక్టరేట్ రావడం కన్నా ఆ సందర్భంగా తనింట్లో నన్ను మా సీనియర్ బ్రహ్మానందం గారు సత్కరించడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందని అలీ అన్నారు. 'బ్రహ్మానందం గారికి డాక్టరేట్ వచ్చినప్పుడు నా తర్వాత నీకే వస్తుందిరా అన్నారు. ఆయన మాటలను తథాస్తు దేవతలు విని ఆశీర్వదించినట్లున్నారు. నాకు ఆ గౌరవం దక్కింది' అన్నారు. ఈ కార్యక్రమానికి సునీల్, బ్రహ్మాజీ, కృష్ణభగవాన్, పోసాని, గుండు హనుమంతరావు తదితర సినీనటులు హాజరయ్యారు.

తండ్రుల తహ తహ!

      "హ్యాపీడేస్" చిత్రంతోనే లక్షలాది పురుష పుంగవులు వయోభేదం లేకుండా తమన్నాపై మనసు పారేసుకున్నారు. "రచ్చ" సినిమా ఆమె కోసమే ఆడిందన్న అందమైన ఆరోపణలు సైతం తమన్నా ఎదుర్కోవటం మనకు తెలుసు. సామాన్య ప్రేక్షకులు, కుర్ర హీరోలు మాత్రమే కాదు.. వయసు మళ్లిన హీరోలు సైతం ఆమెతో నటించాలని తహతహలాడుతుండడం చర్చనీయాంశమవుతోంది. "రచ్చ" ఆడియో ఫంక్షన్‌లో తమన్నాను చూస్తుంటే.. తన ఒకవేళ 150వ చిత్రంలో నటిస్తే ఆ చిత్రంలో తమన్నాను హీరోయిన్‌గా పెట్టుకోవాలనిపిస్తోందని చిరంజీవి ప్రకటిస్తే.. రీసెంట్‌గా అదే పని నాగార్జున కూడా చేసేసారు. "తడాఖా" ఆడియో ఫంక్షన్‌లో తమన్నా అందాలపై ప్రత్యేక ప్రశంసలు కురిపించిన నాగార్జున.. ఆమెతో నటించాలని ఉందంటూ తన ఆ"కాంక్ష"ను వెలిబుచ్చారు. తమ కుమారులతో నటించిన హీరోయిన్‌తో తాము నటించాలని ఈ ఇద్దరూ సరదా కోసమైనా ఆశపడడం.. తమన్నాకు గల క్రేజ్‌ను తేటతెల్లం చేస్తున్నది. తండ్రి సరసన నటించిన శ్రీదేవితో ఏకంగా రెండు చిత్రాల్లో నటించిన నాగార్జున.. తన కుమారుడు నాగచైతన్యతో రెండు సినిమాల్లో నటించిన తమన్నాతో ఒక చిత్రంలోనైనా నటిస్తాడేమో చూడాల్సిందే!

త్రిషకి అదిరిపోయే ఆఫర్

      త్రిష సినీ కేరియార్ ముగింపు దశలో వున్న టైమ్ లో ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. తమిళ్ లో సూర్య సరసన నటించే సూపర్ ఛాన్స్‌ను కొట్టేసింది త్రిష. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో సూర్య నటించే చిత్రంలో హీరోయిన్‌గా త్రిష ఎంపికైంది. మొదట్లో సూర్యకు జంటగా అమలాపాల్‌ పేరును పరిశీలించారు. ప్రస్తుత తనస్థాయి ఆధారంగా అవకాశం దక్కుతుందని అమలాపాల్‌ కూడా ఆశలు పెంచుకుంది. అయితే ఊహించని విధంగా త్రిష పేరు తెరపైకి వచ్చింది. తమిళంలో ఈ చిత్రానికి "ధృవ నచ్చిత్రం" (ధృవ నక్షత్రం) అనే పేరు పెట్టారు. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఈ ఆఫర్‌తో త్రిష కెరీర్‌కు మరో అయిదారేళ్లు "ఎక్స్‌టెన్షన్" లభించినట్లే. నిన్నటివరకు త్రిషను చిన్నచూపు చూసినవాళ్లంతా.. మళ్లీ ఇప్పుడు "పెద్ద చూపు" చూసే పరిస్థితి ఏర్పడింది!

సతమతమవుతున్న సమంత !

