మూవీమొఘల్ పుట్టిన రోజు
posted on Jun 6, 2013 @ 12:10PM
మనలో అందరికీ సినిమా ఓ రంగుల కల... కానీ కొందరికి మాత్రం అది రంగుల కళ... అలాంటి వారు సినిమానే శ్వాసిస్తారు, సినిమానే జీవితంగా జీవిస్తారు , సినిమానే ప్రేమిస్తారు, చివరకు ఆ సినిమానే శాసిస్తారు. అలాంటి వారిలో ప్రముఖులు మూవీ మొఘల్ డా. డి. రామానాయుడు. జూన్ 06 ఆయన పుట్టినరోజున ఆయన జన్మదినం సదర్భంగా ఆ సినీ శిఖరం గురించి తెలుసుకుందా..
ఒక్క భాషలో ఒక్క సినిమా తీసి 100 సినిమాలు తీసినట్టు ఫోజులిచ్చే సినీ నిర్మాతలను మనం రోజూ చూస్తుంటాం. కానీ దాదాపు అన్ని భాషల్లో వందకు పైగా చిత్రాలు చేసినా సింపుల్ గా కనిపించే ఏకైక నిర్మాత రామానాయుడు. సెట్ లో కలివిడిగా వుంటూ అన్ని పనుల్లో సాయం చేస్తూ సినిమాను అనుక్షణం ప్రేమిస్తారు కాబట్టే ఆయన ఇంకా సినిమాలు తీస్తూనే వున్నారు. ముందు ముందు కూడా సినిమాలు తీస్తూనే వుంటారు.
కమర్షియల్ , క్లాస్, మాస్ సందేశాత్మకం ఇలా అన్ని రకాల చిత్రాలను నిర్మించి ఆడియన్స్ ని అలరిస్తోన్న నిర్మాత రామానాయుడు. అంతే కాదు అత్యధిక భాషల్లో సినిమాలు నిర్మించిన నిర్మాతగా గిన్నిస్ రికార్డును సైతం నెలకొల్పిన ఘనత ఆయనది.. స్పాట్... ప్రేమించుకుందాం. రా.
రామానాయుడు 1936 జూన్ 06న కారంచేడు లో జన్మించారు. వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవమ్మ ఆయన తల్లిదండ్రులు.. రామానాయుడి చిన్నతనంలో ఆయన తల్లి దండ్రులు ఆయన్ను డాక్టర్‌ని చేయాలనుకున్నారు.. అయితే వారి కోరిక తీర్చలేకపోయిన రామానాయుడు నిర్మాతగా మారి డాక్టరేట్ అందుకుని డాక్టర్ డి. రామానాయుడు అయ్యారు.
నిర్మాతగా రామానాయుడు తొలిచిత్రం అనురాగం.. కాని తొలి ప్రయత్నంలోనే రామానాయుడికి నిరాశ ఎదురైంది.. కాని ఆయన కుండిపోలేదు.. తిరిగి ప్రయత్నించాడు ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో రాముడు భీముడు చిత్రాన్ని నిర్మించారు..ఈ సినిమా సూపర్ హిట్ దీంతో రామానాయుడు నిర్మాతగా స్థిరపడిపోయారు..
రామానాయడు నిర్మించిన చిత్రాలలో ప్రేమ్ నగర్ చిత్రం ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంటుంది. ఏయన్నార్, వాణిశ్రీ ల నటనకి సంగీతానికి ఆ సెట్స్ కి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.
అంతేకాదు అత్యధికంగా మల్టీ స్టారర్ సినిమాలను నిర్మించిన ఘనత కూడా రామానాయుడుగారిదే.. నాయుడి గారి సినిమా అంటే హీరో హీరోయిన్లు తమ ఇగోలను పక్కన పెట్టి పని చేసేవారు ఇండస్ట్రీలో ఆయన మీద ఉన్న గౌరవం అలాంటిది.. ఓ కధను విన్నప్పుడు నిర్మాతగా నాయుడు గారు తీసుకునే అద్బుతమైన జడ్డిమెంట్ , ప్లానింగ్ ఆయన సినీ యానాన్ని సుగమం చేసింది.
అహా నా పెళ్లంట సురేష్ ప్రోడక్షన్స్ పతాకంపై వచ్చిన అద్బుత కామెడీ చిత్రం జంధ్యాల మార్క్ కామెడీతో రూపోందిన ఆ చిత్రం వేల నవ్వులకు కేరాఫ్ అడ్రస్ లా నిలిచిపోయింది. అరగుండు గా బ్రహ్మానందం, వీర పిసినారిగా కోట... ఇంకా రాజేంద్రప్రసాద్, నూతన్ ప్రసాద్, వీర భద్రరావు ఇలా ఒక్కరేంటి ప్రతి నటుడు భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హాస్య చిత్రం అహా నా పెళ్లంట
ప్రతివారి మనసులోని బాధల్ని మటుమాయం చేసే ఆ చక్కని టానిక్ లాంటి హాస్య చిత్రాన్ని తెలుగు వారికి అందించిన ఘనుడు రామానాయుడు
దాదాపు అందరు అగ్ర హీరో హీరోయిన్లతో చిత్రాలు చేశారు రామానాయుడు.. వెంకటేష్, హరిష్, లాంటి హీరోలను , టబు, కుష్ బూ, మాలశ్రీ లాంటి హీరోయిన్లను పరిశ్రమకు పరిచయం చేశారు ఆయన.
అహనా పెళ్లంట తో బ్రహ్మానందం కి తాజ్ మహల్ తో హీరో శ్రీకాంత్ కి , ప్రేమ ఖైదీ తో డైరెక్టర్ ఇ.వి.వి. కి స్టార్ డం తీసుకొచ్చిన నిర్మాత ఆయనే.
అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రల్లో తెర మీద కనిపించడం రామానాయుడిగారికి హాబీ. అంతే కాదు హొప్ చిత్రంలో పూర్తి స్థాయి క్యారెక్టర్‌లో కూడా అలరించాడు ఆయన.. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు 2010 లో దాదాసాహెబ్ పాల్కే, 2006 లో రఘుపతి వెంకయ్య పురస్కారాలు ఆయన్ని వరించాయి. గిన్నిస్ రికార్డు సాధించినా ఆయన ఇంకా సినిమాలు నిర్మిస్తుండటం కూడా ఓ రికార్డే అని చెప్పాలి.
రామానాయుడు నిర్మించిన ఎన్నో చిత్రాలు అవార్డులు సాధించాయి. చాలా చిత్రాలు నంది అవార్డులు గెలుచుకుంటే 1993 లో సూరిగాడు చిత్రం ఇండియన్ పనోరమ కు ఎంపికైంది. 1999 లో అశుఖ్ అనే బెంగాలీ చిత్రం జాతీయ పురస్కారాన్ని సాధించింది.
ఇలా తెలుగు కళామతల్లికి తన వంతు సేవ చేస్తున్న రామానాయుడు గారు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ ఆ మూవీ మొగళ్‌కు మరో సారి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం…