క‌న్నీళ్లు పెట్టించిన ఓ మ‌ల్లి

  ఇన్నాళ్లు న‌టిగా చిన్న పాత్రలు వ్యాంప్ రోల్స్ మాత్రమే చేసిన ర‌మ్య శ్రీ ఇప్పుడు ద‌ర్శకురాలిగా మారింది.. తన స్వీయ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కించిన సినిమా ఓ మ‌ల్లి.. హాట్ హాట్ పోస్టర్స్‌తో ఆక‌ట్టుకున్న ర‌మ్య త‌న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావ‌డానికి రెడీ అవుతుంది. భారీ అందాల ప్రద‌ర్శన‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఇటీవ‌లే సెన్సార్ పూర్తి చేసుకుంది.. ఎక్కువ‌గా క‌ట్స్ ఏం ప‌డ‌కున్నా ఏ స‌ర్టిఫికేట్‌తో రిలీజ్‌కు రెడీ అవుతుంది ఓ మ‌ల్లి. అంతేకాదు తానే లీడ్ రోల్‌లో న‌టించిన ఈ సినిమా ప్రశంస‌ల‌తో పాటు అవార్డుల‌ను కూడా సాదించి పెడుతుంద‌ని ఆశ‌ప‌డుతుంది ర‌మ్య. ఇటీవ‌ల ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ స‌భ్యులు క‌న్నీళ్లు పెట్టుకోవ‌టంతో త‌న న‌ట‌న‌తో పాటు డైరెక్షన్ కూడా వంద మార్కులు ప‌డ్డాయంటూ ఫీల్ అవుతుంది ర‌మ్య శ్రీ.. మ‌రి ఇక్కడిదాకా బాగానే ఉన్నా ఈ సినిమా థియేట‌ర్స్‌లో అభిమానుల‌ను ఎంత‌వ‌ర‌కు అల‌రిస్తుందో చూడాలి.

మాధురి దీక్షిత్‌ మరణించింది..!!

      బాలీవుడ్‌ గ్రేట్‌ యాక్టరస్‌ బ్యూటీక్వీన్‌ ఆఫ్‌ ఇండియా ఇక లేరు.. ఈవార్త ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.. హిందీ చిత్ర సీమను దశాబ్దాల పాటు ఓ ఊపుఊపేసిన అందాల తార మాధురి దీక్షిత్‌ చచ్చిపోయింది అంటూ వచ్చిన వార్తలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి..   అయితే ఈ వార్తనలు ఖండించింది మాధురి.. తాను హార్ట్‌ ఎటాక్‌ మరణించానని వార్తలు తనని కూడా షాక్‌ గురిచేసాయని.. ప్రస్థుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానంటూ ఫ్యాన్స్‌ మెసేజ్‌ అందించింది.. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌ వారి అత్యుత్సాహంతో ఓ అందాల భామ బతికుండగానే చనిపోయిన్నట్టుగా వార్త వచ్చిందని మాధురి ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

బాలయ్య చిన్న కుమార్తె పెళ్ళి నిశ్చయం!

      ప్రముఖ నటుడు, తెలుగుదేశం నేత నందమూరి బాలకృష్ణ ఇంట పెళ్లి సందడి మొదలు కానుంది. బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని వివాహం నిశ్చయమైంది. గీతం విద్యా సంస్థల అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎమ్.పి ఎమ్.వి.వి.ఎస్.మూర్తి మనుమడు శ్రీభరత్ తో తేజస్విని వివాహం నిశ్చయించారు.బాలకృష్ణ పెద్ద కుమార్తెను చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో కుమార్తె పెళ్లి కూడా చేయబోతున్నారు. అయితే అబ్బాయి శ్రీభరత్ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు కూడా మనవడు కావడం విశేషం. ఇరుకుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించాయని నెల క్రితమే వార్తలు వచ్చాయి. అమెరికాలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసిన శ్రీభరత్ గీతం పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ కు కూడా అదే ప్రాబ్లమ్

