బ్రహ్మం గారు చెప్పని వింత జరిగింది.. కుక్క కడుపున మేక పుట్టింది!
posted on Nov 4, 2022 @ 11:49AM
బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది.. అంటారు. అలాంటి బ్రహ్మంగారు చెప్పని వింతలెన్నో సృష్టిలో జరుగుతున్నాయి. బ్రహ్మంగారు పంది కడుపున ఏనుగు పుడుతుందన్నారు. కానీ కుక్క కడుపున మేక పుట్టింది. అన్నిటికీ సైంటిఫిక్ రీజన్స్ ఉండక పోవచ్చు.. కానీ ప్రాణి పుట్టుకలోని అవకరాలకు మాత్రం కచ్చితంగా జన్యుపరమైన లోపాలేనని అంటుంటారు.
సరిగ్గా అలాంటి వింత జననమే బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో సంభవించింది. ఒక కుక్క అచ్చు మేకపిల్లలా కనిపించే పిల్లకు జన్మనిచ్చింది. దానిని చూసి మేకపిల్లే అనుకుని ఓ వ్యక్తి దానిని తన ఇంటికి తీసుకువెళ్లాడు.
అయితే బిడ్డను వెతుక్కుంటూ కుక్క అతని వెంటే వెళ్లింది. తన పిల్లను నోట కరుచుకుని తీసుకు వెళ్లింది. అసలు కుక్క కడుపున మేక పుట్టడమేంటని అందరూ ఆశ్చర్య పోతున్నారు. జంతు వైద్య నిపుణులు మాత్రం జన్యుపరమైన లోపాలతోనే కుక్క కడుపున మేక రూపు ఉన్న పిల్ల పుట్టి ఉంటుందంటున్నారు.
స్థానికులైతే క్రాస్ బ్రీడింగ్ అయి ఉంటుందన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అచ్చం మేకపిల్లలా ఉన్న కుక్క పిల్లను చూసేందుకు మాత్రం జనాలు తండోపతండాలుగా వస్తున్నారు.