Nagarjuna Damarukam

నాగ్ ఫ్యాన్స్ వీరంగం

    ‘ఢమరుకం’ చిత్రం మరో సారి విడుదల వాయిదా పడడంతో నాగార్జున అభిమానులు భగ్గుమన్నారు. తిరుపతి సంధ్య థియేటర్‌ను నాగార్జున అభిమానులు ధ్వంసం చేశారు. ఫర్నిచర్, అద్దాలను పగులగొట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. నాగార్జున హీరోగా నటించిన ‘ఢమరుకం’ చిత్రం చాలా రోజులుగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. శనివారం విడుదల తేది మరోసారి వాయిదా పడింది.   దీపావళి కానుక అంటూ  అభిమానులను ఊరిస్తూ వస్తున్న డమరుకం శనివారం  మళ్లీ నిరాశపర్చింది. అనేక అవరోధాలను ఎదుర్కొని ఈ సినిమా చివరికి నేడు విడుదల కావల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో రిలీజ్‌ ఆగిపోవటంతో నాగార్జున అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. గ్రాఫిక్స్‌ ఇబ్బందుల్ని, టైటిల్‌ వివాదాన్ని దాటుకుంటూ వచ్చిన డమరుకం నేడు విడుదలంటూ భారీగా ప్రచారం కూడా జరిగింది. అభిమాన హీరో సినిమా కోసం ఆశగా వచ్చిన అభిమానులు సినిమా విడుదల లేదని తెలియగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Dhenikaina Ready

బ్రాహ్మణులను కించ పరచలేదు: బ్రహ్మానందం

  దేనికైనా రెడీ సినిమాలోని పలు సన్నివేశాల్లో ఉన్న నటుడు బ్రహ్మానందం తాజాగా బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పారు. ‘‘ఆ సినిమాలో బ్రాహ్మణులను కించపరుస్తూ ఏవైనా సన్నివేశాలు ఉన్నట్లు భావిస్తే తాను క్షమాపణలు చెబుతున్నానని, అయినా ఆ చిత్రంలో తాను బ్రాహ్మణుడిగా నటించలేదని..’’ బ్రహ్మానందం తెలిపారు. ఆ సన్నివేశాలు బ్రాహ్మణులను నొప్పించాయని తాను అనుకోవడం లేదని అన్నారు.   దేనికైనా రెడీ చిత్రంపై ప్రభుత్వం నియమించిన కమిటీ గురువారం సినిమా వీక్షించారు. ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని తేల్చారు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలను నమోదు చేశామని, వీటిపై శుక్రవారం చిత్రనిర్మాత మోహన్‌ బాబు, హీరో విష్ణును పిలిపించి చర్చిస్తామని కమిటీ ఛైర్మన్‌ రేమండ్‌ పీటర్‌ తెలిపారు. అయితే తాజాగా హైకోర్టు స్టే విధించడంతో ఈ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోరని స్పష్టం అవుతోంది.

  Vidya Balan Siddharth Roy

డిసెంబరులో మ్యారేజ్...?

    బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తన మ్యారేజ్ పై క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఆమె పెళ్ళి చేసుకోబోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఇందుకు సంబంధించి పనులు చకచకా జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో మరో హై ప్రొఫైల్ వెడ్డింగ్ జరగబోతోంది. ఈ ఏడాదిలో సైఫ్ కరీనాల పెళ్ళి తర్వాత ఆ తరహాలో మరొకటి జరగబోతోంది.  చాన్నాళ్ళ గా యుటీవి డిస్నీ సిఈఓ సిద్ధార్థరాయ్ కపూర్ తో డేటింగ్ చేసిన విద్యాబాలన్, వీలైనంత తొందరగా మ్యారేజ్ చేసుకునె పనిలో పడింది.   ఈ ఏడాది చివర్లో ఎంగేజ్ మెంట్ కానిచ్చి తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని ఈ జంట భావించింది. అయితే ఇంతలోనే ఈ జంట వీలైనంత తొందరగా మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ లోగా విద్యా కూడా తన సినిమాలను పూర్తి చేసే పనిలోవున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా సిద్ధార్థ రాయ్ కపూర్ డిసెంబర్ నేలంతా లీవ్ పెట్టడం ఇందుకు బలం చేకూరుతోంది. ఎంగేజ్ మెంట్ ఒకవారం సరిపోతుందని నేలంతా లీవ్ పెట్టడంతో పెళ్ళి పనుల్లో నిమగ్నమైనట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈవార్తలపై  ఆ జంట ఏమంటుందో...?  

