అగ్నిపర్వతం హిమాలయాన్నేమీ చేయలేదు..తమిళిసై

తమిళనాడు గవర్నర్, పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై మళ్లీ ఆగ్రహించారు.  తాము తమిళులమని భావించుకునే వారు అసలుసిసలు తమిళుల వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. డిఎంకె పత్రిక మురసొలి లో ఆమె పై వచ్చిన వ్యాసం పై తమిళిసై స్పందించారు. తనను అగ్నిపర్వతంగా ప్రచారం చేసుకుం టున్న పార్టీ హిమాలయాన్నేమీ చేయలేదని అన్నారు. వాస్తవాలు మింగుడుపడనివారు, నిజాలు మాట్లాడని వారే భయానికి లోనవుతుంటారని, డీఎంకె కి మోదీ ఫోబియా పట్టుకుందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలించే విధంగా, సహాయసహకారాలు అందించేవిధంగా పనిచేయాలని లేకుంటే  తెలంగాణా గవర్నర్ తమిళిసై పరిస్థితి ఎదుర్కొనాల్సి వస్తుందని డిఎంకే తమిళనాడు గవర్న ర్ను హెచ్చరించింది. గవర్నర్లు తమ తప్పులు తెలుసుకుని వ్యవహరించాలని, అందుకు గొప్ప ఉదాహ రణ తమిళిసై అంటూ డిఎంకె అధికార పత్రిక మునసోలీలో ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఈ విధంగా గవర్నర్ వ్యవస్థను హెచ్చరించచడం, అవమానించడంపై తమిళిసై మండిపడ్డారు. పిరికివారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారన్నారు.  గవర్నర్ వ్యవస్థ గురించి డిఎంకె ఆ విధంగా వ్యాఖ్యానించడం ఎంత వరకూ సబబు అని తమిళ రాజకీయ  పరిశీల కులు ప్రశ్నిస్తున్నారు.  గతంలో తెలంగాణా ప్రభుత్వంతో కూడా తమిళిసై విభేదించారు. రాజ్ భవన్, తెలంగాణ సర్కార్ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. నెలరోజుల తర్వాత హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా కలిసినపుడు మాట్లాడుకున్నారు. కానీ విబేదాలు మాత్రం కొనసాగి తనను కేసీఆర్ సర్కార్ అవమా నిస్తోందని ప్రకటనలూ చేశారు. ఇదే పరిస్థితుల్లో ఆమె గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేశారు.  తనది ఎవరికి భయపడే స్వభావం కాదన్న తమిళి సై... తనను ఎవరూ తక్కువగా చేసి చూసినా సహించ నని చెప్పారు. గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపిం చారు. ఇది అనేక సందర్భాల్లో బయట పడిందన్నారు.ప్రభుత్వం చాలాసార్లు కావాలని ఇబ్బంది పెట్టినా తాను భయపడలేదని గవర్నర్ తమిళి సై తెలిపారు. తనపై ఎందుకిలా వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.  గవర్నర్ కార్యాలయానికి ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. గవర్నర్ కార్యాలయం అయిన రాజ్ భవన్ పై ప్రభుత్వం వివక్ష కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వం ప్రోటోకాల్ ను తుంగలో తొక్కిందన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు

తాడేపల్లి ప్యాలస్ ను ముట్టడిస్తాం జాగ్రత్త.. జగన్ కు గోరంట్ల హెచ్చరిక

జగన్ పాలనలో ఇకపై ఓ ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు నష్టం జరిగినా తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడిస్తాం తస్మాత్ జాగ్రత్త అంటూ తెలుగుదేశం సీనియర్ నాయకుడు, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి సంఘీ భావంగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నుంచి 125 కార్లలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు నర్సీపట్నానికి ర్యాలీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా వారు అయ్యన్న పాత్రుడికి సంఘీ భావం తెలిపారు. ఇతర జిల్లాల నుంచి వందల మంది వచ్చి మద్దతుగా నిలవడం తనకు కొండంత ధైర్యాన్నిచ్చిందన్న అయ్యన్నపాత్రుడు ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. కాగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. ఆయన జగన్ పై నిప్పులు చెరిగారు. విపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర అంటూ మూడేళ్లు తిరిగిన నిన్ను ఏనాడైనా అడ్డగించామా అంటూ జగన్ ను నిలదీశారు. అయినా సీఐడీ పోలీసులు పగలంతా ఏం చేస్తుంటారు.. అరెస్టులు అర్దరాత్రి దాటిన తరువాతే  ఎందుకు చేస్తారు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిపై ఏదో ఒక సాకుతో   కేసులు పెడుతూనే ఉన్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారంటూ అయ్యన్న కుమారుడు విజయ్ ఇంటికి వెళ్లి ఆయన కుమార్తెను వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైఎస్ వివేకా కుమార్తెకు క్యాపిటల్ ఫౌండేషన్ పురస్కారం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్   సునీతకు  క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారం దక్కింది. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని డాక్టర్ సునీతకు  భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యూయూ లలిత్  అందజేశారు.   వివిధ రంగాల్లో సేవలందించిన పలువురికి క్యాపిటల్ ఫౌండేషన్.. జస్టిస్ కృష్ణయ్యర్ ఉచిత న్యాయ సేవల విభాగంతో కలిసి ఈ అవార్డులను అందజేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నియంత్రణ విభాగంతో పాటు పలు సంస్థల్లో సభ్యురాలిగా సునీత అందిస్తున్న డాక్టర్ సునీత ఈ పురస్కారం అందుకున్నారు. పురస్కారం అందుకున్న తరువాత మీడియాతో మాట్లాడిన సునీత  అంటువ్యాధుల్లో టీబీతోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభణతో అంటువ్యాధుల వ్యాప్తి నివారణపై ప్రపంచ వ్యాప్తంగా శ్రద్ధ తగ్గిందన్నారు. కాగా డాక్టర్ సునీత తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి హత్య కేసు విచారణ ఏపీలో అయితే సరిగా జరగదని, నిందితులకు ప్రభుత్వం కాపాడే యత్నం చేస్తోందని ఆరోపిస్తూ రాష్ట్రం బయట విచారణ జరగాలని కోరుతూ సుప్రీం ను ఆశ్రయించిన సంగతి విదితమే. సుప్రీం కోర్టు కూడా ఏపీ బయట విచారణకు అంగీకారం తెలిపింది. ఒక వైపు తన తండ్రి హంతకులకు శిక్ష పడాలని కోరుతూ న్యాయపోరాటం చేస్తూనే.. మరో వైపు అంటువ్యాధుల నియంత్రణపై వృత్తి పరంగా సేవలు కొనసాగిస్తున్న సునీతకు క్యాపిటల్ ఫౌండేషన్ జాతీయ పురస్కారం లభించడం ముదావహం.

ఉప ఎన్నికల్లో కమల వికాసం

మునుగోడులో ఓడినా.. దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాలలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలల బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. తెలంగాణలోని మునుగోడు సహా దేశ వ్యాప్తంగా 7 నియోజకవర్గాలకు జరిగిన ఉన ఎన్నికల ఫలితాలు ఆదివారం (నవంబర్6) వెలువడ్డాయి. వీటిలో నాలుగింటిలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. మునుగోడు, బీహార్ లోని మొకామా అసెంబ్లీ నియోజకవర్గం, అలాగే మహారాష్ట్రలోని ఒక నియోజకవర్గంలో బీజేపీకి పరాజయం ఎదురైంది. మిగిలిన నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ కమల వికాసమే జరిగింది. బీహార్ లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా వాటిలో మకావూలో పరాజయం పాలైన బీజేపీ గపాల్ గంజ్ నియోజకవర్గంలో జయకేతనం ఎగుర వేసింది.  ఉత్తరప్రదేశ్, , ఒడిశా, హర్యానా, మహారాష్ట్లలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరగగా అక్కడ బీజేపీ గెలుపొందింది.  

