గుజరాత్ లో బీజేపీ హవా కొనసాగుతుందా?

డిసెంబర్ 1,5 తేదీల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల షెడ్యూల్‌ ను ప్రకటించింది. నవంబర్ 12న ఓటింగ్ జరిగే  హిమాచల్ ప్రదేశ్‌తో పాటు డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈసారి మాదిరిగానే 2017, 2012లో కూడా గుజరాత్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 182 సీట్లకు గాను 99 సీట్లు గెలుచుకుని 1995 తర్వాత బీజేపీ తన సీట్ల సంఖ్య కనిష్ట స్థాయికి  పడిపో యింది. కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. అయితే గుజరాత్‌లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పటికీ దాదాపు 50%(49.05%) ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 41.44% ఓట్లు వచ్చా యి. అక్టోబరు 2001లో నరేంద్ర మోదీ తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అధికారంలో లేకుండా బీజేపీ పోరాడిన తొలి ఎన్నికలు కూడా ఇదే. 2017 నుండి ఒక ముఖ్యమైన మార్పు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉనికిని కలిగి ఉంది, ఇది బీజేపీ , కాంగ్రెస్ రెండింటికీ బలమైన పోటీని ఇస్తుంది, కాంగ్రెస్ ఓట్లను చీల్చుతుందని భావిస్తున్నారు. 2017లో, పెద్ద రెండు మినహా, పోటీలో వాస్తవంగా మరే ఇతర పార్టీ లేదు, స్వతంత్రులు (వీరిలో ముగ్గురు గెలిచారు) ఎన్సీపీ , బీజేపీ కంటే ఎక్కువ ఓట్లను పొందారు, ఇది వరుసగా 1 , 2 స్థానాలను కైవసం చేసుకుంది. భారతీయ ట్రైబల్ పార్టీ, ఏఐఎంఐఎం,  ఎన్సీపీ వంటి కొన్ని చిన్న పార్టీలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉంది. 2012 తో పోలిస్తే 2017లో బీజేపీ గెలిచిన సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ, వాస్తవానికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. 2012లో మోదీ సీఎంగా ఉన్నప్పుడు బీజేపీ 115 సీట్లు, 47.85 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ సంఖ్య 61 సీట్లు  38.93% ఓట్లు,  ఐదేళ్ల తర్వా త ఆ పార్టీ భారీ జంప్‌ను సూచిస్తుంది, ఎక్కువగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటిదార్ కోటా ఉద్యమ బలంపై. 2012లో కూడా, రెండు పార్టీలకు వాస్తవంగా మూడో పోటీదారు లేరు. 2012 నుండి జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికలు కూడా రాష్ట్రంలో బిజెపికి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తు న్నాయి, 2014లో పార్టీ 60.1% ఓట్లను, 26 సీట్లలో 26 (కాంగ్రెస్‌కు 33.5% ఓట్లు) 63.1% ఓట్లను గెలుచు కుంది. 2019లో మళ్లీ అన్ని సీట్లు (కాంగ్రెస్‌కు 32.6% ఓట్లు వచ్చాయి). 2019 ఎన్నికల్లో ఆప్ ఉనికిని నమోదుచేసుకోలేదు. బిజెపి బలమైన అధికార వ్యతిరేకతను ఎదుర్కొంది, వరుసగా ఆరవ సారి పదవిని ఆశిస్తోంది, విజయ్ రూపానీ మొత్తం ప్రభుత్వాన్ని దాదాపు అనుభవం లేని భూపేంద్ర పటేల్ మంత్రి వర్గంతో భర్తీ చేయడం ఎలా సహాయ పడుతుందనే దానిపై జ్యూరీ ఇంకా తెలియలేదు. 1995లో కేశూభాయ్ పటేల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శంకర్‌సింగ్ వాఘేలా తిరుగుబాటు చేసిన నేప థ్యంలో గుజరాత్‌లో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. వాఘేలా తిరుగుబాటు విఫలమై, కేశూభాయ్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, గుజరాత్‌లోని పెద్ద ప్రాంతాలను చదును చేసిన భారీ భూకంపం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్న విమర్శల తర్వాత, 2001లో బీజేపీ హైకమాండ్‌చే ఆయన స్థానంలో మోడీని నియమించారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదం,  గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో జరిగిన 2002 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ 182 సీట్లలో 127 (49.8% ఓట్లు) గెలుచుకున్నప్పుడు, రాష్ట్రంపై మోడీ , బీజేపీ పూర్తి నియంత్రణ అనుసరించింది. ఇప్పటి వరకు గుజరాత్‌లో బీజేపీకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన. కాంగ్రెస్ 51 స్థానాలకు పడిపోయింది. 2007లో, గోర్ధన్ జడాఫియా వంటి పలువురు సీనియర్ నాయకులు విడిపోయినప్పటికీ, మోడీ నేతృత్వంలోని బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చింది. 2002 అల్లర్ల సమయంలో జడాఫియా హోం శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. బీజేపీ సంఖ్య కేవలం 117 స్థానాలకు (49.12% ఓట్లు) పడి పోయింది, కాంగ్రెస్ 59కి వ్యతిరేకంగా. 2012 ఎన్నికలలో కూడా బీజేపీ తన ఆధిక్యాన్ని 115 స్థానాలతో నిలబెట్టుకుంది, కాంగ్రెస్ కేవలం రెండు మాత్రమే పెరిగి 61కి చేరుకుంది. 2014లో మోదీ ప్రధానిగా ఢిల్లీకి వెళ్లగా, గుజరాత్ ప్రభుత్వ పగ్గాలు తన సన్నిహితురాలు ఆనందీబెన్ పటేల్‌కు అప్పగించారు. అప్పటి నుండి, రాష్ట్ర నాయకత్వం వరుసగా సిఎం మార్పులతో మోడీ బూట్లు నింపడానికి కష్టపడు తోంది. 2015 కోటా ఆందోళన తర్వాత, ఆనందిబెన్ స్థానంలో విజయ్ రూపానీని ముఖ్యమంత్రిగా నియమించారు - 2017 ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఆ ఎన్నికలలో, బీజేపీ 99కి దిగజారింది. కాంగ్రెస్ 77కి పెరిగింది, కానీ వరుస ఫిరాయింపుల తర్వాత అసెంబ్లీలో ఇప్పుడు 62కి దిగజారింది - ఇది సభలో అత్యల్పంగా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరు ణంలో, పెద్ద నాయకులు ఇంకా బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా, ఆప్‌ ప్రతిపక్ష స్థలాన్ని దోచుకోవ డంతో అది విపరీతమైన పోరాటం చేస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లో దూకుడుగా అడుగులు వేస్తున్నందున, నేరుగా మోడీకి వ్యతిరేకంగా పోటీ పడుతుం డగా, మూడవ ఫ్రంట్ కోసం ఇప్పటికే ఆప్‌కి అవకాశం లభించింది. 2017లో ఆప్ ద్వారా బరిలోకి దిగిన మొత్తం 29 మంది అభ్యర్థులు తమ డిపాజిట్లను కోల్పోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది చాలా మలుపు. అసదు ద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం దృష్టిలో నాల్గవ పార్టీ ఉంది, ఇది తొలిసారిగా గుజరాత్ ఎన్నికల్లో పోరాడు తుంది , ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.