Namita workout

నమితకు కొత్త షేపులు

    మొదటి సినిమాలో చాలా స్లిమ్ గా కనిపించిన నమిత తర్వాత్తర్వాత తమిళ ఇండస్ట్రీకెళ్లి తెగ ఊరిపోయింది. ఏదైనా బాగా ఎక్కువగా ఉంటేనే ఇష్టపడే తమిళజనంకోసం బాడీని తెగపెంచేసిన ఈ ముద్దుగుమ్మ బొద్దుగా తయారయ్యాక తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని పుష్కలంగా సంపాదించుకుంది.   నమిత అందాన్ని చూసి ఫ్లాటైన ఓ జపాన్ టీవీ ఛానెల్ ఆమెని ప్రత్యేకంగా తమ దేశానికి పిలింపించుకుని ఘన సన్మానం చేసి తరించింది. ఫోటో గ్రాఫర్ కార్తీక్ శ్రీనివాసన్ తీసిన ఓ ఫోటో ఆ ఛానెల్ కి పిచ్చపిచ్చగా నచ్చిందట. విదేశాల్లోకూడా తన ఫిగర్ కున్న ఫాలోయింగ్ ని చూసి ఖంగుతిన్న నమిత అయ్యయ్యో బాడీని తెగ పెంచేసి అనవసరంగా డీ గ్లామరైజ్ అవుతున్నానేమో అన్న ఆలోచనలో పడింది.   అనుకున్నదే తడవుగా ఓ పర్సనల్ ట్రైనర్ ని ఏర్పాటుచేసుకున్న నమిత రోజూ కఠినమైన వర్కవుట్లు, స్ట్రిక్ట్ డైట్ చార్ట్ తో తన షేపుల్ని పూర్తిగా మార్చేసుకుంటోంది. యుద్ధప్రాతిపదికమీద స్లిమ్ గా తయారవ్వాలన్న తపన నమితలో బాగా కనిపిస్తోందని ట్రైనర్ కూడా చెబుతున్నారు. స్లిమ్ గా తయారైతే తెలుగులో మరో స్ట్రైట్ హిట్ కొట్టొచ్చన్నది ఈ అందాల సుందరి ఆలోచనని ఇండస్ట్రీవర్గాలు అనుకుంటున్నాయ్.  

