అక్రమ సంబంధంలో మూడు ముక్కలాట.. చివరికి వ్యక్తి మర్డర్..
posted on Jul 8, 2021 @ 9:37AM
మానవ సంబంధాలకు విలువ నివ్వండి అని ఒకపక్క హ్యూమన్ బియింగ్స్ మొత్తుకుంటుంటే మరో పక్క చాలా అక్రమ సంబంధాలు నడుపుతూ మనుషులను చంపుకుంటున్నారు.. తాజాగా ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకునే విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన గొడవలు కారణంగా నిండు ప్రాణం బలయ్యిుంది. అది ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ముందుకు వెళ్లి మొత్తం చదవండి..
ఓపెన్ చేస్తే.. అది నల్గోండ జిల్లా. జాజిరెడ్డి గూడెం మండలం. అడివెంల గ్రామం.. ఈ గ్రామం లో జూలై 2న సైదులు అనేవ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఒక్కసారిగా ఆ ఊరు మొత్తం ఉలికి పడింది.. హత్య కు మందు కళ్ళ ముందు తిరిగిన వ్యక్తి మరణించడంతో ఒక్కసరిగా తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, షాక్ తిన్నారు.. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు సైరన్ వేసుకుని హత్య జరిగిన స్థలానికి వచ్చారు.. హత్యకు సంబందించిన వివరాలు, అధరాలు సేకరించారు. ఆ తరువాత నాలుగు రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. అప్పుడు ఆ హత్యకు గల కారణాలు, నిజాలు బయటికి వచ్చాయి. అవేంటో చూద్దాం పదండి.
అడివెంల చెందిన వ్యక్తి. అతని పేరు బొర్ర శైలేందర్. అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో 10 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఎప్పటికైనా మనకంటే ఒక జీవితం ఉండాలి అని అనుకున్నాడేమో.. ఏడాది క్రితం శైలేందర్ తన వివాహేతర సంబంధానికి టాటా చెప్పి.. వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇక అంటే శైలేందర్ తో అప్పటి వరకు అక్రమ సంబంధం నడిపిన మహిళతో గత 4 నెలలుగా మనస్పర్ధలు వచ్చి ఆమెకు దూరంగా ఉంటున్నాడు.
కట్ చేస్తే.. అదే సమయంలో గ్రామానికి చెందిన శతకోటి సైదులు(27) అనే వ్యక్తితో శైలేందర్ మాజీ గర్ల్ ఫ్రెండ్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తది చెప్పాడు..10 ఏళ్ళు వివాహేతర సంబంధం నడిపి అతని దారి అతను చూసుకున్నాడు నా దారి నేను చూసుకుంటాను అనుకుంది ఆవిడ.. ఇక అంటే ఆ విషయం సైదులు ప్రాణానికి పాడేకు సిద్ధం చేసింది.. ఈ విషయం తెలిసిన శైలేంద్ర కోపం కట్టలు తెంచుకుంది. సైదులును పలుమార్లు హెచ్చరించాడు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్నమహిళతో, నువ్వు మళ్లీ ఎలా వివాహేతర సంబంధం పెట్టుకుంటావని గొడవపడ్డాడు. అయినా సైదులు మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించ సాగాడు.
దీంతో సైదులుపై కక్ష పెంచుకున్నశైలేంద్ర తన స్నేహితుడు సతీష్ తో కలిసి సైదులును హత్యచేయటానికి పధకం వేశాడు. అందులో భాగంగా జూన్ 29న వేసుకున్న ప్లాన్ సక్సెస్ కాలేదు. మళ్లీ ఈనెల 2వ తేదీన ప్లాన్ చేశారు. ఆ రోజు రాత్రి సైదులు గ్రామంలోని ఓ బెల్టు దుకాణంలో మద్యం సేవిస్తున్నాడు. మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చాడు. అప్పటికే సైదులు పైన త్రాచు పాముల పగపట్టిన శైలేందర్ సైదులు ని వేయడానికి అదే అదును అనుకుని. తన స్నేహితుడు సతీష్ తో కలిసి సైదులు మెడపై కత్తితో నరికి పరారయ్యాడు. కేసునమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం నిందితులు శైలేంద్ర, సతీష్ లను అదుపులోకి తీసుకుని కోర్టులో హజరు పరి