      తనతో నటించే హీరోయిన్స్‌ను ఓ ప్లాన్ ప్రకారం "లైన్"లో పెట్టుకోవడంలో సిద్దార్ద్ సిద్ధహస్తుడు. హిందీలో తనతోపాటు ఓ చిత్రంలో నటించిన సోహా అలీఖాన్ (సైఫ్ అలీఖాన్ సోదరి) కావచ్చు.. లేక "అనగనగా ఓ ధీరుడు" చిత్రంలో తనతో జతకట్టిన శృతిహాసన్ కావచ్చు.. ఎవరినైనా సరే ఇట్టే ఆకట్టేసుకుంటాడు. అంతేకాదు.. తమ మధ్య ఉన్న "సంబంధం" మీడియాకు లీకయ్యేలా "తగిన" జాగ్రత్తలు తీసుకొని.. ఎప్పుడూ వార్తల్లో ఉండడంలో సిద్దార్ధను మించినవాళ్లు మరొకరు లేరు. "జబర్‌దస్త్"లో తనకు జోడీగా నటించిన సమంతను కూడా ఇలాగే ముగ్గులోకి దించాడు సిద్దార్ధ. టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న సమంతతో తను "సహజీవనం" (లివ్ ఇన్ రిలేషన్ షిప్) చేస్తున్న విషయం మీడియాకు పొక్కేలా చేశాడు. "విషయం" బయటకు వచ్చేయడంతో "సరదా ఎఫైర్" అనుకొన్నది కాస్తా.. "సీరియస్ ఎఫైర్" అయిపోయి కూర్చుంది. దీనికితోడు "సమ్‌థింగ్.. సమ్‌థింగ్" చిత్రంలో సమంతతో స్పెషల్ గెస్ట్ రోల్ చేయించి ఆమెను పూర్తిగా ఇరికించేసాడు. అంతేకాదు.. "త్వరలోనే పెళ్లి" అనే పుకారును కూడా తెరమీదకు తెచ్చేసాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక సమతమమైపోతోంది సమంత. నిజానికి పన్నెండు పదమూడేళ్ల క్రితం విడుదలైన "బోయ్స్" చిత్రంతో హీరోగా పరిచయమైన నాటికే సిద్దార్ధకు పెళ్లయిపోయింది. అంతకుముందు అతను కొంతకాలం మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక భార్యతో తెగతెంపులు చేసుకొని.. హీరోయిన్స్‌ను లై‌లో పెట్టడం మొదలుపెట్టాడు. సిద్దార్ధ్ వయసు కొంచెం అటు ఇటుగా 40. "నాలుగుపదుల వయసు వాడిని కట్టుకుని నువ్వేం సుఖపడతావ్?" అంటూ ఫ్రెండ్స్_వెల్ విషర్స్ హెచ్చరిస్తుండడంతో ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు సమంతకు!

ప్రభాస్ కు వచ్చేఏడాది పెళ్ళి చేస్తాం: కృష్ణంరాజు

        ప్రముఖ హీరో ప్రభాస్ వివాహాం వచ్చే ఏడాది చేస్తామని ప్రభాస్ పెదనాన్న, ప్రముఖ నటుడు, నిర్మాత కృష్ణంరాజు చెప్పారు. ఆయన విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆగస్టులో ప్రభాస్ హీరోగా నిర్మించే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో ఓ పెళ్లికి హాజరయిన ప్రభాస్ కూడా తను వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని అన్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, దగ్గుబాటి రాణాల కాంబినేషన్ లో ’బాహుబలి’ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా నిర్మాణానికి దాదాపు ఏడాది కాలం పట్టేలా ఉంది. అందుకే ఈ సినిమా పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తోంది.

సమంతతో పెళ్ళి.. సిద్దార్థ్ ట్విస్ట్

        సమంత, సిద్దార్థ్ ల మధ్య 'సమ్‌థింగ్.. సమ్‌థింగ్' నడుస్తుందని, త్వరలో వాళ్ళు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సిద్దార్థ్ తన ప్రేమ పెళ్ళి పై మీడియా తో మాట్లాడారు. '' సహజంగా నిప్పులేనిదే పొగ రాదంటారు..కాని నా విషయంలో నిప్పు లేకుండానే పొగ వస్తుంది. నేను ఎవరితోనూ ఎలాంటి రిలేషన్ లో లేను. తల్లిదండ్రులు చూసే అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాను'' అని స్పష్టం చేశారు. సిద్దార్థ్, హన్సిక జంటగా సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్'. ఈ చిత్రం జూన్ 14న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది. బ్రహ్మానందం ఈ చిత్రంలో లవ్ గురు గా హైలెట్ కానున్నారు.

మాటివి అవార్డ్స్‌పై మహేష్ ఫైర్ !

        2012కు గాను మాటివి ఇవ్వనున్న అవార్డ్స్‌కుగాను "బిజినెస్‌మేన్" చిత్రాన్ని "ఉత్తమ నటుడు" అవార్డ్స్ కోసం నామినేట్ చేయకపోవడం పట్ల మహేష్‌బాబు తన ట్విట్టర్ ద్వారా నిరసన వ్యక్తం చేసారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే మహేష్‌బాబు తన ట్విట్టర్ ద్వారా మాటివి అవార్డ్స్‌పై మండిపడడం సహజంగానే చర్చనీయాంశమవుతోంది.    "2012 మా అవార్డ్స్ కోసం బెస్ట్ యాక్టర్ కేటగిరీలో "బిజినెస్‌మేన్"ను నామినేట్ చేయకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటె నేను అత్యుత్తమ నటన కనబరిచిన చిత్రాల్లో "బిజినెస్‌మేన్" ఒకటి" అంటూ మహేష్‌బాబు ట్వీట్ చేసారు.   "ఒన్ నేనొక్కడినే" షూటింగ్ కోసం నేనో రెండు నెలలపాటు విదేశాలలో ఉండబోతున్నాను. అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరయ్యే అవకాశం లేదు కాబట్టి.. నన్ను నామినేట్ చేసి ఉండరు" అంటూ దెప్పిపొడిచారు కూడా మహేష్‌బాబు!

