టార్గెట్ అశోక్.. చిక్కుల్లో వైసీపీ ఎంపీ.. లాక్ డౌన్ తప్పదా.. టాప్ న్యూస్@1PM
posted on Dec 23, 2021 @ 12:02PM
ధర్మాన్ని పాటించని జగన్ రెడ్డికి అనువంశిక ధర్మకర్తని గౌరవించడం ఏం తెలుస్తుంది? అని నారా లోకేష్ అన్నారు. గాడిదకు గంధం వాసన తెలియనట్టే! అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనం దోచి దాచుకునే వైసీపీ నేతలకు, నీతి నిజాయితీ, దానం గుణం గల మహారాజు అశోక్ గజపతిరాజు గొప్పతనం తెలియదన్నారు. నిబంధనలు ఉల్లంఘనపై ప్రశ్నించిన రాజుపైనే కేసు నమోదు చెయ్యడం హిందూ ధర్మంపై జరుగుతున్న పైశాచిక దాడికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
---
దేవాదాయ చట్టం రాష్ట్రంలో ఉందని.. అది లేకపోయి ఉంటే తను చైర్మన్ పదవి నుంచి ఈ ప్రభుత్వం ఎప్పుడో తొలగించేసి ఉండేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. దేవాలయాలకు దేవుడే యజమాని అని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వాడుతున్న భాష తనకు రాదన్నారు. తనపై ప్రభుత్వం వ్యక్తిగతంగా దృష్టి సారించిందని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. రామతీర్ధం కొండపై ఆలయ పునర్నిర్మాణ ముహూర్తం తేదీ నిర్ణయించే ముందు తెలియపరచమని చెప్పినా తన మాట పట్టించుకో లేదన్నారు.
---
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డే ప్రధాన సూత్రధారిగా సీబీఐ అధికారులు తేల్చారు. శివశంకర్ రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షల నిర్వహణపై రేపు పులివెందుల కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. న్యాయస్థానం ముందు ఇప్పటికే సీబీఐ దర్యాప్తు వివరాలను ఉంచింది. పదిరోజుల ముందే న్యాయస్థానానికి సీబీఐ వివరించింది. వివేకా గుండెపోటు, రక్తపు వాంతులతో చనిపోయాడని శివశంకర్ రెడ్డి చెప్పించినట్లు న్యాయస్థానానికి తెలిపింది
--------
అవినీతిపరులకు శిక్ష పడితేనే ఇతరులు భయపడతారని సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ అన్నారు. తాము నిర్వర్తించాల్సిన విధులకు అధికారులు రేటు కడితే, పౌరులు ఉపేక్షించొద్దని సూచించారు. ప్రజలు ఎక్కువగా అనుసంధానం ఉండే విభాగాల్లోనే అవినీతి కనిపిస్తోందని, సాంకేతికతతో ఆ అనుసంధానాన్ని తగ్గిస్తే అవినీతి నియంత్రించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆదాయపు పన్ను వివరాలు ఆన్‌లైన్‌లో సమర్పిస్తున్న తరహాలో ఇతర విభాగాల్లోనూ సాంకేతిక సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
---
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా.. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంత ఇళ్లకు కుళాయిలు, పీఏంజీఏవై కింద ఇళ్లు పూర్తి చేయడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపించారు. ఏపీలో 2014 నాటికి 4,193 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో, కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ పట్టుదలతో 8,183 కిలోమీటర్లకు పెరిగిందన్నారు.
------
కొవిడ్ పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై GV ఆంక్షలు విధించాలని కోర్టు పేర్కొన్నది. రెండు, మూడు రోజుల్లో ఈ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది.క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
--
పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పీవీ ఘాట్ దగ్గర ఆయనకు ఘనంగా నివాళులర్పించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పీవీ ఆర్థికంగా దేశంలో ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. బహు బాషా కోవిదుడని, అన్ని భాషల్లో మాట్లాడగల వ్యక్తి అని, ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం పీవీ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిందన్నారు. ఢిల్లీలో కనీసం పీవీ ఘాట్ లేదని తలసాని విమర్శించారు
-----
ఇంటర్ బోర్డ్ వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా పొన్నాల మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులను ప్రమోట్ చేయడం ఏంటి? ఫెయిల్ చేయడం ఎందుకని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతో విద్యార్థులు నష్టపోతున్నారు.
---
జమ్మూకశ్మీరులో జమ్మూకశ్మీరులో జమ్మూకశ్మీరులో భారీ ప్రమాదం తప్పింది. ఉగ్రవాదులు శ్రీనగర్ రోడ్డుపై అమర్చిన 5కిలోల ఐఈడీ పేలుడు పరికరాన్ని సైనికులు కనుగొని దాన్ని ధ్వంసం చేశారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా గురువారం గాలిస్తుండగా శ్రీనగర్ వాన్ పోరా రోడ్డుపై అమర్చిన 5కిలోల ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం కనిపించింది. దీంతో ఆర్మీ బలగాలు ఈ ఐఈడీని ధ్వంసం చేశారు.
--
సినిమా టికెట్ ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించడంపై సినీ హీరో నాని బహిరంగానే అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించిందని, ఇది సరైన నిర్ణయం కాదని అన్నారు. టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించిందని చెప్పారు. సినిమా థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయని అన్నారు.