ప్రాణ రక్షణ కోసం చిరుత పోరాటం!

పిల్లైనా సరే తలుపులు మూసి కొడితే తిరగబడుతుంది. అది చిరుతపులి అయితే ఇక చెప్పేదేముంది. తలుపులు మూయక్కర్లే ఒకింత అదిలించినా, బెదిరించినా తిరగబడటం ఖాయం. అదే జరిగింది. కర్నాటకలోని మైసూరులో పొరపాటున ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చేసింది. దానిని చూసిన స్థానికులు రాళ్లు రువ్వారు. అసలే కొత్త ప్రాంతం అప్పటికే భయంతో ఉన్న ఆ చిరుత జనం రాళ్లు రువ్వడంతో  మరింత భయపడింది. తప్పించుకోవడానికి ఆ చిరుత చేసిన ప్రయత్నంలో ఇద్దరిపై దాడి చేసి గాయపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను అటవీ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్ లో పోస్టు చేశారు. వెంటనే ఆ వీడియో వైరల్ అయ్యింది. జనావాసంలోకి వచ్చిన చిరుతపై ఓ భవనంపై ఉన్న వ్యక్తులు రాళ్లురువ్వారు. దీంతో ఆ చిరుత తప్పించుకునే ప్రయత్నంలో రోడ్డు పైకి పరుగుతీసింది. ఆ సమయంలో అటుగా ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిపై దాడి చేసింది. అతడు గాయపడ్డాడు. ఇది చూసిన మరో వ్యక్తి చిరుతను అదిలించే ప్రయత్నం చేస్తే అతడిపైనా దాడి చేసి గాయపరిచింది. చిరుత తన ప్రాణ రక్షణ కోసం పోరాడిందనీ, దాని తప్పేమీ లేదనీ నందా తన పోస్టులో పేర్కొన్నారు. ఆ తరువాత అటవీ అధికారులు చిరుతను కాపాడి బంధించి తీసుకువెళ్లారు.  

సుప్రీంలో జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ.. అమరావతి కేసు అత్యవసర విచారణకు నో

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జగన్ సర్కార్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతే రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్ సత్వర విచారణ కోరగా సుప్రీం కోర్టు నిరాకరించింది. ఏపీ  హైకోర్టు మార్చిలో తీర్పు ఇస్తే.. సప్రీం కోర్టులో సెప్టెంబర్  వరకూ సుప్రీంను ఆశ్రయించకుండా.. ఇప్పుడు సత్వర విచారణ అంటారేమిటని నిలదీసింది. అమరావతినే రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్ అమరావతినే రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం వీటిపై సత్వర విచారణ చేయాలని గతంలో ఛీఫ్ జస్టిస్ యూయూ లలిత్ ను కోరింది. అయితే నాట్ బిఫోర్ మీ అంటూ ఆయన  విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో   జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.   అమరావతి పిటిషన్లను ఏపీ విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్లతో కలిపి విచారణ చేయాలని సీజేఐ ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ ఈ రెండు అంశాలపై ద్విసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. దీంతో ఈ విచారణ ఆలస్యమవుతుందని భావించిన ఏపీ సర్కార్ అత్యవసరంగా దీనిపై విచారణ చేయాలని కోరింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసఫ్   మార్చిలో హైకోర్టు అమరావతిపై తీర్పు ఇస్తే సెప్టెంబర్ లో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు.  అత్యవసర విచారణ విజ్ఞప్తిని సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. అమరావతి పిటిషన్లను అధ్యయనం చేయడానికి   కొంత సమయం పడుతుందని న్యాయమూర్తులు అన్నారు తెలిపారు. ఈ దశలో రైతుల తరఫు న్యాయవాది ఫాలీ నారిమన్ బ్రీఫ్ నోట్ ఇస్తామని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం 14న విచారణను వాయిదా వేసింది.

నందిగామ పర్యటనలో బాబు లక్ష్యంగా రాళ్ల దాడి

రెండు రెళ్ళు నాలుగన్నందుకు గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. ప్రభుత్వ ప్రజా వ్యతరేక చర్యలను ప్రశ్నించే నేతలే లక్ష్యంగా దాడులకు తెగబడటమే ఏపీలో పాలన అయిపోయింది. అరాచక పాలనకు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా మారింది. రాష్ట్రంలో గూండాయిజం రాజ్యమేలుతోంది. అధికార పార్టీని విమర్శించే వారెవరూ రోడ్ల మీద తిరగడానికి వీల్లేదన్నట్లుగా పాలన సాగుతోంది. పోలీసుల డ్యూటీ విపక్ష నాయకులు, కార్యకర్తల ఇళ్ల పై దాడులు చేసి అరెస్టు చేయడానికే పరిమితమైంది. ప్రభుత్వాన్ని వ్యతరేకించేవారెవరూ రాష్ట్రంలో బతకడానికి వీల్లేదన్నంతగా రాజ్య హింస ప్రబలిపోయింది. విపక్ష నేతకూ భద్రత లేని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. తెలుగుదేశం అదినేత నారా చంద్రబాబునాయుడు   నందిగామ జిల్లాలో పర్యటిస్తూంటే ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ఆ సమయంలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నందిగామలో చంద్రబాబు పర్యటనకు జనం భారీగా వచ్చారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అందుకోసమే ఎదురు చూస్తున్నారా అన్నట్లుగా ఆ వెంటనే ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ అధికారి గాయపడ్డారు.  విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఆ వెంటనే రాళ్ల దాడి జరగడం కాకతాళీయమని ఎవరూ భావించడం లేదు. ఇదంతా ప్రీ ప్లాన్డ్‌గా జరిగిందన్న టీడీపీ నేతలవి కేవలం ఆరోపణలు కాదనే జనం అంటున్నారు.  ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మొత్తం పులివెందుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ రౌడీలకు భయపడే ప్రశ్నే లేదన్నారు. తాను అధికారంలో ఉన్న సమయంలో ఇదే విధంగా వ్యవహరించి ఉంటే జగన్ పాదయాత్ర చేయగలిగే వారా అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల జగన్ కు ఇసుమంతైనా గౌరవం, నమ్మకం లేదని చంద్రబాబు విమర్శించారు. పోలీసులు   ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని.. భద్రత గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. 

సింహయాజి స్వామి అలియాస్ అశోక్ ఒక ఫ్రాడ్..!