Brazilian Woman's Virginity

కన్నెతనానికి భలే గిరాకీ

  బ్రెజిల్ యువతి కేటరీనా తన కన్యత్వాన్ని చాలా లాభానికి అమ్మేసుకుంది. ముందుగా అనుకున్నదానికంటే చాలా ఎక్కువ మొత్తంలో గిట్టుబాటు కావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కేటరినా తన కన్యత్వాన్ని ఆన్ లైన్ లో ఆక్షన్ కి పెట్టినప్పుడు విపరీతమైన స్పందన కనిపించింది. దేశవిదేశాల్లో ఉన్న కోటీశ్వరులు కేటరీనా కన్నెతనాన్ని అందిపుచ్చుకునేందుకు పోటీలు పడ్డారు. వీళ్లలో ఓ భారతీయుడుకూడా ఉన్నాడు. 20 సంవత్సరాల వయసున్న కేటరీనా ఫిజికల్ ఎడ్యుకేషన్ చదువుతోంది. జపాన్ కి చెందిన నట్సూ 7 లక్షల 80 వేల డాలర్లకు కేటరీనా కన్నెతనాన్ని సొంతం చేసుకున్నాడు. నట్సూకి తన కన్నెతనాన్ని అప్పగించడానికి ముందు కేటరీనా అస్ట్రేలియానుంచి అమెరికాకు చేసే విమానం ప్రయాణంలో మీడియాకు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వూ ఇవ్వాలనుకుంటోంది. అయితే తనను మాత్రం మీడియాలో చూపించడానికి వీల్లేదని నట్సూ కండిషన్ పెట్టాడు. నట్సూకి తన అందాన్ని అర్పించినందుకు వచ్చే సొమ్ములో 90 శాతాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకి దానం చేస్తానని ఈ అమ్మడు చెబుతోంది. తన సొంత రాష్ట్రమైన కేటరీనాలో ఇళ్లు లేని నిరుపేదలకోసం తన సంపాదించే మొత్తాన్ని ఇవ్వాలని కేటరీనా ఉవ్విళ్లూరుతోంది. తర్వాత తన తాత్కాలిక ప్రియుడు రహస్య ప్రదేశంలో కామవాంఛలు తీర్చుకోవడానికి కేటీ సహకరిస్తుంది.

Samanta rate fixed

గంటకి పది లక్షలే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్ సమంతా రేటు ఇప్పుడు గంటకి అక్షరాలా పది లక్షల రూపాయలు మాత్రమే. లేటెస్ట్ హాట్ సుందరి అయిన సమంతా చెయ్యిపడాలంటే పది లక్షల రూపాయల హాట్ క్యాష్ ముందుగా కట్టి తీరాల్సిందే.. అదికూడా అడ్వాన్స్ గా.. ముందుగా అడ్వాన్స్ ఇచ్చేశాక.. సమంతకి ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు వస్తుందట.. తనకి ఎప్పుడు తీరిక దొరుకుతుందో చూసుకుని మరీ డబ్బులిచ్చేవాళ్లు టైమ్ ఫిక్స్ చేసుకోవాలిట. ఎంత డిమాండ్ ఉన్నా మరీ ఇంతగా డబ్బుమనిషా అంటూ చాలామంది చెవులు కొరుక్కుంటున్నా సమంతమాత్రం డోన్ట్ కేర్ అంటోంది. డబ్బుంటేనే అంతా పలకరిస్తారనే వేదాంతాన్ని కాస్త గట్టిగానే వంటబట్టించుకున్న ఈ భామామణి మొత్తానికి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూత్రాన్ని అక్షరాలా ఆచరించి చూపిస్తోంది. ఇంతకీ సమంతా అంత డబ్బుని ఎందుకు డిమాండ్ చేస్తుందో తెలుసా.. యాడ్ ఫిల్మ్ లకు, ప్రారంభోత్సవాలకి మాత్రమే ఈ రేటు.. కొత్త కాన్సెప్ట్ ఏదైనా వస్తే దానిగురించి అప్పుడు బేరీజువేసుకుని రేటు చెబుతుందట.

Trisha and rana

త్రిషతో రానాకి ఏంటంట?