రేణుని మిస్ అవుతున్న పవన్ కళ్యాణ్

        అసలే సహజీవనం చేసి, పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లల్ని కూడా కన్న తరువాత పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ లు విడిపోయినట్లు టాలీవుడ్ మొత్తం టాం టాం అయిన విషయం మీకు తెలిసిందే. ఈ విషయం గురించి మెగా ఫ్యామిలీ కూడా సైలెంట్ అవడంతో అందరూ నిజమనే అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే...   ఈ మధ్య మెగా ఫ్యామిలీ హీరోలు ఏ చిత్రం చేసిన కూడా అందులో రేణుదేశాయ్ పేరు వేస్తున్నారు. దాంతో పవన్ కి రేణుని ఎంత మిస్ అవుతున్నాడో తెలుసుకొని, త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న తాజా చిత్రానికి అత్తారింటికి దారేది అనే టైటిల్ పవన్ పట్టుబట్టి మరి ఓకే చేయించాడట. ఈ చిత్ర షూటింగ్ సమయంలో తన కూతురుతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తున్నాడు. అదే విధంగా ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో రేణు కూడా వచ్చే అవకాశాలున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

శ్రియ చూసి భయపడుతున్న ఛార్మి

        అగ్ర హీరోలందరితో నటించిన అందాల శ్రియ కు ఈ మధ్య సినిమా అవకాశాలు పూర్తిగా రావడమే లేదు.పబ్బుల్లో తాగి తాగి, తన లైఫ్ ని ఏదో ఒక విధంగా కొనసాగిస్తుంది. తను పబ్బుల్లో తాగి ఎంజాయ్ చేసిన ఫొటోస్ అన్ని కూడా ఇప్పటికే నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ అమ్మడు వేశ్య పాత్రలో నటించిన తాజా చిత్రం పవిత్ర. ఈ చిత్రం ఇటీవలే విడుదలై ప్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం చుసిన ప్రతి ఒక్కరికి తలపోటు తప్ప, సినిమా చుసామనే సంతృప్తి ఎవరిలో కనిపించట్లేదు. దీంతో శ్రేయ మళ్ళీ పబ్బులో మందు కొడుతు టైం పాస్ చేస్తుందట.   ఇదిలా ఉంటే... పబ్బులో ఎంజాయ్ చేసే మరో బ్యూటీ చార్మింగ్ గర్ల్ ఛార్మి ఒకరు. ఈ అమ్మడికి సినిమా అవకాశాలు రావడం తక్కువ అవడంతో బయట జరిగే డాన్స్ ప్రోగ్రామ్స్ కి వెళ్తుంది. అయితే ఛార్మి నటిస్తున్న తాజా చిత్రం ప్రేమ ఒక మైకం. ఈ చిత్రంలో ఛార్మి కూడా వేశ్య పాత్రలో నటిస్తుంది. శ్రేయ వేశ్య పాత్రలో నటించిన పవిత్ర సినిమా ఎలాగో అట్టర్ ప్లాప్ అవడంతో.. తన సినిమా కూడా అలాగే అవుతుందని ఛార్మి భయపడుతుంది. మరి ఈ సినిమాతో ఛార్మి తన సినిమాలు కొనసాగిస్తుందో లేక మళ్ళీ పబ్బులు, పార్టీలు అంటూ సినిమాలకు మెల్లి మెల్లిగా దూరం అవుతుందో చూడాలి.

తమన్నా మూడు పడవల ప్రయాణం

        టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా తెలుగు, తమిళ్, హిందీ భాషల చిత్రాలతో బిజీ బిజీగా ఉంటుంది. కోలివుడ్ లో సరైన అవకాశం రాక టాలీవుడ్ కి వచ్చి టాప్ హీరోయిన్ గా మారిన తమన్నా, తరువాత కోలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు సంపాదించుకొని తమిళ్ ఇండస్ట్రీలో కూడా టాప్ హీరోయిన్ లలో ఒకరిగా నిలిచింది. ఇదిలా ఉంటే... తాజాగా హిమ్మత్వాలా చిత్రంతో బాలీవుడ్ కి వెళ్ళిన తమన్నాకి ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం కాకపోయినా కూడా తమన్నా అందానికి బానిసైన అక్కడి దర్శక నిర్మాతలు తమ్మన్నా డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.   ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో కలిసి హలో బ్రదర్ రీమేక్ లో, తమిళ్ లో అజిత్ సరసన ఓ చిత్రంలో నటిస్తుంది. హిమ్మత్వాలా చిత్రం తర్వాత ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో కలిసి ఓ చిత్రంలో నటించనుంది. మరి ఈ మిల్క్ భామ మూడు భాషల సినీ ప్రయాణం ఇంకెన్నిరోజులు చేస్తుందో చూడాలి.

అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీ చిత్రాలు

      ఒకప్పుడు జగపతిబాబు, శ్రీకాంత్ వంటి హీరోలు కుటుంబకథా చిత్రాలు చాలా చేసి ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించేవారు. అప్పుడంటే జనాలు అలా ఉండేవారు కాబట్టి ఏం తీసిన చూసేవారు కానీ ఇప్పుడంటే అల కాదు కదా? అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.... ప్రస్తుతం లవ్, యాక్షన్, మాస్ మసాలా సినిమాలు తప్ప ఏమి కనిపించడం లేదు. దీంతో కుటుంబంతో కలిసి చూసే సినిమా అని ఏ చిత్రం కూడా అనిపించుకోవట్లేదు.   అయితే ఎలాగైనా కుటుంబ కథ చిత్రాలు తీసి ప్రేక్షకులను మళ్ళీ థియేటర్లకు రప్పించాలని... వాళ్ళ కుటుంబ సభ్యులతోనే చిత్రాలు తీసేస్తున్నారు. మరి వాళ్ళెవరో ఒకసారి చూద్దామా.     తెలుగు సినిమా ముడు తరాల హీరోలు ఒకే చిత్రంలో కనిపించడానికి సిద్దమయ్యారు. అక్కినేని వంశం నుండి నాగేశ్వర్ రావు, నాగార్జున, నాగచైతన్యలు కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి మనం అనే టైటిల్ ఖరారు చేసారు. ఇష్క్ చిత్రం తర్వాత విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అదే విధంగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు, నిర్మాత డా. మంచు మోహన్ బాబు తన కొడుకులు విష్ణు, మనోజ్ లతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ విదేశాలలో జరుపుకుంటుంది. ఎన్నో చిత్రాలను తన సంస్థలో నిర్మించిన నటుడు, నిర్మాత డా. రామానాయుడు... తన తదుపరి చిత్రాన్ని తన కుటుంబం లోని హీరోలతో చేయనున్నారు. ఈ చిత్రంలో రామానాయుడు, సురేష్ బాబు, వెంకటేష్, రానా, నాగచైతన్యలు నటిస్తున్నారు. మరి వీళ్ళ కుటుంబాలతో అయినా త్వరలో కుటుంబ కథా చిత్రాలు వస్తాయో లేదో చూడాలి.

హీరో అల్లు శిరీష్ పై యువతి పిర్యాదు

      స్టైలిష్ అల్లు అర్జున్ తమ్ముడు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ పై ఓ యువతి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అల్లు శిరీష్ పబ్ లో మద్యం సేవించి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఢిల్లీ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అల్లు శిరీష్ తండ్రి అల్లు అరవింద్ కు తీవ్ర ఇబ్బందికరంగా మారనుంది. రీసెంట్ గా రామ్ చరణ్ నడి రోడ్డుపై పెద్ద విద్వంస౦ సృష్టించాడు. తన కారును ఓవర్ టేక్ చేశారని ఇద్దరు వ్యక్తులపై తన బాడీగార్డ్ లతో కొట్టించాడు. బాధితులు పోలీసులకు కూడా పిర్యాదు చేశారు. రాజకీయాల్లో నానా యాతనలు పడుతున్న చిరంజీవికి, మెగా హీరోలు తీసుకొస్తున్న ఈ వివాదాలు తలనొప్పిగా మారాయి.