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు ఒక్క తెలంగాణ రాష్ట్రాంలోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్ల రూపాయలు, పదవులు, కాంట్రాక్టులు ఇవ్వ జూపారనీ, ఇందు కోసం డీల్ కుదుర్చుకునేందుకు అడ్వాన్స్ సొమ్ములతో మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు బీజేపీ దూతలు వచ్చి బేరసారాలాడారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి టీఆర్ఎస్ వీడియోలను కూడా విడుదల చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమే ధ్యేయంగా బీజేపీ ఈ దుర్మార్గానికి పాల్పడిందని విమర్శలు గుప్పిస్తోంది. అయితే టీఆర్ఎస్ బీజేపీ దూతలని చెబుతున్న ఆ ముగ్గురిలో ఒకరు సింహయాజ స్వామి. ఆయన నిజంగా స్వామీజీయేనా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆయన గత, వర్తమానాలను పరిశీలిస్తే ఆయన వాస్తవంగా స్వామీజీ కాదనీ, ఆయనకు వెనుక పెద్ద నేర చరిత్రే ఉందని తెలుస్తోంది. స్వయంగా సింహయాజి స్వామికి  స్వయాన పెదనాన్న ఈ సింహయాజి స్వామి బాగోతం అంతా చెప్పారు. చాలా చిన్న వయస్సులోనే సింహయాజి స్వామిని రమణారావు అనే వ్యక్తి దత్తతకు తీసుకున్నారు. సింహయాజి స్వామి అసలు పేరు అశోక్.. అన్నమయ్య జిల్లా అయ్యవారి పల్లి ఆయన స్వస్థలం. అయితే పదేళ్ల కిందటే అశోక్ అలియాస్ సింహయాజి స్వామి స్వగ్రామం వదిలి తిరుపతి వెళ్లిపోయారు. ఇంటర్ వరకూ చదివిని సింహయాజి స్వామి ఒక ప్రైవేట్ స్కూళ్లో టీచర్ గా పని చేశారు. ఆ సమయంలోనే స్వగ్రామానికి వచ్చి అక్కడ ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుని వెళ్లిపోయారు.  ఆ తరువాత దాదాపు ఏడెనిమేళ్ల కిందట ఆయన స్వామీజీ అవతారం ఎత్తి పేరును సింహయాజి స్వామిగా మార్చుకున్నారు. ఇందుకు ఆయన చెన్నైకి చెందిన చతుర్వేది స్వామిని ఆశ్రయించి పీఠాన్ని స్థాపించి పీఠాధి పతి అయ్యారు. అయితే ఈ సిహయాజి స్వామి పీఠం ఏమిటో.. అక్కడేం చేస్తారో ఎవరికీ అర్ధం కాదు. ఒక ఇంటిని చూపి అదే పీఠం అని చెబుతారు. ఆ పీఠానికి సింహయాజ స్వామి ఎప్పుడో కానీ అదీ అర్దరాత్రి వేళ మాత్రమే వస్తుంటారని సాయంత్రం చెబుతారు. ఇక దేవగుడి పల్లిలో వెయ్యేళ్ల నాటి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మిస్తానంటూ అందరినీ నమ్మించారు. కోట్ల రూపాయల వ్యయానికి కూడా సిద్ధమేనంటూ నమ్మబలికే వారు. అయితే పురాతన ఆలయ పునర్నిర్మాణం పేర గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించేవారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక సారి అర్ధరాత్రి తవ్వకాలు జరుపుతుంటే జనం సింహయాజి స్వామిని తరిమికొట్టారు. ఆ గుడి ఆర్కియాలజీ శాఖకు సంబంధించిన గుడి కావడంతో రాయచోటికి చెందిన న్యాయవాది రాజేశ్వరి కుమార్తె ఆర్కియాలజీ శాఖకు ఫిర్యాదు చేయడంతో సింహయాజి స్వామి ఆగడాలు, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇక సింహయాజి స్విమి అలియాస్ అశోక్ కు భార్య,  ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో కుమారుడు మానసిక వికలాంగుడు. భార్యా  పిల్లలను పట్టించుకోకుండా తిరిగే సింహయాజి స్వామి ఒక ఫ్రాడ్ అని స్వయానా ఆయన పెదనాన్నే చెప్పారు. తిరుపతిలో ఉండి సింహయాజి స్వామి ఏం చేశాడో ఎవరికీ తెలియదని ఆయన పేర్కొన్నారు. అదో రహస్యం అన్నారు. ఎలాగోలా పీఠాధిపతి అయ్యి నామాలు పెట్టుకుని పూజలూ, యాగాలూ చేస్తూ వచ్చాడని సింహయాజి స్వామి పెదనాన్ని చెప్పారు. ఏం చేస్తాడో, ఏక్కడ తిరుగుతాడో తెలియదు. ఎలా బతుకుతున్నాడో తెలియదని సింహయాజ స్వామి పెదనాన్న చెప్పారు. ఇంతటి నేర చరిత్ర ఉన్న సింహయాజ స్వామి ఎలా బీజేపీ తరఫున ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలకు దూతగా మారాడో అర్ధం కాదని అంటున్నారు. కాగా సింహయాజస్వామికి ఎమ్మెల్యే పైలట్ రెడ్డి భక్తుడని తరచూ కలుస్తుంటారని అంటున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎవరు ఎవరి తరఫున ఉన్నా రంగంలో ఉన్నది మాత్రం క్రిమినల్స్ అని సామాన్యులు అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు ఆయనకు బీజేపీలోని ఒక అగ్రనేతతో సత్సంబంధాలు ఉన్నాయని చెబుతుంటే.. బీజేపీ వారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆయన భక్తుడని చెబుతున్నారు. నిజానిజాలెలా ఉన్నా దేశాన్ని కుదిపేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఒక ఫ్రాడ్ కీలక పాత్ర వహించడమే కొసమెరుపు.

తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా కాసాని జ్ణానేశ్వర్

మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ను తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. ఇప్పటి వరకూ   ఆ స్థానంలో ఉన్న   బక్కిని నరసింహుని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.   తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో కాసాని జ్ణానేశ్వర్ ఇటీవలే తెలుగుదేశం గూటికి చేరిన సంగతి విదితమే.  బీసీ నాయకుడిగా గట్టి పట్టున్న నాయకుడిగా కాసానికి గుర్తింపు ఉంది. గత కొంత కాలంగా కాసాని రాజకీయంగా క్రియాశీలంగా లేకపోయినా.. ముదిరాజ్ సామానిక వర్గానికి చెందిన కాసానికి బీసీలలో గట్టి పట్టు ఉందని అంటారు.  2018 ఎన్నికలలో ఆయన సికిందరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అబ్యర్థిగా పోటీ చేశారు ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. అంతకు ముందు ఆయన రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పని చేశారు. అయితే ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలని టీఆర్ఎస్, బీజేపీలు తమ వంతు ప్రయత్నాలు చేశాయంటేనా కాసాని ప్రాముఖ్యత అర్ధమౌతుంది.  ఇటీవల ఆయనను హరీష్ రావు కలిసి చర్చించినట్లు చెబుతారు. అలాగే బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ కూడా జ్ణానేశ్వర్ కు కలిసి కమలం గూటికి రావలసిందిగా కోరారు. అయితే జ్ణానేశ్వర్ మాత్రం తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపి చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయనను చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా నియమించారు. 

