భగ్నప్రేమికుడి షష్ఠిపూర్తి
దేవాదాసు సినిమా విడుదలై 60 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా తెలుగు వన్.కాం ఆ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
కొన్ని కథలు ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తాయి..ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తాయి. అలా వెండితెర మీద 14 సార్లు ఆవిష్కరింపబడిన అరుదైన కథ దేవాదాసు.. దాదాపు భారతీయ భాషలన్నింటిలో తెరకెక్కిన దేవాదాసు తెలుగు వెండితెర మీద ఆవిష్కరింపబడి 60 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ చిత్ర విశేషాలు తెలుసుకుందాం..
దేవదాసు పాత్ర అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అక్కినేని నాగేశ్వర్రావు.. అవును అసలు దేవాదాసు ఇలాగే ఉంటాడేమో అనేంత బాగా నటించారు ఆయన.. శరణ్ రాసిన నవలా నాయకున్ని కళ్లకు కట్టినట్టుగా మన ముందు ఆవిష్కరించారు..
ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో పాత్ర పార్వతి.. ఈ పాత్రల్లో ఎంతో హుందాగా ఓదిగిపోయింది సావిత్రి.. జానకీ చేయాల్సిన పాత్ర అదృష్టం కొద్ది సావిత్రిని వరించటంతో ఆ అవకాశాన్ని ఎంతో బాగా ఉపయోగించుకుంది.. 17 ఏళ్ల వయసులోనే తను తప్ప మరెమరూ ఆ పాత్రకు అంతగా న్యాయం చేయలేరేమో అనేంత బాగా నటించి మెప్పించింది..
Click Here to Watch Devadasu Full Movie
తెలుగులో అక్కినేని నటించిన దేవదాసు రిలీజ్ నాడే, పోటీగా సైగల్ నటించిన హిందీ దేవదాసును విడుదల చేశారు బాలీవుడ్ నిర్మాతలు.. అయినా తెలుగు దేవాదాసు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.. అంతేకాదు భారతీయ చరిత్రలోనే అన్ని దేవాదాసుల కంటే ఏఎన్నార్ హీరోగా నటించిన దేవాదాసే భారీ విజయం సాదించింది.
1951 నవంబర్ 24న మద్రాసులోని రేవతి స్టూడియోలో రాత్రి 8 గంటలకు దేవదాసు షూటింగ్ ప్రారంభమైంది. ఎంత మంది వద్దు అంటున్నా .. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఎలాగైనా ఈ సినిమా పూర్తి చేయాలనే దృడ సంకల్పంతో సినిమా ప్రారంబించారు నిర్మాత ద్రణావధ్యుల లక్ష్మీ నారాయణ..
నిర్మాత లక్ష్మీ నారాయణ గారు అంత సాహసం చేయటం వెనుక కారణం లేకపోలేదు.. దేవాదాసు కథ అప్పటికే బాలీవుడ్ తెర మీద మంచి సక్సెస్ సాదించింది.. అంతకు మించి దర్శకులు వేదాంతం రాఘవయ్యగారు భారీ బరోసా ఇవ్వటంతో నిర్మాత నిశ్చింతగా ఉన్నారు..
ఇక ఈ చిత్రానికి మరో ఎసెట్ సీనియర్ సముద్రాల.. ఈ సినిమాకు మాటలు పాటలు అందించిన సముద్రాల ప్రతీ అక్షరంలోనూ తన మార్క్ చూపించారు.. అంతేకాదు ఈ సినిమాలో ఉన్న పదకొండు పాటలూ ఆయనే రాయడం విశేషం..
ఈ సినిమా సంగీతం ఇప్పటికీ అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది అంటే అందుకు కారణం సంగీత దర్శకుడు సుబ్బరామన్.. ఇప్పటి చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఆ రోజుల్లోనే మాస్, క్లాస్, రోమాంటిక్ అండ్ ట్రాజిక్ సాంగ్స్‌తో అద్భుతమైన పాటలు ఇచ్చారు..
దేవాదాసు సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ నడుస్తుండగానే సుబ్బరామన్‌గారు మరణించారు.. అప్పటికీ రెండు పాటలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి.. దాంతో సుబ్బరామన్‌గారి అసిస్టెంట్.. ఎం ఎస్ విశ్వనాధన్‌గారు ఆ రెండు పాటలను పూర్తి చేశారు..
ఫైనల్‌గా ఎన్నో అవాంతరాల తరువాత దేవాదాసు చిత్రం విడుదలకు రెడీ అయ్యింది.. జూన్ 26, 1953న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అప్పటి వరకు ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఘనవిజయం సాదించింది.. ఏడు కేంద్రాల్లో వందరోజులు ఆడి చరిత్ర సృష్టించింది.
సంతోషాన్ని, చిలిపితనాన్ని, పొగరుని, క్షోభని, ఎడబాటుని, తాగిన మైకాన్ని, విషాదాన్ని... ఇలా రకరకాల హావ భావాల్ని అద్భుతంగా చూపించిన అక్కినేని నటనకు యావత్ భారత దేశం మురిసిపోయింది.. దిలీప్‌కుమార్, శివాజీ గణేషన్ లాంటి మహానటులు కూడా ఈ పాత్ర ఆయన తప్ప మరెవరూ ఇంత బాగా చేయలేరు అన్నారంటే ఆయన నటన ఏ స్థాయితో ఉందో ఊహించుకోవచ్చు..
పేదింటి అమ్మాయి - పెద్దింటి అబ్బాయి - పెద్దలు విడగొట్టడం - అబ్బాయి మద్యానికి బానిస కావడం ఇదంతా చాలా సార్లు విన్న కథ లాగే అనిపించినా ఈ నాటికి మళ్లీ మళ్లీ చూడాలని పించే సినిమా దేవదాసు.. అందుకే ఆ సినిమా రిలీజ్ అయి 60 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా మనం ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం..