పిన్నెల్లికి ముందస్తు బెయిలుపై సుప్రీంకు వెళతారా?

ఈ ఎమ్మెల్యే చాలా మంచోడు  ముఖ్యమంత్రి జగన్ సర్టిఫికెట్ ఇచ్చిన మాచర్ల ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ  ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే సీరియస్ అయిన ఎన్నికల సంఘం ఆయనపై చర్యలకు ఆదేశించింది. దాదాపు ఏడేళ్లు జైలు శిక్ష పడేలా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసలు ఆయనను అరెస్టు చేయడానికి బయలు దేరారు. హౌస్ అరెస్టులో ఉండగా తప్పించుకు పారిపోతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన ఏపీ పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి మరీ ఆయన కోసం హైదరాబాద్ వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చంద్రంగా ఆయన కారును, అందులోని ఆయన ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆయన మాత్రం తప్పించుకున్నారని చెప్పారు. ఆ తరువాత కూడా అరెస్టు చేస్తామంటూ గంభీర ప్రకటనలు అయితే ఇచ్చారు కానీ, ఆ పని మాత్రం చేయలేకపోయారు. ఈ లోగా నరసరావు పేట కోర్టులో పిన్నెల్లి లొంగిపోతున్నారంటూ వార్తలు. మన పోలీసులేమో పెద్ద సంఖ్యలో కోర్టు వద్ద మోహరింపు. ఈ లోగా పిన్నెల్లి  ఏపీ హైకోర్టును ఆశ్రయించడం, ముందస్తు బెయిలు పొందడం జరిగిపోయాయి. జగనన్న దృష్టిలో చాలా మంచోడు అయిన పిన్నెల్లిపై జూన్ 5వ తేదీ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.   ఇలాంటి మంచోల్లు వైసీపీలో చాలా మంది ఉన్నారు. అంతా తామే చేసి.. ఎదుటివారిపై నెపం నెట్టడంలో సిద్ధహస్తులు. అలాంటి వారి కోవలోకే మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళి వచ్చి చేరారు. అతి మంచివాడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడం తప్పెలా అవుతుందని అమాయకంగా ప్రశ్నిస్తూ, ఈవీఎం ధ్వంసం చేస్తేనేం.. అందులో డేటా భద్రంగా ఉందిగా అంటూ ఓ లాజిక్ ను కూడా తెరమీదకు తెచ్చారు. డేటా భ్రదంగా ఉన్నప్పుడు విలవ లేని ఈవీఎంను ధ్వంసం చేస్తే తప్పేమిటని సమర్ధించారు.  వైసీపీ వాళ్ల సమర్ధింపులు అన్నీ పక్కన పెడితే.. ఎన్నికల నిర్వహణలో, ఎన్నికల అక్రమాలకు పాల్పడిన వారిని నిలువరించడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ఎన్నికల అధికారి, ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పుడు పిన్నెల్లి విషయంలో ఏం చేస్తారు? ఏం చేయగలరు? కనీసం ఆనవాయితీ ప్రకారం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయిస్తారా?  అందరి మనస్సుల్లోనూ తలెత్తుతున్న అనుమానాలు, సందేహాలు ఇవే. పిన్నెల్లికి జూన్ 5 వరకూ ముందస్తు బెయిలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులను సుప్రీం కోర్టులో సవాల్ చేయడం సహజం. విధాయకం కూడా. గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ చేసిన పని ఇదే.  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రఘురామకృష్ణంరాజు కేసులతోపాటు.. రాజధాని కేసులు, సీఐడీ కేసుల్లో హైకోర్టులో దెబ్బతిన్న ప్రతిసారీ జగన్ సర్కార్ సుప్రీం తలుపు తట్టింది.  అంతెందుకు  సీనియర్ ఐపిఎస్, డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై విధించిన సస్పెన్షన్ చెల్లదు  తిరిగి విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఆదేశంపై కూడా హైకోర్టును ఆశ్రయించింది. అంతకుముందు ఒకసారి హైకోర్టు, ఇంకోసారి సుప్రీంకోర్టు కూడా ఏబీకి అనుకూలంగా తీర్పులిచ్చాయి.  ఇప్పుడు సీఎస్ జవహర్‌రెడ్డి..సీఈసీ చెప్పినట్లు, ఈవీఎం పగులకొట్టి సిగ్గుమాలిన పనిచేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి.. బెయిల్ ఇచ్చిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారా?  లేదా జగన్ పై భక్తిని చాటుకుంటూ ఆయనే మంచోడని సర్టిఫికెట్ ఇచ్చారు కదా.. ఇక సుప్రీంకు ఎందుకులే అని ఊరుకుంటారా చూడాలి. 

ఎవరెస్ట్ మీద టీడీపీ పతాకం రెపరెప!

ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పతాకం రెపరెపలాడనుంది. దీనికి సింబాలిక్‌గా టీడీపీ ఫ్లాగ్ గ్రేట్ ఎవరెస్ట్ శిఖరం మీద రెపరెపలాడింది. అనంతపురం జిల్లాకి చెందిన మత్స్యకార కుటుంబానికి చెందిన ఉపేంద్ర ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాడు. ఎవరెస్ట్ శిఖరం అంచులకు చేరుకున్న తర్వాత ఆయన అక్కడ మన భారత జాతీయ పతాకాన్ని ఎగరేశాడు. ఆ తర్వాత తెలుగుజాతి పతాకం అయిన తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేశారు. ఈ ఫొటోలను టీడీపీ అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తమ ఎక్స్ అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఎంతో పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఉపేంద్ర నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. తెలుగుదేశం పతాకం ఎవరెస్ట్ శిఖరం మీద రెపరెపలాడటం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో చాలాసార్లు తెలుగుదేశం పతాకం ఎవరెస్ట్ శిఖరం మీద రెపరెపలాడింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు యువకులు భారత జాతీయ పతాకం తర్వాత తెలుగుదేశం పతాకాన్నే ఎగురవేస్తూ వచ్చారు. తెలుగుజాతి గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలిపింది, తెలుగుజాతికి జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థాయిని ఏర్పరచింది ఎన్టీఆర్ అయితే, ఆ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్నికల సమరంలో జయాపజయాలు సాధారణం. అయితే తెలుగు కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేయడంలోగానీ, యువతకు అత్యుత్తమమైన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో గానీ చంద్రబాబు చేసిన కృషిని ఎవరూ విస్మరించరు. ముఖ్యంగా తెలుగు యువతరం పురోగతిని ఒక పెద్ద మలుపు తిప్పిన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచారు. ఆ గౌరవంతోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు యువతీ యువకులు అక్కడ టీడీపీ పతాకాన్ని కూడా ఎగరేస్తూ వుంటారు. అయితే, ఇప్పుడు అనంతపురానికి చెందిన మత్యకార యువకుడు ఉపేంద్ర ఎవరెస్ట్ మీద టీడీపీ పతాకాన్ని ఎగురవేయడం అనేది ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. యావత్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళలో, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రాబోతోందని అందరిలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్న వేళలో... ఎవరెస్ట్ శిఖరం మీద మరోసారి తెలుగుదేశం పతాకం రెపరెపలాడటం ఒక శుభసూచకంగా భావించవచ్చు. ఎవరెస్ట్ శిఖరం మీద టీడీపీ పతాకం రెపరెపలాడించిన అనంతరం ఉపేంద్ర ఆక్సిజన్ మాస్క్ పెట్టుకునే మాట్లాడారు. తనకు ఎవరెస్ట్ ఎక్కే అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థాంక్యూ సోమచ్ అని ఉపేంద్ర అన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

విదేశాలలో సేదతీరుతున్న నాయకులు.. అద్వానంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. హోరాహోరీ ప్రచార యుద్ధం ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత చెలరేగిన హింసాకాండతో రాష్ట్రం అట్టుడికిపోయింది. ఆ ఉద్రిక్తతలు ఇప్పటికీ చల్లారలేదు. అయితే నెలల తరబడి ప్రచార పర్వంలో నిర్విరామంగా తిరిగిన పార్టీల నేతలు విశ్రాంతి మూడ్ లోకి వెళ్లి విదేశీ పర్యటనలలో సేదతీరుతున్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం వేసవి వేడి ఒకింత చల్లబడినా, ఎన్నికల హింస మాత్రం రోహిణీకార్తె ఎండలను మించిపోయింది,   ఇక నేతల విదేశీ పర్యటనల విషయానికి వస్తే కోర్టు అనుమతి తీసుకుని మరీ ఈ నెల 17న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సమేతంగా  ఐరోపా పర్యటనకు వెళ్లారు.  వారంపాటు ప్రముఖ దేవాలయాలు సందర్శించి తరువాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు అమెరికా వెళ్లారు.ఆయన ఆరోగ్య పరిక్షలు చేయించుకోవడంతో పాటు అక్కడ ఒకింత విరామం తీసుకుని రిలాక్స్ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  జనసేన సేనాని పవన్ కళ్యాణ్ కూడా రష్యా పర్యటనకు వెళ్లారు.  లోకేష్ కూడా అమెరికాలోనే ఉన్నారు. ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా అమెరికా పర్యటనకు వెళ్లారు.  పార్టీ అధినేతల బాటలో ఇతర నాయకులు  పలువురు కూడా  విదేశీయానం చేస్తున్నారు.  పోలింగ్ పూర్తయిన తరువాత ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాల ప్రకటనకు మధ్య 22 రోజులు గడువు ఉండడంతో నాయకులు రిలాక్సేషన్ కోసం విదేశీ  పర్యటనలకు వెళ్లారు. అయితే నేతల విదేశీ పర్యటనలపై సీపీఐ నారాయణ విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఎన్నికల అనంతర హింసతో  అట్టుడుకుతుంటే నాయకులు విశ్రాంతి అంటూ విదేశాలకు వెళ్లడమేంటని నిలదీశారు.   ఇక అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. ఆ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఎన్నికల కమిషన్ పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సందర్భంగా జరిగిన హింస ట్రయల్ మాత్రమేననీ, ఓట్ల లెక్కింపు సందర్భంగా మరింత హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందనీ ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అదనపు బలగాలను కౌంటింగ్ అయిన తరువాత కూడా పక్షం రోజుల పాటు రాష్ట్రంలో ఉంచాలని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ సందర్భంగా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అయినా కూడా ప్రజలలో మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది. 