బ్యాటింగ్ విధ్వంసానికి కొత్త పేరు సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ క్రికట్ లో ఇప్పుడీ పేరొక సంచలనం. వేసవి కాలం మిట్టమధ్యాహ్నం రోహిణీ కార్తెలో బయటకు వెడితే వడ దెబ్బ తగులుతుందో లేదో చెప్ప లేం కానీ.. సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లో ఉంటే మాత్రం బౌలర్లకు బౌండరీ దెబ్బలు తప్పవు. మధ్యందిన మార్తాండుడిని మించిన తీక్షణతతో సూర్యకుమార్ యాదవ్ బౌలర్లపై విరుచుకు పడతాడు. అలాంటి బ్యాటింగ్ విధ్వంసం గతంలో డివీలియర్స్ నుంచి చూసేవాళ్లం. ఇప్పుడు డివీలియర్స్ రిటైర్ అయిపోయాడు. ఇక ఆ బ్యాటింగ్ మెరుపులు చూడలేమా? అనుకున్న వారికి సూర్యకుమార్ యాదవ్ అంతకు మించి అంటూ వచ్చేశాడు. ప్రత్యర్థి ఎవరైనా, బౌలర్ ఎంతటి వాడైనా తగ్గేదే లే అంటూ బంతిని బౌండరీకి తరలించి ఔరా అనిపిస్తున్నాడు. క్రికెట్ షాట్లకు సృజనను జోడించి క్రికెట్ బ్రెయిన్ ను అప్లై చేసి మంచి బంతిని కూడా సిక్సర్ కొట్టే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ విన్యాసాలు చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదని దిగ్గజ క్రికెటర్లు సైతం ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఆదివారం(నవంబ్6) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ నే తీసుకుంటే క్రికెటింగ్ షాట్లతో పాటు..సూర్యకుమార్ తనవైన ప్రత్యేక షాట్లతో అలరించాడు. బంతి ఏదైనా బౌండరీకి తరలాల్సిందే అన్నట్లుగా ఆడాడు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ ఆవల దాదాపు వైడ్ అన్నట్లుగా పడిన బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్రర్ కు తరలించిన షాట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బంతి ఎక్కడ వేస్తే సూర్యకుమార్ బౌండరీ కొట్టకుండా ఆపగలమో బౌలర్లకే అర్ధంకాలేదంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ ఖాతాలోకి పలు రికార్డులు వచ్చి పడ్డాయి. ఒక క్యాలెండర్ ఇయర్ లో టి20ల్లో శతకం చేసిన తొలి ఇండియన్ గా, అలాగే ఒక క్యాలండర్ ఇయర్ గా టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. తన కెరీర్ మొత్తంలో ఇప్పటి వరకూ 39 మ్యాచ్ లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 1270 పరుగులు చేశాడు. అందులో వేయ్యీ ఆరు పరుగులు ఈ క్యాలెండర్ ఇయర్ లో చేసినవే. ఇక ప్రస్తుత టి20 ప్రపంచ కప్ లో అయితే ఇప్పటి వరకూ 225 పరుగులు సాధించి మూడో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. 

ఎమ్మెల్యే నివాసం ఎదుట అయ్యప్ప స్వాముల భజన నిరసన

భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో పూజలు భజనలు చేసుకునే అయ్యప్పస్వాములే నిరసనకు దిగాల్సిన పరిస్థితిని వైసీపీ సర్కార్ తీసుకువచ్చింది. రాజకీయ ప్రత్యర్థులను బద్ధ శత్రువుల్లా చూసే జగన్ సర్కార్ నైజమే ఇందుకు కారణమన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఇంతకూ జరిగిందేమిటంటే..భీమవరంలోని సింహాద్రి అప్పన్న దేవాలయం వద్ద గత 28 ఏళ్లుగా అయ్యప్పమాల ధరంచే వారు పడిపూజ చేసుకుంటారు. సంప్రదాయంగా వస్తున్న ఈ విషయంలో ఇప్పటి వరకూ ఎవరూ జోక్యం చేసుకోలేదు. కానీ తాజాగా అయ్యప్ప మాల వేసుకున్న జనసేన మద్దతుదారు పడిపూజను   అడ్డుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారుల్ని స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆదేశించారు. దాంతో పోలీసులు, అధికారులు రంగ ప్రవేశం చేసి అప్పటికే షామియానా వేసి..  పూజా కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్న వేళ అడ్డుకున్నారు. అయ్యప్ప మాలలో ఉన్న వారు భక్తిభావంతో చేసే కార్యక్రమాన్ని రాజకీయంగా ఎలా చూస్తారని అయ్యప్పలు నిలదీశారు. ఎమ్మెల్యేను అడిగితే ఇప్పుడు ఇంతే అని నిర్లక్షంగా సమాధానమిచ్చారు. దీంతో అయ్యప్పలకు ఆగ్రహం వచ్చింది.  ఎమ్మెల్యే తీరుకు నిరసనగాద శనివారం రాత్రి ఆయన నివాసం ముందు రోడ్డుపై కూర్చుని అయ్యప్ప గీతాలు పాడుతూ, భజన చేస్తూ నిరసనకు దిగారు. అయ్యప్పల నిరసనలకు స్థానికులు కూడా మద్దతు ఇస్తూ ఎమ్మెల్యే తీరును తప్పుపట్టారు. 