షర్మిల వాంగ్మూలం.. జగన్ చిందులు.. విజయమ్మ ఇబ్బందులు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు  షర్మిల సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం తాడేపల్లి ప్యాలెస్‌లో తీవ్ర ప్రకంపనలకు కారణమైందంటున్నారు. దీంతో షర్మిల ఎపిసోడ్‌పై  జగన్.. నేరుగా తన తల్లీ, వైసీపీ మాజీ అధ్యక్షురాలు   విజయమ్మకు ఫోన్ చేసి.. వైయస్ షర్మిల వ్యవహారశైలి పట్ల మండిపడినట్లు తెలుస్తోంది. వద్దు వద్దంటే.. తెలంగాణ వెళ్లి పార్టీ స్థాపించడంతోపాటు.. ఈ మూడున్నరేళ్లుగా చోటు చేసుకున్న వరుస పరిణామాలను ఈ సందర్భంగా ఫోన్‌లో జగన్ ఏకరువు పెట్టారని లోటస్ పాండ్‌లోని వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై వైయస్ విజయమ్మ.. మౌనంగానే విని.. కామ్‌గా ఉండిపోయారని లోటస్ పాండ్‌లోని నేతలు అంటున్నారు. అయితే  జగన్.. షర్మిలల మధ్య ఏర్పడిన దూరం.. తగ్గాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదని విజయమ్మ... తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు   చెబుతున్నారు. వివేకా హత్య కేసులో నిందితుల్లో ఒకరైన దస్తగిరి అప్రూవర్‌గా మారి సీబీఐ ఎదుట చేసిన వ్యాఖ్యలే... తాజాగా   షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారని.. అలాగే తన తండ్రి హత్య కేసులో సోదరుడు సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరి పట్ల.. వై వివేకా కుమార్తె  సునీత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని... ఈ నేపథ్యంలోనే ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించి.. ఈ కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారని.. అలాంటి వేళ  షర్మిల ఇలా వాంగ్మూలం ఇవ్వడాన్ని ఆమె సోదరుడు,ఏపీ సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. షర్మిల వాంగ్మూలం అంటూ మీడియాలో వచ్చిన వార్తలను ప్రతిపక్ష టీడీపీ ఓ ఆస్త్రంగా మలుచుకుని రచ్చ రచ్చ చేసి పెడుతోందని.. ఇది జగన్ పార్టీకి గట్టి దెబ్బేనని కూడా అంటున్నారు. మరో వైపు ఉమ్మడి కడప జిల్లాలో   వివేకా హత్య ఎవరు చేశారు.. ఎందుకు చేశారు... ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టినా ఎందుకు ముందుకు సాగడం లేదనే అంశాలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే  వచ్చే ఏన్నికల్లో కూడా విజయం సాధించి మరో సారి ఏపీలో అధికార పగ్గాలు చేపట్టాలన్న జగన్  ఆకాంక్షలకు షర్మిల కారణంగా విఘాతం కలుగడం తథ్యమని రాజకీయ పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.

బాలయ్య షోకు షర్మిల.. చంద్రబాబు వ్యూహమేనా?

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ సీఎం వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల.. త్వరలో భేటీ కానున్నారు. ఔను నిజమే.. షర్మిల బాలకృష్ణలు భేటీ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇది నిజంగా సంచలన వార్తే. అయితే వారిరువురూ కలుసుకునేది రాజకీయ వేదిక మీద కాదు.  నందమూరి బాలకృష్ణ  ఓటీటీలో చేస్తున్న అన్‌స్టాపబుల్ షో కు చీఫ్ గెస్ట్ గా షర్మిల హాజరు కానున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సీజన్ 2 నడుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పాల్గొని సందడి చేశారు. ఆ సందర్భంగా 1995 అగస్టులో తెలుగుదేశం సంక్షోభానికి సంబంధించి కీలక వివరాలు, నాడు ఎన్టీఆర్ పై పార్టీ తిరుగుబాటుకు దారి తీసిన పరిస్థితుల గురించి సంచలన వివరాలను చంద్రబాబు వెల్లడించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కు స్వయాన సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల హాజరు కానున్నారన్న సంగతి తెలుగు రాష్ట్రాలలో ఆ షో పట్ల విపరీతమైన ఆసక్తి పెంచేసింది.     సీఎం జగన్ కు స్వయాన బాబాయ్, మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకీ  షర్మిల  వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్ ఫైర్ అయ్యారనీ వార్తలు వినవస్తున్నాయి. వివేకా హత్య కేసు విషయంలో తన సోదరుడు జగన్ కు ఇష్టం లేకపోయినా షర్మిల సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సంగతి విదితమే. వివేకా హత్య తమ కుటుంబంలో అత్యంత విషాద సంఘటనగా పేర్కొన్న షర్మిల.. తన బాబాయ్ ని హత్య చేసిన వారూ, అందుకు కారకులు ఎవరో అందరికీ తెలియాలి, వారికి శిక్ష పడాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా కడప ఎంపీ సీటు కోసమే తన బాబాయ్ హత్య జరిగిందని, ఇది వాస్తవమని ఆమె ఢిల్లీలో మీడియాముఖంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే షర్మిలపై ఏపీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహంతో రగలిపోతున్నారని రాజకీయ వర్గాలలో ముఖ్యంగా వైసీపీ వర్గాలలో వినిపిస్తోంది. అలాగే   తెలంగాణలో షర్మిల..  సుదీర్ఘ పాదయాత్ర ఇప్పటికే 3000 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. తన యాత్ర పొడవునా అమె తెలంగాణలో  అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా విమర్శలు గుప్పించడమే కాకుండా... తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కోట్లాది రూపాయిల అవినీతి మేట వేసిందంటూ.. ఢిల్లీకి వెళ్లీ మరీ సీబీఐకి సైతం ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఏ విషయమైనా నిర్భయంగా మాట్లాడతారన్న నమ్మకం జనంలో ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బాలయ్య టాక్ షోలో షర్మిల మరిన్న సంచలన విషయాలు వెల్లడిస్తారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. దీంతో షర్మిల పాల్గొనబోయే ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా చేస్తున్నారు. మరో వైపు తన అన్నపై వ్యతిరేకతతో షర్మిల ఏపీలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కాగా కొందరు మాత్రం బాలయ్య టాక్ షోకు షర్మిల రావడం తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యూహమా అన్న సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు.  మొత్తం మీద షర్మిల బాలయ్య షోకు హాజరు కావడం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఉచితాలపై వివరణ ఇవ్వాల్సిందే.. అది పార్టీల బాధ్యత.. సీఈసీ

కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ ఎన్నికల ప్రకటన వేళ కీలక కామెంట్స్ కొన్ని చేసింది. ఉచిత హామీలు ఇపుడు దేశంలోని అనేక పార్టీలు ఇస్తున్నాయని వాటి విషయంలో హామీలు ఎలా తీరుస్తారు అన్నది తమకు చెప్పాలని ఈ మేరకు  అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాసినట్లుగా చెప్పారు. ఈ విధంగా చెప్పడం ఆయా పార్టీలు అభ్యర్ధుల కనీస బాధ్యత సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ఉచితాలపై షాక్ ఇచ్చింది. ఉచిత హామీలు ఇచ్చి ఊరుకుంటే సరిపోదు.. వాటిని అమలు చేయడం కూడా ఆయా హామీలు ఇచ్చిన పార్టీల బాధ్యత అని స్పష్టం చేసింది. మేనిఫెస్టోలో ఉచిత హామీలు ఎలా నెరవేరుస్తారన్నది కూడా స్పష్టం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దీనిపై అన్ని రాజకీయ పార్టీలకూ ఇప్పటికే లేఖలు రాసినట్లు పేర్కొంది. హామీలు ఇచ్చిన పార్టీలు వాటిని ఎలా నెరవేరుస్తారన్న విషయాన్ని ఆర్థిక నిపుణులకు, మీడియాకు, ఓటర్లకు చెప్పాల్సి ఉందని అది ఆయా పార్టీల బాధ్యత అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి విదితమే. రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 1న తొలి విడత, 5న రెండో విడత పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. వాటిలో 89 స్థానాలకు తొలి విడతలో, మిగిలిన 93 స్థానాలకు రెండో విడతలో పోలింగ్ జరుగుతుంది.   ఇక ఒక్క ఓటరు కోసం తాము పదిహేను మంది పోలింగ్ సిబ్బందిని గిర్ అడవులకు పంపిస్తున్నట్లుగా సీఈసీ చెప్పడం విశేషం. అలాగే మరో 272 మంది కోసం అలియాబెట్ లో ఒక షిప్ కంటైనర్ నే పోలింగ్ బూత్ గా వాడుతున్నట్లుగా చెప్పారు. 

