అత్తారింటికి పవన్ కళ్యాణ్? ఫ్యామిలీతో రష్యా టూర్?

ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్య నాయకులందరూ విదేశాలకు వెళ్ళిపోయారు. ఎన్నికల సందర్బంగా అందరి బుర్రలు వాచిపోయాయి. రిలాక్స్ అవడం కోసం కావచ్చు.. వైద్య పరీక్షల కోసం కావచ్చు.. ఇతర కారణాల వల్ల కావచ్చు ఎవరికి వారు విదేశాల బాట పట్టారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా అమెరికా వెళ్ళారు. అక్కడ ఆయన రిలాక్స్ అవడంతోపాటు వైద్య పరీక్షలు కూడా చేయించుకోబోతున్నారు. ఇక షర్మిలమ్మ అమెరికా వెళ్లారు. జగన్ అయితే లండన్, స్విట్జర్లాండ్ టూర్ వెళ్ళిపోయారు. ఇక మిగిలింది జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ కూడా ఈ ఎన్నికల సందర్భంగా హార్డ్ వర్క్ చేశారు. ఇక ఫలితాలు వెలువడే జూన్ తర్వాత ఆయన ఫుల్ బిజీ. అందుకే ఆయన కూడా రిలాక్స్ కావడానికి విదేశం వైపు చూస్తున్నట్టు సమాచారం. ఈసారి అటో ఇటో ఎటోకాకుండా తన భార్య అన్నా లెజ్నేవాతో కలసి తన అత్తగారి దేశమైన రష్యాకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారట. మన అత్తారింటికి దారేది స్టార్.. ఇప్పుడు అత్తగారి ఇంటికి వెళ్ళే దారిలో వున్నాడు.. భలే వుంది కదూ.  

ఇబ్రహీం రైసి చ‌నిపోతే... ఇరాన్ ప్ర‌జ‌లు పండ‌గ చేసుకున్నారు!

దివంగ‌త నేత‌ ఇబ్రహీం రైసిలో రెండు కోణాలున్నాయి. ఒకటి నిరంకుశ మతోన్మాదం, రెండవది తిరుగులేని సామ్రాజ్యవాద వ్యతిరేకత. ఆయ‌న చ‌నిపోయిన సంఘ‌ట‌న మతవర్గాలలో దిగ్భ్రాంతి క‌లిగించింది. మ‌రో వైపు ఇరాన్ దేశమంతటా సామాన్య జనంలో సంతోష ఛాయలు క‌నిపించాయి. ఎందుకంటే.... హిజాబ్‌ ధరించకుండా ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యవహరించిందనే ఆరోపణతో మహషా అమీని ప్రాణాలు తీశారు. మత ఛాంద‌సంతో నైతిక పోలీసింగ్ పేరిట‌, ఆమెకు నీతి పాఠాలు బోధిస్తూ, చిత్ర హింసలు పెడుతూ ప్రాణాలు తీశారు. ఈ సందర్భంగా ఇబ్రహీం రైసి మతాధినేతకు చూపిన విధేయత కారణంగా ఖమేనీకి తగిన వారసుడు అతనే అనే అభిప్రాయం కలిగింది. అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసి తీసుకున్న చర్యలు జనంలో తీవ్ర అసంతృప్తి, నిరసనలకు దారితీశాయి. ముఖ్యంగా నైతిక పోలీసులను రంగంలోకి దించి సమాజాన్ని మత గిరి నుంచి కదలకుండా చేసేందుకు చూశాడు. ఈ క్రమంలోనే మహషా అమీ అనే యువతిని పోలీసు కస్టడీలో చంపివేయటంతో గడచిన ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దాదాపు ఐదు వందల మంది నిరసనకారులను చంపివేశారంటే అణచివేత ఎంత క్రూరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వందలాది మంది జాడ ఇప్పటికీ తెలియదు. వారిని కూడా చంపివేశారా, జైళ్లలో ఉంచారా అన్నది కూడా స్పష్టం కాలేదు.  1998లో 30వేల మందికి పైగా రాజకీయ ఖైదీలను ఉరితీశారు. వీరిలో అధికులు పీపుల్స్‌ ముజాహిదీన్‌ సంస్థకు చెందిన ప్రత్యర్ధులే ఉన్నారు. చరిత్రలో అత్యంత హీన నేరగాండ్లుగా నమోదైన వారి జాబితాలో చేరి ఈ మారణకాండకు బాధ్యులైన ముగ్గురిలో ఇబ్రహీం రైసీ ప్రముఖుడు.  యువకుడిగా ఉన్నపుడే మత ఛాందసాన్ని వంటబట్టించుకున్న ఇబ్రహీం రైసి 1979లో ఇరాన్‌ ఇస్లామిక్‌ విప్లవం పేరుతో జరిగిన పరిణామాల్లో ఖమేనీ అనుచరుడిగా ఉన్నాడు. తరువాత మరింత సన్నిహితుడిగా, దేశ సర్వాధినేతను ఎంపిక చేసి, పర్యవేక్షణ చేసే నిపుణుల కమిటీలో 2006 నుంచి పనిచేశాడు. 2021లో దేశ అధ్యక్షుడిగా అంచెలంచెలుగా వీర విధేయుడిగా ఎదిగాడు.  అనేక అక్రమాలు, అనేక మంది అభ్యర్థులను పోటీకి అనర్హులుగా చేసిన 2021 అధ్యక్ష ఎన్నికలలో అడ్డగోలు పద్ధతిలో గెలిచాడనే విమర్శలు ఉన్నాయి. రైసీకి మతపెద్దలతో పాటు మిలిటరీ మద్దతు కూడా ఉన్న కారణంగానే ఎన్నిక సాధ్యమైందని చెబుతారు.  ఖమేనీ న్యాయమూర్తుల అధిపతిగా ఉన్న రైసీ 2019లో తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేతలుగా ఉన్న వారితో సహా తరువాత తన పదవీ కాలంలో మొత్తం పదిహేను వందల మందిని ఉరితీయించాడు. తాను అధ్యక్షుడైన తరువాత 2022లో తలెత్తిన నిరసనల సమయంలో 750 మంది ఉన్నారు.  జైళ్లు, ఇతర నిర్బంధ శిబిరాలలో మధ్యయుగాలనాటి ఆటవిక పద్ధతుల్లో వేలాది మందిని చిత్రహింసలకు గురిచేశాడు. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