ఇవివి సత్యనారాయణ జయంతి

        తెలుగు సినిమాకు కమర్షియల్‌ కామెడీ అందించిన అతి కొద్ది మంది దర్శకులల్లో ఆయన ఒకరు.. జంద్యాల లాంటి మహామహులు అందిస్తున్న సున్నితమైన కామెడీకి దూరంగా ఆ కామెడీకి కాస్త స్పైస్‌ జోడించి తెలుగు తెరమీద నవ్వులు పువ్వులు పూయించిన దర్శకుడు ఇవివి సత్యనారాయణ.. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తన కంటచూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఇవివి గారి జయంతి సందర్భంగా ఆ నవ్వుల రారాజు జీవిత విశేషాలను తెలుసుకుందాం.. తెలుగు తెరకు మెమరబుల్‌ సక్సెస్‌లు అందించిన ఇవివి.. 1958 జూన్ 10న పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో జన్మించారు. 42 తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీలో అమితాబ్ నటించిన సూర్యవంశానికి కూడా దర్శకుడు ఈవీవీనే. ఈవీవీ తల్లిదండ్రులు వెంకటరావు, వెంకటరత్నం. భార్య సరస్వతి కుమారి. తరువాత ఆయన వారసులుగా ఇద్దరు కుమారులు ఆర్యన్‌ రాజేష్‌, అల్లరి నరేష్‌లను హీరోలుగా పరిచయం చేశారు..   1990లో చెవిలో ఫువ్వు సినిమాతో దర్శకత్వ అరంగేట్రం చేసిన ఇవివి...తొలి ప్రయత్నంలో అనుకున్న విజయం సాదించలేక పోయారు..కాని అదే ఏడాది ప్రేమ ఖైదీ చిత్రంతో మెగా హిట్‌ను దక్కించుకున్నారు. జంధ్యాల వద్ద కొన్నాళ్లు సహాయకుడిగా పనిచేసిన ఇవివి... ఇంద్రుడు-చంద్రుడు సినిమాలో పోలీస్ అధికారి క్యారెక్టర్ వేసి తనలోని నటున్ని కూడా పరిచయం చేశారు.  వెరైటీ టైటిల్స్ పెట్టినా, గోదావరి యాస డైలాగులు పలికించినా, కామెడీ క్యారెక్టర్లన్నిటినీ వరసపెట్టి ఒకే సినిమాలో చూపించినా... అవన్నీ ఇవివికే చెల్లాయి. ఫిట్టింగ్ మాస్టర్.. బెండు అప్పారావు ఆర్‌ఎంపీ.. తొట్టిగ్యాంగ్.. దొంగల బండి.. ఎవడి గోల వాడిది.. వీడెక్కడి మొగుడండీ.. అదిరింది అల్లుడూ.. కితకితలు.. ఇలాంటి టైటిల్స్ విన్నప్పుడల్లా ఆయన మార్క్‌ కొట్టోచ్చినట్టుగా కనిపిస్తుంది, అదే ఇవివి స్టైలంటే. ఇవివి తల్లిదండ్రులు స్థిరపడింది నిడదవోలు మండలం కోరుమామిడిలో. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇవివికి చిన్నప్పటి నుంచే సినిమాలంటే విపరీతమైన ఇష్టం. టెన్త్ వరకూ బుద్ధిగానే చదివిన ఆయన నిడదవోలు కళాశాలలో ఇంటర్లో చేరాక... క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూసి చివరకు పరీక్ష తప్పారు. తరవాత వ్యవసాయం కూడా కలిసి రాకపోవడంతో తనకు ఎంతో నచ్చిన సినీరంగంలో స్థిరపడాలనుకున్నారు ఇవివి.. అలా చెన్నై చేరిన ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోన్నారు.. ఆ సమయంలో ఇండస్ట్రీలో బతకటం అంత ఈజీకాదు.. తిరిగి ఊరికి వెళ్లిపొమ్మని చెప్పిన వాళ్లు ఉన్నారు.. కాని ఆయన ఏ రోజు నిరాశపడలేదు.. తొలిసారిగా దేవదాసు కనకాల దర్శకత్వంలో రూపొందుతున్న ఓ ఇంటి భాగోతం సినిమాకు సహాయ దర్శకుడిగా జాయిన్‌ అయ్యారు.. అప్పటినుంచి ఇవివి వెనుదిరిగి చూడలేదు. ప్రముఖ దర్శకుడు జంధ్యాలకు శిష్యుడిగా మారిన తరువాత ఆయనకు తన గమ్యం ఏంటో, తను ఎంటు సినిమాలను తీయగలడో తెలుసుకున్నాడు. తొలి సినిమాతో నిరాశపడినా.. తరువాత రామానాయుడు నిర్మించిన ప్రేమఖైదీ చిత్రంతో ఇవివికి బ్రేక్‌ వచ్చింది. ఆ చిత్రం విజయవంతం కావటంతో ఇవివికి మంచి అవకాశాలు వచ్చాయి. జంధ్యాల కంటే కొంచెం ఘాటైన హాస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు. రాజేంద్రప్రసాద్ హీరోగా ఆ ఒక్కటీ అడక్కు, అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజను దొంగలు వంటి చిత్రాలు తీశారు. జంబలకిడి పంబ, సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది లాంటి చిత్రాల తరువాత మహిళలు మెచ్చిన తాళి, ఆమె వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అగ్ర నటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో భారీ బ్లాక్‌ బస్టర్‌లను అందించారు ఇవివి. రంభ, ఊహ, ఆమని, రవళి వంటి నటీమణులతో పాటు పవన్‌కళ్యాణ్‌ను కూడా తెలుగు తెరకు పరిచయం చేశారు ఇవివి.  తరువాత తన వారసులుగా ఆర్యన్‌ రాజేష్‌, అల్లరి నరేష్‌లను హీరోలుగా పరిచయం చేసిన ఆయన వారిద్దరితో కూడా మంచి సక్సెస్‌ఫుల్‌ సినిమాలను అందించారు..   ఇలా తెలుగు తెరకు ఎన్నో మరపురాని చిత్రాలు అందించిన ఇవివి సత్యనారాయణగారు భౌతికంగా మనతో లేకున్నా నవ్వు బతికున్నంత కాలం మనతోనే ఉంటారు.. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఆ కామెడీ కింగ్‌కు మరోసారి నివాళులర్పిద్దాం.  

పవన్ కళ్యాణ్ తో నటించేందుకు మహేష్ రెడీ

          టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు ఇక చూడలేము అనుకుంటున్న టైంలో ట్రెండ్ ను మార్చిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ అయిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ’ సినిమా తో టాలీవుడ్ కి మళ్ళీ మల్టీ స్టారర్ రుచి చూపించాడు. ప్రిన్స్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ లాంటి పెద్ద హీరోలు ఒకే సినిమాలో నటించడం, దానికి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ రావడంతో తెలుగు సినిమాలో మళ్లీ ఈ సందడి మొదలైంది. గత కొంత కాలంగా మహేష్..పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. వీటిపై మహేష్ బాబు స్పందించారు. మంచి కథ దొరికితే పవన్ తో సినిమా తప్పక చేస్తానని, దానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదనీ చెప్పాడు మహేశ్. సో త్వరలో టాలీవుడ్ మరో బిగ్ మల్టీ స్టారర్ మూవీ ఎక్స్ పెక్ట్ చేయోచ్చు.