ఆ ముగ్గురితో బీజేపీకి సంబంధం లేదు.. కిషన్ రెడ్డి

కేసీఆర్ పేల్చిన బాంబుతో బీజేపీ పూర్తిగా డిఫెన్స్ లో పడినట్లు కనిపిస్తోంది. ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడే కమలం నేతలు ఇప్పుడు తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి నానా ఇక్కట్లూ పడుతున్నారు. కేసీఆర్ గురువారం(నవంబర్ 3)న మీడియా మీట్ పెట్టి వెల్లడించిన విషయాలు, విడుదల చేసిన వీడియోలోని అంశాలతో బీజేపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందని పిస్తోంది. ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మరీ కమలం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు కేసీఆర్ విమర్శించడానికే పరిమితమయ్యారు, ఆ వీడియోలో ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడిన వారితో తమకు సంబంధం లేదని చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప.. ఇన్ని రాష్ట్రాలలో ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రణాళికలు రూపొందించిన ఆరోపణలను సమర్ధంగా తిప్పి కొట్టడంలో విఫలమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి ప్రజల్లో ఆదరణ తగ్గుతుండటంతోనే ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు తెరతీశారని, ఆయన ప్రెస్ మీట్ లో చెప్పినవన్నీ అబద్ధాలు, అవాస్తవాలని కిషన్ రెడ్డి చెప్పారు. ఆ వీడియోలో ఉన్న వారితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కిరాయి ఆర్టిస్టులతో, పార్టీ నేతలతో కేసీఆర్ ఒక అబద్ధాన్ని సృష్టించి.. అదే నిజమని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారనీ, అటువంటి వ్యక్తి దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేయడం దొంగే దొంగ దొంగ అని అరవడంలా ఉందన్నారు. కేసీఆర్ గురించి ఆయన రాజకీయ ప్రత్యర్థులను కాదు ఆయనతో తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచని ఎవరిని అడిగినా చెబుతారని కిషన్ రెడ్డి అన్నారు.   ఇంత కాలం కేసీఆర్, కేసీఆర్ కుటుంబం, తెరాస సర్కార్ అవినీతిపై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన బీజేపీ తొలిసారిగా కేసీఆర్ పకడ్బందీ స్టింగ్ ఆపరేషన్ తో వీడియోలు బయటపెట్టి మరీ చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టేందుకు నానాయాతనా పడుతోంది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు, వారి నొటి వెంట బీజేపీ అగ్రనాయకులు మోడీ, అమిత్ షా, నడ్డాల కనుసన్నలలోనే తాము పని చేస్తున్నామన్న మాట్లాడిన విషయాలను కేసీఆర్ బయటపెట్టడంతో ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులతో సంబంధం లేదని చెప్పుకోవడానికే బీజేపీ పరిమితమైన పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోందని పరిశీలకులు అంటున్నారు. యాదగిరి గుట్టలో ప్రమాణం అంటూ బండి సంజయ్ వంటి వారు సవాళ్లు చేయడం ఏదో ఫేస్ సేవింగ్ వ్యవహారంలాగ ఉంది తప్ప కేసీఆర్ ఆరోపణలకు దీటుగా జవాబు మాత్రం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యక్తిగత గోప్యతకు భంగకరమని అంటున్నారే తప్ప.. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం జరిగిన సంభాషణ అబద్ధమని మాత్రం అనడం లేదు. బీజేపీ అగ్రనాయకత్వం పేరు ప్రస్తావిస్తూ కొనుగోళ్లకు వారి అనుమతి, ప్రోత్సాహం ఉందని వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తూ, వినిపిస్తుంటే.. వారితో సంబంధం లేదని చెబుతున్నారే తప్ప.. అక్రమంగా అగ్రనేతల పేర్లు ఉపయోగించి వసూళ్లకు పాల్పడుతున్నారంటే కేసు ఎందుకు నమోదు చేయలేదని  పరిశీలకులు బీజేపీని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈడీ దర్యాప్తునకు సిద్ధమా అంటూ సవాల్ చేస్తున్నారే కానీ.. ఆ వీడియో ఫుటేజ్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఫామ్ హౌస్ వ్యవహారం బీజేపీని డిఫెన్స్ లోకి నెట్టేసిందనీ, ఇప్పట్లో ఆ పార్టీ పూర్వపు దూకుడును అందిపుచ్చుకోవడం అంత సులువు కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కేసీఆర్ కు కౌంటర్ ఇవ్వడంతో తరుణ్ ఛుగ్ తడబాటు

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో వీడియోలు విడుదల చేసి కేసీఆర్ బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చారా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఈ వీడియోలు విడుదల చేస్తూ కేసీఆర్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలపై కౌంటర్ ఇవ్వడంలో బీజేపీ తడబాటుకు గురౌతోందని విశ్లేషణలు చేస్తున్నారు. కేసీఆర్ మీడియా సమావేశం తరువాత శుక్రవారం ఉదయం వరకూ బీజేపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. చివరాఖరికి బీజేపీ అగ్రనాయకత్వం కేసీఆర్ కు గట్టి కౌంటర్ ఇవ్వాలని విస్పష్టంగా ఆదేవించడంతో ఒక్కరొక్కరుగా మీడియా ముందుకు వచ్చి ఆ వ్యవహారంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకుంటున్నారు. బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు హస్తినలో వేర్వేరు మీడియా సమావేశాల్లో కేసీఆర్ ఆరోపణలను ఖండించారు. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో మెయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై గురువారం (నవంబర్ 3) తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలపై బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ ఛుగ్ కౌంటర్ ఇచ్చారు. హస్తినలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఆరోపణలపై స్పందించడంలో తడబడ్డారు.  ఫాం హౌజ్ లో జరిగిన వ్యవహారంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మొత్తం ఎమ్మెల్యేల కొనగోలు బేరాసారాల వ్యవహారంతో మాకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం వినా.. విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఆయన తత్తరపాటుకు గురయ్యారు. ప్రశ్నలను దాటవేస్తూ.. కేసీఆర్ పై ఎదురుదాడికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బైబై చెబుతున్నారన్నారు. కేసీఆర్ పతనం ప్రారంభమైందన్నారు. మరోసారి ఆయన అధికారంలోకి రావడం అసాధ్యమని చెప్పారు. అంతే కానీ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో కేసీఆర్ ఆరోపణలకు సంబంధించి స్పష్టంగా కౌంటర్ ఇవ్వడంలో విఫలమయ్యారు. విలేకరుల ప్రశ్నలకు బదులివ్వడంలో తత్తరపడ్డారు. సమాధానాలు ఇవ్వడం మాని కేసీఆర్ పై, టీఆర్ఎస్ సర్కార్ పై ఎదురుదాడికి దిగారు. మునుగోడులో తెరాస తీవ్రమైన అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ణతలు చెప్పారు. విజయం కమలాన్నే వరిస్తుందని చెబుతూనే  అక్కడ టీఆర్ఎస్ ధనబలంతో పాటూ, అధికార దుర్వినియోగానికీ పాల్పడిందని ఆరోపించారు.  ఓటింగ్ మొదలవ్వడానికి ముందు వరకూ కూడా మంత్రులు, నాయకులు నిబంధనలను తుంగలో తొక్కి మునుగొడులోనే బస చేశారని ఆరోపించారు.   కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మోడీ దేశాన్ని బలోపేతం చేస్తుంటే కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని విమర్శలు గుప్పించారు. మోడీ హయంలో జరిగిన అభివృద్ధికి ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమనీ, కేసీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని తొలిసారి చూస్తున్నామంటూ దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ చేసి యాదగిరి గుట్టలో ప్రమాణం చేస్తే.. సవాల్ కు సై అనకుండా కేసీఆర్ పిల్లిలా దాక్కున్నారని విమర్శించిన తరుణ్ ఛుగ్ ఎమ్మెల్యేల కొనుగోలుకు తాము కోట్లు వెచ్చిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కు తాము డబ్బు ఖర్చు చేశామనడం శుద్ధ అబద్ధమన్నారు. కేసీఆర్ కు దేవుడిపై నమ్మకం లేకపోతే ఈడీ దర్యాప్తునకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.   ఫామ్ హౌజ్ వీడియోలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. వీడియోలపై దమ్ముంటే కేసీఆర్ ప్రమాణం చేయాలని తరుణ్ ఛుగ్   అన్నారు.  

