ముగ్గురి కూతుళ్లకు ఉరేసిన తల్లి.. చివరికి..
posted on Jul 8, 2021 @ 10:38AM
బంగారు తెలంగాణలో బతుకు కరువైంది.. తెలంగాణాలో పునాదులు ఒకడివి..పుట్టెడు దుఃఖాలు మరొకడివి. పైసల్ ఉన్నవాడికి అందలం.. ఆకాశం.. అంతరిక్షలకు తీసుకుపోతుంటే.. అదే డబ్బు పేద వాడిని పాతాళానికి తోకేస్తుంది..ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేని, ఎప్పుడు జరగని ఆర్థిక ఆత్మహాత్యలు జరిగాయి.. పాలకులకు ఓట్లు కావలసినప్పుడు.. ప్రజలు హామీలు ఇచ్చిన నాయకులూ ప్రజలకు ఉపాధి లేక.. జానెడు కడుపుకు పిడికెడు అన్నం దొరకక.. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రజలను చూస్తూ నవ్వుకోవడమే తప్ప.. కాపాడడం తెలియడం లేదు.
అది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రాంనగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు కూతుళ్లకు ఉరి వేసింది. తను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూతుళ్లు, తల్లి మరణించారు. కాగా, ఉరి జారడంతో మరో కూతురు ప్రాణాలతో బయటపడింది. తల్లి ఉమారాణి(32) మొదట తన ముగ్గురు పిల్లలకు ఉరి వేయగా హర్షిణి(13), లక్కీ(11) మృతి చెందారు. చిన్న కూతురు శైనీ(8) ప్రాణాలతో బయటపడింది. కరోనా వచ్చి అందరిని ఇబ్బందులో పడేసింది. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. తల్లి మరణంతో చిన్నారి శైనీ అనాథగా మారింది.