సుప్రీంలో జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ.. అమరావతి కేసు అత్యవసర విచారణకు నో
posted on Nov 5, 2022 6:18AM
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జగన్ సర్కార్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతే రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్ సత్వర విచారణ కోరగా సుప్రీం కోర్టు నిరాకరించింది. ఏపీ హైకోర్టు మార్చిలో తీర్పు ఇస్తే.. సప్రీం కోర్టులో సెప్టెంబర్ వరకూ సుప్రీంను ఆశ్రయించకుండా.. ఇప్పుడు సత్వర విచారణ అంటారేమిటని నిలదీసింది.
అమరావతినే రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన జగన్ సర్కార్ అమరావతినే రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం వీటిపై సత్వర విచారణ చేయాలని గతంలో ఛీఫ్ జస్టిస్ యూయూ లలిత్ ను కోరింది. అయితే నాట్ బిఫోర్ మీ అంటూ ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
అమరావతి పిటిషన్లను ఏపీ విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్లతో కలిపి విచారణ చేయాలని సీజేఐ ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ ఈ రెండు అంశాలపై ద్విసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. దీంతో ఈ విచారణ ఆలస్యమవుతుందని భావించిన ఏపీ సర్కార్ అత్యవసరంగా దీనిపై విచారణ చేయాలని కోరింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసఫ్ మార్చిలో హైకోర్టు అమరావతిపై తీర్పు ఇస్తే సెప్టెంబర్ లో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు.
అత్యవసర విచారణ విజ్ఞప్తిని సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. అమరావతి పిటిషన్లను అధ్యయనం చేయడానికి కొంత సమయం పడుతుందని న్యాయమూర్తులు అన్నారు తెలిపారు. ఈ దశలో రైతుల తరఫు న్యాయవాది ఫాలీ నారిమన్ బ్రీఫ్ నోట్ ఇస్తామని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం 14న విచారణను వాయిదా వేసింది.