బ్రహ్మం గారు చెప్పని వింత జరిగింది.. కుక్క కడుపున మేక పుట్టింది!

బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది.. అంటారు. అలాంటి బ్రహ్మంగారు చెప్పని వింతలెన్నో సృష్టిలో  జరుగుతున్నాయి. బ్రహ్మంగారు పంది కడుపున ఏనుగు పుడుతుందన్నారు. కానీ కుక్క కడుపున మేక పుట్టింది.   అన్నిటికీ సైంటిఫిక్ రీజన్స్ ఉండక పోవచ్చు.. కానీ ప్రాణి పుట్టుకలోని అవకరాలకు మాత్రం కచ్చితంగా జన్యుపరమైన లోపాలేనని అంటుంటారు. సరిగ్గా అలాంటి వింత జననమే బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో సంభవించింది. ఒక కుక్క అచ్చు మేకపిల్లలా కనిపించే పిల్లకు జన్మనిచ్చింది. దానిని చూసి మేకపిల్లే అనుకుని ఓ వ్యక్తి దానిని తన ఇంటికి తీసుకువెళ్లాడు. అయితే బిడ్డను వెతుక్కుంటూ కుక్క అతని వెంటే వెళ్లింది. తన పిల్లను నోట కరుచుకుని తీసుకు వెళ్లింది. అసలు కుక్క కడుపున మేక పుట్టడమేంటని అందరూ ఆశ్చర్య పోతున్నారు.  జంతు వైద్య నిపుణులు మాత్రం జన్యుపరమైన లోపాలతోనే కుక్క కడుపున మేక రూపు ఉన్న పిల్ల పుట్టి ఉంటుందంటున్నారు. స్థానికులైతే క్రాస్ బ్రీడింగ్ అయి ఉంటుందన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అచ్చం మేకపిల్లలా ఉన్న కుక్క పిల్లను చూసేందుకు మాత్రం జనాలు తండోపతండాలుగా వస్తున్నారు.

ట్విట్లర్ లో కాస్ట్ కట్.. 3800 ఉద్యోగాలు కోత

ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన తరువాత ఎలాన్ మస్క్ కాస్ట్ కట్ పేరుతో ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నారు. అనేక వివాదాల మధ్య ట్విట్టర్ ను స్వాధీనం చేసుకున్న ఎలాన్ మస్క్ దాదాపు సగం మంది ఉద్యోగులకు తొలగింపు మెయిల్స్ పంపినట్లు చెబుతున్నారు. అదెంత వరకూ వాస్తవమో తెలియదు కానీ.. కనీసంలో కనీసం 3800 ఉద్యోగాలకు కత్తెర వేసినట్లు సమాచారం.   అదే సమయంలో వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని రద్దు చేసి.. మిగిలిన ఉద్యోగులపై తీవ్రమైన పని భారం మోపారని అంటున్నారు.ముఖ్యంగా మైక్రోబ్లాగింగ్ సైట్ ఉద్యోగులపై ఈ భారం తీవ్రంగా ఉందంటున్నారు. ట్విట్టర్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ ఎస్తర్‌ క్రాఫోర్డ్‌ ఆఫీసులో నేలపై నిద్రిస్తున్న ఫొటో ఇఫ్పుడు సామాజిక మాధ్యమంలో విపరీతంగా వైరల్ అవుతోంది. దానికి కింద ట్యాగ్ చేసిన క్యాప్షన్ మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.  మీ బాస్‌ నుంచి మీకు ఏదైనా అవసరమైనప్పుడు ఇలా ఉండాల్సిందే అన్న ట్యాగ్ నెటిజన్లకు విపరీతంగా నచ్చేసింది. దీనిపై ఎలాన్ మస్క్ను పెద్ద ఎత్తున ట్రోల్  చేస్తున్నారు.

ముందస్తే.. జగన్ కు ఏకైక ఆప్షన్!