కమలానికి మునుగోడు కషాయం? ఊరించి చేజారిన గెలుపు

మునుగోడులో గెలుపుతో టీఆర్‌ఎస్ భవన్‌లో గులాబీపార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉపఎన్నిక నెల రోజుల ఉత్కంఠకు నేడు తెర పడింది.  15 రౌండ్లు ముగిసే సరికి 11,666 ఓట్ల స్పష్ట మైన ఆధిక్యంలో నిలిచింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ ముం దంజలో నిలిచింది. మొత్తం 686 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోల్ కాగా టీఆర్‌ఎస్‌ 228, బీజేపీ 224, బీఎస్పీ 10, ఇతరు లకు 88 ఓట్లు సాధించారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 4 ఓట్ల ఆధిక్యం లభించింది. ఉప ఎన్నికలో ఉప ఎన్ని కల ఫలి తాల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లుగా ప్రకటించారు బీజేపీ అభ్యర్దిగా పోటీ చేసిన కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. తెలంగాణ భవన్ లో సంబరాలు జరుగుతున్నాయి. మొదటి రౌండ్ మినహా మిగిలిన అన్నీ రౌండ్లు టీఆర్ఎస్‌ పార్టీ క్రమంగా మెజార్టీ పుంజుకుంటూ చివరకు ఏడు వేల ఓట్ల ఆధిక్యం దాటిపోవడంతో ఆయ న ఓటమిని అంగీ కరించారు.  ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటి రెడ్డి రాజ గోపాల్  రెడ్డి రాజీనామా  చేశారు. మును గోడులో నవంబరు 3న పోలింగ్ జరిగింది. ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటి రెడ్డి రాజగోపాల్  రెడ్డి కాంగ్రెస్  పార్టీకి  రాజీనామా చేశారు.  అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధి గా ఈ స్థానం నుండి  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం  సాధించా రు. ఈ దఫా  బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వా యి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో  ఉన్నారు. మునుగోడు  ఉప ఎన్నికల్లో  47 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.  47  మందిలో  ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ  నెలకొంది. ఈ  నియోజక వర్గంలో గురువారం జరిగిన పోలింగ్‌ లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది.   మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు.  ఇందులో 2,25,192 మంది ఓటువేశారు. వీరిలో 1,13,853 పురుషులు, 1,11,338, మంది స్త్రీలు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలుపుకొని 93.41 శాతం నమోదైంది. తెలంగాణలో ఏ ఎన్నికల్లోనూ ఇంత పోలింగ్ నమోదు కాలేదు. ఆ స్థాయిలో మునుగోడు ఓటర్లు పోటెత్తారు. చౌటుప్పల్‌లో 59,433 ఓట్లు ఉండగా 55,678 ఓట్లు, సంస్థాన్ నారాయణపురంలో 36,430 ఓట్లు ఉండగా 34,157 ఓట్లు, మునుగోడు 35,780 ఓట్లు ఉండగా 33,455 ఓట్లు, చండూరులో 33,509 ఓట్లు ఉండగా 31,333 ఓట్లు, గట్టుప్పల్‌లో 14,525 ఓట్లు ఉండగా 13,452 ఓట్లు, మర్రిగూడలో 28,309 ఓట్లు ఉండగా 25,877 ఓట్లు, నాంపల్లి‌ లో 33,819 ఓట్లు ఉండగా 31,240 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 47 మంది అభ్యర్థులు మునుగోడు బరిలో నిలి చారు. నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్‌ హౌసింగ్‌ గోడౌన్స్‌లో ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఐదో రౌండ్ లో  బీజేపీ పై టీఆర్ఎస్ ఆధిక్యంలో  నిలిచింది. 1,4,5  రౌండ్లలో టీఆర్ఎస్  ఆదిక్యంలో  నిలిచింది. రెండు,మూడు రౌండ్లలో మాత్రమే బీజేపీ ఆధిక్యత ను సాధించింది. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ లో 1,352 ఓట్లతో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. టీఆర్ఎస్‌కి 6,478, బీజేపీకి 5,126, కాంగ్రెస్‌కి 2,100 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్ 563 ఓట్లతో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. టీఆర్ ఎస్‌ కి 14,211, బీజేపీకి 13,648, కాంగ్రెస్‌కి 3,597 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్‌ ముగిసే సరికి టీఆర్‌ఎస్ 35 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్‌కి 7,010, బీజేపీకి 7,426, కాంగ్రెస్‌కి 1,532 ఓట్లు పోలయ్యాయి. 4 రౌండ్  ముగిసే సరికి టీఆర్‌ఎస్ 35 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్‌కి 7,010, బీజేపీకి 7,426, కాంగ్రెస్‌కి 1,532 ఓట్లు పోలయ్యాయి.  ఐదో రౌండ్ లో  బీజేపీ  అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై  తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదిక్యంలో నిలిచారు. ఐదో రౌండ్ లో  టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 6,1,62 ఓట్లు, బీజేపీఅభ్యర్ధి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 5,245  ఓట్లు వచ్చాయి. మొత్తం ఐదు  రౌండ్లు కలుపుకుంటే టీఆర్ఎస్ అభ్యర్ది కూసుకుంట్ల  ప్రభాకర్ రెడ్డికి 32,605 ,బీజేపీ అభ్యర్ధి  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి 30,974  ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి  స్రవంతికి  10,055 ఓట్లు వచ్చాయి. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి  టీఆర్ఎస్  అభ్యర్ధి  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 52,334 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డికి 49,243 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి 13,689 ఓట్లు దక్కాయి. బీజేపీ ఎన్నో  ఆశ లు పెట్టుకున్న చండూరు మండలంలోనూ టీఆర్ఎస్‌ కారు దూసుకెళ్లింది. 9వ రౌండ్‌లో కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డికి  7,497 ఓట్లు పడ్డాయి. బీజేపీకి 6,665 ఓట్లు వచ్చాయి.10వ రౌండ్‌లోనూ కొనసాగిన టిఆర్ఎస్  ఆధిక్యత. మొత్తం మీద 4,416 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్. 11 రౌండ్లు  పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డికి 74,574 ఓట్లు,బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డికి 68,800 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి  స్రవంతికి  16,280  ఓట్లు  వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డిపై 5,765 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 12వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు పోలైన ఓట్లు 7440, బీజేపీ 5398. 12వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం 2042. 12 రౌండ్లు ముగిసేసరికి 7836 ఓట్ల ఆధిక్యంతో గెలుపు వాకిట్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి  ఉన్నారు.  కౌంటింగ్ ప్రక్రియ మందకొడిగా జరుగుతుండడంపై టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రౌండ్‌ల వారీగా కౌంటింగ్ ఫలితాలను ఆలస్యంగా ప్రకటిస్తుండడంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మందకొడిగా జరుగుతుండడంపై టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రౌండ్‌ల వారీగా కౌంటింగ్ ఫలితాలను ఆల స్యంగా ప్రకటిస్తుం డడంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ స్పందించాలని కోరారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి వివరాలు తెలిపాలని ఆయన కోరారు. దీని పై సీఈవో వికాస్ రాజ్ స్పందించారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమ వుతుందని చెప్పారు. ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థుల ఏజెంట్లు ఉన్నారని, ఆర్వో సంతకం చేశాకే ఫలితాలు విడుదల చేస్తున్నామ ని వివరించారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందని స్పష్టం చేశారు. ఉదయం కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న సమయంలో పాల్వాయి స్రవంతి రెడ్డి మాట్లాడుతూ, విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సక్సెస్ అవుతాయని లేదుగా ప్రశ్నించారు. అయితే ప్రతి రౌండ్‌లో కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితం కావడం.. బీజేపీ, టీఆర్ఎస్‌‌లతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు పోలు కావడంతో పాల్వాయి స్రవంతి నిరాశతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.  మునుగోడు ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కూడా సిట్టిం గ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ముందు నుంచే ప్రయత్నాలు చేపట్టింది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందే పాల్వాయి స్రవంతిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ప్రచారంలో విషయంలో మాత్రం ఆ పార్టీ వెనక బడిందనే చెప్పాలి. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీల మాదిరిగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రచారం నిర్వ హించలేదనే టాక్ కూడా ఉంది. అలాగే ఓటర్లను ప్రలోభ  పెట్టడంలో కూడా కాంగ్రెస్ వెనకబడిందని చాలా మంది మునుగోడు వాసులే స్వయంగా వెల్లడించారు.  మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుపై తన అనుమానం వ్యక్తం చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఏడు రౌండ్లు కౌంటింగ్‌ పూర్తైనప్పటికి ఆయనకు కనీసం ఓట్లు పడకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. లక్షా 17 వేలు ఓట్లు ఉంగరానికి పడ్డాయని మునుగోడు ప్రజలు చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఇప్పటి వరకు తనకు 600 ఓట్లు కూడా నాకు రాకపోవడంపై అను మానం వ్యక్తం చేశారు. ఈవీఎం ల పనితీరుపై తనకు నమ్మకం లేదన్నారు కేఏ పాల్. ఇదంతా బిజెపి, టీఆరెఎస్ పార్టీల కుట్రగా భావిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలో అవినీతి జరిగిందన్నారు కేఏ పాల్. 200ఖాళీ ఈవీఎంలను మిగతావాటితో కలిపి భద్రపరచడంపై అనుమానం వ్యక్తం చేశారాయన. ఎలక్షన్‌ను రద్దు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో జాప్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్ని కల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌‌కు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి.. ఫలితాలు ఎప్పటికప్పుడు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడితో జాప్యంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ అన్నారు.  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప సీఈవో రౌండ్ల వారీ గా ఫలితాలను  అప్ డేట్ చేయడంలేదని ఆరోపించారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను వెల్లడించడం లేద న్నారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కార ణాలేమిటో సీఈవో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎం దుకు వెల్లడించడం లేదని నిలదీశారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘా నికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.  

మునుగోడులో కారు జోరు.. వాడిపోయిన కమలం!

