ఈ సారి అఫిషియల్ రీమేక్
posted on Jun 7, 2013 @ 10:25AM
అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కి గ్రాండ్‌గా పరిచయం అయిన దర్శకురాలు నందినీ రెడ్డి.. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో అవకాశాలు సాదించటమే కాదు తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా తెచ్చుకుంది నందిని..
తొలి సినిమా అలామొదలైందితో తను సక్సెస్ సాదించటమే కాకుండా నాని, నిత్యామీనన్‌ల కెరీర్‌కు కూడా ఓ బ్లాక్‌బస్టర్ అందించింది. దీంతో నందినికి తొలి సినిమాతోనే మంచి డైరెక్టర్‌గా ముద్రపడింది..
కాని ఆ పేరును కాపాడుకోవటంలో ఫెయిల్ అయింది నందిని.. హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో విడుదలైన తన రెండో సినిమా జబర్ధస్త్ డిజాస్టర్ అయింది.. సిద్దార్ధ్ హీరోగా సమంత నిత్యామీనన్ లాంటి హీరోయిన్లు ఉండి కూడా ఈ సినిమాకు సక్సెస్ టాక్ తీసుకురాలేకపోయారు..
జబర్ధస్త్ సినిమా ఫ్లాప్ కావడమే కాకుండా ఈ సినిమా హిందీలో రిలీజ్ అయిన బ్యాండ్ బాజా బారాత్ సినిమా రీమేక్ అన్న టాక్‌తో నందిని ఇమేజ్ మరింత పడిపోయింది.. దీంతో నెక్ట్స్ అఫిషియల్‌గా ఓ రీమేక్ సినిమా చేసే ఆలోచనలో ఉందట నందినీ రెడ్డి..
గతంలోనే సురేష్ ప్రొడక్షన్‌తో అగ్రిమెంట్ చేసుకున్న నందినీ రెడ్డి ఆ బ్యానర్‌లో రానా హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటుంది.. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన యే జవానీ హై దివాని సినిమాను టాలీవుడ్‌లో నందినీ, రానాల కాంభినేషన్‌లో రీమేక్ చేయాలనుకుంటున్నాడు నిర్మాత సురేష్‌బాబు..
మరి కాఫీ అన్న అపవాదుతో ఫెయిల్యూర్‌ను ఎదుర్కొన్న నందిని రెడ్డి ఈ అఫీషియల్ రీమేక్‌తో అయినా సక్సెస్ కొడుతుందో లేదో చూడాలి..