రాజకీయాల్లోకి ఉదయభాను!
ప్రముఖ యాంకర్ ఉదయభాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఉదయభాను యాంకర్ గా బుల్లితెరపై హిట్ అయింది. ఉదయభాను అంటే తెలియని వారు రాష్ట్రంలో ఉండరు అంటే సందేహం అక్కర్లేదు. వేటగాడు, ఎర్రసైన్యం, ఖైదీబ్రదర్స్, కొండవీటి సింహాసనం, పోలీస్ నంబర్ 1, బస్తీమే సవాల్, శ్రావణమాసం తదితర చిత్రాలలో నటించింది. ఆపదమొక్కుల వాడు చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించిన ఉదయభాను, లీడర్, జులాయి సినిమాలలో ఐటం సాంగ్ చేసింది.
తాజాగా ఉదయభాను ప్రధాన పాత్రలో మధుమతి చిత్రం రూపొందింది. త్వరలో అది విడుదలకానుంది. తెర మీద ఇన్నాళ్లు భవిష్యత్ ఎదుర్కొన్న ఉదయభాను రాజకీయ రంగంలోకి రావాలని అనుకోవడం ఆశ్చర్యకరమే. గతంలో ఆమె తండ్రి మొయినుద్దీన్ మూడుసార్లు సర్పంచ్ గా పనిచేశారు. స్థానికంగా మొయినుద్దీన్ మంచి గుర్తింపు కూడా వుంది. మొయినుద్దీన్ మృతి చెందక ఫ్యామిలీ హైదరాబాద్ రావడంతో రాజకీయాలకి దూరమయ్యారు. తాజాగా ఉదయభాను టీఆర్ఎస్ లేదా బీజేపీ పార్టీలలో చేరుతుందని ఊహాగానాలు వినిపిస్తున్పాయి.