త్రిషకి రానాకి మధ్య ఏదో నిప్పు రాజుకుందని టాలీవుడ్ వర్గాలు తెగ చెవులు కొరుక్కుంటున్నాయి. ఇద్దరూ ఒక్క నిమిషంకూడా విడిచిపెట్టలేనంత దగ్గరగా అతుక్కుని కనిపిస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు. మా మధ్య స్నేహం తప్ప మరేం లేదంటూనే రానా, త్రిషలు తెగ కరుచుకుపోతున్నారని తెలుగు సినీవర్గాల భోగట్టా. త్రిష పదేళ్లుగా తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో హీరోయిన్ గా కొనసాగుతోంది. మరి రానాకేమో కేవలం ఐదు సినిమాల అనుభవం. తన అనుభవాన్నంతా రంగరించి ఆరడుగుల కుర్రాణ్ణి త్రిష తేలిగ్గానే బుట్టలోపడేసిందని తెగ చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా ఇద్దరూ కలిసి ఓ మ్యాగజైన్ కి హాట్ హాట్ ఫోజులుకూడా ఇచ్చారు. ఓ అవార్డ్ ఫంక్షన్ కి కూడా కలిసేవచ్చారు. త్వరలోనే ఒకటైపోతారేమో అని కొంతమంది అనుకుంటుంటే .. లేదు.. లేదు.. కొత్త సినిమా కృష్ణం వందే జగద్గురుమ్ ఫ్రీ పబ్లిసిటీకోసం ఆడుతున్న డ్రామానే ఇదంతా అని మరికొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు. నిజమేంటో కాలమే నిర్ణయించాలి మరి..

sweta blessed with child

శ్వేతామీనన్ లేబర్ సీన్స్

మళయాళ నటి శ్వేతామీనన్ ప్రసవ వేదన పడుతోంది. చకచకా ఓ కెమెరా టీమ్ డెలివరీ రూమ్ లోకి ఎంటరయ్యింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం టకటకా లైటింగ్ అరేంజ్ మెంట్స్ చేసేసుకున్నారు. శ్వేతామీనన్ పాపకి జన్మనిచ్చేటప్పుడు పడ్డ ప్రసవవేదనని షూట్ చేశారు. ఇదంతా సినిమాకోసం చేసిన నటనకాదు. నిజ జీవితంలో జరిగిన వాస్తవం. శ్వేత భర్త అనుమతితో, ఆస్పత్రివర్గాల అనుమతితోనే ఇదంతా జరిగింది. నిజజీవితంలో జరిగిన సన్నివేశాన్ని చిత్రీకరించిన సినిమా క్రూ శ్వేత తర్వాతి చిత్రంలో ఈ దృశ్యాల్ని ఉంచబోతున్నారట. బిడ్డ కడుపులోపడ్డ దగ్గర్నుంచి తల్లికి ఎదురయ్యే అనుభవాల సారాంశమే కొత్త సినిమా అని తనే చెబుతోంది. అందుకే నిజజీవితంలోని అనుభవాల్ని చిత్రీకరించి సినిమాకి అనుగుణంగా వాడుకునేందుకు శ్వేతామీనన్ తోపాటు ఆమె భర్తకూడా ఒప్పేసుకున్నాడట. నటనలో జీవిస్తున్న శ్వేతకి నిజంగా ఆస్కార్ కూడా సరిపోదేమో అని ఆమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.  

Dare to bare

కేట్స్ లా చూపించలేం!

    కేట్స్ టాప్ లెస్ ఫోటోలు ఒక్క రోజులో ప్రపంచాన్ని ఊర్రూతలూగించాయ్. బ్రిటన్ రాజుగారి పెళ్లాం కొంగుచాటు అందాల్ని చూడాలని ఆరాటపడని మగాడు ఈ భూమ్మీదే లేడన్నంతగా జనం విరగబడి చూశారు. అమ్మో.. కేట్ అందాలకు ఇంత ఫాలోయింగా అనుకుంటూ తోటి మోడలింగ్ ముద్దుగుమ్మలు బుగ్గలుకూడా నొక్కుకున్నారుకూడా. అయితే మరి.. మీరు కూడా రవికెలు తీసిపారేసి విపరీతమైన ఫాలోయింగ్ పెంచేసుకోవచ్చుగా అని అడిగితే మాత్రం గుటకలు మింగుతున్నారు.   వాళ్ల అందాలు కేట్స్ అందాలంత బాగుండవన్న విషయం తెలుసుగాబట్టి చూపించుకోవడం బాగుండన్న విషయాన్ని బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. మాయజేసో, మతలబు చేసో మేం ఉన్న అందాలకు కాస్త అదనపు హంగుల్ని జోడించుకుని ఎప్పట్నుంచో తిప్పలు పడుతుంటే.. ఇప్పుడిలా కేట్ తన అందాల్ని ప్రపంచానికి కనువిందుచేసేస్తే మా గతి ఏం కానూ అంటూ మూతి ముఫ్పైఆరు వంకర్లు తిప్పుకుంటున్నారు. హేట్సాఫ్ టు కేట్ అని మనస్ఫూర్తిగా అభినందించేవాళ్లుకూడా ఎక్కువగానే ఉన్నారు లేండి.

