సతమతమవుతున్న సమంత !
posted on Jun 13, 2013 @ 2:52PM
తనతో నటించే హీరోయిన్స్‌ను ఓ ప్లాన్ ప్రకారం "లైన్"లో పెట్టుకోవడంలో సిద్దార్ద్ సిద్ధహస్తుడు. హిందీలో తనతోపాటు ఓ చిత్రంలో నటించిన సోహా అలీఖాన్ (సైఫ్ అలీఖాన్ సోదరి) కావచ్చు.. లేక "అనగనగా ఓ ధీరుడు" చిత్రంలో తనతో జతకట్టిన శృతిహాసన్ కావచ్చు.. ఎవరినైనా సరే ఇట్టే ఆకట్టేసుకుంటాడు. అంతేకాదు.. తమ మధ్య ఉన్న "సంబంధం" మీడియాకు లీకయ్యేలా "తగిన" జాగ్రత్తలు తీసుకొని.. ఎప్పుడూ వార్తల్లో ఉండడంలో సిద్దార్ధను మించినవాళ్లు మరొకరు లేరు. "జబర్‌దస్త్"లో తనకు జోడీగా నటించిన సమంతను కూడా ఇలాగే ముగ్గులోకి దించాడు సిద్దార్ధ. టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న సమంతతో తను "సహజీవనం" (లివ్ ఇన్ రిలేషన్ షిప్) చేస్తున్న విషయం మీడియాకు పొక్కేలా చేశాడు. "విషయం" బయటకు వచ్చేయడంతో "సరదా ఎఫైర్" అనుకొన్నది కాస్తా.. "సీరియస్ ఎఫైర్" అయిపోయి కూర్చుంది. దీనికితోడు "సమ్‌థింగ్.. సమ్‌థింగ్" చిత్రంలో సమంతతో స్పెషల్ గెస్ట్ రోల్ చేయించి ఆమెను పూర్తిగా ఇరికించేసాడు. అంతేకాదు.. "త్వరలోనే పెళ్లి" అనే పుకారును కూడా తెరమీదకు తెచ్చేసాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక సమతమమైపోతోంది సమంత. నిజానికి పన్నెండు పదమూడేళ్ల క్రితం విడుదలైన "బోయ్స్" చిత్రంతో హీరోగా పరిచయమైన నాటికే సిద్దార్ధకు పెళ్లయిపోయింది. అంతకుముందు అతను కొంతకాలం మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక భార్యతో తెగతెంపులు చేసుకొని.. హీరోయిన్స్‌ను లైలో పెట్టడం మొదలుపెట్టాడు. సిద్దార్ధ్ వయసు కొంచెం అటు ఇటుగా 40. "నాలుగుపదుల వయసు వాడిని కట్టుకుని నువ్వేం సుఖపడతావ్?" అంటూ ఫ్రెండ్స్_వెల్ విషర్స్ హెచ్చరిస్తుండడంతో ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు సమంతకు!