ఫ్లాష్.. ఫ్లాష్.. పిన్నెల్లి అరెస్టు

వైసీపీ నేత పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి సమీపంలోని ఇస్నాపూర్ లో పోలీసులు  పిన్నెల్లిని అరెస్టు చేశారు.  మాచర్ల వైసీపీ అభ్యర్థి అయిన పిన్నెల్లి పోలింగ్ రోజున విధ్వంసానికి పాల్పడటంతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. అయితే హౌస్ అరెస్టు నుంచి తప్పించుకుని ఆయన పరారయ్యారు. ఆ తరువాత తాపీగా సొంత పనిమీద హైదరాబాద్ వచ్చినట్లు సామాజిక మాధ్యమం ద్వారా ఓ ప్రకటన జారీ చేశారు. అదలా ఉంచితే తాజాగా ఆయన పోలింగ్ రోజున ఓ పోలింగ్ బూత్ లోకి జొరబడి ఈవీఎంను ధ్వంసం చేయడానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఆయనపై క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్టు చేయాలని ఆదేశించింది. సాయంత్రం ఐదు గంటల లోగా ఆయనను అరెస్టు చేయాలని పేర్కొనడంతో పోలీసులు పిన్నెల్లి కోసం వేట మొదలు పెట్టారు. తొలుత మధ్యాహ్నం ఆయన కారు డ్రైవర్ ను అరెస్టు చేశారు. ఆయన కారును, అందులోని సెల్ ఫోన్ నూ స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత కొద్ది సేపటికే పిన్నెల్లి సంగారెడ్డి ఇస్నాపూర్ లో పోలీసులకు చిక్కారు.  

టిఎస్ ఆర్టీసీ ఇక నుంచి టీజీఎస్  ఆర్టీసి గా మార్పు 

ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్ పేరు కాస్తా మారిపోయింది. తెలంగాణ ఆవిర్బావం తర్వాత అధికారంలో వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం తన మార్కు ఉడేలా  జాగ్రత్తపడింది. ఇందుకు సరికొత్త రిజిస్ట్రేషన్ కోడ్ అమల్లోకి తెచ్చింది. టీఎస్ఆర్టీసీని త్వరలో టీజీఎస్ఆర్టీసీగా మార్చనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. త్వరలో లోగోలో మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక నుంచి బస్సులను టీజీ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు అధికారులు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నాటి ప్రభుత్వం టీఎస్ఆర్టీసీగా పేరు మార్చింది. అయితే ఉద్యమం సమయంలో టీజీని తెలంగాణవాదులు, ప్రజలు ఉపయోగించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చాక టీఎస్‌ను టీజీగా మార్చుతామని ప్రకటించింది. రాష్ట్రంలో టీజీ అమలుకు కేంద్రం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వగా, అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో 'టీఎస్'కు బదులు 'టీజీ'ని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల వేళ పీఓకే విలీనం మాట.. ఎన్డీయే కూటమిలో తగ్గిన ధీమాకు తార్కాణం?

సార్వత్రిక ఎన్నికలు ఇప్పటివరకూ ఐదు విడతలు పూర్తి అయ్యాయి. జూన్ 1వతేదీతో ఎన్నికలు పూర్తి అవుతాయి. మూడోసారి తమకు అధికారం రావడం గ్యారంటీ అని బీజేపీ ఘంటాపథంగా చెబుతున్నది. అయితే క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు తొలి ఐది విడతలలో బీజేపీ భారీగా నష్టపోతున్నది. చివరి రెండు విడతలలో కూడా ఆ పార్టీ పెద్దగా పుంజుకుంటుందన్న నమ్మకం లేదని అంటున్నారు. ఎందుకంటే చివరి రెండు విడతలలో ఎన్నికలు జరిగే  లోక్ సభ నియోజకవర్గాలలో రైతుల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. దీంతో బీజేపీకి ఇక్కడ పెద్దగా సీట్లు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా రైతుల ఆగ్రహం ప్రస్ఫుటమే. ఈ కారణంగానే ఒక్కో విడత పోలింగ్ పూర్తి అవుతున్న కొద్దీ బీజేపీ నేతలు సమాజంలో విద్వేషాలు రగిలేలా ప్రచారంలో స్వరం మార్చారు. తాజాగా అమిత్ షా మోడీ సర్కార్ మూడో సారి అధికారంలోకి రావడం తరువాయి..  పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేస్తామని ఒక ఎన్నికల సభలో ప్రతిన చేశారు.  ఇక ఆ క్షణం నుంచీ బీజేపీ నేతలందరూ పీవోకే విలీనం అంటూ కోరస్ పాడుతున్నారు. నిజమే పీవోకేలో ఇప్పుడు పరిస్థితులు అంత సవ్యంగా లేవు.  నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటాయి.పెట్రోలు ధరలు కూడా ఐదు రెట్లు పెరిగాయి. ప్రజల  నిరసనలు వెల్లువెత్తు తున్నాయి.ఇటీవల భారత్ కు అనుకూలంగా పీవోకేలో  నిరసనకారులు నినాదాలు చేసినట్లు వార్తలు వచ్చాయి.  పీవోకే లో కొన్ని పార్టీలు భారత్ లో విలీనం చేయాలన్న డిమాండ్ ను కూడా తెరమీదకు తీసుకుచ్చాయి. సరిగ్గా దీనినే ఎన్నికలలో తనకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందాలన్న వ్యూహానికి బీజేపీ తెరతీసింది.   ఈసారి తాము 400 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామన్న ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ ఎన్నికల ప్రచారంలో  ఊదరగొడుతూ, ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే వాస్తవంగా బీజేపీకి విజయంపై నమ్మకం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి ఎన్నికల ముందూ ఏదో ఒక ప్రజాకర్షక నినాదంతో ఒడ్డెక్కుతున్న బీజేపీ ఈ సారి భారత ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీసేందుకు కూడా వెనుకాడకపోవడం ఆ పార్టీలో నెలకొన్న ఓటమి భయమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలైతే మూడో సారి బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబుతూనే.. ఆ పార్టీ ఊదరగొడుతున్న సంఖ్య మాత్రం చేరుకునే అవకాశం ఇసుమంతైనా లేదని ఢంకా బజాయించి చెబుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ ను చేరుకున్నా  అధికారం చేపట్టవచ్చని గుర్తు చేస్తున్నారు. మరో వైపు అనూహ్యంగా ఈ సార్వత్రిక ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకున్న ఇండియా కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గట్టిపోటీ ఇస్తున్నది. తొలి ఐదు విడతల పోలింగ్ సరళిని బట్టి చూస్తుంటే ఎన్డీయే, ఇండియా కూటముల్లో దేనికీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. మొత్తం మీద ఎన్డీయే కూటమికి 400 ప్లస్ స్థానాలు అంటూ మోడీ అండ్ కో చేస్తున్న ప్రచారం కేవలం ఆర్భాటం మాత్రమేననీ, క్షేత్రస్థాయిలో అంత సీన్ కనిపించడం లేదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కవిత అరెస్ట్ వెనుక సంతోష్ హ‌స్తం? బీజేపీతో సంతోష్‌కున్న లింక్ ఏంటి?