టాలీవుడ్ లో టైటిల్ వివాదాలు కామన్ అయిపోయాయి.. గతంలో చాలా మంది హీరొల సినిమాలకు తలెత్తిన టైటిల్ సమస్య ఇప్పుడు స్టార్ హీరోలకు కూడా తప్పడం లేదు.. తాజాగా ఇలాంటి వివాదంలోనే ఇరుక్కున్నాడు టాలీవుడ్ పవర్ స్టార్.. దాదాపు ఫుష్కర కాలం పాటు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేని పవర్ స్టార్ కు ఆ లోటు తీర్చిన సినిమా గబ్బర్ సింగ్. అందుకే ఆ సినిమా రిలీజ్ దగ్గర నుంచి గబ్బర్ సింగ్ సీక్వల్ పై కూడా చాలా వార్తలు వచ్చాయి.అయితే ఆ ఊహాగానాలకు తెరదించుతూ పవన్ గబ్బర్ సింగ్ 2 ను ఎనౌన్స్ చేశాడు. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా ఈ సినిమాను తెరకెక్కిస్తానని ఆ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తారని చెప్పాడు.. అయితే అక్కడే మొదలైంది అసలు సమస్య.. గబ్బర్ సింగ్ సినిమాతో సౌత్ లో సక్సెస్ సాదించటమే కాదు నార్త్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు పవన్.. దీంతో గబ్బర్ సింగ్ అనే పేరు మీద అన్ని హక్కులు మావేనంటూ షోలే సినిమా నిర్మాతలు గోల చేస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమా విడుదలైనప్పుడు గాని అంత సక్సెస్ సాదించినప్పుడు గాని మాట్లాడని షోలో చిత్ర యూనిట్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారన్న టాక్ వినిపిస్తుంది.. ప్రస్థుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో అత్తారింటికి దారేది సినిమా పనిలో ఉన్న పవన్ ఆ సినిమా పూర్తి కాగానే గబ్బర్ సింగ్ సీక్వల్ ను సెట్స్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడు.. మరి ఈ లోపు టైటిల్ సమస్య ఓ కొలికి వస్తుందంటున్నారు అభిమానులు..

'ఎవడు' 31న వస్తున్నాడు

      దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'ఎవడు'. రామ్‌చరణ్‌, శ్రుతిహాసన్‌ జంటగా నటించారు. అమీజాక్సన్‌ మరో హీరోయిన్. అల్లు అర్జున్‌, కాజల్‌ అతిథి పాత్రల్లో నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.   ''స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' చేసిన పాత్ర ఎవడు కథకు ప్రాణంలాంటిది. రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి నా సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ నెల 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది'' అన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.   ఎవడు గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...''పవన్ కళ్యాణ్  ''అత్తారింటికి దారేది'' రిలీజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా విడుదల కొన్ని రోజులు వాయిదా వేయాలని అనుకున్నాం. కాని రామ్ చరణ్ బాలీవుడ్ మూవీ 'జంజీర్' విడుదలను ఖరారు చేయడంతో...  ప్రత్యామ్నాయం లేక 31న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నాం. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఘనవిజయం సాధిస్తాయన్న నమ్మకం ఉంది'' అని అన్నారు.           

రామ్ చరణ్ ను పక్కన పెట్టేశారు..!

      'ఇద్దరమ్మాయిలతో' సినిమా విడుదల రోజే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా ఓపెనింగ్ జరిపి ఇండస్ట్రీలో క్రేజ్ ని సంపాదించుకున్నాడు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. కాని ఇదంతా 'ఇద్దరమ్మాయిలతో' వచ్చే కష్టాలను తప్పించుకోవడానికి గణేష్ వేసిన ప్లాన్ అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.   'ఇద్దరమ్మాయిలతో' ముందుగానే భారీ రేట్లకు అమ్మిన గణేష్.. ఈ సినిమా తేడా కొడుతుందని ఉహించి బయ్యర్ల నుంచి  తప్పించుకోవడానికి రామ్ చరణ్ తో సినిమాని ఓపెనింగ్ చేసి హడావుడి సృష్టించారని తెలుస్తోంది. అసలు రామ్ చరణ్ తో కొరటాల శివ మూవీ కి స్టోరీ ఇంకా రెడీ కాలేదని సమాచారం.  లేటెస్ట్ గా కొరటాల శివ మహేష్‌కి ఓ కథ వినిపించారని తెలుస్తోంది. ఆ కథ ఆయనకు విపరీతంగా నచ్చడంతో..శివ ఇప్పుడు ఈ స్టోరీ మీదే పూర్తిగా ఫోకస్ పెట్టాడట. ఈ మ్యాటర్ ను గణేష్ తన స్నేహితుల వద్ద లీక్ చేశారని సమాచారం. 