చీరాల, దర్శిలో కూటమి విజయంపైనే భారీగా పందేలు.. వైసీపీ ఆశలొదిలేసుకున్నట్లేనా?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో పందెం రాయుళ్ల దృష్టంతా రెండు నియోజకవర్గాలపైనే ఉంది. దర్శి, చీరాల నియోజకవర్గాలలో వైసీపీదే పై చేయి అని ముందు నుంచీ ఒక భావన ఉంది. పోలింగ్ పూర్తి అయిన తరువాత నుంచీ ఈ నియోజవర్గాల ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని మిగిలిన పది నియోజకవర్గాలపై కంటే ఈ రెండు నియోజకవర్గాలలోనే గెలుపు గుర్రం ఏదన్నదానిపై పందెంరాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు.  ఈ రెండు నియోజకవర్గాలలోనూ కూడా వైసీపీకి విజయావకాశాలు ఉన్నాయని ముందు నుంచి పరిశీలకులు విశ్లేషణలు చేస్తూ వచ్చారు. దర్శి నియోజవర్గం విషయానికి వస్తే.. వైసీపీ ఇక్కడ చాలా ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసేసింది. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డిని ప్రకటించింది. నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్న శివప్రసాద్ రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించేనాటికి  ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ చార్జ్ కూడా లేడు. అంతే కాదు ఈ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.  దీంతో దర్శిలో వైసీపీ విజయం నల్లేరు మీద బండి నడకేనని అంతా భావించారు.  అయితే అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి. జనసేనకు కేటాయించిన దర్శి నియోజకవర్గంలో అనూహ్యంగా తెలుగుదేశం అభ్యర్థిని ప్రకటించింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ లక్ష్మి పోటీలోకి దిగారు.  ఈ మార్పు టీడీపీకి నియోజకవర్గంలో సానుకూల వాతావరణం ఏర్పడడానికి దోహదపడింది. అంతే కాకుండా తెలుగుదేశం, జనసేన శ్రేణులు సమైక్యంగా లక్ష్మి విజయం కోసం పని చేశారు.  దీంతో దర్శి నియోజకవర్గ సీన్ ఒక్క సారిగా మారిపోయింది. పోలింగ్ రోజుల తెలుగుదేశం కూటమి అభ్యర్థి జోరు స్పష్టంగా కనిపించింది.  అది నియోజకవర్గంలో గెలుపు ఓటములపై పందేలు ఒడ్డే పందెం రాయుళ్లు తొలుత భారీగా వైసీపీ విజయంపై బెట్టింగులు వేశారు. అయితే  పోలింగ్ తరువాత నుంచి ట్రెండ్ మారింది. ఇప్పుడు శివప్రసాద్ రెడ్డి గెలుస్తారంటూ పందెం ఒడ్డే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అదే సమయంలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి విజయం సాధిస్తారంటూ పందెం రాయుళ్లు పెద్ద మొత్తంలో పందేలు కాస్తున్నారు.  ఆరంభంలో వైసీపీ గెలుపుపై రూపాయికి రూపాయన్నర వరకూ పందేలు కాసిన వారు ఇప్పుడు రూపాయికి రూపాయి అని కాయడానికి కూడా వెనుకాడుతున్నారు. అదే విధంగా ఆరంభంలో వైసీపీ అభ్యర్థి పదివేల మెజారిటీ సాధిస్తారంటూ పందేం ఒడ్డడానికి సిద్ధపడిన వారు ఇప్పుడు కలికానిక్కూడా కనిపించడం లేదు.   మరో వైపు తెలుగుదేశం అభ్యర్థి విజయంపై పందెం రాయుళ్లు బెట్టింగులకు రెడీ అవుతున్నారు. అంతే కాదు మండలాలవారీగా ఆధిక్యతలపై కూడా పందేలు ఒడ్డుతున్నారు. ఇక చీరాల విషయానికి వస్తే.. పోలింగ్ కు ముందు వరకూ కూడా ఈ నియోజకవర్గం వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయమన్న అభిప్రాయం ఉండేది. అయితే ఎప్పుడైతే సీనియర్ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారో అప్పటి నుంచీ చిరాలలో వైసీపీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి విజయంపై పెద్ద ఎత్తున పందెం ఒడ్డేందుకు పందెం రాయుళ్లు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి ఆమంచి పోటీలో ఉండటంతో వైసీపీ ఓట్లు భారీగా చీలిపోయాయని అంటున్నారు. అంతే కాకుండా ఇక్కడ నుంచి తెలుగుదేశం బీసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించడం, అదే సమయంలో వైసీపీలో గ్రూపు తగాదాలు కూటమికి మొగ్గు రావడానికి దోహదపడిందని చెబుతున్నారు.  

తీవ్ర ఆందోళన వల్లే నానికి అస్వస్థత!.. తేల్చేసిన వైద్యులు?

గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు శుక్రవారం కొద్ది సేపు హల్ చల్ చేశాయి. అయితే ఆ తరువాత తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ నాని కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది పక్కన పెడితే  కొడాలి నానికి ఇంతకు ముందు నుంచీ కూడా ఆరోగ్య సమస్యలు  ఉన్న సంగతి తెలిసిందే. దాంతోనే కొడాలి నానికి తీవ్ర అస్వస్థత అనగానే అందరూ నమ్మారు. సరే తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ కొడాలి నాని ఆ వార్తలకు చెక్ పెట్టారు అది వేరే సంగతి.. కానీ విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు కొడాలి నాని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులూ అక్కడే ఉన్నారు. శుక్రవారం( మే 23) కొడాలి నాని ఒక్కరే హైదరాబాద్ నుంచి గుడివాడ వచ్చారు. తన నివాసంలో నియోజకవర్గ పార్టీ నేతలతో మాట్లాడుతూ ఒక్కసారిగా స్ఫృహ కోల్పోయారు. వెంటనే తేరుకున్నారు. వైద్యులు వచ్చి పరీక్షలు చేశారు. చాలా నీరసంగా ఉన్నారంటూ సెలైన్ కూడా పెట్టారు.  ఇంతకీ నాని ఒక్కసారిగా స్ఫృహ కోల్పోయి, అస్వస్థతకు గురి కావడానికి కారణమేంటి? అంటే వైద్యులు చెప్పిన దానిని బట్టి ఆయన తీవ్ర మానసిక వేదనలో ఉన్నారట. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారట. అది మానుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారట. ఇంతకీ ఆయన అంతగా ఆలోచిస్తున్నది దేని గురించి? ఆరోగ్యం చెడిపోయేంతగా ఆయన మానసికంగా ఎందుకు వేదన పడుతున్నారు? పరిశీలకులే కాదు.. ఆయన సన్నిహితులు, పార్టీ శ్రేణులూ సైతం కొడాలి నాని ఎన్నికల గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నారనీ, విజయంపై అనుమానంతోనే తీవ్ర మానసిక వేదనకు గురౌతున్నారనీ అంటున్నారు.  కాగా ఆ విషయాన్ని జనం కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే చీటికీమాటికీ, అవసరం ఉన్నా లేకున్నా, సందర్భం అయినా అసందర్భమైనా కొడాలి నాని ఎప్పుడూ తెలుగుదేశంపైనా, ఆ పార్టీ అధినేతపైనా, అలాగే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పైనా తనకు మాత్రమే ప్రత్యేకమైన అనుచిత భాషలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి కొడాలి నాని ఎన్నికలు పూర్తయిన నాటి నుంచీ నోట మాట లేకుండా మౌనంగా ఉండిపోయారు. దీంతో ఆయన గుడివాడలో మరో సారి విజయం సాధించే అవకాశాలు లేవా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. పార్టీ శ్రేణులే ఈ సారి గుడివాడలో వైసీపీ విజయం సాధించే అవకాశాలు దాదాపు మృగ్యం అన్న నిర్ణయానికి వచ్చేశారు. దీంతో గుడివాడ నాని అస్వస్థతకు కారణం తీవ్రంగా ఆలోచించడం, మానసిక ఆందోళన అన్న వైద్యుల మాటలు వాస్తవమేనని అంటున్నారు. ఇలా ఉండగా కొడాలి నానిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకువెళ్లే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఆయనను ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయించాలని భావిస్తున్నారనీ..కొద్ది కాలం పాటు గుడివాడకు దూరంగా ఉంచాలని అనుకుంటున్నారని చెబుతున్నారు.  