మునుగోడు ఉప ఎన్నికల్లో కమలం వాడిపోయింది. కారో జోరు చూపింది. కమలనాథుల లెక్క తప్పింది. నియోకవర్గ ప్రజలు తెరాసకే బ్రహ్మరథం పట్టారు. ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేలపై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలయ్యారు.దీంతో తెలంగాణలోని టీఆర్ఎస్ కార్యాలయాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి రెండో స్థానంలో నిలువగా.. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నిలిచారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తంలో రెండు, మూడు రౌండ్లలో మాత్రమే బీజేపీ అధిక్యత ప్రదర్శించింది.   ఆ తరువాత అన్ని రౌండ్లలోనూ  కారు పార్టీ జోరు కొనసాగించింది. చివరకు విజయం తెరాస అభ్యర్థి కూసుకుంట్లనే వరించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. కమలం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో మునుగోడు ఉప ఎన్నక అనివార్యమైన సంగతి తెలిసిందే.   ఈ ఉప ఎన్నికను అటు అధికార టీఆర్ఎస్, ఇటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆ క్రమంలో మునుగోడులో సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన భారీ బహిరంగ సభను బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. ఈ సభ సాక్షిగా రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరో వైపు అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం.. సదరు నియోజకవర్గాన్ని మొత్తం 86 యూనిట్లుగా విభజించి..  ఇన్‌చార్జులను నియమించారు. 14 మంది మంత్రులు, 72 మంది ఎమ్మెల్యేలకు ప్రచార భాద్యతలు అప్పగించడమే కాదు.. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లును సైతం గులాబీ బాస్ రంగంలోకి దింపారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ గడప గడపకు ప్రచారం నిర్వహించినట్లు అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాదే జరగనున్న   తరుణంలో.. జరుగుతోన్నఈ  ఉప ఎన్నికను సెమీ ఫైనల్స్‌గా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అలాంటి తరుణంలో తమ పార్టీ అభ్యర్థి విజయం కోసం అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీలు పోటా పోటీ పడి మరీ ప్రచారాన్ని నిర్వహించాయి. మరోవైపు.. ఈ ఉప ఎన్నికకు కొద్ది రోజుల ముందు.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోనుగోలుకు బీజేపీ తెర తీసిందంటూ.. కొన్ని వీడియోలు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో జరిగిన హడావుడి ఓ రేంజ్‌లో సాగింది. అయితే ఇంకేముందు కారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి.. కమలం పార్టీ నేతలను ఉతికి ఆరేస్తారని.. ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా పక్కాగా ఫిక్స్ అయిపోయారు. కానీ దీనిపై కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టింది లేదు. చివరకు మంత్రి కేటీఆర్ సైతం.. ఈ అంశంపై ఎవరు పెదవి విప్పవద్దంటూ గులాబీ గూటిలోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారు. దీంతో మునుగోడు ప్రజలే కాదు.. ప్రపంచంలోని తెలుగు ప్రజలు సైతం మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్‌ నిజమేనా?.. కాదా? అనే ఓ సందిగ్థంలోకి వెళ్లిపోయారనే ఓ టాక్ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా నడిచింది.  అయితే మునుగోడు ఉప ఎన్నిక జరిగిన నవంబర్ మూడో తేదీ సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి.. మొయినాబాద్ పామ్ హౌస్ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోను ప్రగతి భవన్ సాక్షిగా విడుదల చేశారు. మరోవైపు మునుగోడు ఓటర్లంతా ఏ పార్టీ వైపు ఉన్నారనే చర్చ సైతం రాజకీయ పార్టీల్లో జోరుగా సాగింది. కానీ మునుగోడు ఓటర్లు మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే పట్టం కట్టినట్లు ఈ ఉప ఎన్నిక ఫలితం   రూఢీ చేసింది.  మునుగోడు ఉప ఎన్నికలో  గెలిచి.. తమ సత్తా ఏమిటో గులాబీ బాస్ కేసీఆర్‌కు రుచి చూపిద్దామనుకున్న కమల నాథులు భంగపడ్డారు.   ఈ ఉప ఎన్నిక ద్వారా సీఎం కేసీఆర్.. తెలంగాణ బీజేపీ నేతలకే కాదు.. హస్తినలోని మోదీ, అమిత్ షా ద్వయానికి సైతం ఝలక్ ఇచ్చారనే  ఓ టాక్ అయితే తెలంగాణ భవన్ సాక్షిగా రచ్చ రంబోలా చేసి పారేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ జోడో యాత్ర సైతం.. ఈ ఉప ఎన్నికపై ప్రభావం చూపించలేదని.. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి వచ్చిన ఓట్లను బట్టి అవగతమౌతోంది.   ఈ ఉప ఎన్నికల వేళ అడుగడుగునా చెక్ పోస్ట్‌లు పెట్టడం ద్వారా భారీగా నోట్ల కట్టలే కాదు.. భారీగా మద్యాన్ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. అయినా.. ఎప్పటిలాగానే ఈ ఉప ఎన్నికల్లో కూడా నగదు, మద్యంతోపాటు తులం బంగారం సైతం అత్యంత కీలక పాత్ర పోషించాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. 

కౌంటింగ్ పూర్తి కాకుండానే ఓటమి అంగీకరించిన రాజగోపాలరెడ్డి

మునుగోడులో రాజగోపాలరెడ్డి పరాజయాన్ని అంగీకరించారు. కౌంటింగ్ పూర్తి కాకుండానే.. ఆయన తన పరాజయాన్ని అంగీకరించారు. అదే సమయంలో టీఆర్ఎస్, వామపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పది రౌండ్లు పూర్తయిన తరువాత ఆయన మీడియా ముందుకు వచ్చి మునుగోడు ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని చెప్పారు. అధికార పార్టీ విశృంఖలంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు.బీజేపీ అభ్యర్థిగా తనను కనీసం ప్రచారం కూడా చేసుకోనివ్వలేదని ఆరోపించారు.   టీఆర్ఎస్ అధర్మంగా గెలిచిందని అన్నారు. భారత దేశ చరిత్రలో ఎన్నికల మధ్యలో రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేయడం అనేది  మునుగోడు ఉప ఎన్నికలోనే జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్,  పోలీసులు వ్యవస్థ మొత్తం ప్రభుత్వ యంత్రాంగ మొత్తం నియోజకవర్గాన్ని అష్టదిగ్బంధం చేసిందన్నారు.   పోలింగ్ రోజు కూడా డబ్బు మద్యం పంచారని ఆరోపించారు.   

జింబాబ్వేను ఓ ఆటాడుకున్న టీమ్ ఇండియా.. 71 పరుగుల తేడాతో సునాయాస విజయం

సూపర్ 12 లో చివరి మ్యాచ్ లో జింబాబ్వేపై ఇండియా ఘన విజయం సాధించి గ్రూప్ 2లో అగ్రస్థానాన్ని దక్కించుకుని ఘనంగా సెమీస్ కు చేరింది.  ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం సాధించి 71 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.  ఫామ్ లోకి వచ్చిన రాహుల్ ఈ మ్యాచ్ లో కూడా రాణించి హాఫ్ సెంచరీ చేశాడు. అయితే భారత్ ఇన్నింగ్స్ లో హై లైట్ మాత్రం సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగే. సూర్యకుమార్ యాదవ్ పాతిక బంతుల్లో 61 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ స్కోరులో నాలుగు సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి.  స్కిప్పర్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే కోహ్లీ సాధికారికంగా ఆడి 26 పరుగులు చేశాడు. దినేష్ పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చిన రిషభ్ పంత్ కూడా విఫలమయ్యాడు. 5 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు చేసి ఔటయ్యాడు. హార్ధిక్ పాండ్యా 18 పరుగులు చేశాడు.   జింబాబ్వే బౌలర్లు ఆరంభంలో భారత బ్యాట్స్‌మెన్లను కట్టడి చేసినా.. ఆ తరువాత చేతులెత్తేశారు.  మరీ ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లోకి వచ్చిన తరువాత బౌలర్లు బౌండరీలు ఇవ్వడానికే బౌల్ చేస్తున్నారా అన్నట్లుగా సీన్ మారిపోయింది.  187 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే ఏ దశలోనూ లక్ష్య ఛేదన దిశగా సాగలేదు. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో  17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జింబాబ్వే బ్యాటర్లలో సికందర్ రజా 24 బంతుల్లో 34 పరుగులు, రియాన్ బర్ల్ 22 బంతుల్లో 35 పరుగులు మాత్రమే రాణించారు. మెరుపు బ్యాటింగ్ తో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. 

ఏపీ బీజేపీలో భగ్గుమన్న విభేదాలు!

మోడీ విశాఖపర్యటన బీజేపీలో విభేదాలను బయటపెట్టింది. సోము వీర్రాజుపై పార్టీ సీనియర్లలో ఉన్న అసంత‌ృప్తి భగ్గుమంది. వైసీపీ మోడీ రాష్ట్ర పర్యటనను  హైజాక్ చేస్తే ఏం చేస్తున్నారంటూ బీజేపీ సీనియర్ నాయకులు సోము వీర్రాజుపై మాటల దాడి చేశారు. పార్టీ నేతలకు కనీస సమాచారం లేకండా వైసీపీ ప్రధాని కార్యక్రమానికి ఏర్పాట్లు ఎలా చేస్తున్నదనీ, మీరేం చేస్తున్నారనీ విమర్శలతో సోముపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రమేయం  లేకుండా ప్రధాని కార్యక్రమ ఏర్పాట్లను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎలా సమీక్షిస్తారంటూ సోము వీర్రాజును పార్టీ సీనియర్లు నిలదీశారు. ఈ సీన్ కు బీజేపీ కోర్ కమిటీ సమావేశం వేదికైంది. సీనియర్ల విమర్శలకు ఆగ్రహించిన సోము వీర్రాజు వారిపై ఎదురుదాడికి దిగారు.     ఎవరి బతుకులేమిటో నాకు తెలుసంటూ విమర్శలు గుప్పించారు. దీంతో బీజేపీ కోర్ కమిటీ సమావేశం రసాబాసగా మారిపోయింది. సోము వీర్రాజు, సీనియర్ల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఈ దశలో కేంద్ర మంత్రి, పార్టీ ఏపీ ఇన్ చార్జి మురళీధరన్ జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. అదే సమయంలో అందరినీ కలుపుకుని పోవాలని సోము వీర్రాజుకు హితవు చెప్పారు. ఈ నెల11న ప్రధాని మోడీ విశాఖకు పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మోడీ పర్యటనపై చర్చించేందుకు జరిగిన కోర్ కమిటీ భేటీలో  ప్రధాని కార్యక్రమం గురించి ముందుగా తెలియాల్సింది వైసీపీకా? బీజేపీకా అని ఏపీ బీజేపీ సీనియర్లు సోము వీర్రాజును ప్రశ్నించారు. దీంతో సీనియర్లు, సోము వీర్రాజు మధ్య వాగ్వాదం జరిగింది.     

దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ ఆశలు గల్లంతు.. నెదర్లాండ్స్ చేతిలో చిత్తు

వరల్డ్ కప్ విజయం దక్షిణాఫ్రికాకు మరో సారి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఐసీసీ వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా సెమీస్ కు చేరకుండానే టోర్నీ నుంచి వైదొలగింది. పసి కూన నెదర్లాండ్స్ చేతిలో 13 పరుగు తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి ఔటైపోయింది. ఇన్నేళ్లుగా కలగానే మిగిలిపోయిన  వరల్డ్ కప్ ను ఈ సారి ఎలాగైనా సాధించి తీరాలని, ఐసీసీ టి20 వరల్డ్ కప్ విజేతగా నిలవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న దక్షిణాఫ్రికాకు  మరోసారి నిరాశే మిగిలింది. గ్రూప్ బిలో నిన్నటి (నవంబర్ 5) వరకూ అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా ఆదివారం(నవంబర్ 6)న నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 13 పరుగుల తేడాలో పరాజయం పాలయ్యింది. దీంతో సఫారీల వరల్డ్ కప్ ఆశలు గల్లంతయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. 159 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా ఛేదనలో చతికిల బడింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 145 పరుగులు మాత్రమే చేసి 13 పరుగుల తేడాతో మ్యాచ్ ని కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సఫారీలకు వరల్డ్ కప్ అందని ద్రాక్షే అన్న సంగతి మరో సారి రుజువైంది. అద్భుతమైన బ్యాటింగ్ తో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచిన నెదర్లాండ్ బ్యాటర్ ఆకెర్మాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

ఉత్కంఠ రేపుతున్న మునుగోడు కౌంటింగ్.. రౌండ్ రౌండ్ కూ మారుతున్న ఆధిక్యత

మునుగోడు ఉఫ ఎన్నిక కౌంటింగ్ ప్రతి రౌండ్ కూడా హార్స్ రేస్ ఫొటో ఫినిష్ లా ఉత్కంఠగా సాగుతోంది. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యత సాధిస్తే, రెండు, మూడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యత కనబరిచింది. మళ్లీ నాలుగు, ఐదు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. ఇలా రౌండ్ రౌండ్ కూ ఫలితం దోబూచులాడుతూ ఉత్కంఠను పెంచేస్తోంది. మొదటి నుంచీ పరిశీలకులు అంచనా వేసినట్లు గ్రామీణ ప్రాంతంలో టీఆర్ఎస్, అర్బన్ ఏరియాల్లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తూ వస్తోంది. బీజేపీకి కాంగ్రెస్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతోందని అంటున్నారు. ఆ పార్టీ ఆశించినట్లుగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు కమలం గూటికి చేరకపోవడం.. అలాగే కాంగ్రెస్ ఓటు పెద్దగా బీజేపీకి అనుకూలంగా టర్న్ కాకపోవడం ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాన్ని బట్టి స్పష్టమౌతోంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ బీజేపీ కంటే 613 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో ఉంది.  టీఆర్‌ఎస్ కు 26,343, బీజేపీ 25,730, కాంగ్రెస్ 8,200, బీఎస్పీ 907ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితం సరళిని బట్టి చూస్తూ ఏ పార్టీ విజయం సాధిస్తుంది అన్నిది చివరి వరకూ తేలే అవకాశం లేదని అంటున్నారు. ఇక ఐదో రౌండ్ ఫలితం వెలువడటంలో జాప్యంపై హై డ్రామా నడిచింది.  టీఆర్ఎస్ కు మెజారిటీ వస్తే తప్ప ఫలితం వెలువరించరా అంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రౌండ్ల వారీ ఫలితాల వెల్లడిలో ఇంత జాప్యం ఎందుకని ప్రశ్నించారు.  ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇది నైతిక ఓటమి అన్నారు. ఇప్పటి వరకూ వెలువడిన రౌండ్ల ఫలితాలను గమనిస్తే బీజేపీ గెలవబోతున్నదని స్పష్టమౌతున్నదన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల స్వగ్రామంలో బీజేపీకి ఆధిక్యత లభించిందన్నారు. అలాగే మంత్రులు ఇన్ చార్జీలుగా ఉన్న ప్రాంతాలలో కూడా బీజేపీ ఆధిక్యత కనబరిచిందని చెప్పారు.  అలాగే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్ లో అనుకున్నంత మెజారిటీ రాలేదని అంగీకరించారు. ప్రస్తతానికి టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉన్నా.. రౌండ్ రౌండ్ కూ ఫలితం మారుతోందనీ, బీజేపీ విజయం తథ్యమనీ అయితే చివరి వరకూ హోరాహోరీ పోరు ఉంటుందని చెప్పారు. 

రాటుదేలిన షర్మిల రాజకీయం.. ప్రతి అడుగులోనూ అన్న జగన్ కు చెక్!