ఎక్స్ ఫోజింగ్ చేయడం సమాజసేవే: పూనమ్

      బాలీవుడ్ సినిమాలో నటించగానే పూనమ్ పాండే తానేదో గొప్ప నటి అయినట్టు ఫీలైపోతుంది. ఎక్స్ ఫోజింగ్ చేయడం కూడా సమాజసేవనని అని అంటోంది. ఎక్స్ ఫోజింగ్ చేయడాన్ని తప్పుగా భావించడం లేదని, నన్ను ఇలాంటి డ్రెస్సుల్లో చూసి జనం ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇది ముమ్మాటికీ సోషల్ సర్వీసే అని పూనమ్ పాండే వాదిస్తోంది. పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తో తనని కొంతమంది పోలుస్తున్నారని తెగ బాధ పడిపోతుంది.భవిష్యత్‌లో తనను పోలిస్తే గిలిస్తే....ఆమె అభిమానించే రేఖ, మాధురి దీక్షిత్, కాజోల్‌ లాంటి స్టార్లతో పోల్చాలని మీడియా వారితో వాదన పెట్టుకుంటోంది. పూనమ్ పాండే నటించిన తొలి సినిమా ‘నషా' ఈ నెల 26న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నని తెలిపింది. తనలోని యాక్టింగ్ టాలెంట్ చూపించడానికి అవకాశం లభించినందు వల్లే 'నషా' లో నటించినట్లు తెలిపింది.  

రామ్ చరణ్ తో సీఎం అఖిలేష్ యాదవ్

      హైదరాబాదులో జరుగుతున్న యాదవ సభకు హాజరైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇక్కడ రాష్ట్ర ప్రముఖ నేతలను సుడిగాలిలా పర్యటిస్తూ కలిశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును, కేంద్ర మంత్రి చిరంజీవిని.. బొత్స సత్యనారాయణను ఇలా అందరినీ ఆయన వరుసబెట్టి కలిశారు. అనంతరం ఆయన పలు చోట్ల మాట్లాడారు. చిరంజీవి గురించి మాట్లాడుతూ “తాను మైసూరులో చదువుతున్న రోజుల్లో చిరంజీవి సినిమాలు బాగా చూసేవాడినని” చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చిరంజీవి చొరవ తీసుకుంటున్నారని అన్నారు. అంతేకాదు, ”చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యాక పర్యాటక శాఖకు గ్లామర్ చేకూరిందని” అఖిలేష్ సరదా వ్యాఖ్య చేశారు.   ఇక గ్లామర్ ఫీల్డులో పొగడ్తలు, చప్పట్ల మధ్య ఎదిగిన చిరంజీవి ఊరికే ఉంటారా.. అఖిలేష్ యాదవ్ యువతకు స్పూర్తి అన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువకులకు ఒక ప్రేరణగా నిలిచారన్నారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక అభివృద్ధి నువ్వు బాగా చేస్తున్నావంటే, నువ్వు బాగా చేస్తున్నావంటూ ఇద్దరూ పొగుడుకున్నారు.  