సంగీత దర్శకుడు జెవి రాఘవులు అస్తమయం

        జననీ జన్మ భూమిశ్చ లాంటి దేశభక్తి గీతాలు.. చినుకు చినుకుగా లాంటి విరహగీతాలు. ఇంట్లో రామయ్య వీదిలో కృష్ణయ్య లాంటి హుషారెత్తించే పాటలు.. ఈ జీవన తరంగాలలో లాంటి వేదాంత గీతాలు.. ఆయన స్వరం చేయని పాటలేదు.. ఆస్వరం పాడని పాటా లేదు.. ఆయన సుమధుర సుస్వర సంగీత దర్శకుడు జెవి రాఘవులు.. ఎన్నో మరపురాని మథుర గీతాలను అందించిన రాఘవులుగారు ఈ ఉదయం తుది శ్వాస విడిచారు.. తెలుగు సినిమాకు ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలను అందించిన ఈ సంగీత ప్రవాహానికి నివాళులర్పిద్దాం..   ఘంటసాల ప్రియశిష్యుడిగా ప్రస్థాన్నాన్ని ప్రారంభించిన ఆయన ఎన్నో మరుపురాని గీతాలతో గాయకుడిగా మరెన్నో విజయవంతమైన చిత్రాలతో సంగీత దర్శకునిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.. దాదాపు 112 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.. నాటకాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన తరువాత రేడియోలో పాటలు పాడేవారు.. ఒకసారి రికార్డింగ్‌లో ఆయన పాట విన్న ఘంటసాల గారు ఆయన్ను తన శిష్యునిగా స్వీకరించి ఆయన సినీ ప్రయాణానిరి బాటలు వేశారు.. ఘంటసాల పిలుపు అందుకున్న రాఘవులు గారు మరో ఆలోచన లేకుండా కనీసం ఇంట్లో తన తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా మద్రాసు ట్రైన్‌ ఎక్కేశారు.. ఘంటసాల గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరారు.. ఘంటసాల గారు స్వరపరిచిన ఎన్నో సినిమాల్లో రాఘవులు గారు పాటలు పాడారు.. వాటిలో లవకుశ, జగదేకవీరుని కథ, పరమానందయ్య శిష్యుల కథ లాంటి సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలతో జెవి రాఘవులుకు గాయకునిగా కూడా మంచి గుర్తింపు వచ్చింది.. కేవలం ఘంటసాల గారితోనే కాదు.. కెవి మహదేవన్‌, ఎమ్‌ ఎస్‌ విశ్వనాధన్‌ సంగీత దర్శకుల సినిమాలలో కూడా చాలా పాటలు పాడారు.. సంగీత దర్శకునిగా మారకముందే వందల సంఖ్యలో పాటలు పాడారు.. కెవి మహాదేవన్‌ సంగీతం అందించిన ప్రేమ్‌నగర్‌ సినిమాలో కూడా ఓ పాట కంపోజ్‌ చేశారు రాఘవులు.. వ్యక్తిగత కారణాలతో ఓ పాట చేయకుండానే మహదేవన్‌గారు తప్పుకోవడంతో ఆ సినిమాలోని ఎవరి కోసం పాటను రాఘవులుగారు కంపోజ్‌ చేశారు.. 1970లో ఘంటసాలగారి మరణంతో తప్పని పరిస్థితుల్లో ద్రోహి సినిమాతో పూర్తి స్థాయి సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు రాఘవులు.. తరువాత ఎక్కువగా దాసరి, కోడి రామకృష్ణ లాంటి దర్శకుల సినిమాలకు పని చేశారు.. అప్పట్లో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న  ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి లాంటి స్టార్‌ హీరోలందరి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. వీరి కాంభినేషన్‌లో ఎన్నో సూపర్‌ హిట్స్‌ కూడా వచ్చాయి.. సినీ రంగం చైన్నైలో ఉన్నన్ని నాళ్లు స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వెలుగొందిన రాఘవులు గారికి ఇండస్ట్రీ హైదరాబాద్‌ వచ్చాకా అవకాశాలు తగ్గిపోయాయి.. దీంతో ఆయన తన సొంత ఊరు రాజమండ్రిలో స్థిరపడిపోయారు.. వందకు పైగా  సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన రాఘవులు గారు చివరి దశలో ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. ఇలా తెలుగు కళామతల్లికి పాటల పట్టం కట్టిన జెవి రాఘవులు గారు.. ఈ లోకాన్ని విడిచినా ఆయన పాటలతో ఎప్పుడూ మనతో ఉంటారు.. మరోసారి ఆ సంగీత సాగరానికి నివాళులర్పిద్దాం  

ఈ సారి అఫిషియల్‌ రీమేక్‌

              అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కి గ్రాండ్‌గా పరిచయం అయిన దర్శకురాలు నందినీ రెడ్డి.. మేల్‌ డామినేటెడ్‌ ఇండస్ట్రీలో అవకాశాలు సాదించటమే కాదు తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా తెచ్చుకుంది నందిని..   తొలి సినిమా అలామొదలైందితో తను సక్సెస్‌ సాదించటమే కాకుండా నాని, నిత్యామీనన్‌ల కెరీర్‌కు కూడా ఓ బ్లాక్‌బస్టర్‌ అందించింది. దీంతో నందినికి తొలి సినిమాతోనే మంచి డైరెక్టర్‌గా ముద్రపడింది..         కాని ఆ పేరును కాపాడుకోవటంలో ఫెయిల్ అయింది నందిని.. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో విడుదలైన తన రెండో సినిమా జబర్ధస్త్‌ డిజాస్టర్‌ అయింది.. సిద్దార్ధ్‌ హీరోగా సమంత నిత్యామీనన్‌ లాంటి హీరోయిన్లు ఉండి కూడా ఈ సినిమాకు సక్సెస్‌ టాక్‌ తీసుకురాలేకపోయారు..         జబర్ధస్త్‌ సినిమా ఫ్లాప్‌ కావడమే కాకుండా ఈ సినిమా హిందీలో రిలీజ్‌ అయిన బ్యాండ్‌ బాజా బారాత్‌ సినిమా రీమేక్‌ అన్న టాక్‌తో నందిని ఇమేజ్‌ మరింత పడిపోయింది.. దీంతో నెక్ట్స్‌ అఫిషియల్‌గా ఓ రీమేక్‌ సినిమా చేసే ఆలోచనలో ఉందట నందినీ రెడ్డి..         గతంలోనే సురేష్‌ ప్రొడక్షన్‌తో అగ్రిమెంట్‌ చేసుకున్న నందినీ రెడ్డి ఆ బ్యానర్‌లో రానా హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటుంది.. బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన యే జవానీ హై దివాని సినిమాను టాలీవుడ్‌లో నందినీ, రానాల కాంభినేషన్‌లో రీమేక్‌ చేయాలనుకుంటున్నాడు నిర్మాత సురేష్‌బాబు..         మరి కాఫీ అన్న అపవాదుతో ఫెయిల్యూర్‌ను ఎదుర్కొన్న నందిని రెడ్డి ఈ అఫీషియల్‌ రీమేక్‌తో అయినా సక్సెస్‌ కొడుతుందో లేదో చూడాలి..  