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ అయినపుడు.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు 2017 లో ప్రభుత్వ స్పెషల్ జీ.ఓ ద్వారా కార్పొరేట్ మద్యం దుకాణాన్ని తెరిచి.. పన్నులు చెల్లించకుండా యథేచ్చగా అక్రమాలకు పాల్పడిన టానిక్ ది, స్కామ్ అని బీజేపీ పెద్దలు భావించలేదు? ఎందుకు కవితను మాత్రమే టార్గెట్ చేశారు? రెండు మధ్యానికి సంబందించిన కుంభకోణాలే కదా! రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవే కదా! అక్కడ కేజీవాల్ ప్రభుత్వం రూపొందించిన పాలసీ తప్పు అయితే….. ఇక్కడ ప్రత్యేక జీవోతో నాటి కేసీఆర్ ప్రభుత్వం అనుమతిచ్చిన మద్యం వ్యాపారమే కదా! కేవలం టానిక్ వెనుక ఉన్నది సంతోష్ అని పట్టించుకోకుండా పదిలేశారా!  టానిక్ విషయానికి వస్తే అదొక పెద్ద స్కామ్ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక విచారణ చేపట్టింది. ఎలాంటి అనుమతులు లేకుండా టానిక్ పేరుతో కార్పొరేట్ మద్యం దుకాణాలు నడిపించిన యాజమాన్యం.. విదేశీ ఖరీదైన మద్యాన్ని యథేచ్ఛగా విక్రయిస్తూ లాభాలు గడించడమే కాకుండా వంద కోట్లకు పైగా జీఎస్టీ ని ఎగవేసినట్లుగా గుర్తించారు. అంతే కాదు పొరుగున ఉన్న మహారాష్ట్ర లో కూడా తమ దుకాణాలను విస్తరించినట్లుగా గుర్తించారు. మహారాష్ట్ర పూణే నగరంలో టానిక్ వైన్ షాప్స్ ఏర్పాటు చేశారు.  ఢిల్లీలో కీలకంగా వ్యవహరించిన సంతోష్ ప్రమేయంలేకుండానే ఢిల్లీ లిక్కర్ పాలసీ లో కవిత పెట్టుబడి పెట్టిందా! అసలు కవిత చేత పెట్టుబడి పెట్టించాలని ప్రోత్సహించింది ఎవరు అనే ప్రశ్నలూ ఉత్పన్నమౌతున్నాయి. ఒక వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేయించిన పెద్దలు అంత కంటే ముందు నుండే లిక్కర్ వ్యాపారాన్ని పరోక్షంగా నిర్వహిస్తున్న సంతోష్ ని ఎందుకు వదిలేశారు! ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేవ‌లం వంద కోట్లు పెట్టుబడి పెట్టిందని కవితను అరెస్ట్ చేశారు! మరి అంతకంటే పెద్ద లిక్కర్ స్కామ్ ను వెనకుండి నడిపించిన సంతోష్ ని ఎందుకు వదిలేశారు? అసలు సంతోష్ ఎలా త‌ప్పించుకున్నారు?  కేసీఆర్ వెన్నంటి ఉంటూ, ఎప్ప‌ట్టిక‌ప్పుడు బీజేపీ పెద్దలకు స‌మాచారం అందించి, కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని ఇరుకున పడేలా చేశారా?  అసలు సంతోష్ లక్ష్యమేమిటి, రాజకీయంగా తన ఎదుగుదలకు కేటీఆర్, కవిత, హరీష్ రావు అడ్డుగా ఉన్నారని బావించాడా! వారిని అడ్డులేకుండా చేసుకోవడానికే లోపాయికారిగా బీజేపీ తో చేతులు కలిపాడా! అనే అనుమానాలు ఇప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో వ్యక్తమవుతున్నాయి!  సంతోష్, త‌న స్వప్రయోజనాల కోసం, అవినీతి దందాలలో కేసుల బారిన పడకుండా ఉండటం కోసమే, క‌విత‌ను బ‌లిపీఠం ఎక్కించారు. నమ్మకంగా వెంట బెట్టుకున్న కేసీఆర్ ను నట్టెట్ట ముంచడమే లక్ష్యంగా సంతోష్ పావులు కదిపారు.  కేసీఆర్ కుటుంబసభ్యుల కదలికలపై సంతోష్ నిఘా పెట్టించాడు! పార్టీలో కీలకంగా ఉన్న కేటీఆర్, కవిత, హరీష్ రావు వ్యవహారాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సంతోష్ ఒక ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్నే నడిపించాడనేది బహిరంగ రహస్యమే! తమపై సంతోష్ నిఘా పెట్టిన విషయం గ్రహించిన కవిత, కేటీఆర్ కి, తండ్రికి చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ,  సంతోష్ పైనే కేసీఆర్‌ చాలా విశ్వాసం ఉచేవారనేది పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.  ఢిల్లీలో కీలక వ్యవహారాలన్నీ సంతోషే చూసుకునే వారు. అలాంటిది కవిత పేరు లిక్కర్ స్కామ్ లో బయటకు రాగానే కేసీఆర్ ఉలిక్కి పడ్డాడు! ఢిల్లీలో అత్యంత కీలకంగా రాజకీయ వ్యవహార నడిపించిన సంతోష్ కు లిక్కర్ స్కామ్ గురించి ముందే తెలియదా అన్న అనుమానాలు కేసీఆర్ లో మొదలయ్యాయి! తెలిసే కావాలనే గోప్యంగా ఉంచాడా అని అనుమానం వచ్చింది! దీంతో కేసీఆర్ మెల్లిగా సంతోష్ ను దూరం పెట్టడం మొదలెట్టాడు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న అత్యంత కీలక సమయంలో సంతోష్ ని కేసీఆర్ దూరం పెట్టడం పార్టీ శ్రేణుల్లో అనేక అనుమానాలకు తావిచ్చింది! ఇదిలా ఉండగానే అసెంబ్లీ, ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం, కేసీఆర్ జారిపడి అనారోగ్యానికి గురవ్వడం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. అధికారం కోల్పోయిన తర్వాత పూర్తిగా అశక్తుడిగా మారిపోయిన కేసీఆర్ ఎవరిని ఏమీ అనలేని దయనీయ స్థితిలోకి పడిపోయాడు. అదే సరైన సమయంగా భావించిన సంతోష్.. మళ్ళీ వచ్చి కేసీఆర్ వద్ద మెల్లిగా చేరిపోయాడు. సంతోష్ గురించి అన్ని తెలిసినా.. అతన్ని ఏమి చేయలేని దీనావస్థలో కేసీఆర్ ఉన్నట్లుగా సొంత పార్టీ నేతలకు సహా అందరికీ అనిపించింది. ఈలోగా కవిత అరెస్ట్ శరాఘాతంలా కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడింది. అసలే అధికారం కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడిన కేసీఆర్ కుటుంబ సభ్యులను కవిత అరెస్ట్ మరింత సంక్షోభంలోకి నెట్టేసింది, ఎవరినీ ఎవరు రక్షించలేని స్థితిలో కేసీఆర్ కుటుంబసభ్యులు పడిపోయారు. ఒక వైపు సంక్షోభం నుండి ఎలా బయట పదాలో తెలియకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత సహా ఇతర కుటుంబ సభ్యులు సతమతమౌతుంటే.. సంతోష్ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండడం అందరిని విస్మయ వరుస్తోంది. కవిత అరెస్ట్ తీహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉండి దాదాపు యాభై రోజులు కావస్తున్నా… సంతోష్ మాత్రం జైలుకు వెళ్లి కనీసం పలకరించిన పాపాన పోలేదు. ఓవైపు కేటీఆర్, కవిత కుటుంబం, హరీష్ రావు తీహార్ జైలుకు వెళ్లి కవితను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పి వస్తున్నా.. సంతోష్ మాత్రం అటువైపు చూడటంలేదు! అసలు కవిత ఆరెస్ట్ అయినా నాటి నుండి సంతోష్ ఢిల్లీ కి వెళ్లడమే మానేసాడు!. సంతోష్ వ్య‌వ‌హారం మొత్తం కేసీఆర్‌కు తెలుసు. అయినా ఎందుకు నోరువిప్పడం లేదు.  కేవ‌లం రాజకీయ కక్షతోనే నా కూతురిని మోడీ అరెస్ట్ చేయించాడని కన్నీళ్లు కారుస్తున్న కేసీఆర్,  సంతోష్ను ఎందుకు వదిలేస్తున్నారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీలో, కేసీఆర్ కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. - ఎం.కె. ఫ‌జ‌ల్‌  