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కబుర్లు

  పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కబుర్లు పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటి దారేది’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం అభిమానుల మధ్య చాలా ఘనంగా జరిగింది. ఇటీవలే ఆయన మరో కొత్త సినిమాకు కూడా సంతకం చేశారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మాస్ మహారాజ రవితేజకు సూపర్ హిట్ అందించిన ‘బలుపు’ సినిమాను నిర్మించిన నిర్మాత పరం. వీ. పొట్లూరి ఈ సినిమాను తన స్వంత బ్యానర్ ‘పీవీపీ సినిమా’ క్రింద చాలా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్నఒక ప్రముఖ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఇవ్వనీ మామూలు విశేషాలే. కానీ ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది.   దీనిని నిర్మిస్తున్న పరం.వీ.పొట్లూరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత. ఈయన ఆ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుండటమే కాక, వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ తరపున పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి అన్నచిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రిగా చక్రం తిప్పుతుంటే, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నిర్మిస్తున్నసినిమాలో నటిస్తున్నాడేమిటి? అని అప్పుడే కొందరు చెవులు కొరుకొంటున్నారు. నిర్మాత రాజకీయ నేపధ్యం తెలిసి కూడా అదేమి పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ ఆయన సినిమా చేయాలనుకొన్నారా? లేక అసలు ఆ సంగతే ఆయనకు తెలియదా? లేక తెలిసి ఉద్దేశ్యపూర్వకంగానే ఈ సినిమాకు ఒప్పుకొన్నారా? అనే ధర్మ సందేహాలకి పవన్ కళ్యాణ్ జవాబు చెప్పాలి మరి.   ఇది వరకు, జూ.యన్టీఆర్ కొడాలి నాని నిర్మించిన సినిమాలలో నటించేవారు. వారిరువురు మధ్య మంచి స్నేహ సంబంధాలే ఉండేవి. కానీ ఆ తరువాత కొడాలి నాని తెదేపా వీడి వైకాపలో జేరడం, అప్పుడు వారిరువురికి మధ్య స్నేహ సంబంధాలను అందరూ ప్రశ్నించడం, తదనంతర పరిణామాల గురించి అందరికీ తెలిసిందే.   ఆ నిర్మాత కేవలం వైకాపా కార్యకర్తగా ఉన్నంతకాలం ఎటువంటి సమస్య రాకపోవచ్చును. కానీ ఒకవేళ ఆయన ఎన్నికలలో పోటీ చేస్తూ చిరంజీవిని విమర్శించితే, మరి అప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏమిటి? అప్పుడు కొనసాగుతుందా లేక అటకెక్కుతుందా? తెలుగు సినిమా రంగంలో కూడా రాజకీయపార్టీల వలన చీలిక ఏర్పడిన కారణంగా ఇటువంటి అనుమానాలు తలెత్తడం సహజమే.

'అత్తారింటికి దారేది'..నేను సింహం లాంటివాడిని: పవన్

      'అత్తారింటికి దారేది' ఆడియో ఫంక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనడైన స్టైల్లో స్పీచ్ నిచ్చి అభిమానులను అలరించారు. సాధారణంగా ఫంక్షన్ లలో తక్కువగా మాట్లాడే పవర్ స్టార్...'అత్తారింటికి దారేది' ఫంక్షన్ లో డైలాగు చెప్పడం విశేషం. ‘చూడప్పా సిద్దప్పా... నేను సింహం లాంటివాడిని... దానికి నాకు తేడా ఒక్కటే... అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతా అంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా ’ అంటూ తనదైన స్టైల్లో డైలాగ్ చెప్పారు.   పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను దర్శకత్వం వహించిన జాని సినిమా ప్లాపు తర్వాత కాస్త మూడౌట్లో ఉన్నాను. అదే సమయంలో త్రివిక్రమ్ వచ్చి కథ చెప్పారు. తొలిసారిగా ఆయన కథ చెబుతుంటే నిద్ర పోయాను. కానీ ఆయన ఏమాత్రం బాధ పడకుండా మళ్లీ జల్సా కథతో వచ్చారు. నేను మీలాంటి మనిషినే. నాకు బాధలు ఉంటాయి. జల్సా చేస్తున్న సమయంలో నాకు వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. అప్పుడు త్రివిక్రమ్ నాకు ఎంతో భరోసా ఇచ్చారు. ఆయన చెప్పిన మాటలు నాకు ఎంతో ఓదార్పును ఇచ్చాయి. ఆయన నాకు ఎంత భరోసా ఇచ్చారు. అలాంటి వ్యక్తి దర్శకత్వంలో చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అని పవన్ కళ్యాన్ చెప్పారు.

కాక్ పిట్ లో వెళ్ళింది నిత్యామీనన్ కాదట!