ANUSHKA

అనుష్కది చాలా విశాలం!

  అవును.. నిజంగా అనుష్కది.. చాలా... విశాలం.. ఎంత విశాలం కాకపోతే.. అమ్మడు మరి తన డ్రైవర్ని అంతగా ఎలా కరుణిస్తుంది. అనుష్క తన పుట్టిన రోజునాడు డ్రైవర్ చాలామంచి నజరానా ఇచ్చిందని ఇండస్ట్రీమొత్తం కోడై కూస్తోంది. ఎంత సీక్రెట్ గా చేద్దామన్నా నిప్పులాంటి నిజాన్ని దాచిపెట్టడం కుదరలేదు. లక్షల విలువచేసే కారుని చాలా నమ్మకస్తుడైన డ్రైవర్ కి అనుష్క గిఫ్ట్ గా ఇవ్వడం ఇండస్ట్రీలో చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. డ్రైవర్ కి అంత ఖరీదైన కారుని కానుకగా ఇచ్చిన హీరోయిన్ ఇంత వరకూ ఇండస్ట్రీ చరిత్రలోనే లేదని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. చేయితిరిగిన పనితనం ఉన్న తన పనివాళ్లంటే స్వీటీకి.. (ఇది అనుష్క ముద్దుపేరు లెండి) చాలా ఇష్టమట. అందుకే పర్సనల్ కెమెరా మెన్ విషయంలో తమిళసినిమా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడి టెక్నీషిన్లతో గొడవపడి వాళ్లంతా మీదపడేవరకూ పరిస్థితి వచ్చిందంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. అనుష్కకి తన స్టాఫ్ అంటే ఎంతిష్టమో..!

Tamannaa SAYS NO TO MAHESH

మహేష్ అంటే ఇష్టమే కానీ..!

  మహేష్ బాబు ఇష్టపడి చేస్తానంటే వద్దంటానికి ఏ అమ్మాయికి మాత్రం ఏం కారణముంటుంది చెప్పండి.. కానీ.. తమన్నా మాత్రం నాకిప్పుడస్సలు టైం లేదు అనేసిందని టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. “అవును మరి ఆల్రెడీ లైన్లో ఉన్న హీరోలు, ప్రొడ్యూసర్లతో బిజీగా ఉన్నప్పుడు సూపర్ స్టార్ ఎంతగా ఇష్టపడ్డా చేయలేని పరిస్థితి నాది అంటూ తమ్మూ గట్టిగా చెప్పడంలోకూడా ఓ పాయింటుంది మరి” అంటూ లేత తమలపాకులాంటి ఈ హీరోయిన్ని ఇష్టపడేవాళ్లు వెనకేసుకొస్తున్నారు. “వర్క్ లోడ్ మరీ ఎక్కువైతే లేలేత చివురులాంటి చిన్నది వాడిపోదూ” అంటూ ఫ్యాన్స్ కళ్లెర్రజేస్తున్నారు. సో.. తమన్నా కావాలంటే ఎంత పెద్ద స్టారైనా సరే.. కొంతకాలం పాటు వెయిట్ చేయక తప్పదు గాక తప్పదు.. ఎందుకంటే క్యూలైన్ అంత పెద్దగా ఉంది.. మరి..