తోక ముడిచిన ‘రేసు’ కుక్క!

మొన్నటి వరకు జగన్ పాద సేవలో తరించిన ఐప్యాక్ ఖేల్ ఖతమ్ అయిపోయి.. ఏపీలో దుకాణ్ బంద్ చేసేసింది. ఆ సంస్థలో పనిచేసిన 150 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పేసింది. జగన్ మళ్ళీ వస్తాడు... మనం ఇంకా అబద్ధాలు ప్రచారం చేయొచ్చని కలలు కన్న ఐప్యాక్ ఉద్యోగులు షాకైపోయారు. ఐదేళ్ళపాటు హాయిగా బతికిన ఆ జీవితాలు రోడ్డున పడ్డాయి. సర్లేండి.. వాళ్ళకి ఉద్యోగాలు దొరక్కపోవు.. జీవితాలు మళ్ళీ మామూలు అవ్వకపోవు.. కాకపోతే ఏపీలో వైసీపీ పుట్టి మునిగిపోవడంతో ఐప్యాక్ ఉద్యోగుల జీవితాల్లో కూడా చిన్న కుదుపు వచ్చింది. ఇప్పుడు మరో సంస్థ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఇంతకాలం జగన్‌కి కావల్సిన ప్రమోషన్ కార్యక్రమాలు, టీడీపీ వ్యతిరేకంగా విష ప్రచారాలు, ఉత్తుత్తి సర్వేలు జరిపి జగన్ గెలుస్తున్నాడని ప్రచారం చేస్తూ, తోకఊపుతూ బతికిన ‘రేసు’ కుక్క లాంటి  సంస్థ కూడా తోక ముడుచుకుని తన దుకాణం బంద్ చేసే ప్రయత్నాల్లో వుంది. ఈ సంస్థ కూడా తాజాగా తన తన దగ్గర పనిచేస్తున్న దాదాపు రెండు వందల మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పేసింది. ఇక మీకూ మీకు ఎలాంటి సంబంధం లేదు.. మీకు రావల్సిన బ్యాలన్స్ సాధ్యమైనంత త్వరలో పంపించేస్తాం అని క్లియర్ కట్‌గా చెప్పేసింది. దాంతో ఆ ఉద్యోగులు బతుకుజీవుడా అని తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. పుబ్బలో పుట్టి మఖలో అంతరించిపోయే ఇలాంటి దిక్కుమాలిన సంస్థల్లో చేరితే పరిస్థితి ఇలాగే వుంటుంది. అందుకే యూత్ ఇలాంటి సంస్థలకి దూరంగా వుండాలి..

పిన్నెల్లి పిల్లి మీద అనర్హత వేటు?

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంత దుర్మార్గ, దుష్ట, నీచ, నికృష్ణ, కమీనేనా అని ఎన్నికల కమిషన్ అధికారులు నోళ్ళు తెరిచారట. ఇలా నోళ్ళు తెరిచింది ఎప్పుడూ.... పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు, వీవీ ప్యాట్లు నేలకేసి కొట్టడం, పోలింగ్ బూత్‌ల దగ్గర మహిళల మీద విరుచుకుపడటం.. ఇలాంటి వీడియో ఆధారాలు చూశాకగానీ ఈసీకి అసలు విషయం అర్థం కాలేదు. కెమెరాల దయవల్ల ఈ వీడియోలు ఉన్నాయిగానీ, లేకపోతే ఎన్నికల కమిషన్ కూడా పిన్నెల్లి పిల్లి కాదు పులి అని అనుకుంటూ వుండేదేమో. పిన్నెల్లి పోలింగ్ స్టేషన్లో దూరి అంత రచ్చ చేస్తుంటే గాడిదల్లాగా చూస్తూ నిల్చున్న పోలీసులు, పిన్నెల్లి రాగానే దణ్ణాలు పెట్టేసిన అధికారులు, జరిగిన తతంగాన్నంతా వీడియో తీసిన ఉద్యోగులు ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ని చెప్పాలి కదా.. అలా చెప్పలేదు. పిన్నెల్లి టైమ్ బాగాలేక సీసీ టీవీ ఫుటేజ్ చూడాలని అనుకోవడం వల్ల పిన్నెల్లి దారుణాలు బయటపడ్డాయి. పిన్నెల్లి విషయంలో ఈసీ చాలా సీరియస్‌గా వుందన్న వార్తలు వస్తున్నాయి. అరెస్టుకు ఆదేశాలు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం వస్తోంది. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, పిన్నెల్లిని ఎమ్మెల్యే పదవికి, ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించే అవకాశాలను కూడా ఈసీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసీ ఏ నిర్ణయమైనా లాగకుండా త్వరగా తీసుకుంటే మంచిది.

