మంత్రుల శాఖలివే.. మోదీ భలే సెట్ చేశారే..! కిషన్‌రెడ్డికి చిరంజీవి శాఖ..
posted on Jul 7, 2021 @ 11:45PM
కొత్తగా 43 మంది మంత్రుల చేరికతో కేంద్ర కేబినెట్ పరిమాణం 78కి చేరింది. రాష్ట్రపతి భవన్‌లో బుధవారం 15మంది కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మార్పుచేర్పులతో కొలువుదీరిన కొత్త కేబినెట్‌లో మంత్రులకు కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయి..
నరేంద్ర మోదీ - ప్రధానమంత్రి, శాస్త్ర సాంకేతిక శాఖ.
అమిత్ షా - హోంశాఖతో పాటు కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన సహకార శాఖ.
జ్యోతిరాదిత్య సింధియా- పౌర విమానయాన శాఖ. ఆయన తండ్రి దివంగత మాధవరావ్ సింధియా కూడా గతంలో ఇదే శాఖను నిర్వర్తించారు.
మన్‌సుఖ్ మాండవీయ - ఆరోగ్యశాఖ. ప్రస్తుత కరోనా సమయంలో కీలక శాఖ వరించింది.
స్మృతి ఇరానీ- మహిళా, శిశుసంక్షేమశాఖ
ధర్మేంద్ర ప్రదాన్ - విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ
హర్‌దీప్ సింగ్ పూరీ - పట్టణ అభివృద్ధి, పెట్రోలియం శాఖ
పీయూష్ గోయల్ - వాణిజ్య శాఖకు అదనంగా జౌళి శాఖ
అనురాగ్‌ఠాకూర్ - సమాచార, ప్రసారాలు; క్రీడలు
రాజ్‌నాథ్ సింగ్ - రక్షణ శాఖ
నితిన్ గడ్కరీ - రవాణా శాఖ
నిర్మలా సీతారామన్ -ఆర్థిక శాఖ
నరేంద్రసింగ్ తోమర్ - వ్యవసాయశాఖ
డాక్టర్ జైశంకర్ -విదేశీ వ్యవహారాలు
కిషన్‌రెడ్డి - పర్యాటక, సాంస్కృతిక శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి. గతంలో చిరంజీవి సైతం పర్యావరణ శాఖ మంత్రిగా చేశారు. టూరిజంతో పాటు కీలకమైన ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కూడా కిషన్‌రెడ్డికి దక్కడం విశేషం.
అశ్వినీ వైష్ణవ్ - రైల్వే, ఐటీ కమ్యూనికేషన్లు
భూపేంద్ర యాదవ్ -కార్మిక శాఖ
పశుపతి కుమార్ పారస్ - ఫుడ్ ప్రాసెసింగ్
గిరిరాజ్ సింగ్- గ్రామీణాభివృద్ధి
పురుషోత్తం రూపాల - డెయిరీ, మత్స్య శాఖ
అర్జున్ ముండా - గిరిజన సంక్షేమం
పీయూష్ గోయల్ - వాణిజ్యం, పరిశ్రమలు, అదనంగా జౌళిశాఖ, ఆహార, ప్రజా పంపిణీ
ప్రహ్లాద్ జోషీ - పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ
నారాయణ్ రాణే - చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
సర్వానంద్ సోనోవాల్ - ఓడరేవులు, జలరవాణా, ఆయుష్ శాఖ
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాల శాఖ
డాక్టర్ వీరేంద్ర కుమార్ - సామాజిక న్యాయం, సాధికారత
గిరిరాజ్ సింగ్ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్
రామచంద్ర ప్రసాద్ సింగ్ - ఉక్కు శాఖ
గజేంద్రసింగ్ షెకావత్ - జల్‌శక్తి
మహేంద్రనాథ్ పాండే - భారీ పరిశ్రమల శాఖ
పురుషోత్తమ్ రూపాల - మత్స్య, పశుసంవర్దక, డెయిరీ
రాజ్‌కుమార్ సింగ్ - విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ
భూపేంద్ర యాదవ్ - పర్యావరణ, అటవీశాఖ, కార్మిక శాఖ
కిరణ్ రిజిజు - న్యాయశాఖ