మూవీమొఘల్‌ పుట్టిన రోజు

మనలో అందరికీ సినిమా ఓ రంగుల కల... కానీ కొందరికి మాత్రం అది రంగుల కళ... అలాంటి వారు సినిమానే శ్వాసిస్తారు, సినిమానే జీవితంగా జీవిస్తారు , సినిమానే ప్రేమిస్తారు, చివరకు ఆ సినిమానే శాసిస్తారు. అలాంటి వారిలో ప్రముఖులు మూవీ మొఘల్ డా. డి. రామానాయుడు. జూన్ 06 ఆయన పుట్టినరోజున ఆయన జన్మదినం సదర్భంగా ఆ సినీ శిఖరం గురించి తెలుసుకుందా..     ఒక్క భాషలో ఒక్క సినిమా తీసి 100 సినిమాలు తీసినట్టు ఫోజులిచ్చే సినీ నిర్మాతలను మనం రోజూ చూస్తుంటాం. కానీ దాదాపు అన్ని భాషల్లో వందకు పైగా చిత్రాలు చేసినా సింపుల్ గా కనిపించే ఏకైక నిర్మాత రామానాయుడు. సెట్ లో కలివిడిగా వుంటూ అన్ని పనుల్లో సాయం చేస్తూ సినిమాను అనుక్షణం ప్రేమిస్తారు కాబట్టే ఆయన ఇంకా సినిమాలు తీస్తూనే వున్నారు. ముందు ముందు కూడా సినిమాలు తీస్తూనే వుంటారు.   కమర్షియల్ , క్లాస్, మాస్ సందేశాత్మకం ఇలా అన్ని రకాల చిత్రాలను నిర్మించి ఆడియన్స్ ని అలరిస్తోన్న నిర్మాత రామానాయుడు. అంతే కాదు అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించిన నిర్మాతగా గిన్నిస్‌ రికార్డును సైతం నెలకొల్పిన ఘనత ఆయనది.. స్పాట్... ప్రేమించుకుందాం. రా.   రామానాయుడు 1936 జూన్ 06న కారంచేడు లో జన్మించారు. వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవమ్మ ఆయన తల్లిదండ్రులు.. రామానాయుడి చిన్నతనంలో ఆయన తల్లి దండ్రులు ఆయన్ను డాక్టర్‌ని చేయాలనుకున్నారు.. అయితే వారి కోరిక తీర్చలేకపోయిన రామానాయుడు నిర్మాతగా మారి డాక్టరేట్ అందుకుని డాక్టర్ డి. రామానాయుడు అయ్యారు.   నిర్మాతగా రామానాయుడు తొలిచిత్రం అనురాగం.. కాని తొలి ప్రయత్నంలోనే రామానాయుడికి నిరాశ ఎదురైంది.. కాని ఆయన కుండిపోలేదు.. తిరిగి ప్రయత్నించాడు ఎన్టీఆర్‌ డ్యూయల్‌ రోల్‌లో రాముడు భీముడు చిత్రాన్ని నిర్మించారు..ఈ సినిమా సూపర్‌ హిట్‌ దీంతో రామానాయుడు నిర్మాతగా స్థిరపడిపోయారు..   రామానాయడు నిర్మించిన చిత్రాలలో ప్రేమ్ నగర్ చిత్రం ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంటుంది. ఏయన్నార్, వాణిశ్రీ ల నటనకి సంగీతానికి ఆ సెట్స్ కి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.   అంతేకాదు అత్యధికంగా మల్టీ స్టారర్‌ సినిమాలను నిర్మించిన ఘనత కూడా రామానాయుడుగారిదే.. నాయుడి గారి సినిమా అంటే హీరో హీరోయిన్లు తమ ఇగోలను పక్కన పెట్టి పని చేసేవారు ఇండస్ట్రీలో ఆయన మీద ఉన్న గౌరవం అలాంటిది.. ఓ కధను విన్నప్పుడు నిర్మాతగా నాయుడు గారు తీసుకునే అద్బుతమైన జడ్డిమెంట్ , ప్లానింగ్ ఆయన సినీ యానాన్ని సుగమం చేసింది.     అహా నా పెళ్లంట సురేష్ ప్రోడక్షన్స్ పతాకంపై వచ్చిన అద్బుత కామెడీ చిత్రం జంధ్యాల మార్క్ కామెడీతో రూపోందిన ఆ చిత్రం వేల నవ్వులకు కేరాఫ్ అడ్రస్ లా నిలిచిపోయింది. అరగుండు గా బ్రహ్మానందం, వీర పిసినారిగా కోట... ఇంకా రాజేంద్రప్రసాద్, నూతన్ ప్రసాద్, వీర భద్రరావు ఇలా ఒక్కరేంటి ప్రతి నటుడు భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హాస్య చిత్రం అహా నా పెళ్లంట ప్రతివారి మనసులోని బాధల్ని మటుమాయం చేసే ఆ చక్కని టానిక్ లాంటి హాస్య చిత్రాన్ని తెలుగు వారికి అందించిన ఘనుడు రామానాయుడు   దాదాపు అందరు అగ్ర హీరో హీరోయిన్లతో చిత్రాలు చేశారు రామానాయుడు.. వెంకటేష్, హరిష్, లాంటి హీరోలను , టబు, కుష్ బూ, మాలశ్రీ లాంటి హీరోయిన్లను పరిశ్రమకు పరిచయం చేశారు ఆయన.  అహనా పెళ్లంట తో బ్రహ్మానందం కి తాజ్ మహల్ తో హీరో శ్రీకాంత్ కి , ప్రేమ ఖైదీ తో డైరెక్టర్ ఇ.వి.వి. కి స్టార్ డం తీసుకొచ్చిన నిర్మాత ఆయనే.         అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రల్లో తెర మీద కనిపించడం రామానాయుడిగారికి  హాబీ. అంతే కాదు హొప్‌ చిత్రంలో పూర్తి స్థాయి క్యారెక్టర్‌లో కూడా అలరించాడు ఆయన.. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు 2010 లో దాదాసాహెబ్ పాల్కే, 2006 లో రఘుపతి వెంకయ్య పురస్కారాలు ఆయన్ని వరించాయి. గిన్నిస్ రికార్డు సాధించినా ఆయన ఇంకా సినిమాలు నిర్మిస్తుండటం కూడా ఓ రికార్డే అని చెప్పాలి.   రామానాయుడు నిర్మించిన ఎన్నో చిత్రాలు అవార్డులు సాధించాయి. చాలా చిత్రాలు నంది అవార్డులు గెలుచుకుంటే 1993 లో సూరిగాడు చిత్రం ఇండియన్ పనోరమ కు ఎంపికైంది. 1999 లో అశుఖ్ అనే బెంగాలీ చిత్రం జాతీయ పురస్కారాన్ని సాధించింది.   ఇలా తెలుగు కళామతల్లికి తన వంతు సేవ చేస్తున్న రామానాయుడు గారు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ ఆ మూవీ మొగళ్‌కు మరో సారి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం…

నటి జియాఖాన్ అంత్యక్రియలు పూర్తి

        బాలీవుడ్ నటి జియాఖాన్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆమెకు తుదివీడ్కోలు పలికారు. జూహులోని శ్మశానంలో ఆమె భౌతిక కాయాన్ని ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఖననం చేశారు. జియా అంత్యక్రియలకు అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు, రితేష్ దేశ్ ముఖ్, ఆదిత్య పంచోలి తదితర ప్రముఖులు హాజరయ్యారు. 25 ఏళ్ల జియాఖాన్ సోమవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. జియాఖాన్ మృత దేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేసారు. వైద్యలు వెల్లడించిన నివేదిక ప్రకారం ఆమె ఉరి వేసుకోవడం వల్లనే చనిపోయిందని, ఇది ఆత్మ హత్యే అని ధృవీకరణ అయింది. రాత్రి 11 గంటల నుంచి 11.30 గంటల మధ్యలో ఆమె ప్రాణాలు వదిలినట్లు వైద్యులు తెలిపారు. దీంతో జియా ఖాన్ మరణంపై నెలకొన్న అనుమానాలకు తెర పడినట్లయింది.

తెలుగులోనే..బాలీవుడ్ వెళ్ళాను: మహేష్

        టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను ఆయన ఖడించారు. ఈ రోజు విజయవాడలో రెయిన్ బో చిల్డ్రన్ హాస్పటల్ ను మహేష్ బాబు ప్రారంభించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ..మరో పదేళ్ళ పాటు తెలుగులోనే సినిమాలు చేస్తానని స్పష్టం చేశారు. తాను ప్రస్తుతానికి బాలీవుడ్ ప్రాజెక్ట్ లు చేయడంలేదని కూడా చెప్పారు.‘1 నేనొక్కడినే’ టైటిల్ వెనక వేరే ఉద్దేశ్యం లేదని, నేనే నెం.1 అని దాని పరమార్థం కాదని, అలాంటి నెంబర్ గేమ్ తనకు ఇష్టం లేదని, పరిశ్రమలో అందరూ ప్రేక్షకులను రంజింప చేయడానికే ప్రయత్నిస్తున్నారనే అర్థం వచ్చేలా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నానని, ఈ సినిమా నా కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందని, ఇందులో కొత్త లుక్ తో కనిపిస్తానని మహేష్ బాబు స్ఫష్టం చేసారు.