పిన్నెల్లికి హైకోర్టులో ఊరట

మాచర్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయన హైకోర్టులో శుక్రవారం (మే23) ముందస్తు బెయిలు కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.  ఆ పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అనంతరం హైకోర్టు జూన్ 6వ తేదీవరకూ పిన్నెల్లిపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో జూన్ 6 ఉదయం పది గంటల వరకూ మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.  పిన్నెల్లి సహా వివిధ కేసులు ఎదుర్కొంటున్న అసెంబ్లీ అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు విచారించింది. తాడిపత్రి తెలుగుదేశం అభ్యర్థి అస్మిత్ రెడ్డిని కూడా జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశించింది. కాగా, కోర్టు ఆదేశాల నేపథ్యంలో, పిన్నెల్లి   న్యాయం గెలిచింది అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టారు.

నాగార్జునకొండ కట్టడాలను సందర్శించిన టిబెట్ బౌద్ధ భిక్షువులు

శ్రీ పర్వత విజయపురి చరిత్రను వివరించిన శివనాగిరెడ్డి నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్యాంకులో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం వద్ద జరిగిన 2568వ బుద్ధ జయంతి వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న టిబెటన్ బౌద్ధ భిక్షువులు (విజయపురి సౌత్) అనుపు వద్దగల బౌద్ధ కట్టడాలను సందర్శించారని బుద్ధవనం కన్సల్టెంట్ మరియు ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం (మే23) బుద్ధ వనంలో బుద్ధ జయంతి సందర్భంగా మహాయాన సాంప్రదాయ ప్రకారం బుద్ధ వందనం కార్యక్రమం తర్వాత, ఆచార్య నాగార్జునుడు నడియాడిన శ్రీ పర్వత విజయపురి పరమ పవిత్ర స్థావరమని, బుద్ధునికి, ఆచార్య నాగార్జునకి, అనుపు బౌద్ధారామం వద్ద బౌద్ధ భిక్షువులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైసూరు సమీపంలోని బైలుకుప్పేలోని సెరా టిబెటన్ బౌద్ధారామానికి చెందిన గేషే నవాంగ్ జుంగ్నె మరియూ జంపాకుంగ అనే బౌద్ధ భిక్షులకు, నాగార్జునకొండలో తిరుగాడిన ఆచార్య నాగార్జునడు, శ్రీ పర్వత విజయపురిలో విలసిల్లిన ఇక్ష్వాకుల కాలం (క్రీ.శ. 3వ శతాబ్దం) నాటి బౌద్ధ చరిత్ర, కట్టడాలు, శిల్పాలు, శాసనాలు, స్తూపాలు, చైత్యాలు, విహారాల గురించి శివనాగిరెడ్డి వివరించగా వారు ఆసక్తికరంగా విన్నారు.  బుద్ధ జయంతి రోజున నాగార్జునకొండ బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, మహాయాన సిద్ధాంతకర్త, మాధ్యమిక, శూన్య వాదాలను స్థిరీకరించిన ఆచార్య నాగార్జునుడు తమకు అత్యంత గౌరవనీయుడని వారు చెప్పారని శివనాగిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కి చెందిన వెంకటేశ్వర్లు, స్థానిక బౌద్ధాభిమానులు గ్రంధి రామకృష్ణ, నాగార్జున పాల్గొన్నారు. బౌద్ధ కట్టడాలను శ్రద్ధతో పరిరక్షిస్తున్న  కమలహాసన్ ను వారు అభినందించారు.

చత్తీస్ గడ్ నారాయణపూర్ లో భారీ ఎన్ కౌంటర్ , 7గురు నక్సల్స్ దుర్మరణం 

చత్తీస్ గడ్ లోని  నారాయణ పూర్  భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగిన తర్వాత కొందరు పారిపోయినట్టు సమాచారం.    ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గత రెండు నెలల వ్యవధిలో ఛత్తీస్ గఢ్ లో జరిగిన మూడో ఎన్ కౌంటర్ ఇది. ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారు. 12 మందికి పైగా మావోయిస్టులు గాయపడినట్టు తెలుస్తోంది.  పోలీసులు, మావోయిస్టులకు ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ మధ్య కాలంలో మావోయిస్టులను పోలీసులు మట్టుపెడుతున్నారు. ఇటీవలే కొంతమంది లొంగిపోయారు.దండకారణ్యంలో మావోయిస్టులు కీలక సమావేశం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. దంతేవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా, మావోలు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా దీటుగా స్పందించి ఎదురు కాల్పులతో బదులిచ్చాయి. ఉదయం మొదలైన ఈ ఎన్ కౌంటర్ ఇప్పటికీ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.  కాగా, పారిపోయే ప్రయత్నంలో ఉన్న పలువురు మావోయిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

ముద్దు పెట్టినందుకు బాదేశారు!