ఆంధ్రప్రదేశ్ లో గడిచిన మూడున్నరేళ్లు ఒక చీకటి కోణం అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల నెరవేర్చుకోవడానికి సుదీర్ఘ పాదయాత్ర చేసి.. ఆర్థిక రంగంపై, ప్రభుత్వ ఆదాయ వ్యయాలపై ఎలాంటి అవగాహనా లేకుండా ఇష్టారీతిగా హామీలు ఇచ్చేసి ప్రజలను మభ్యపెట్టారు. సరే వాగ్దానాల ఫలితమో, మరోటో అధికారం దక్కింది. కానీ పాలనానుభవం లేకపోవడం. సలహాలను స్వీకరించే మనస్తత్వం కాకపోవడంతో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టింది. మామూలుగా అయితే పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలను ఎవరూ విశ్వసించరు. కానీ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు. రాష్ట్రానికి మంచే జరిగిందో, చెడే జరిగిందో పక్కన పెడితే.. ప్రజాకర్షక పథకాలను అమలు చేయడంలో దివంగత రాజశేఖరరెడ్డి విజయవంతమయ్యారు. ఆ పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందడంతో ఆయన జననేత అయ్యారు. అందుకే జగన్ మోహన్ రెడ్డి ఎడా పెడా హామీలిచ్చేస్తే జనం నిజమని నమ్మారు. కానీ మూడేళ్లు కాకుండానే ఆ హామీలలోని డొల్ల తనాన్ని జనం గుర్తించేశారు. మూడేళ్లు గడిచిపోయిన తరువాత తాము ఇంత చేశాం.. అంత చేశాం అని చెప్పుకుంటూ గడపగడపకూ వెళుతున్న ఎమ్మెల్యేలపై జనం తిరగబడుతున్నారు. అమరావతి ఏకైక రాజధాని అమరావతికే నా మద్దతు అంటూ విపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాకా మూడు ముక్కలాట అంటూ మూడు రాజధానుల పల్లవి ఎత్తుకోవడాన్ని జనం ప్రశ్నిస్తున్నారు. తాను యథేచ్ఛగా ఎలాంటి అవాంతరాలూ, అడ్డంకులూ లేకుండా పాదయాత్ర చేసిన రాష్ట్రంలోనే.. ఎవరూ పాదయాత్రలు చేపట్టకూడదంటూ విధిస్తున్న ఆంక్షలు జనంలో అసంతృప్తికి కారణమౌతున్నాయి. ఇక జిల్లాల ఏర్పాటు దగ్గర నుంచి వాటికి నామకరణం వరకూ జగన్ సర్కార్ వేసిన కుప్పిగంతులు జనంలో జగన్ ప్రభుత్వం పట్ల అసంతృప్తిని రగిల్చాయి.   ఒక్క చాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లే వేయించుకుని అధికారంలోకి వచ్చిన జగన్.. తన పాలనా వైఫల్యాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని బలి చేశారు. రాష్ట్రం రోజు వారీ అవసరాలకు కూడా అప్పు చేయకుండా గడవని పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి రాజకీయ అవసరాల కోసం ఏపీ అడ్డగోలు అప్పులకు అంతే అడ్డగోలుగా అనుమతులిచ్చేస్తున్న కేంద్రం.. ఆ అవసరం తీరాకా పీకల మీద కూర్చుంటుందనడంలో సందేహం లేదు. కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులు ఏపీ ఆర్ధిక స్థితిపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు ఇందుకు సంకేతాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మీట నోక్కి జనం ఖాతాత్లో వేలకు వేల డబ్బులు జమ చేస్తున్నానని జగన్ అంటున్నారు. అయితే అందుకు చెగన్ ఫణంగా పెడుతున్నది రాష్ట్ర భవిష్యత్ అని ఇప్పుడు అదే జనం గుర్తిస్తున్నారు. అందుకు నిదర్శనమే గడపగడపకూ కార్యక్రమంలో లబ్ధిదారులే ప్రభుత్వ విధానాలను ప్రశ్నించి నిలదీయడమని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటి వరకూ కేంద్రం దయాదాక్షిణ్యాలో, మరొకటో ఎలాగో అలా నెట్టుకోచ్చేసినా ఇక ముందు ఆ పరిస్థితి ఉండదని పరిశీలకులు అంటున్నారు. ఇక పై ప్రభుత్వోద్యోగులకు జీతా లివ్వాలన్నా, కనీసం ప్రభుత్వం రోజువారీ వ్యయాలన మీట్ కావాలన్నా పైసా పుట్టని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ పతనమైపోయింది. ఈ పరిస్థితుల్లో ఇక ముందు ఇప్పటి దాకా తాను నమ్ముకున్న సంక్షేమ మీటను నొక్కడానికి కూడా జగన్ కు అవకాశం ఉండదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ మునగాలన్నా,న తేలాలన్నా ఆయనకు ఉన్న ఏకైక ఆప్షన్ ముందస్తు ఎన్నికలే. అంటే సాధ్యమైనంత త్వరగా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం. అదొక్కటే ఇప్పుడిక ఏపీ సీఎం జగన్ కు మిగిలిన మార్గమని పరిశీలకులే కాదు.. ప్రభుత్వ వ్యవహారాలపై గట్టి పట్టున్న మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వంటి వారు కూడా చెబుతున్న మాట. కేంద్రానికి జగన్ పట్ల ఎంత సానుకూలత ఉన్నా కూడా ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఏం చేయలేని పరిస్థితి వచ్చేసిందని అంటున్నారు. అలా కాకుండా మొండిగా అధికారాన్ని పట్టుకు వేళాడాలనుకుంటే.. అది జగన్ కే కాక రాష్ట్రానికి కూడా చేటేనని ఐవైఆర్ అంటున్నారు. పూర్తి కాలం అధికారంలో కొనసాగితే రాష్ట్రం మరింత అధోగతి పాలు కావడం తథ్యమంటున్నారు. ఆర్థికంగా దివాళా తీసి శ్రీలంక పరిస్థితులు ఎదురు కావడం తప్ప జగన్ పూర్తి కాలం అధికారంలో కొనసాగడం వల్ల మరో ప్రయోజనం ఉండదంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ముందస్తుకు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం శ్రేణులకు దిశా నిర్దేశం చేయడం, ఐవైఆర్ ముందస్తే బెటర్ అంటూ ఒకింత వ్యంగ్యంగానైనా సూచించడం కాకతాళీయమైతే కావచ్చు కానీ జరిగేది మాత్రం అదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    

వేలంలో రూ.66 వేలు పలికిన కొబ్బరి కాయ

హైదరాబాద్ లో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రసిద్ధి. గణేష్ నవరాత్రులు ఘనంగా నిర్వహించిన తరువాత ఆ తొమ్మిది రోజులూ గణేషుడి చేతిలో ఉన్న లడ్డూను వేలం వేస్తారు. వేలంలో లడ్డును దక్కించుకున్న వారికి అష్టైశ్వర్యాలూ, ఆరోగ్యం సిద్ధిస్తుందన్నది భక్తుల విశ్వాసం. అందుకే బాలాపూర్ గణేషుడి లడ్డూ ఏ యేటికా యేడు రికార్డులు బద్దలు కొడుతూ ఉంటుంది. లక్షలు పోసైనా సరే వేలంలో లడ్డూను దక్కించుకోవాలని పోటీలు పడుతుంటారు. అలాగే తమిళనాడులోని తేని జిల్లా బోడి ప్రాంతంలో కొబ్బరి కాయ వేలం అంతే ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆ ప్రాంతంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్కంద షష్టి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా వల్లి, దేవయాని సమేత సుబ్రహ్మణ్యేస్వర స్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పూజలో ఉంచిన వస్తువులను వేలం వేశారు.   పూజలో ఉంచిన కొబ్బరి కాయను వేలంలో ఓ భక్తుడు రూ.66 వేలకు దక్కించుకున్నారు. గత ఏడాది వేలంలో కొబ్బరి కాయ ధర 27 వేలు పలికింది. సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణంలో ఉంచిన కొబ్బరి కాయను ఇంటికి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తే  శుభం జరుగుతుందనీ, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. మొత్తం మీద కొబ్బరికాయ వేలంలో రూ.66 వేలు పలకడం రికార్డు సృష్టించింది.