Shruti Haasan

శ్రుతి హాసన్ "బలుపు"

  శ్రుతి హాసన్ బలుపుతో బిజీగా ఉంది .... అందుకే చెర్రీ కొత్త సినిమాలో ఒక ఐటమ సాంగ్ చేయమని నిర్మాత ఆఫర్ యిస్తే బ్లంట్ గా నో చెప్పేసిందట. ఇంతకుముందు బన్నీ సినిమాకి కూడా స్పెషల్ సాంగ్ చేయమని ఆఫర్ వచ్చినప్పుడు కూడా శృతి తిరస్కరించిందట. టాప్ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయిన చేర్రీని కాదని రవితేజ 'బలుపు' ని నమ్ముకోవడం దేనికని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గబ్బర్ సింగ్ తో టాలీవుడ్ కి బాగా దగ్గరైనా శృతి మెగా ఫ్యామిలీ హీరోలకు నో చెప్పడం ఏమిటని ఆవెశాన్ని వెళ్లగక్కుతున్నారు. ప్రభుదేవా డైరెక్షన్ లో మరో కొత్త తెలుగు సినిమా చేస్తున్నానని చెప్పుకుంటున్న శృతికి బాబాయ్ 'పవర్' ని రుచి చూసేసరికి అబ్బాయి ఆనడం లేదా ఏంటీ అని కొంతమంది సెటైర్లు కూడా వేస్తున్నారు. ఆరు నూరైనా సరే ఐటమ సాంగ్ కి ఎస్ అనేది లేదని శృతి గట్టిగానే చెబుతోంది. ఈ వార్ ఇంకా ఎంతదూరం పోతుందోనని అటు మెగా ఫ్యాన్స్ ఇటు శృతి అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది.

AMALAPAUL angry

అమలకి ఎక్కడో మండింది!

  అమలాపాల్ ని జర్నలిస్ట్ లు ఎట్టాపడితే అట్టా ఆడేసుకుంటున్నారంట. తానే స్వయంగా తన బ్లాగ్ లో ఈ విషయాన్ని వివరంగా పూసగుచ్చినట్టు ఆవేశపడుతూ చెప్పింది. “మీ ఇష్టమొచ్చినట్టు మీరు రాసేసుకుంటే ఎలా ఓ మాట నన్నడగొచ్చుగా” అంటూ ఈ అమ్మడు తన అక్కసునంతా వెళ్లగక్కింది. ప్రస్తుతం చేతిలో ఉన్న ఓ సినిమాకోసం చాలా స్లిమ్ కనిపించేందుకు ట్రైనర్ చెప్పినమాటల్ని తు.చ తప్పకుండా పాటిస్తూ అమల తెగ చిక్కిపోయింది. మరో సినిమాకోసం ఆ నిర్మాత కాస్త ఒళ్లు చేస్తే బాగుంటుందికదా.. అని అమలాపాల్ ని ఆదరంగా అడిగినట్టు కొన్నిచోట్ల ఒచ్చిన వార్తల్ని తను చాలా సీరియస్ గా తీసుకుంది. ఎట్టాపడితే అట్టా రాసేస్తారా.. ఒక్క క్షణంకూడా మా గురించి ఆలోచించరా అంటూ.. చెడామడా తనకు నచ్చనివాళ్లకు నాలుగు చీవాట్లు పెట్టడమే కాకుండా విలువలు, వలువల గురించి ఓ చిన్నసైజు ఉపన్యాసం కూడా ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల భోగట్టా..

 ANNA HAGARE PARTED WITH KEJRIWAL

కేజ్రీవాల్ కి క్రేజీ ఆఫర్..!