      ప్రముఖ సినీ నటి నిత్యమీనన్ బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తూ విమానంలోని కాక్ పిట్ లోకి వెళ్లారని, దీంతో పైలట్లను సస్పెండ్ చేసి డీజీసీఎ విచారణకు ఆదేశించారని వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా వట్టిదే అని నిత్యమీనన్ మేనేజర్ చెబుతున్నారు. అసలు ఈ మధ్య కాలంలో నిత్యమీనన్ బెంగుళూరు నుండి హైదరాబాద్ వెళ్లలేదని తెలిపారు. ఈ మధ్య ఒకసారి కొచ్చిన్ నుండి హైదరాబాద్ అవార్డుల కార్యక్రమానికి వెళ్లారని అంతకుమించి ఎక్కడికీ వెళ్లలేదని తెలిపారు. ఈ విషయాన్ని నిత్యమీనన్ కు చెబితే నవ్వి ఊరుకున్నారని ఆయన అన్నారు. మరి ఇప్పటికే సస్పెండ్ అయిన ఎయిర్ ఇండియా పైలట్లు కాక్ పిట్ లోకి అనుమతించి ముచ్చట్లు పెట్టిన నటి ఎవరన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది.

గుండె జారి గల్లంతయితే సస్పెండేనట

  “ఆమె ఓరకంట చూస్తూ ఒక చిరునవ్వు నవ్వితే ఎవరి గుండెయినా జారి గల్లంతవాల్సిందే. మరి అటువంటప్పుడు ఆ పైలట్లు మాత్రం గుండె నిబ్బరం చేసుకొని విమానం ఎలా నడపగలరు? మా భద్రత సంగతి గాలికొదిలేసి ఆమెతో ముచ్చట్లాడుతుంటే, అవతల మా గుండెలు గల్లంతయిపోయాయి మహాప్రభో!” అని ఒక విమాన ప్రయాణికుడు మొరపెట్టుకొంటే వెంటనే ఆ ఇద్దరు పైలట్లని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేసేసారు. ఇంతకీ ఆ కధా కమామిషు ఏమిటంటే, క్రింతటి నెల మన టాలివుడ్ అందాల భామ నిత్య మీనన్ బెంగుళూరు నుండి హైదరాబాద్ కి ఎయిర్ ఇండియా విమానంలో వెళ్తూన్నపుడు, ఆ ముద్దు గుమ్మకి అసలు ఇంత పెద్ద విమానాన్ని కేవలం ఇద్దరు మనుషులు ఎలా నడుపుతారో తెలుసుకోవాలని కోరిక పుట్టింది. అంతే ఆమె నేరుగా కాక్ పిట్ వద్దకు వెళ్లి తలుపు మీద సుతారంగా టక్ టక్మని కొట్టగానే తలుపు తీసి బయటకి తొంగి చూసిన మన కుర్ర పైలట్లు జగన్, కిరణ్ (ముఖ్యమంత్రి, జగన్ మోహన్ రెడ్డి కాదు లెండి)లకి తమ కోసమే ఆకాశం నుండి దిగివచ్చిన (ఆ టైంకి వాళ్ళు కూడా ఆకాశంలోనే ఉన్నారనే సంగతి మరిచిపోయారు) అప్సరసలా తలుపు దగ్గిర నిలబడి, ఓరకంట చూసి నవ్వుతున్న నిత్యా మీనన్ కనబడగానే నిజంగానే వారి గుండెలు జారి గల్లంతయిపోయాయి. ఇంకేముంది, ఆమెను సాదరంగాలోనకి ఆహ్వానించి తమ పక్కన ఖాళీగా ఉన్నసీటులో (ఆ సీటు కేవలం విమాన శిక్షణ ఇచ్చే మాస్టర్లకి, లేదా అటువంటి వారికి మాత్రమే కేటాయించబడింది) కూర్చోబెట్టుకొని, ఆమె తన పెద్దకళ్ళను విప్పార్చి తమవైపే చూస్తుంటే, వారిద్దరూ ఆమెతో ఉల్లాసంగా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొంటూ అలా అలా గాలిలో తేలిపోతున్నట్లు (విమానమన్నాక గాలిలోనే తేలుతుందని అందరికీ తెలుసు. గానీ, ఆ రోజు మరింత బాగా తేలిపోయిందని ప్రయాణికుల అభిప్రాయం) విమానాన్ని అలవోకగా ఎడం చేత్తో నడిపి చూపించి ఆమె నుండి మరిన్ని ముసిముసి నవ్వులు రాల్చుకొని పరమానందపడిపోయారు మన కుర్ర పైలట్లు ఇద్దరూ. ఆ తరువాత ఆమె హైదరాబాద్ రాగానే వారికి ‘టాటా టాటా బై బై’ చెప్పేసి బ్యాగు ఊపుకొంటూ వెళ్లిపోయింది.   అయితే, ఆమె వచ్చి తనపక్కన కూర్చొంటే చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చునని ఆశపడి భంగపడిన ఒక ప్యాసింజరు, ఇదంతా చూసి ఓర్వలేక నేరుగా వెళ్లి బరబరా ఒక పిర్యాదు వ్రాసి పడేసాడు. అంతే ఇంకేముంది? ఇద్దరు కుర్ర పైలట్లని సస్పెండ్ చేస్తూ ఆర్డర్లు చేతిలో పెట్టేసారు సదరు విమాన సంస్థ వారు. ఇప్పుడు వారిద్దరూ ‘ఎంతపనిచేసావే నిత్యా!’ అంటూ ఆక్రోశిస్తున్నారు పాపం!