పిన్నెల్లి విధ్వంసం చూసిన తరువాతా ఈసీ కళ్లు తెరవదా?

మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్రిమినల్ కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా ఆయన ఒక పోలింగ్ బూత్ లో ఈవీఎమ్ ధ్వంసం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన తరువాత మాత్రమే ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. పూర్తి స్థాయి వెబ్ కాస్టింగ్ అమలు చేసిన నియోజకవర్గాలలో పిన్నెల్లి పోటీ చేసిన మాచర్ల నియోజకవర్గం కూడా ఒకటి. అయినా ఆయన ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై పోలింగ్ ముగిసిన పది రోజులకు గానీ, అదీ కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సిట్ నివేదిక తరువాత మాత్రమే ఆయనపై కేసు బుక్కైంది. చర్యలు తీసుకోవాలన్న ఈసీ ఆదేశాలపై పోలీసులు ఎలా ముందుకు కదులుతారో చూడాలి. హౌస్ అరెస్టు నుంచి సునాయాసంగా పరారైపోయిన పిన్నెళ్లి.. హైదరాబాద్ లో ఉన్నట్లు తెలియసేసినా పోలీసులు ఆయనను తిరిగి తీసుకువచ్చి హౌస్ అరెస్టులో ఉంచే దిశగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు.  మాచర్లలో పోలీసులు, అధికారయంత్రాంగం అంతగా  పిన్నెల్లితో అంటకాగి విధ్వంసం ద్వారా ఓటింగ్ ప్రక్రియకు ఆటంకాలు కలిగించి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి లేకుండా చేయడానికి ఎంత చేయాలో అంత చేసినా.. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. నియోజకవర్గంలో ఆయన ఎంత వ్యతిరేకత మూటగట్టుకున్నారో ఇట్టే అర్ధం అవుతుంది.   అయినా పోలింగ్ బూత్ లోకి చొరబడి, అక్కడి సిబ్బందిని బెదరించి ఈవీఎంను ధ్వంసం చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఈసీ ఇప్పటి వరకూ చర్య ఎందుకు తీసుకోలేదో అర్ధం కాదు. వాస్తవానికి ఆయనపై అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. తమ వైఫల్యానికి సిగ్గుపడి పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలవంచుకోవాలి.    ఇక్కడ ఈసీ వైఫల్యాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ కు ముందు నుంచీ కూడా విపక్ష కూటమి నేతలు ఏపీలో శాంతి భద్రతల గురించి ఫిర్యాదులు చేసినప్పటికీ తక్షణ  చర్యలు తీసుకోకుండా పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందు ఇన్  చార్జి డీజీపీని బదిలీ చేసి ఈసీ సాధించింది శూన్యమని పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనతో తేలిపోయింది. ఇప్పటికీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం బుట్టదాఖలు చేసిన సీఎస్పై చర్యలే లేవు. పోలింగ్ రోజున భారీ హింస ఒకెత్తయితే.. కౌంటింగ్ రోజు అంతకు మించి హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా భద్రత పెంపునకు, అదనపు బలగాల మోహరింపునకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే సీఎస్ ను మార్చకుండా భద్రతా ఏర్పాట్లు చేసినా పెద్దగా ఫలితం ఉండదని, కొత్త డీజీపీ వచ్చిన తరువాత కూడా అధికార పార్టీకి అనుకూలంగా పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు చూసిన ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. మరి ఈ విషయంలో ఈసీ ఎందుకు స్పందించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.  

తమ్మినేని తట్టాబుట్టా సర్దేసుకోవలసిందేనా?

తమ్మినేని సీతారాం.. జగన్ హయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. స్పీకర్ గా ఆయన వ్యవహారశైలి ఎంత వివాదాస్పందంగా ఉందో అందరికీ తెలిసిందే. అసెంబ్లీ లోపలా, బయటా కూడా ఆయన తీరు, భాష అనుచితంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఆయన విద్యార్హతలకు సంబంధించి వివాదం కూడా పెద్ద ఎత్తున రచ్చరచ్చ అయ్యింది. ఇక ఆయన సొంత నియోజకవర్గం అయిన ఆముదాలవలసలో కూడా జనం ఆయన తీరు పట్ల వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి కూడా తమ్మినేని సీతారాం వ్యవహారశైలి ఆ స్థాయికి తగ్గట్టుగా లేదని విమర్శలూ వెల్లువెత్తాయి. ఇక ఆముదాల వలస నియోజకవర్గాన్ని తమ్మినేని ఏ మాత్రం పట్టించుకోలేదని అక్కడి జనం గట్టిగా చెబుతున్నారు. ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చిన పాపాన పోలేదని అంటున్నారు. తమ్మినేని సీతారాంపై ఆ ఆగ్రహం, ఆ అసంతృప్తే ఎన్నికలలో  ప్రతిఫలించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన తీరు, పొగరు, అహంభావం ఆయన ప్రకటనలలో ప్రతిఫలించేది. ఇదే ఆయనకు పూడ్చకోలేని నష్టాన్ని చేకూర్చింది. ఆముదాల వలసలో  తమ్మినేని ఓటమి ఖాయమని  తెలుగుదేశం శ్రేణులు ధీమాగా ఉంటే.. పరిశీలకులు సైతం తమ్మినేని ఆగ్రహం, అనుచిత భాష, అహంభావం ఆయనను ప్రజలకు దూరం చేసిందని విశ్లేషిస్తున్నారు.   ఇక సమస్యల పరిష్కారం విషయంలో తమ్మినేని ఆముదాలవలసను అస్సలు పట్టించుకోలేదని అంటున్నారు. రాష్ట్రంలో అత్యంత అధ్వానంగా ఉన్న రోడ్డు ఏది అంటే ఎవరైనా ఆముదాలవలస, శ్రీకాకుళం హైవే అని ఠక్కున చెప్పేస్తారు. ఆ రోడ్డు మరమ్మతుల కోసం ప్రజల నుంచి ఎన్ని విజ్ణప్తులు వచ్చినా తమ్మినేని పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ రహదారి ప్రమాదాలకు నెలవుగా మారిపోయినా తమ్మినేని పట్టించుకోలేదు. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణించిన ప్రతి ఒక్కరూ ఎట్టిపరిస్థితుల్లోనూ తమ్మినేనికి ఓటు వేయకూడదని నిర్ణయించేసుకున్నారు.  ఇక ఆముదాలవలసలో చక్కెరకర్మాగారం వాగ్దానం కూడా నీటిమూటగానే మిగిలిపోయింది.  వీటన్నిటికీ తోడు ఆముదాలవలస నియోజకవర్గంలో వైసీపీ నాలుగు గ్రూపులుగా చీలిపోయింది. వైసీసీ స్వయంగా నిర్వహించుకున్న సర్వేలోనే నియోజకవర్గ ప్రజలలో తమ్మినేని పట్ల తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉందని తేలింది. అలాగే నియోజకవర్గంలో అధికారపార్టీ అవినీతి పెచ్చరిల్లిందని కూడా ఆ సర్వే పేర్కొంది. అయినప్పటికీ జగన్ తమ్మినేనికే మరో సారి ఆముదాల వలస టికెట్ కేటాయించారు.    ఎన్నికలకు ముందే తమ్మినేని ఓటమి ఖరారైపోయిందని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి.   ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న సెంటిమెంట్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన ఎవరూ కూడా ఆ తరువాతి ఎన్నికలలో విజయం సాధించలేరు. అయితే తమ్మినేనికి ఆ సెంటిమెంట్ మాత్రమే కాకుండా  నియోజకవర్గ వైసీపీలో గ్రూపు తగాదాలూ కూడా స్పీకర్ తమ్మినేని ఓటమిని ఖాయం చేసేశాయి.  గత ఎన్నికలలో తమ్మినేని  విజయం కోసం సర్వం తానై పని చేసిన వైసీపీ నేత సువ్వారి గాంధీ.. ఇప్పుడు తమ్మినేనికే కాకుండా ఆయన కారణంగా వైసీపీకి కూడా దూరమయ్యారు.  దీంతో ఆముదాలవలస నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ  చేసిన  కూన రవికుమార్  విజయం నల్లేరుమీద బండి నడకేనని అంటున్నారు. 