  అన్నా హజారేతో కేజ్రీవాల్ కి చెడిందని ఊరూవాడా కోడై కూస్తోంది. తన ఫోటోల్ని వాడుకోవడానికి వీల్లేదంటూ కేజ్రీవాల్ కి అన్నా అల్టిమేటమ్ ఇచ్చేశాడని ప్రచారంకూడా జోరుగా సాగుతోంది. క్రేజీ మోడల్ పూనమ్ పాండే ఇప్పుడు ఇద్దరి మధ్యా ఎంటరైంది. కేజ్రీవాల్ కి ఓ క్రేజీ ఆఫర్ కూడా ఇచ్చేసింది. అన్నా ఫోటోలు పెట్టుకుంటే నిన్నెవరు చూస్తారు.. కావాలంటే నా ఫోటోలు పెట్టుకో ఫ్రీగా ఎడాపెడా న్యూడ్ ఫోజులిచ్చేస్తానంటూ పూనమ్ పాండే కేజ్రీవాల్ ని కోరింది. కేజ్రీవాల్ ఈ క్రేజీ ఆఫర్ కి ఒప్పుకుంటాడా లేదా అన్న విషయాన్ని పక్కనపెడితే ఇప్పటికే ఈ ఆఫర్ పూనమ్ కి మళ్లీ బోలెడంత ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టేస్తోంది. ఒకవేళ నిజంగా కేజ్రీవాల్ టెంప్టై పూనమ్ ఆఫర్ కి ఎస్ చెప్పేస్తే.. అప్పుడు చూడాలి.. నా సామిరంగా.. బ్లాగులన్నీ బద్దలైపోవూ.. అని చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం.. క్రేజీ గర్ల్ ఆఫర్ కేజ్రీవాల్ కి ఎంత వర్కవుటౌతుందో..

హిందీవాళ్లతో ఇష్టం లేదా?

  రేఖ, శ్రీదేవి, జయప్రద ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగునుంచి హిందీకెళ్లి అక్కడ బా...గా.. కష్టపడి పైకొచ్చిన హీరోయిన్లు కోకొల్లలు. మామూలుగా తెలుగు ప్రొడ్యూసర్లు బోర్ కొట్టగానే చాలామంది హీరోయిన్లు హిందీ ప్రొడ్యూసర్లవైపు చూస్తారు. కొందరు హీరోయిన్లైతే బాలీవుడ్ నిర్మాతలు ఒక్క చూపు చూస్తే చాలు నిలువెల్లా బంగారంతో నిండిపోవచ్చని ఆశపడుతుంటారు. బాలీవుడ్ అంటే హీరోయిన్లకుండే క్రేజ్ అలాంటిది మరి. కానీ.. కోలీవుడ్ లో, టాలీవుడ్ లో మాం....చి ఊపులో ఉన్న అమ్మణ్ణి అనుష్కకి హిందీ వాసనంటే అస్సలు పడదంట. హిందీవాళ్లతో చేయడం తనకస్సలు ఇష్టంలేదని తెగేసి చెబుతోందీ అమ్మడు. తెలుగు నిర్మాతలు, కన్నడం నిర్మాతలు చూసుకున్నంత బాగా హిందీ నిర్మాతలు చూసుకోరని భయపడిందో లేక అక్కడి అవకాశాలకోసం అర్రులుచాచి ఇక్కడి అవకాశాల్ని పోగొట్టుకున్న చాలామందిని చూసి మనకెందుకులే అనుకుందోగానీ.. ఇప్పట్లో అస్సలు హిందీ వాళ్లవైపు చూసే పనేలేదని అనుష్క గట్టిగా చెప్పేసింది.

బ్రాడ్ పిట్ తో ఐష్ కి ఒకేనా ?

  బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్య రాయ్ బ్రాడ్ పిట్ ఒక హాలీవుడ్ సినిమాలో నటించాబోతోందని బాలీవుడ్ వర్గాల్లో తాజా చర్చ నడుస్తోంది. జీవితంలో ఒక్కసారైనా ఐష్ తో చేయాలని బ్రాడ్ పిట్ తెగ కళలు కంటున్నట్లు హాలీవుడ్ వర్గాల బోగట్టా. గతంలో ట్రాయ్ అనే చిత్రంలో బ్రాడ్ పిట్ సరసన నటించే అవకాశం వచ్చినప్పుడు ఐష్ నో చెప్పేసింది. ఓ పిల్లకు తల్లైన తరువాతైనా తనతో పనిచేసే అవకాశం దక్కుతుందేమోనని బ్రాడ్ పిట్ ఆశతోనే ఉన్నాడని హాలీవుడ్ లో గట్టిప్రచారం జరుగుతోంది. ఐష్ ను ఎలాగైనా ఒప్పించేందుకు బ్రాడ్ పిట్ ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడట. ప్రపంచంలోనే ఐశ్వర్య వంటి అందగత్తె లేదని, వర్సటైల్ నటిగా కూడా ఐష్ కి చాలామంచి పేరు సంపాదించుకుందని 'ది పింక్ పాంథర్', 'ప్రోవోకడ్' లాంటి చిత్రాల్లో ఐష్ నటన చూసిన దగ్గర్నుంచీ తను ఆమెకు పిచ్చ ఫ్యాన్ గా మారిపోయానని లైఫ్ లో ఒక్కసారైనా తనతో చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని బ్రాడ్ పిట్ కన్పించినవారికల్లా చెప్పుకుని సంతోషపడుతున్నాడట. ఇంతకీ ఐష్ బ్రాడ్ పిట్ కోరికను ఈసారైనా తీరుస్తుందో లేదో ....

అదంటే నాకు చాలా ఇష్టం

  హర్రర్. థ్రిల్లర్ సినిమాలు బిపాసాకు మంచి ఊపు ఇస్తున్నాయి. ఈ సినిమాలో రెచ్చిపోయి నటిస్తున్న బిపాసాను చూసి నిర్మాతలు వరుసగా తనని బుక్ చేసేసుకుంటున్నారు. ప్రస్తుతం 'ఆత్మ' అనే సినిమా కోసం బిపాసా రాత్రింబవళ్ళు కష్టపడుతుంది. ముందర సినిమాల్లో బిపాసా తీరును తెగ మెచ్సుసుకున్న విక్రం భట్ టెంప్టేషన్ ఆపుకోలేక తన కొత్త సినిమాలో అవకాశం ఇచ్చేసాడట. విక్రం భట్ స్వీయ రచనలో సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న సినిమా బిపాసా ప్రస్తుతం నటిస్తున్న 'ఆత్మ' పూర్తికాగానే మొదలవుతుందని భట్ గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో విక్రం భట్ నెంబర్ వన్ గనుక తనతో చేయడం చాలా ఆనందాన్ని కలిగించే విషయమని బిపాసా చెప్పుకుంటోంది. ఇద్దరి కెమిస్ట్రీ బా...గా వర్కవుట్ అయితే హర్రర్ గాళ్ గా మారిన ఐటమ గర్ల్ బిపాసా మరింత చెలరేగిపోతుందని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.

ఆర్యా తో తాప్సీకి లింకుందా?

  వరుడు సినిమాలో విలన్ గా నటించిన ఆర్యాతో తాప్సీ మద్రాస్ వీథుల్లో చెట్టాపట్టాలు వేసుకుని తెగ తిరిగేస్తుందని చెన్నపట్నంలో అందరూ చెప్పుకుంటున్నారు. విష్ణువర్థన్ దర్శకత్వంలో వీళ్ళిద్దరూ ఒక కొత్త సినిమాలో నటిస్తున్నారు. తాప్సీ మాత్రం ఆర్య నా కోస్టార్ మాత్రమె అంటూ చక్రాల్లాంటి కళ్ళను తెగ తిప్పెసుకుంటూ ముద్దు ముద్దుగా చెబుతోంది. గతంలో కూడా తాప్సీకి మరికొందరు హీరోలతో లింకుందని పుకార్లు షికార్లు చేశాయి. "ప్లీజ్ ఇలాంటి ప్రశ్నలు వేసి నన్ను ఇరకాటంలో పెట్టకండి'' అంటూ ఈ తెల్లతోలు పిల్ల మీడియాని దాటేసుకుని షూటింగ్ స్పాట్ కి చెక్కేస్తోందట.