అభిమానులకి అత్తారింటికి దారే దొరకలేదట

  పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ శుక్రవారంనాడు హైదరాబాద్ శిల్పకళావేదికలో జరుగబోతోంది. ఈ కార్యక్రమానికి పాసులు ఇచ్చేటప్పుడు ఆడిటోరియంలో ఉన్నసీట్లకి సరిపోయినంత మాత్రమే పాసులు జారీ చేయమని పవన్ కళ్యాణ్ నిర్మాతను కోరినట్లు సమాచారం. ముందుగా తన అభిమానులకి, ఫిలిం పంపిణీదారులకి, సినిమా యూనిట్ సభ్యులకి ఇచ్చిన తరువాతనే వీఐపీలకు, ఇతరులకు కేటాయించమని కోరారు. అదేవిధంగా పాసులు దొరక్క ఆడిటోరియం బయట ఉండిపోయే తన అభిమానుల పట్ల సెక్యురిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించకుండా ఆదేశించమని, అదేవిధంగా వారు ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా తగిన ముందు జాగ్రత్తలు కూడా తీసుకోవలసిందిగా పవన్ కళ్యాణ్ నిర్మాతను కోరినట్లు తెలుస్తోంది.   బహుశః పాసుల విషయంలో ఈ సారి ఖచ్చితంగా ఉండాలని ఆదేశించినందువలనే కొంత మంది అభిమానులకు పాసులు దొరకకపోవడంతో తీవ్రనిరాశ చెంది, వారు ఆగ్రహంతో హైదరాబాద్ లో గల చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద పాసుల కోసం చాలాసేపు ధర్నా చేసారు. అయితే అక్కడి సిబ్బంది వారికి నచ్చజెప్పి పంపేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ అంటే అందరికీ తమ ఇంట్లో ఫంక్షన్ లాగానే ఉంటుంది. మరి పాసులు దొరకక ఫంక్షన్ వెళ్ళలేకపోతే వారెంత బాధ పడి ఉంటారో దీనిని బట్టి అర్ధం అవుతోంది.

పవన్ 'అత్తారింటికి దారేది' లేటెస్ట్ ఫొటోస్

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నకొద్దీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం కోసం మెగాభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ రిలీజ్ చేసిన ఆడియో ఫోటోలలో పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా వెరయిటీగా, మంచి కలర్ ఫుల్ గా చాలా బాగుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టిజర్ కి కేవలం 38గంటలలో 4,68,564 మంది దానిని వీక్షిస్తే, 10,119 లైక్స్, మరియు 4724 కామెంట్స్ దానికి వచ్చాయి. ఇది తెలుగు చిత్ర సీమలో మరో సరికొత్త రికార్డ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన అందాల భామలు సమంత మరియు ప్రణీతలు హీరోయిన్ లుగా నటించారు. పవర్ ఫుల్ డైలాగులకి పెట్టింది పేరయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం చేసారు. యువతరాన్ని ఉర్రూతలూగించే దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు.  