అంగరంగ వైభవంగా పెళ్ళి జరుగుతోంది. వేదిక మీద వున్న వధూవరులు చిలకాగోరింకల మాదిరిగా చూడముచ్చటగా వున్నారు. వాతావరణం అంతా సందడిగా వుంది. పెళ్ళికూతురు తరఫు వాళ్ళు భారీ స్థాయిలో పెళ్ళి ఏర్పాట్లు చేశారు. పెళ్ళికొడుకు తరఫు వాళ్ళకు అన్ని రకాల మర్యాదలూ చేస్తున్నారు. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. పెళ్ళి కూతురు బుగ్గ మీద అతను ముద్దు పెట్టాడు. అది చూసిన ఆడపెళ్ళివారికి ఆగ్రహం ముంచుకొచ్చింది. పెళ్ళికూతురికి ముద్దు పెట్టడానికి నువ్వెవడ్రా అంటూ పెళ్ళికూతురికి ముద్దుపెట్టిన వ్యక్తిని చావబాదారు. దాంతో అతను లబోదిబో, కుయ్యోమొర్రో అన్నాడు.. ఇంతకీ పెళ్ళికూతురికి ముద్దుపెట్టింది ఎవరో దారినపోయే దానయ్య కాదు.. సాక్షాత్తూ పెళ్ళికొడుకే. ఇవాళా రేపు పెళ్ళి వేదికల మీద పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ముద్దు పెట్టుకోవడం మామూలు విషయమే.. పాపం పెళ్ళికొడుకు కూడా అదే పని చేశాడు. దాంతో పెళ్ళికూతురు తరఫు వాళ్ళ చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. పెళ్ళికొడుకుని అలా కొట్టినందుకు అతని తరఫు వాళ్ళు రెచ్చిపోయారు. పెళ్ళికూతురు ఫ్యామిలీవాళ్ళని కూడా తుక్కుతుక్కుగా ఇరగొట్టేశారు. వీళ్ళు కూడా తిరగబడ్డారు. దాంతో రెండు వర్గాల వాళ్ళూ విరగబాదుకుంటూ పెళ్ళికి వచ్చిన జనం మీద పడ్డారు. పెళ్ళికి వచ్చిన జనం ఇదేంట్రా కొత్తరకం గొడవ అనుకుంటూ పరుగులు తీసి, తినడానికి సిద్ధంగా వున్న ఆహార పదార్థాల మీద పడ్డారు. దాంతో కంగాళీ, గందరగోళం, సర్వనాశనం..  ఈ సందర్భంగా జరిగిన తన్నులాటలో మొత్తం ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళలో పెళ్ళికూతురు తండ్రి కూడా వున్నాడు. గాయపడినవాళ్ళందరూ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. వీళ్ళలో ఒక వికెట్ అయినా లేచే అవకాశం వుందని అంటున్నారు. తన్నుకునే శక్తి తగ్గిపోయిన తర్వాత రెండు వర్గాలూ మాటల యుద్దం ప్రారంభించాయి. పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకు ముద్దుపెట్టుకుంటే తప్పేంటయ్యా అని వీళ్ళు అంటే, మా అమ్మాయిని అందరి ముందూ ముద్దు పెట్టుకుంటే మేం ఊరుకోం అని వాళ్ళు అన్నారు. చివరికి పెళ్ళికొడుకు అసలు విషయం బయటపెట్టాడు. పెళ్ళికూతురు ముద్దు పెట్టుకోమంటేనే ఈ అందగాడు ముద్దు పెట్టుకున్నాడట. అలా ఒక్క ముద్దు పెట్టిన పాపానికి వంద గుద్దులు తినాల్సి వచ్చింది. అసలు విషయం తెలిసి అందరూ నోళ్ళు తెరిచారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపూర్‌లో జరిగింది.

 ముందస్తు బెయిల్ కోసం హైకోర్టునాశ్రయించిన పిన్నెల్లి

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల పోలింగ్‌ స్టేషన్‌లో ఈవీఎం యంత్రాలను  ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , అతడి సోదరుడి కోసం రెండు రాష్ట్రాల పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటికే పిన్నెల్లిని ఏ1గా ఎఫ్ఐఆర్ ‎లో చేర్చారు. ఐపీలోని143, 147, 448, 427, 353, 452, 120బి, తోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టం, ఆర్పీ చట్టం 131, 135లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలోనే పిన్నెల్లిని అరెస్ట్ చేయనున్నట్టు సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.మరోవైపు నరసారావుపేట కోర్టులో లొంగిపోనున్నారనే వార్తలు వినిపించిన కొద్ది సేపటికే తాజాగా ఏపీ హైకోర్టు లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున పిటిషన్ దాఖలు అయింది. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హై కోర్టులో విచారణ జరుగనుంది.

ఫలితాల్లో ఫస్ట్ ఓటమి రోజాదే!

వైసీపీ నాయకురాలు రోజాకి ‘ఐరన్ లెగ్’ అనే బిరుదు మొట్టమొదటిసారి ఎవరు ఇచ్చారోగానీ, ఆ ఇచ్చినోడి నాలుక మీద మచ్చలు వుండే వుంటయ్ నో డౌట్. ఎందుకంటే, ఆ మాట ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూ వస్తోంది. రోజా రెండుసార్లు ఎమ్మెల్యే అయినా, మంత్రి పదవిలోకి వచ్చినా సదరు ‘ఐరన్ లెగ్’ అనే మాట మాత్రం ఆమె జీవితంలో నుంచి తొలగిపోవడం లేదు. నగరి నియోజకవర్గం నుంచి హాట్రిక్ సాధించడానికి ప్రయత్నిస్తున్న రోజా ఈ సారి తుక్కుతుక్కుగా ఓడిపోవడం ఖాయమనే విషయంలో పోలింగ్ రోజు క్లారిటీ వచ్చేసింది. తనను ఓడించడానికి తన పార్టీ నాయకులే పనిచేస్తున్నారని రోజా బాహాటంగా చెప్పుకుని లబోదిబో అనడం గురించి అందరికీ తెలిసిందే. దీన్నిబట్టి ఏంటంటే, నగరిలో రోజా ఓడిపోవడం ఖాయం. ఓడిపోవడం మాత్రమే కాదు.. ఫలితాలలో మొదటగా వచ్చే ఫలితం నగరిదే.. అంటే, వైసీపీకి ఓటమి బోణీ కొట్టేది రోజా నియోజకవర్గమేనన్నమాట.. పాపం వైసీపీ, అయ్యో పాపం రోజా! ఎన్నికల ఫలితాలలో మొదటి ఫలితం తనదే అయ్యే అదృష్ణం రోజాకి ఎందుకు పట్టిందంటే, నగరి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య తక్కువ. ఇక్కడ మొత్తం 2,02,574 మంది ఓటర్లు వున్నారు. పోలింగ్ బూత్‌ల సంఖ్య కూడా తక్కువ (231). అలాగే పోటీలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య కూడా తక్కువే. ఇక్కడ కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే రంగంలో వున్నారు. సంఖ్యాపరంగా అన్నిరకాలుగా తక్కువలో వున్న నగరి నియోజకవర్గం రోజాకి, వైసీపీకి మొదటి షాక్ ఇవ్వబోతోంది.