పాయె.. సీఐడీ పరువు గంగలో కలిసి పాయె

ఏపీ సీఐడి పరువు గంగలో కలిసింది. తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ కు రిమాండ్ విధించేందుకు విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు  మెజిస్ట్రేట్ తిరస్కరించడంతోనే ఏపీలో సీఐడీ ఏలిన వారి అడుగులకు మడుగులొత్తుతూ..వారి కనుసన్నలలో పని చేస్తోందన్న విషయం మరో సారి స్పష్టమైంది. అయ్యన్న అరెస్ట్ కేసులో 467 సెక్షన్ వర్తించదని విస్పష్టంగా తేల్చేసి బెయిలు మంజూరు చేసింది.   అయ్యన్న పాత్రుడుతో పాటు ఆయన కుమారుడు రాజేశ్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశించింది.   నాలుగు వందల మంది వందల మంది పోలీసులతో తెల్లవారు జామును అయ్యన్నపాత్రుడి ఇంటిపై దాడి చేసి గోడదూకి తలుపులు పగలగొట్టి ఈడ్చుకెళ్లి మరీ అరెస్టు చేసిన సీఐడీ పోలీసులకు మేజిస్ట్రేట్ ఉత్తర్వులు చెంపపెట్టులా తగిలాయని చెప్పక తప్పదు. కాగా అయ్యన్న పాత్రుడు ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో.. సీఐడీని కేసు డెయిరీ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.   సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో .. రిమాండ్‌కు తరలించేంత ఆధారాలు లేవని గుర్తించిన న్యాయమూర్తి సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని చెప్పి.. రిమాండ్‌ను తిరస్కరించింది. ఇక అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడిని అరెస్టు చేయడానికి కారణం ఏమిటో, కేసు ఏమిటో, నేరం ఏమిటో చెప్పలేక నానా ఇబ్బందులూ పడ్డారు సీఐడీ పోలీసులు.  ఈ కేసుకు సంబంధించి, అయ్యన్న అరెస్టు గురించి మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ విలేకరుల సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు.  . ఏఈ సంతకం ఫోర్జరీ చేశారని..ప్రాథమిక విచారణ చేశామని చెప్పినా...  అయ్యన్నకు నోటీసులు ఇచ్చారా అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేక నోరెళ్లబెట్టారు. అరెస్టుకు సహకరంచలేదని ఇంట్లోకి చొరబడ్డామని చెప్పుకొచ్చారు. నేరానికి పాల్పడిన వారు సహకరించకపోతే ఎలాగైనా అరెస్టు చేయవచ్చని చట్టంలో ఉందని మీడియాలో గంభీరంగా చెప్పారు కానీ.. మేజిస్ట్రేట్ రిమాండ్  నిరాకరించడంతో అయ్యన్న అరెస్టు రాజకీయ కక్ష సాధింపు కోసమేనని తేలిపోయింది.  అయినా ఏలిన వారి ప్రాపకం కోసం ఇలా అరెస్టులు చేయడం,  కోర్టులు అలా  రిమాండ్ విధించడానికి తిరస్కరించడం సీఐడీ కేసుల్లో ఒక ఆనవాయితీగా మారిపోయింది. సీఐడీ అరెస్టు చేసిందంటే అది కచ్చితంగా అక్రమ కేసేనని జనం అనుకునే పరిస్థితి వచ్చేసింది. సీఐడీ ఏలిన వారి సొంత సైన్యంలా పని చేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఏపీ బీజేపీలో అయోమయం.. గందరగోళం

ఏపీ బీజేపీ నాయకుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లా తయారైంది. పై నుంచి ఆదేశాలు అంటూ రాష్ట్రంలో అధికార వైసీపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇరు పార్టీల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయన్న బిల్డప్ ఇవ్వడానికి వారి శక్తిని మించి ప్రయత్నిస్తున్నారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎటువంటి సహాయం కావాలన్న మోడీ సర్కార్ ఆఘమేఘాల మీద చేసేస్తోంది. పరిమితికి మించిన అప్పులు, రాష్ట్రం దివాళా అంటూ రాష్ట్రంలో బీజేపీ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతుంటే.. కేంద్రం మాత్రం ఏపీ సర్కార్ కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పరిమితితో సంబంధం లేకుండా అప్పులు చేసుకోవడానికి వాయువేగంతో అనుమతులు ఇచ్చేస్తోంది. సరే అది పక్కన పెడితే..ప్రధానమంత్రి విశాఖ పర్యటన ఏర్పాట్లను విజయసాయిరెడ్డి సమీక్షించడంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అసలేం జరుగుతోందో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు విజయసాయి ఎవరంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రుసరుసలాడారు.   పులివెందుల పర్యటనలో ఉన్న   సోము వీర్రాజు మీడియా సమావేశంలో విజయసాయిపై నిప్పులు చెరిగారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల సమీక్షకు ఆయనకున్న అధికారాన్ని ప్రశ్నించారు. ప్రధాని పర్యటనను హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలలో అయోమయాన్ని సృష్టించేందుకే విజయ సాయిరెడ్డి ఈ పర్యవేక్షణ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. భారత ప్రధాని అధికారిక పర్యటన ఎపి ప్రభుత్వం ఛీఫ్ సెక్రటరీ ప్రకటించాలని, కలెక్టర్ లు పర్యటన వివరాలు చెప్పాలని అయితే అందుకు భిన్నంగా విజయసాయిరెడ్డి చెప్పడాన్ని సోము తప్పుపట్టారు.   ఈ విషయంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.  ఇదంతా ఎందుకంటే ప్రధాని పర్యటన వివరాలపై తమకు ఓ వైపు తమకు సమాచారం లేదనే బాధ.. మరోవైపు ప్రధాని పర్యటనకు వైసీపీ సర్కార్ చేస్తున్న హడావుడి బీజేపీ రాష్ట్ర నాయకులకు అసలేం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితిలోకి నెట్టేసింది.  దీంతో విమర్శలకు దిగుతున్నారు. 

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు సీబీఐకి.. నందకుమార్ భార్య పిటిషన్

ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ భార్య హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. తన భర్త ఫోన్ ను చట్ట విరుద్ధంగా ట్యాప్ చేశారని ఆరోపించారు. తన భర్త నందకుమార్ తో పాటు ఇతర నిందితులకు రిమాండ్ విధించడానికి ఏసీబీ కోర్టు తొలుత నిరాకరించిన విషయాన్ని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. కేసు  దర్యాప్తు పారదర్శకంగా జరగకుండా పలుకుబడి కలిగిన వ్యక్తులు   ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు.   సీబీఐ, సిట్‌ లేదా సిట్టింగ్‌ జడ్జికి కేసు దర్యాప్తును అప్పగించాలని ఆమె తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేవరకు నిందితులకు సంబంధించిన ఎటువంటి ఆడియోలను, వీడియోలను మీడియాకు, సోషల్‌ మీడియాకు, ఇతరులకు విడుదల చేయకుండా పోలీసులను కట్టడి చేయాలని కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సీబీఐ, సిట్‌ లేదా సిట్టింగ్‌ జడ్జి చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం (నవంబర్ 4) మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది.  

మునుగోడులో రికార్డు స్థాయిలో 93శాతం ఓటింగ్

రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపిన మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 93 శాతం పోలింగ్ నమోదయ్యాంది.  రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలన్నిటి కంటే మునుగోడు ఉప ఎన్నికలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో 84.75 శాతం, దుబ్బాకలో 82.61 శాతం, నాగార్జునసాగర్‌ 88 శాతం, హుజూరాబాద్‌లో 87 శాతం ఓటింగ్‌ నమోదైంది. మూడు ప్రధాన పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హోరాహోరీ తలపడిన మునుగోడు ఉప ఎన్నిక చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.అక్కడక్కడా ఘర్షణలు, ఆందోళనలు తలెత్తినా మొత్తం మీద పోలింగ్ ప్రశాతంగానే ముగిసింది.  మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  5వేల మంది రాష్ట్ర పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.   మొత్తం 298 పోలింగ్‌ బూత్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి   నల్లగొండ కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షించారు.