నటి అంజలి కేసులో కొత్త మలుపు

      సినీ నటి అంజలి తనకి నెలకు రూ. 50 వేలు జీవన భృతి చెల్లించాలని ఆమె పిన్ని భారతీ దేవి ప్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించి ఆగస్టు 14కు వాయిదా వేసింది. అంజలిని పెంచి పెద్ద చేయడంతో పాటు, హీరోయిన్‌గా చేయడానికి ఇప్పటి వరకు రూ. 70 లక్షలు అప్పులు చేసి ఖర్చు పెట్టానని, ఇప్పుడు తనను విడిచి వెళ్లింది కాబట్టి నెలకు రూ. 50 వేలు జీవన భృతి చెల్లించాలని పిటీషన్‌ లో పేర్కొంది. అంజలి అదృశ్యం నేపథ్యంలో భారతీదేవి మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను నిన్న ఉపసంహరించుకుని, తాజాగా ఈ పిటిషన్ వేయడం విశేషం. మరో వైపు అంజలిపై దర్శకుడు కళంజియం వేసిన పరువు నష్టం పిటీషన్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కూడా అంజలి పలు మార్లు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె ఒక్కసారి కూడా కోర్టు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెకు కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

అత్తారింటికి దారేది టీజర్ సరికొత్త రికార్డ్

  మెగాభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ‘అత్తారింటికి దారేది’ టీజర్ విడుదలయింది. ఊహించిన దానికంటే అది చాలా అద్భుతంగా ఉండటంతో మెగాభిమానుల ఆనందానికి అంతే లేదు. ముఖ్యంగా పవర్ స్టార్ తన స్టైల్లో పలికిన “వీడు ఆరడుగుల బులెట్...వీడు దైర్యం విసిరిన రాకెట్” డైలాగ్ కి వారుఆనందంతో కేరింతలు కొట్టారు. పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా వెరయిటీగా, మంచి కలర్ ఫుల్ గా చాలా బాగుంది.   యూ ట్యూబ్ లో టీజర్ విడుదలయిన గంటలోనే అనేకవేల హిట్స్ రావడమే అది పవర్ స్టార్ అభిమానులకు ఎంతగా నచ్చేసిందో తెలియజెపుతోంది. కేవలం 38గంటలలో 4,68,564 మంది దానిని వీక్షిస్తే, 10,119 లైక్స్, మరియు 4724 కామెంట్స్ దానికి వచ్చాయి. ఇది తెలుగు చిత్ర సీమలో మరో సరికొత్త రికార్డని నిర్మాత బీ.వీ.యస్.యన్.ప్రసాద్ తెలిపారు. టీజర్ను అంతగా ఆదరించిన ప్రజలకి, మెగాభిమానులకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.   ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన ఆడియో రిలీజ్ మరియు వచ్చేనెల 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.   ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన అందాల భామలు సమంత మరియు ప్రణీతలు హీరోయిన్ లుగా నటించారు. పవర్ ఫుల్ డైలాగులకి పెట్టింది పేరయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కధ నందించి, దర్శకత్వం చేసారు. యువతరాన్ని ఉర్రూతలూగించే దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు. వీటిని ప్రసిద్ద ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ రూపొందించారు. ఈ సినిమాను బీ.వీ.యస్.యన్.ప్రసాద్ తన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రవేట్ లిమిటడ్ బ్యానర్ పై నిర్మించగా, దానిని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సమర్పిస్తోంది.   కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: రవీందర్.

పవన్ 'అత్తారింటికి దారేది' న్యూ స్టిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ మూవీ 'అత్తారింటికి దారేది' విడుదలకు రెడీ అవుతున్న కొద్దీ ఆ సినిమాకు సంబందించిన కొత్త విషయం బయటకు వచ్చిన అదో సెన్సేషనే. రీసెంట్ గా రిలీజైన ఆడియో టీజర్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన పవన్ కళ్యాణ్ న్యూస్టీల్స్ బయటకు వచ్చాయి. ఈ ఫోటోలలో పవన్ స్టైలిష్ లూక్స్ తో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. టీవీయాంకర్ గాయిత్రి భార్గవి ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సోదరి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రీణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఈ సినిమా విడుదల తరువాత బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అంటున్నారు.