బుద్ద వనంలో ఘనంగా బౌద్జ జయంతి ఉత్సవాలు

ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన   గౌతమ బుద్దుడు గొప్ప దార్శనికుడని , ఆయన చూపిన అష్టాంగ మార్గం ఆచరణీయమని తెలంగాణ పర్యాటకాభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె. రమేష్ నాయుడు అన్నారు. బుద్దవనంలో టీజీటీఎస్ సీ నిర్వహించిన 2568వ బుద్ద జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. కర్ణాటక రాష్ట్రంలోని బైలు కుప్పె, సెరా బౌద్దారామం  నుంచి వచ్చిన గెషెనవాంగ్ జుంగే , సికింద్రాబాద్ మత బోధి బుద్ద విహార నుంచి వచ్చిన శీలం ల నేతృత్వంలో  బుద్ద పాదాల వద్ద బుద్ద పాదాభినందనం, ఆచార్య నాగార్జున కాస్య శిల్పం వద్ద పుష్ప నివాళి అర్పించారు.  అనంతరం మహా స్థూప సమావేశమందిరంలో  బుద్దవనంతో ప్రారంభమైన బుద్ద జయంతి ఉత్సవ సభకు, రమేష్ నాయుడు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథులుగా హాజరైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయ చరిత్ర విభాగ పూర్వ అధ్యక్షులు, చరిత్ర కారిణి, ఆచార్య అలోకాపరాషెర్ సీకు, బౌద్దంలో స్నేహం, శాతావాహన  విశ్వ విద్యాలయ మాజీ వైస్ చాన్సలర్ ఆచార్య మల్లేష్ సంకశాల బౌద్దంలో సామాజికత అన్న అంశాలపై ప్రసంగించారు. బుద్దవనం కన్సల్టెంట్  డాక్టర్ శివనాగిరెడ్డి రచించిన బుద్ధుని మొదటి ప్రవచనం, బుద్దుని  చివరి రోజులు పుస్తకాలను విషిష్ట అతిథులు ఆవిష్కరించగా బుద్ధవనంపై జరిగిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు రమేష్ నాయుడు బహుమలులను అందించారు. ,బుద్ద వన ఓయస్డీ సుదర్శన్ రెడ్డి,  టీజీటీసి, ఎగ్జిక్యూటివ్   డైరెక్టర్  ఉపేందర్ రెడ్డి, హోటల్స్ జీఎం,  నాగార్జున సాగర్   యూనిట్ మేనేజర్  , అధి సంఖ్యలో  బౌద్దులు  ఉత్సవాల్లో  పాల్గొన్నారు.

దేవుడా... కొడాలి నాని బతకాలి!

మేక ఆకులు నమిలినట్టు నాన్‌స్టాప్‌గా గుట్కా నమలటం, చీకటి పడిన దగ్గర్నుంచి నుంచి అర్ధరాత్రి దాటే వరకు  పీకల్దాకా తాగడం. నిద్ర లేచిన దగ్గర్నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు ఎవరో ఒకర్ని తిడుతూ వుండటం.... ఇదీ కొడాలి నాని దినచర్య. మరి ఇలాంటి లైఫ్ స్టైల్ వుంటే ఏమవుతుంది? ఎప్పుడో ఒకసారి సడెన్‌గా ఫ్యూజ్ కొట్టేస్తుంది. ప్రస్తుతం కొడాలి నాని ఫ్యూజ్ ఉండనా, కొట్టేయనా అన్నట్టుగా వుందని సమాచారం. గుడివాడలో గురువారం ఉదయం తన పార్టీ నాయకులతో మాట్లాడుతున్న నాని అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, ఆయనకు వైద్యులు చికిత్స అందించడం గురించి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా వుందనే సమాచారం లేదు. సకల కళా వల్లభుడైన కొడాలి నాని ఆరోగ్యం పాతాళానికి చేరుకుందని మాత్రం తెలుస్తోంది. కొడాలి నాని తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘దేవుడా... కొడాలి నాని బతకాలి.. ఆయన మళ్ళీ మామూలు మనిషిలా అందరిలో తిరగాలి’’ అని పార్టీ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు. వాళ్ళ ప్రార్థనలు ఫలించి, దేవుడు కరుణించి కొడాలి నాని పూర్తిగా కోలుకుంటారని ఆశిద్దాం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఆయన కోలుకోవాలని కోరుకుంటున్న వాళ్ళు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కాదు.... టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. అదేంటీ అనుకుంటున్నారా... అదే కొడాలి నాని విలన్‌గా ‘రంగస్థలం-2’. ‘రంగస్థలం’ సినిమా చూసిన వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏమిటంటే, సినిమా మొదట్లో విలన్‌ని ఎవరో చంపబోతుంటే హీరో కాపాడతాడు. ఎందుకు కాపాడతాడంటే, దుర్మార్గుడైన విలన్‌కి ఎవరో శిక్ష విధించకూడదు.. తానే శిక్ష విధించాలి. అందుకోసమే కాపాడాడు. అలాగే, కొడాలి నాని విలన్ అయిన పొలిటికల్ ‘రంగస్థలం-2’ ప్రకారం, ఇప్పుడు కొడాలి నానికి ఏమైనా అయితే, ఆయన చేసిన పాపాలన్నిటికీ శిక్ష ఎలా అనుభవిస్తాడు? అందుకే, ఆయన బతికుండాలి, గుడివాడ నియోజకవర్గంలో తన ఓటమిని స్వీకరించాలి. ఆ తర్వాత ఆయన చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలి. అప్పటి వరకూ ఆయన క్షేమంగా వుండాలి. 