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచ‌కంపై ఈసీ సీరియ‌స్‌

పిల్లి పాలు తాగుతూ  తననెవరూ చూడడం లేద‌ని అనుకున్న‌ట్లుగా ఉంది వైసీపీ నేత‌ల తీరు. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ రోజు, ఆ త‌రువాత వైసీపీ నేత‌ల అరాచ‌కం అంతాఇంతా కాదు. పోలింగ్ స‌జావుగా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు వారు చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేశారు. అయితే పైకి మాత్రం తమ‌కేమీ తెలియ‌దనీ, తాము సుద్దపూసలమనీ,   కూట‌మి నేత‌లే ఈసీతో కుమ్మ‌క్కై అధి కారుల‌ను మార్చుకొని ఏక‌ప‌క్షంగా పోలింగ్ నిర్వ‌హించుకున్నారంటూ   నాట‌కాలాడారు. ఆడుతున్నారు. కానీ పోలింగ్ రోజు, ఆ త‌రువాత ఏపీలో వైసీపీ గూండాలు సృష్టించిన అరాచ‌కం అంతా ఇంతా కాదు. ఓట‌ర్ల‌ను బెదిరించ‌డం, దాడులు చేయ‌డం ద‌గ్గ‌ర నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల‌ను ధ్వంసం చేయడం వరకూ చేయగలిగినదంతా చేశారు.  పోలింగ్ త‌రువాత క‌త్తులు, రాడ్ల‌తో టీడీపీ నేత‌ల‌పై దాడులు చేశారు. స్ట్రాంగ్ రూంల వ‌ద్ద‌కు కూట‌మి నేత‌లు రాకుండా దాడుల‌కు దిగారు.  ఇప్పుడు  వైసీపీ నేత‌ల అరాచ‌కాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. వీడియోల‌తో స‌హా పోలింగ్ రోజు వైసీపీ నేత‌లు సృష్టించిన బీభ‌త్సం బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టంతో ప్ర‌జ‌లు వారిని చీద‌రించుకుంటున్నారు.  మాచర్ల  వైసీపీ అభ్య‌ర్థి పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి పోలింగ్ రోజు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ప‌గ‌ల‌గొట్టిన వీడియో తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. పోలింగ్‌ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో   వైసీపీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే అభ్య‌ర్థి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వర్గీయులు తెలుగుదేశం నేత‌ల‌పై దాడులు చేశారు. ముఖ్యంగా కారంపూడిలో  కర్రలు, రాడ్లతో చెలరేగిపోయారు. తెలుగుదేశం కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. స్థానిక తెలుగుదేశం నాయకుడి కారును, కొన్ని టూ వీలర్లను  తగులబెట్టారు. నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా వైసీపీ గూండాలు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద రెచ్చిపోయారు. వీరికి ప‌లువురు పోలీసు అధికారులు అండ‌గా నిల‌వ‌డంతో వారి ఆగ‌డాల‌కు హ‌ద్దు లేకుండా పోయింది. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద‌కు వెళ్లి ఓట‌ర్లను  వైసీపీ నేత‌లు బెదిరించారు. మ‌రోవైపు  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత గ్రామంలో తెలుగుదేశం త‌ర‌పున పోలింగ్ ఏజెంట్ లేకుండా చేశారు. పిన్నెల్లిది మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కళ్లకుంట గ్రామం. ఆ గ్రామంలో తెలుగుదేశం ఏజెంట్‌గా దళితవర్గానికి చెందిన నోముల మాణిక్యం కూర్చుంటే వైసీపీ నేత‌లు మాణిక్యం ఇంటిని చుట్టుముట్టి పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు రాకపోతే చంపేస్తామని వీడియో కాల్‌లో బెదిరించారు. అదే విధంగా నియోజకవర్గంలోని కేపీగూడెం పోలింగ్‌ బూత్‌లో కూడా ఇదే విధంగా పైశాచికత్వాన్ని వైసీపీ గూండాలు ప్రదర్శించారు. పోలింగ్ రోజు వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌కు అద్దంప‌డుతూ ఓ వీడియో వెలుగులోకి వ‌చ్చింది. పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డే ఏకంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ప‌గ‌ల‌గొట్టిన వీడియో వైర‌ల్ అయింది.  మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలోని రెంట‌చింత‌ల మండ‌లం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202)లోకి పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి వెళ్లారు. పోలింగ్ బూత్ లోని సిబ్బందిని బెదిరిస్తూ ఈవీఎంను ద్వంసం చేశాగ‌డు. అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన పోలింగ్ ఏజెంట్‌పై ఎమ్మెల్యే అనుచ‌రులు దాడి చేశారు. ఈ దృశ్యాలు వెబ్ క్యామ్ లో రికార్డ‌య్యాయి. అయితే, ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల సిబ్బంది సైతం ఈ ఘ‌ట‌న‌ను చూసీచూడ‌న‌ట్లు వ‌దిలేశారు. ఏపీలో పోలింగ్, ఆ త‌రువాత జ‌రిగిన అల్ల‌ర్ల‌పై ఎన్నిక‌ల సంఘం సిట్ విచార‌ణ‌కు ఆదేశించింది. సిట్ బృందం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప‌ర్య‌టించి ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగిన పోలింగ్ కేంద్రాలు, గ్రామాల‌ను సంద‌ర్శించి వివ‌రాల‌ను సేక‌రించింది. సిట్ ద‌ర్యాప్తుతో వైసీపీ అరాచ‌కాల్లో కొన్ని ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌చ్చాయి. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో మొత్తం ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసం దృశ్యాలు సీసీ కెమెరాల్లో న‌మోద‌య్యాయి. ఈవీఎంల‌ను ద్వంసం చేయ‌డాన్ని ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ గా తీసుకుంది. బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీని ఆదేశించ‌డంతో.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి పేరును నిందితుడిగా చేర్చిన‌ట్లు పోలీసులు ఈసీకి తెలియ‌జేశారు. ఏపీ వ్యాప్తంగా పోలింగ్ రోజు, ఆ త‌రువాత వైసీపీ నేత‌లు బీభ‌త్సం సృష్టించారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద కావాల‌నే ఘ‌ర్ష‌ణ‌ల‌కుదిగి ఓట‌ర్ల‌ను భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. సిట్ బృందం ఈసీకి అందించిన త‌మ నివేదిక‌లో వైసీపీ నేత‌లు అరాచ‌కాల‌ను పొందుప‌ర్చిన‌ట్లు తెలుస్తోంది. పోలింగ్ స‌జావుగా జ‌ర‌గ‌కుండా దాడులు చేసిన వైసీపీ నేత‌లు.. ఆ దాడులు విధ్వంసాలకు తెలుగుదేశం నేతలే కారణమని ఎదురు ఆరోపణలు చేశారు.  ఆల‌స్యంగానైనా  వైసీపీ అరాచ‌కాలకు సంబంధించిన వీడియో ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టంతో ప్ర‌జ‌లు నివ్వెర‌పోతున్నారు. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉంటూ వ‌చ్చారు. పోలింగ్ రోజు భారీ ఎత్తున  ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరారు. భారీగా పోలింగ్ న‌మోదైతే వైసీపీ ఓట‌మికి కార‌ణ‌మ‌వుతుంద‌ని భావించిన ఆ పార్టీ అభ్య‌ర్థులు, నేత‌లు పోలింగ్ స‌జావుగా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో పోలింగ్ రోజు ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. అయితే, తాజాగా సిట్ బృందం ఈసీకి అందించిన నివేదిక‌లో వైసీపీ నేత‌ల అరాచ‌కాలను పొందుప‌ర్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఈసీ వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందోన‌న్న అంశం వైసీపీ నేత‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తుంది. మ‌రోవైపు కౌంటింగ్ రోజు కూడా వైసీపీ నేత‌లు దాడుల‌కు పాల్ప‌డ‌వ‌చ్చున‌న్న ఇంటెలిజెన్స్ స‌మాచారంతో.. కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ఠ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసేప‌నిలో పోలీసులు నిమ‌గ్న‌మ‌య్యారు.