ఏదీ ఏమైనా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు  షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ) పార్టీని స్థాపించి ఆ రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర  ద్వారా సాధించిన గుర్తింపు కంటే.. తెరాస అధినాయకత్వంపై విమర్శలు, కేసీఆర్ కుటుంబ అవినీతిపై చేసి ఫిర్యాదుల ద్వారానే ప్రాచుర్యం పొందారని చెప్పారు. అయితే.. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఆమె ప్రస్థానాన్ని గమనిస్తే ఆమె ప్రతి మాటలోనూ, ప్రతి అడుగులోనే తన తండ్రి రాజశేఖరరెడ్డిని స్ఫురింప చేస్తున్నారన్న చర్చ అయితే రాకీయ వర్గాలలోనూ, జన బాహుల్యంలోనూ జోరుగా సాగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆహార్యాన్ని పుణికి పుచ్చుకోవడమే కాకుండా.. ఆయన ప్రదర్శించిన రాజకీయ చాణక్యాన్ని సైతం ఆమె ప్రదర్శిస్తున్నారన్న భావన ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ వ్యక్తమౌతోంది.   షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొత్త పార్టీ స్థాపించి.. పాదయాత్ర ప్రారంభించడం.. అలాగే రైతులు, నిరుద్యోగుల కోసం దీక్షలు చేపట్టడాన్ని తొలుత అంతా  లైట్‌ తీసుకున్నప్పటికీ, ఇటీవల వైయస్ షర్మిల దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కేసీఆర్ ప్లస్ మెగా కృష్ణారెడ్డిల అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేసి రావడం... ఆ తర్వాత అంటే పక్షం రోజులకే  షర్మిల హస్తినకు పోయి ఇదే అంశంపై ఫిర్యాదు చేయడాన్ని జనం ప్రస్తావిస్తున్నారు. అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగానే వైయస్ వివేకా హత్య కేసులో సీబీఐకి  షర్మిల స్వయంగా వాంగ్మూలం ఇవ్వడంపై  ఆమె ధైర్యాన్ని, చిత్తశుద్ధని, పట్టుదలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. షర్మిల వాంగ్మూలం ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం కానుందని.. ఈ నేపథ్యంలో   జగన్ ఫ్యామిలీలో చోటు చేసుకొన్న పరిణామాలను   చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ షర్మిల తరువాత ఏం చేయబోతోందన్న ఆసక్తి కూడా అందరిలో నెలకొంది. షర్మిల తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి... నమ్మితే ప్రాణాలు ఇస్తారని.. అదే తోక జాడిస్తే మాత్రం కత్తిరించేస్తారని..షర్మిల తీరు కూడా  అచ్చు గుద్దినట్లు.. తండ్రి లాగే ఉందన్న మాట ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తోంది.   జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయకోసం జగనన్న వదిలిన బాణం అంటూ ఆమె పాదయాత్ర చేయడమే కాదు.. బై బై బాబు లాంటి నినాదాలు ఇచ్చిన షర్మిలను ఆ తర్వాత   జగన్.. ముఖ్యమంత్రి అయిన తరువాత ఆమెను దూరం పెట్టడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.  ఇక సొంత బాబాయ్ వివేకా హత్య కేసు దర్యాప్తు నీరు గార్చే ప్రయత్నం సోదరుడు జగన్ చేస్తున్నారన్న విషయంపై   షర్మిల వాంగ్మూలం ఇవ్వడం నిజంగా సాహసమేననీ, అదే సమయంలో వాస్తవాలు వెలికిరావాలన్న ఆమె పట్టుదలకు నిదర్శనమని అంటున్నారు. వైఎస్ వివేకా కేసులో సీబీఐకి షర్మిల వాంగ్మూలం ఇవ్వడం జగన్ గట్టి దెబ్బేనని కడప జిల్లా వాసులు పేర్కొంటున్నారు. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లు.. రాబోయే రోజుల్లో ఈ ఇంటి గుట్టు తాడేపల్లి ప్యాలెస్‌కు చేటు అన్నట్లుగా ఉండవచ్చునని జిల్లా వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మటికి మహానేత రాజకీయ చతురత అని చెబుతున్నారు. దీంతో సోదరుడిని సీఎం పీఠం ఎక్కించడమే కాదు.. అవసరమైతే ఆ పీఠం మీద నుంచి కిందకు దింపడం కూడా..  షర్మిలకు తెలుసుననే గుసగుసలు ఇప్పటికే కడప జిల్లాలో వివవస్తున్నాయి.   మరోవైపు తెలంగాణలో వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైయస్ షర్మిలలోని పోరాట పటిమను.. పట్టుదలను ఈ సందర్భంగా ఆమె తల్లి వైయస్ విజయమ్మ గుర్తు చేసిన విషయాన్ని సైతం ఉమ్మడి కడప జిల్లా వాసులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  గతేడాది జులై 8న వైయస్ఆర్ తెలంగాణ పార్టీని వైయస్ షర్మిల స్థాపించి.. అదే ఏడాది అక్టోబర్ 20వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి వైయస్ షర్మిల తన పాదయాత్రను ప్రారంభించారు. కానీ వైయస్ షర్మిల పాదయాత్రకు ప్రజల్లో మైలేజ్ రావడం లేదని.. ప్రజల్లో ఆమెకు అదరణ కరువైందనే ఓ చర్చ అయితే నిన్న మొన్నటి వరకు తెలంగాణ సమాజంలో కొనసాగింది.  కానీ ప్రస్తుతం వైయస్ షర్మిల పాదయాత్రే కాదు.. ఢిల్లీ యాత్రను సైతం తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం చాలా ఆసక్తిగా గమనిస్తున్నారనే వారు పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా మహానేత తనయగా.. షర్మిల తన రాజకీయాన్ని మరింత పదును పెడుతోందని.. అందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని ఉమ్మడి కడప జిల్లా వాసులు చెబుతున్నారు. అలాగే కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదు నుంచి వైఎస్ వివేకా హత్య కేసులో వాంగ్మూలం వరకూ ఆమె వేస్తున్న అడుగులు జగన్ కు చెక్ పెట్టేవిగా ఉన్నాయని కూడా అంటున్నారు. అన్నిటికీ మించి హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహిస్తున్న టాక్ షోకు ఆమె హాజరు కావడానికి అంగీకరించడం అంటే జగన్ తో అమీతుమీ తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కింగ్ కోహ్లీ కటౌట్ అదిరింది !

రాజు ఒక్కడే ఉంటాడు.. క్రికెట్ లోనూ అంతే.. యుగానికి ఒకడు లా ఈ తరానికి కోహ్లీ యే కింగ్.. సచిన్, ధోనీ, దాదా లు వెనకంజలో పడిపోయారు. ఇప్పటి అత్యాధునిక ధనాధన్ క్రికెట్ కి వీరుడు, కింగ్ అనదగ్గ వాడు కోహ్లీయే అని క్రికెట్ లోకం లక్షనోళ్ల పొగుడుతోంది... ఆరాధిస్తోంది.  అత్యాధునిక రాజుకి, క్రికెట్ భగవాన్ కి నిలువెత్తు.. 36 అడుగుల కటౌట్ తో హైదరాబాద్ వీరాభిమానులూ వీరాభిమానం చాటుకుం టున్నారు.  క్రికెట్ అంటే కోహ్లీ.. కోహ్లీ అంటే వీరబాదుడు.. పరుగుల వరద అంటే అతనితోనే సాధ్యం.  ఆమధ్య కొంత ఫామ్ కోల్పోయా డని నీరసపడిన క్రికెట్ అభిమానులకు మళ్లీ సరిగ్గా టీ20 ప్రపంచకప్ సమయానికి ఫామ్ లోకి తిరిగి వచ్చా సత్తా ప్రదర్శిస్తున్నాడు. టీ20 క్రికెట్ లో కోహ్లీ అత్యధికంగా 1065 పరుగులతో మొదటి స్థానంలో నిలిచాడు. ఇది ఆషా మాషీ వ్యవహారం కాదు. బుధవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 44 బంతుల్లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచి మ్యాచ్ ని గెలిపించడంతో పాటు ఆ రికార్డును నెలకొల్పడం గమనార్హం. జట్టులో రోహిత్ శర్మ, కె ఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ వంటి హేమా హేమీలు ఉండవచ్చుగాక కోహ్లీ రూటే వేరు.. అతని రాక పరుగుల వరద. అతని జోరు పరుగుల హోరు.. ప్రేక్షకుల ఆనంద కెరటం. అదంతే గురూ.. అక్కడ అవతల ఎవరున్నా సరే.. ఇటు మనోడు బ్యాట్ తో రెచ్చిపోవడం ఖాయం అన్న ధీమా జట్టుకే కాదు.. ప్రేక్షకుల్లో ఉండడమే వారి గమనార్హం. ఇంతటి వీరాభిమానం పొందడం గతంలో సచిన్ కి ఆ తర్వాత దాదాకి ఆ తర్వాత ధోనీ కే సాధ్యమయింది. కానీ ఇప్పుడు క్రికెట్ లోకమంతా కోహ్లీ నామస్మరణతోనే గడిచిపోతోంది. అతను క్రికెట్ పిచ్చాడు.. భారీ స్కోర్ చేస్తేనే నిద్రపోతాడు.. అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.  కుటుంబ సభ్యులకు దూరంగా జట్టు సభ్యులతో కలిసి ఉంటున్న కోహ్లీ... తన బర్త్ డే వేడుకలను కూడా జట్టు సభ్యుల మధ్యే జరుపుకున్నాడు. కోహ్లీ బర్త్ డే సందర్భంగా శనివారం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా... టీమిండియా మెంటల్ కండిషనింగ్ ఎక్స్ పర్ట్ ప్యాడీ అప్టాన్ తో కలిసి కోహ్లీ బర్త్ డే కేక్ ను కట్ చేశాడు.  ఇదిలా ఉంటే...బర్త్ డే సందర్భంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో టాలీవుడ్ హీరో స్థాయి ఎలివేషన్ ను కోహ్లీ అందుకున్నాడు. కోహ్లీ బర్త్ డేను పురస్కరించుకుని నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిధిలో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద అతడి 50 అడుగుల ఎత్తున్న కటౌట్ వెలిసింది. క్రికెట్ లో సరికొత్త రికార్డులను లిఖిస్తూ సాగుతున్న కోహ్లీకి మరిచిపోలేని గుర్తుగా హైదరాబాదీ అభిమా నులు ఈ కటౌట్ ను ఆవిష్కరించారు.