ముస్లిం రిజర్వేషన్ చట్ట విరుద్ధం హైకోర్టు సంచలన తీర్పు!

ముస్లిం ఉప కులాలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని ధర్మాసనం తెలిపింది. ముస్లిం సమాజాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వస్తువుగా పరిగణిస్తున్నారని జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి, జస్టిస్‌ రాజశేఖర్‌ మంథా ధర్మాసనం తెలిపింది. అయితే, ఇప్పటికే ఈ విధమైన రిజర్వేషన్లు పొందినవారు, ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసులకు ఎంపికైనవారికి తమ తీర్పు వర్తించదనీ.. వారు ఉద్యోగాల్లో యథావిధిగా కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.  2010 సంవత్సరం తర్వాత నుంచి జారీ చేసిన ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత 14 ఏళ్ళ‌ వ్యవధిలో జారీ అయిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లన్నీ రద్దయ్యాయి.  అయితే, ఓబీసీ సర్టిఫికెట్లను వాడుకొని ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారిపై, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఈ ఆదేశాల ప్రభావం ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారంతా ఓబీసీ కోటాలోనే కొనసాగుతరాని వెల్లడించింది. 2010 సంవత్సరం తర్వాత మ‌మ‌తా సర్కారు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు 1993 చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని న్యాయమూర్తులు జస్టిస్ తపోబ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మంథర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2010 ఏప్రిల్‌ – సెప్టెంబరు మధ్య 77 కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను, 2012 చట్టం ఆధారంగా కొత్తగా చేర్చిన మరో 37 కులాల ఓబీసీ హోదాను కోర్టు కొట్టివేసింది.  2012లో చేసిన ఒక చట్టం కింద కొన్ని కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.  కలకత్తా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  స్పష్టం చేశారు. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

నరసరావుపేట కోర్టులో పిన్నెల్లి లొంగుబాటు?

పోలింగ్ బూత్ లో దౌర్జన్యం చేసి ఈవీఎం ను ధ్వంసం చేసిన మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పిన్నెల్ల ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో వెలుగులోనికి వచ్చిన తరువాత ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఆయనను తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో పోలీసులు పిన్నెల్లిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఆయనను అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బుధవారం (మే 22) ఆయన సంగారెడ్డి సమీపంలోని ఇస్నాపూర్ లో చిక్కినట్లే చిక్కి తప్పించుకు పారిపోయారు. ఆ సందర్భంగా ఆయన కారును అందులో ఉన్న ఆయన సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయన కారు డ్రైవర్ ను కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఇలా ఉండగా ఆయన తమిళనాడు వెళ్లారనీ, అక్కడ నుంచి విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న అనుమానాల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్నరెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇలా ఉండగా గురువారం (మే 23) ఆయన నరసరావు పేట కోర్టులో లొంగిపోయే అవకాశాలున్నాయని అందిన సమాచారం మేరకు పోలీసులు నరసరావుపేట కోర్టు వద్ద భారీగా మోహరించారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. 

పిన్నెల్లి ఆస్తుల్ని సీజ్ చేయాలి! ఉక్కుపాదంతో అణిచేయాలి!

పల్నాడు ప్రాంతంలో జరిగిన పోలింగ్ హింసను చూసి వామ్మో అనుకుంటున్నాం కానీ... ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జరిగే నేరపూరిత చర్యలు వింటేనే వళ్ళు జలదరిస్తుంది. తుపాకులు ధరించి యదేచ్చగా తిరిగే రాజకీయ నాయకుల అనుచరులను ఎదిరించి బ్రతికేవారు ఉండరు. వీళ్ళని స్వయంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులే పొంచి పోషిస్తూ ఉంటారు. ప్రత్యర్ధి అనేవాడు లేకుండా చేసి ఎన్నికల్లో "ప్రజాస్వామ్యబద్ధంగా" గెలుస్తారు.  కొంతకాలం క్రితం ఉత్తరప్రదేశ్ లో, పోలీస్ కస్టడిలో ఉండగా, మీడియా లైవ్ లో కాల్చి చంపబడ్డ ఆతిక్ అహ్మద్ అనే రాజకీయ నాయకుని చరిత్ర తెలుసుకున్నప్పుడు.... అధికారం చేతిలో ఉన్న రాజకీయ రౌడీల ముందు... ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ, భారత రాజ్యాంగం ఏమి చేయలేక చూస్తూ ఉండిపోతున్నాయి అనే విషయం మనకి అర్థం అవుతుంది. హింస, హత్య రాజకీయాలతో 40 సంవత్సరాలపాటు ఎం.పీ, ఎమ్మెల్యేగా కొనసాగిన ఈ గ్యాంగస్టర్ ను ఏ ప్రభుత్వము, ఏ వ్యవస్థ ఏమి చేయలేకపోయాయి. జడ్జీలు కూడా అతని కేసు తీసుకోవడానికి భయపడేవారట. "నీకు వ్యవస్థలు, చట్టం అంటే గౌరవం లేనప్పుడు... నీకు జీవించే హక్కు లేదు" అనే విధానాన్ని యూపీ ప్రభుత్వం అమలు చేయటం మొదలుపెట్టి, గ్యాంగస్టర్ లను నిర్ధాక్షిణ్యంగా ఎన్ కౌంటర్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, ఈ నేరపురిత విష సంస్కృతి అదుపులోకి వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే... ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నంత మాఫియా పోకడ ఇక్కడ లేకపోయినప్పటికీ... రెండు పార్టీలలో రౌడీయిజాన్ని నమ్ముకుని రాజకీయాలు చేసే వారికి కొదవలేదు. తమ వ్యాపార, ఆధిపత్య పోకడలను బలోపేతం చేసుకోవడానికి, వ్యవస్థలను... ముఖ్యంగా పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయటంలో నైపుణ్యమున్న శాసనసభ్యులు అనేకమంది రెండు పార్టీలలోనూ ఉన్నారు. నేడు పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నది, పూర్తిగా నిర్వీర్యమైన పోలీసు వ్యవస్థ కారణంగా వస్తున్న ఫలితం. ఒకప్పుడు రాయలసీమ, గుంటూరు పల్నాడు ప్రాంతంలో ప్రముఖంగా కనిపించిన దుర్మార్గమైన ఫ్యాక్షన్ హింస, ఇప్పుడు లేదు. ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతంలో బయటపడిన దాడులు, ప్రతి దాడులు పోలీసుల వైఫల్యంతో జరిగినవి. ఏమాత్రం శ్రద్ధ తీసుకుని ఉన్నా ... అలాంటి హింసను అరికట్టే అవకాశం పోలీసుల చేతుల్లో ఉంది.  మే 13వ తేదీ నాడు పోలింగ్ జరుగుతున్న సమయంలో మాచర్ల ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 202 పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లారు. అక్కడ EVMను ఎత్తి పడేసి నానా బీభత్సం సృష్టించారు. ఈ దృశ్యాలు సీసీ కెమేరాలో రికార్డయ్యాయి. ఎమ్మెల్యే ధ్వంసం చేస్తున్న సమయంలో పోలింగ్ ఏజెంట్ అడ్డుకునే ప్రయత్నం చేసారు. అతడిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి చేసారు.   పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం ధ్వంసం చేయడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల నియోజకవర్గం పరిధిలో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసినట్లు సీసీ కెమేరాల్లో రికార్డయ్యింది.  ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒక ఈవీఎం ను పగల కొట్టిన దృశ్యం సంచలనంగా కనిపిస్తుంది కానీ... గతంలో బ్యాలెట్ బాక్స్ లను ఎత్తుకెళ్లి బావుల్లో పారవేసిన, ధ్వంసం చేసిన కేసులు అనేకం ఉండేవి. వెబ్ కాస్టింగ్, సిసి కెమెరాలు, మొబైల్ ఫోన్ కెమెరాల సాంకేతిక  పరిజ్ఞానం అందులోకి వచ్చినాక.... ఇలాంటి దౌర్జన్యాలు దాదాపు కనుమరుగయ్యాయి.  ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇది తరచూ మనం వినే మాట. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండినా...ప్రజాస్వామ్యం నిర్దేశించిన పద్ధతులు, ఫలాలు జనాలకు ఇంకా పూర్తిగా చేరలేదు అని చెప్పొచ్చు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రజాస్వామ్యం ముసుగు వేసుకుని అనేక రకాల హింసాయుత పద్ధతులను ఆచరించి ప్రజాస్వామ్య వ్యవస్థను, దేశ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే వారికి ఈ దేశంలో కొదవలేదు. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

కొడాలి నానికి తీవ్ర అస్వస్థత

గుడివాడ సిట్టింగ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ( మే 23) తన నివాసంలో పార్టీ మండల స్థాయి నాయకులతో మాట్లాడుతున్న సమయంలో ఒక్క సారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే నేతలు, గన్ మెన్ లు వైద్యులకు సమాచారం అందించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.   కొడాలి నాని గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరన్న వార్తలు ఇటీవలి కాలంలో గట్టిగా వినిపించాయి. ఆయన రెండుమూడు సార్లు హైదరాబాద్ లోని బసవరామ తారకం క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చినప్పటి ఫొటోలు కూడా మీడియాలో వచ్చాయి. అయితే తన  అనారోగ్యం విషయం నాని ఎప్పడూ చెప్పలేదు. ఇప్పుడు ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఆయన అనారోగ్యం ఏమిటన్నదానిపై చర్చ మొదలైంది. 

పిన్నెల్లి బ్రదర్స్ ఎన్‌కౌంటర్ ఖాయమా?

పిన్నెల్లి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఇద్దరూ ఆరితేరిన దొంగల మాదిరిగా తప్పించుకు తిరుగుతున్నారు. నిజంగానే తప్పించుకు తిరుగుతున్నారో, లేక ప్రభుత్వమే జాగ్రత్తగా తప్పిస్తోందో ఎవరికి తెలుసు? కాకపోతే బయటకి వచ్చే వార్తల లోతును తెలుసుకోలేని సాధారణ ప్రజలు పిన్నెల్లి బ్రదర్స్ పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారనే అనుకుంటున్నారు. పోలీసులు వాళ్ళ వెంట పడుతున్నారని, వాళ్ళు పోలీసులకు దొరక్కుండా చాకచక్యంగా తప్పించకుంటున్నారని... ఇలా సినిమాల్లోని సీన్స్ ఊహించుకుంటున్నారు. వీళ్ళిద్దరూ పోలీసుల నుంచి ఇప్పటికే రెండుసార్లు తప్పించుకున్నారు. సాధారణంగా సినిమాల్లోగానీ, ఒక్కోసారి నిజంగా కూడా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేవారిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసేస్తూ వుంటారు. ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ కూడా అలాగే ఎన్‌కౌంటర్ అయిపోతారేమోనని అమాయక జనం అనుకుంటున్నారు. ఈ రకంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.  అలా సినిమా నాలెడ్జ్.తో ఫీలైపోతున్న అమాయక చక్రవర్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పిన్నెల్లి బ్రదర్స్ పోలీసుల కన్నుగప్పి పారిపోవడం లేదు. ప్రభుత్వం, పోలీసులు చక్కగా వాళ్ళిద్దర్నీ కాపాడుతున్నారు. పోలీసులు, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలూ ఇంటి అల్లుళ్ళ మాదిరిగా అనుభవిస్తూ వాళ్ళు నీడపట్టున హ్యాపీగా వున్నారు. అసలు పాయింట్ ఏంటంటే, ఈ ఇద్దరూ ఎన్నికల ఫలితాలు విడుదలై, ఎన్నికల కోడ్ ముగిసే వరకూ బయటకి రారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక అప్పటి సంగతి అప్పుడు. మళ్ళీ రాబోయేది తమ రౌడీ రాజ్యమే కాబట్టి అప్పుడు తమకేమీ ఢోకా లేదని ఈ బ్రదర్స్ అనుకుంటూ వుండవచ్చు. కానీ, రాబోయేది రౌడీ రాజ్యం కాదు.. లోకేష్ రెడ్ బుక్ రాజ్యం. అప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి సీన్ సితారైపోతుంది.