సెమీస్ కి ఇంగ్లండ్... ఆసీస్ ఆశలు గల్లంతు

టీ20 ప్రపంచకప్ సూపర్ 12 విభాగంలో శనివారం జరిగిన మ్యాచ్ లో జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ వీరవిహారంతో ఇంగ్లండ్ లంకపై 4 వికెట్ల తేడాతో  గెలిచి సెమీస్ సీటు ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్ విజయంతో టోర్నీ ఆతిథ్య మిస్తున్న ఆసీస్ కు సెమీస్ ఆశలు గల్లంతయినట్టే. లంక 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.  టాస్ గెలిచిన లంక ముందుగా బ్యాట్ చేయడానికి ఆసక్తి చూపింది. మంచి బ్యాటింగ్ ట్రాక్ మీద గౌరవప్రద స్కోర్ చేసి ప్రత్యర్ధిని తన బౌలర్లు, ఫీల్డింగ్ సామర్థ్యంతో నిలువరించవచ్చని కెప్టెన్ దశున్ శంక అనుకున్నాడు.  లంక ఇన్నింగ్స్ లో పథుమ్ నిస్సంక తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించి 45 బంతుల్లో 67 పరుగులు చేయడంలో జట్టుకు భారీ స్కోర్ చేసే అవకాశాలు కల్పించాడు. అలాగే భానుక రాజపాక్స 22 బంతుల్లో 22 పరుగులు చేయడంలో జట్టు స్కోర్ ను పరుగులుపెట్టించాడు. అయితే వారిద్దరు తప్ప మిగతావారెవ్వరూ ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనలేక పోయారు. మార్క్ ఉడ్ 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకోగా, ఆదిల్ రషీద్, సామ్ కురన్, స్టోక్స్ చేరో వికెట్ తీసుకు న్నారు.  గ్రూప్ 1లో ఈ మ్యాచ్ లంకకు అత్యంత కీలకంగానూ మారింది. కానీ భారీ స్కోర్ చేయలేకపోవడంతో ఇంగ్లండ్ ను బౌలర్లు, ఫీల్డింగ్ సామర్ధ్యంతో అడ్డుకోవాలని ప్రయత్నించింది. 142 పరుగుల లక్ష్యంతో దిగిన  ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ వీర బాదుడుతో లంక బౌలర్లు బెంబేలెత్తారు. వారి ధాటికి ఇంగ్లండ్ మొదటి వికెట్ కు 75 పరుగులు లభించాయి. కానీ  ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాటర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 65 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడం లంక ఫీల్డింగ్ ఎంత పకడ్బందీగా, వ్యూహాత్మకంగా చేపట్టింది అర్ధమవుతుంది. ముఖ్యంగా లంక బౌలర్లు వానిందు హసరంగ, ధనంజయ డి సిల్వా, లహిరు కుమార ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను దెబ్బతీయగలిగారు. కానీ బెన్ స్టోక్స్  ఎప్పటిలానే దాడి చేసి జట్టు ఇన్నింగ్స్ ను నిలబెట్టడంలో 36 బంతుల్లో 42 పరుగులు చేశాడు. కానీ అందులో కేవలం రెండే ఫోర్లు ఉన్నాయి. చివరగా క్రిస్ ఓక్స్ కొట్టిన ఫోర్ తో ఇంగ్లండ్ విజయం సాధించింది.  దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ రన్ రేట్ ఆధారంగా సెమీస్ అవకాశాలు కోల్పోయింది. శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్ తో తలపడిన మ్యాచ్ లో గెలచినప్పటికీ రన్ రేట్ లెక్కన చూపినపుడు ఇవాళ ఇంగ్లండ్ రన్ రేట్ బాగా మెరుగ్గా ఉండడం తో ఆస్ట్రేలియా కు సెమీస్ చేరే అవకాశాలు దెబ్బతిన్నాయి.

గోవా వెళ్లండి... రమ్ మిక్స్ టీ  తాగి తూగండి!

టీ అనేక రకాలు.. వాటిలో గ్రీన్ టీ ఆరోగ్యానికి మరీ మంచిది అంటున్నారు. భారీ ప్రచారాలు జరుగుతు న్నాయి. కానీ టీ లో మరేదయినా కలిపితే? ఎప్పుడూ ఒకేలా టీ, కాఫీ తాగడం దేనికి. ఏదో కొత్తదనం ఉండాలనుకునే కుర్రాళ్లకి ఒక రెస్టారెంట్ వారు కొత్తరకం టీ తయారుచేస్తున్నారు. దాని పేరు మాంక్ టీ అంటున్నారు. ఇదేదో ఫారిన్ డ్రింక్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇది పక్కా ఇండియన్ బ్రాండ్ టీ. అవును కాబోతే దీని కోసం గోవా వెళ్లాలి.  ఒక్క కప్పు టీ తాగడానికి గోవా వెళ్లాలా అంటే మరి కొత్తరకం కాంబినేషన్ టీ  సామాన్యమైనది కాదు.. ఓల్డ్ మాంక్ తో కలిసిన టీ. అవును మీరు చదువు తున్నది కరష్టే.  అసలు గోవా అంటేనే సరదాల మయం. గోవా ట్రిప్ అంటేనే కుర్రాళ్లకి, సరదాగా కొద్దిరోజులు గడపాలను కునే టూరిస్టులకు పెద్ద ఎంటర్టైన్మంట్ సెంటర్. అక్కడ అన్నీ తమాషాలే. అన్నీ వింతలే. దానికి ఇప్పుడు కొత్తగా కొత్తరకం టీ ఒకటి యాడ్ అయింది. వింతల్లో వింత కాదు.. మందు మార్బల్యంలో కొత్త సరదా.  గోవా కాండోలిమ్లోని సింకెరిమ్ బీచ్ వద్ద ఒక చిన్న టీ డాబా. ఇప్పుడది పెద్ద అట్రాక్షన్ అయిపోయింది. కారణం ఓల్డ్ మాంక్ టీ. అక్కడ మామూలు టీ, కాఫీ లతొ పాటు ఈకొత్తరకం టీ, కాఫీ లనూ అమ్ము తున్నారు. చిన్న మట్టి పాత్రను కాస్త వేడి చేసి అందులో కొద్దిగా ఓల్డ్ మాంక్ రమ్ పోస్తారు. తర్వాత బాగా కాచిన టీని అందులో కలుపుతారు. తర్వాత మట్టిపాత్రలోని ఈ వింత పానీయాన్ని మరో మట్టిపాత్రలో పోసి దాన్ని తాగడానికి ఇస్తారు. అన్నట్టు ఇదంతా ఒక టీ కప్పు సైజు టీ మాత్రమే ఉంటుంది. కాఫీ లోకూడా అంతే ఒక స్పూన్ ఓల్డ్ మాంక్ రమ్ వేడి కాఫీలో కలుపుతారు. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారుగా.. ఇదో కొత్త పానీయం.. దీన్ని మాంక్ టీ అంటున్నారు. దీన్ని తయారీ కూడా వీడియో తీసి నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.గోవా వెళితే ఇక జనం తప్పకుండా మాంక్ టీ తాగకుండా తిరిగిరారేమో.  

జగన్ కు వ్యతిరేకంగా కేసీఆర్ పీకే వ్యూహాలు?

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను, వైసీపీని బలహీన పర్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక వేస్తున్నారా? కేంద్రంలో అధికార పార్టీ బీజేపీతో తాను విభేదిస్తుంటే.. తమ పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్ర సీఎం జగన్ మాత్రం ఆ బీజేపీతోనే అంటకాగుతుండడం కేసీఆర్ కు ఏమాత్రం నచ్చడం లేదా? అటు నదీ జలాల విషయంలో ఇటు ప్రాజెక్టుల విషయంలో మరో పక్కన విద్యుత్ బకాయిల విషయంలో ఉమ్మడి ఆస్తుల వ్యవహారంలో ఏపీతో ఏదో ఒక సమస్య ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనపర్చాలనే యోచనలో  కేసీఆర్ ఉండి ఉండొచ్చని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దాంతో పాటు కేసీఆర్ ఇటీవలే తమ టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా ప్రకటించారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కనీసం నాలుగు రాష్ట్రాల్లో అయినా పోటీ చేయాల్సి ఉంది. దాంతో పాటు ఆయా రాష్ట్రాల్లో కనీసం 6 శాతం ఓట్లు సంపాదిస్తేనే.. బీఆర్ఎస్ కు జాతీయ పార్టీగా గుర్తింపు వస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పోటీలో దిగాలంటే.. బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టాలి.. లేదంటే దానితో సర్దుబాటు అయినా చేసుకోవాలి. కానీ ప్రస్తుతం 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో వైసీపీ బలంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కు జగన్ ఏమాత్రం చోటిచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం (నవంబర్ 3)  కేసీఆర్ సుదీర్ఘంగా నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర బీజేపీ చేస్తోందని ఆరోపించారు. అదే విధంగా ఏపీ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కూల్చేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అంతకు ముందే.. ప్రసిద్ధ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా గత ఎన్నికల్లో జగన్ పదవీ దాహానికి అనవసరంగా సాయం చేశానని అన్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని అనడం ఎంత మాత్రం కాకతాళీయం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు జగన్ ప్రభుత్వం పతనమయ్యేలా పీకే, కేసీఆర్ ల ఏదైనా ప్రణాళిక రూపొందించారా అన్న అనుమానాలు సైతం వారు వ్యక్తం చేస్తున్నారు.   ఎన్నికల వ్యూహాలు వేసేందుకు ఐప్యాక్ సంస్థను ప్రశాంత్ కిశోర్ ఏర్పాటు చేశారు. అటు కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలో రావడానికి, ఇటు ఢిల్లీలో కేజ్రీవాల్ కు, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ విజయం సాధించడానికి, తమిళనాడులో స్టాలిన్ కు, ఏపీలో జగన్ కు, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు వచ్చేందుకు ఇంతకు మందు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు రచించారు. అయితే.. తాను ఫుల్ టైమ్ రాజకీయ వేత్తగా మారిపోయి.. బీహార్ లో పాదయాత్ర చేస్తున్న క్రమంలో  ఐప్యాక్ కు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ కేసీఆర్- ప్రశాంత్ కిశోర్ మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని పరిశీలకలు చెబుతున్నారు. వీరిద్దరూ కూడా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారే. దాంతో శత్రువకు శత్రువు మిత్రుడంటారు కదా? అలా అన్నమాట.  ప్రశాంత్ కిశోర్ వ్యూహాలతో ఢిల్లీలో చక్రం తిప్పాలని కేసీఆర్ ఉబలాటపడుతున్నారంటున్నారు. దీంట్లో భాగంగానే వారిద్దరూ ప్రగతి భవన్, ఫాంహౌస్ లలో పలు మార్లు భేటీ అయ్యారు. పలు వి  వ్యూహాలు రచించారు. పనిలో పనిగా ఏపీలో జగన్ ను, వైసీపీపి కూడా బలహీనం చేసే వ్యూహం ఏదో రచించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. అందుకే కొద్ది రోజుల వ్యవధిలోనే ఇద్దరి నోటా జగన్ మాట వినిపించిందని విశ్లేషిస్తున్నారు. బీజేపీతో అంటకాగుతున్న జగన్ ను  ఆ పార్టీ నుంచి దూరం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు. బీజేపీకి దూరం కావాలని ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాను జగన్ తిరస్కరించి ఉండొచ్చని, అందుకే పీకే జగన్ కు సహాయం చేసి తప్పు చేశానని వ్యాఖ్యానించారని చెబుతున్నారు.   మొదట్లో కేసీఆర్, జగన్  బీజేపీకి మద్దతుగానే నిలిచారు. పెద్ద నోట్ల రద్దు,  370 ఆర్టికల్ రద్దు, జీఎస్టీ,  ఉమ్మడి పౌరసత్వం, వ్యవసాయ చట్టాలు వంటి మోడీ నిర్ణయాలకు అప్పట్లో పార్లమెంట్ లో బీజేపీకి వైసీపీ, టీఆర్ఎస్ కూడా పూర్తి సహకారం, మద్దతు అందించాయి.   కానీ ఇటీవల జరిగిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీతో టీఆర్ఎస్ విభేదించింది. కానీ.. జగన్ మాత్రం ఇప్పటికీ బీజేపీకి మద్దతు కొనసాగిస్తున్నారు. ఇదే కేసీఆర్ కు నచ్చడం లేదని అంటున్నారు. నిజానికి అన్ని విధాలా తమతో కలిసి వస్తున్న జగన్  సర్కార్ ను కూల్చే అవసరం బీజేపీకి లేదని పరిశీలకులు అంటున్నారు. అయినప్పటికీ.. ఏపీలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కేసీఆర్ చెప్పడం వెనుక ఇరు పార్టీల మధ్యా చిచ్చు రగల్చాలన్న లక్ష్యమే ఉందని అంటున్నారు. మొత్తానికి బీజేపీపైన, ఆ పార్టీ పెద్దల పైన జగన్ లో అనుమానం బీజాలు నాటడం ద్వారా ఇటు కేసీఆర్, అటు ప్రశాంత్ కిశోర్ ఏదో ప్రయోజనాన్ని ఆశిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మోదీజీ...మహిళా శక్తి అంటే ఇదేనా?

పొద్దుటే అమ్మాయి ఇంటికి రాగానే తల్లిదండ్రులు చెప్పాపెట్టక ఇలా వచ్చేసేవేమిటే.. ప్రశ్నల మీద ప్రశ్నలు.. కాఫీ తాగి తీరిగ్గా మా ఆయన తిట్టాడు వచ్చేశానంది అమ్మాయి.. అంతే అల్లుడి ఇంటి మీదకు దండయాత్రకి వెళ్లినట్టు వెళ్లారు. తాడో పేడో తేల్చుకోవాల్సిందేనని పక్కింటివారూ తోడయ్యారు. అం దర్నీ చూసి ఖంగారుపడ్డాడు సదరు అల్లుడుగారు. తినకుండా కూచుంది తిట్టానన్నా డు.. అంతేగదా..అని నవ్వుకున్నారు.  మొన్నామధ్య ఒకతను పెళ్లం మీద కోపగించుకుని ఇంట్లోంచి వెళి పోయాడు. ఆ సంగతి విని అతని తల్లితో పాటు ఊరంతా నవ్వుకుంది. మొగాడివి ఏడుస్తూ వచ్చే డమేమిటని హేళనా చేశారంతా. మగవాడు బాధపడితే ఎందుకు నమ్మరో తెలీదు గాని, ఇటీవలి కాలంలో భార్యాబాధితులు కూడా తయారయ్యారు. కానీ కోర్టు దాకా ఎవరూ వెళ్లరు. పోనీ వెళ్లినా కోర్టంతా బామ్మగారిలా నవ్వుతుంతే.  కర్ణాటక బెంగుళూరుకి చెందిన యదునందన్ అనే వ్యక్తిది దాదాపు ఇదే అవస్థ. అతని బాధలు అంా యింతా కాదట. డబ్బుకి, స్థిరాస్తులకు ఇబ్బంది పెట్టడం కంటే ఎక్కువట.  తిట్టడం, కొట్టడం స్థాయి దాటి ఏకంగా కత్తితో దాడి చేసిందట అతని భార్య. అరచేయి కోసుకుపోయిందిట. రోజూ తనను ఏదో ఒక కారణంతో చిత్రహింసలకు గురిచేస్తోందని వాపోతు న్నాడు. ఎవ్వరూ తనకు మద్దతుగా మాట్లాడలేక పోతున్నారు. అది కుటుంబ సమస్య అని, భార్యాభర్తలు మీరే తేల్చుకోవాలని చెప్పి తప్పించుకుం టున్నారు. ఇదే భార్య మీద చిన్న మాటతో రెచ్చిపోయినా ఊరంతా మీదపడే కాలంలో ఇలాంటి మగవారికి ఏమాత్రం మద్దతు లభించదన్నది యదునందన్ గోడు తెలియజేస్తోంది.   ఇక లాభం లేదని యదునందన్ ఏకంగా ప్రధాని మోదీ కార్యాలయానికి ట్వీట్  చేశాడు.. తనను భార్య నుంచి కాపాడ మని. అసలే దేశ రాజకీయాల్లో తలమునకలయిన ప్రధానికి ఇలాంటి భార్యాబాధితుల గోడు సీరియస్ గా పట్టించుకుంటారా  అను మానమే అంటున్నారు యదునందన్ సంగతి తెలిసినవారు. పైగా తనలాగా ఎందరో భార్యాబాధితులు ఉన్నారని వారిని రక్షించే బాధ్యత తీసుకోవాలన్నాడు. ఆ పురుష పుంగవుడు చేసిన ట్వీట్, పీఎంఓనూ ఆలోచనలో పడవేసిందట. అంతేకాదు,  మీరు చెప్పే నారీ శక్తి అంటే ఇదేనా? అని ఆవేశపడి.. ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి?ఆమెపై గృహహింస కేసు పెట్టవచ్చా? లేదా?అని అమాయకంగా పీఎంఓనే సలహా అడిగాడు.  ఇప్పుడు ఈ ట్వీట్  సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయి, సాటి పురుష పుంగవుల సానుభూతిని టన్నుల కొద్దీ దోచేస్తోంది. ఇక యదునందన్ భావీజీవితం పీఎంఓ తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడిందనాలేమో. అసలే రాజకీ యాలతో సతమతమవుతున్న ప్రధాని, రాజకీయాలకు సంబంధించిన వార్తలు, సమాచారాలతో బిజీగా ఉన్న పీఎంఓ మరి యదునందన్ కు మద్దతునిస్తుందో లేదో చూడాలి.