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవలు కావడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. సాధారణంగా వారాంతాలతో పోలిస్తే మిగిలిన రోజులలో భక్తుల రద్దీ ఒకింత తక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం వేసవి సెలవులు కారణంగా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్నారు. బుధవారం(మే22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ టీబీసీ వరకూ  సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక మంగళవారం (మే21) శ్రీవారిని మొత్తం 80వేల774 మంది దర్శించుకున్నారు.   వారిలో 35వేల726 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 76 వేల రూపాయలు వచ్చింది.   

బుద్ధవనం ప్రత్యేకతలను ప్రశంసించిన రాయల్ భూటాన్ ప్రధాన బౌద్ధాచార్యుడు

 రాయల్ భూటాన్ మొనాస్టరీ ప్రధాన బౌద్ధాచార్యులు ఖెన్ పొ ఉగేన్ నాంగెల్, బుద్ధవనం బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ ప్రత్యేకతలను ప్రశంసించినట్లు బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. భూటాన్ ప్రస్తుత రాజధాని ధింపూ నగరంలో క్రీ.శ. 1629లో నిర్మించిన మొదటి చారిత్రక బౌద్ధారామంలో సోమవారం నాడు బౌద్ధాచార్యుని కలిసి, తెలంగాణ బౌద్ధ వారసత్వ స్థలాలు, నాగార్జునసాగర్ లో పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన బుద్ధవనంలోని వివిధ విభాగాల్లో తీర్చిదిద్దిన బౌద్ధ శిలాఫలకాలు, స్తూపాలు, మహా స్తూపం, బుద్ధుని మరియు ఎనిమిది మంది అర్హతుల పవిత్ర ధాతువులు, ఆచార్య నాగార్జునుని  విగ్రహం, బౌద్ధ మ్యూజియం, అశోకుని ధర్మ చక్రం గురించి శివనాగిరెడ్డి వివరించారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న బుద్ధవనాన్ని త్వరలో తాను సందర్శిస్తానని ఆయన చెప్పారు. ఆ సందర్భంగా శివనాగిరెడ్డికి బౌద్ధాచార్యులు పట్టు శేష వస్త్రాన్ని బహుకరించారు. శివనాగిరెడ్డి ఆచార్యులకు బుద్ధవనం బ్రోచర్ ను అందజేశారు

విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం అయిపోయింది.. పేదల ఖాతాల్లోకి సొమ్ముపై మోడీ మరో హామీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ మరోసారి పేదల ఖాతాల్లోకి సొమ్ము అంటూ హామీ ఇచ్చారు. దీంతో గతంలో కూడా విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి రప్పించి పేదల ఖాతాల్లో జమ చేస్తానంటూ ఇచ్చిన హామీ గురించి జనం గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందే పేదల ఖాతాలు, వాటిలోకి సొమ్ము జమ విషయం గుర్తుకు వస్తుందా అంటూ నిలదీస్తున్నారు.   అవినీతి అధికారులు,నాయకులవద్ద పట్టు పడ్డ సంపద బీద ప్రజలకు పంచుతామని   మోడీ హామీ ఇవ్వడమ కాకుండా, ఆ విషయంపై ఇప్పటికే న్యాయసలహా తీసుకున్నామని చెప్పారు. ఇందుకోసం అవసరమైతే   చట్టం సవరణకు కూడా వెనుకాడబోమని అన్నారు.    ఈడి స్వాధీనం చేసుకున్న సంపద రూ. 1.25 లక్షల కోట్లుగా చెప్పిన మోడీ.. ఆ సొమ్మును పేదల ఖాతాల్లో జమ చేయడానికి కసరత్తు చేఃస్తున్నామన్నారు.  2014 ఎన్నికల సమయంలో కూడా మోడీ తాము   అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల్లో మన వారు దాచిన నల్లధనాన్నిస్వదేశానికి  తీసుకువచ్చి పంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అయితే నల్లధనాన్ని పేదలకు పంచే పని మాత్రం చేయలేదు. అసలా హామీ ఇచ్చిన విషయాన్నే ఆయన ఎన్నడూ ప్రస్తావించలేదు.  అందుకు భిన్నంగా పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తీసుకుని జనాలు అన్ని విధాలుగా ఇబ్బందులు పడేలా చేశారు.  ఇప్పుడు తాజాగా   దేశంలో  పట్టుబడ్డ నల్లధనం పంచేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. ఈ ఒక్క హామీతో మోడీ మరోసారి ప్రజల విశ్వాసం పొందే అవకాశాలు ఉన్నాయని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. అయితే విశ్లేషకులు మాత్రం సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన ఐదు విడతల ఎన్నికలలో ఇండియా కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిందని విశ్లేషిస్తున్నారు.  ఇండియా కూటమితో విభేదించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఎన్నికల సరళిని గమనించి అవసరమైతే కాంగ్రెస్ నేతృత్వంలోని  ఇండియా కూటమికి  మద్దతు ఇస్తామని ప్రకటించడాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.   మొత్తం మీద పేదల ఖాతాలలో జప్తు చేసిన సొత్తు జమ చేస్తానంటూ మోడీ చేసిన ప్రకటన, ఇచ్చిన హామీ ఎన్నికల సందర్భంగా ప్రజలను ఆకర్షించేందుకు చేసిన ఉత్తుత్తి హామీగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని స్వదేశానికి రప్పించి పేదల ఖాతాల్లో జమ చేస్తానంటే చేసి విస్మరించిన వాగ్దానాన్ని చూపుతున్నారు. 

అశాస్త్రీయంగా భూముల విలువ పెంపు

భూమి అనేది పెరగదు.. కానీ భూమి విలువ మాత్రం పెరుగుతూనే వుంటుంది. ఒక్కోసారి భూమి విలువ ఆకాశంలోకి కూడా దూసుకెళ్తూ వుంటుంది. ఈ ఇంట్రడక్షన్ సంగతి అలా వుంచితే, ఈ రాష్ట్రం అని కాదు.. ఆ రాష్ట్రం అని కాదు... ఏ రాష్ట్రంలో అయినా భూముల విలువ పెంపు అనేది శాస్త్రీయంగా జరగడం లేదన్న అభిప్రాయాలున్నాయి. భూముల విలువ అవసరం అయినప్పుడు పెంచడం కాకుండా, ప్రభుత్వానికి డబ్బు అవసరం అయినప్పుడు పెంచుకుంటూ వెళ్ళడం అనే సంప్రదాయం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొనసాగుతూ వస్తోంది. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువను పెంచారు. ఉదాహరణగా చెప్పాలంటే, పదేళ్ళ క్రితం ఎకరం రెండు లక్షల వరకు వున్న భూమి విలువ ఇప్పుడు పది లక్షలు దాటిపోయింది. ఇలా భూమి విలువ పెంచడం వల్ల ప్రజలకు  కలిగే మేలు ఏమిటనే విషయం అలా వుంచితే, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకోవడం కోసం తప్ప ప్రభుత్వాలకు భూముల విలువ పెంచడం వెనుక మరో ఉద్దేశమేమీ కనిపించడం లేదు.  ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలు తీర్చడానికి ప్రభుత్వానికి డబ్బు కావాలి. దానికి రేవంత్ రెడ్డికి కనిపించిన మొదటి మార్గం భూముల విలువ పెంచడం.. తద్వారా రిజిస్ట్రేషన్ రాబడిని పెంచుకోవడం. ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూముల విలువ పెంచే విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న విలువను ఏక్‌దమ్ రెడింతలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ఇష్టం వచ్చినప్పుడల్లా భూముల విలువ పెంచుకుంటూ వెళ్ళడం, భూముల విలువను పెంచడంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరించకపోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతదేమోగానీ, సామాన్యుడికి భూమి అందుబాటులో లేకుండా పోతోంది.

సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో కుదుపు...ఒకరు మృతి 30 మందికి గాయాలు 

సింగపూర్ ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడం వల్ల ఓ వ్యక్తి మరణించారు. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. లండన్​ నుంచి సింగపూర్ వెళ్తున్న  విమానంలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు సింగపూర్ ఎయిర్​లైన్స్ సంస్థ వెల్లడించింది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం  మే 20న మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో బ్రిటన్‌ రాజధాని లండన్‌ నుంచి సింగపూర్‌కు బయల్దేరింది. మార్గమధ్యలో ఫ్లైట్‌ తీవ్ర కుదుపులకు లోనుకావడం వల్ల దాన్ని థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని సంస్థ వెల్లడించింది. మరో 30 మందికి గాయాలైనట్లు సమాచారం.ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయ్‌లాండ్‌ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్‌కు పంపుతున్నట్లు తెలిపింది.

పిడకలతో జగన్ పీడకలకి ముగింపు!

ఈ ప్రశాంత్ కిషోర్ ఒకడు.. పోలింగ్ ముందు రోజు జర్నలిస్టు రవిప్రకాష్‌తో  కలసి జగన్‌ని ఉతికి ఆరేశాడు. జగన్ గెలిచే అవకాశం లేదని చెప్పాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇదే మాట చెప్పాడు. ‘‘నేను చాలా ఆలోచించి చెబుతున్నాను. నేను చెప్పింది జరగకపోతే ఎదురయ్యే పర్యవసానాల గురించి కూడా ఆలోచించి చెబుతున్నాను. నేను చెప్పింది జరగకపోతే జనం నా ముఖం మీద పేడ కొడతారు. అదే, నేను చెప్పింది జరిగితే ఆ పేడ జగన్ ముఖాన పడుతుంది’ అన్నారు. అంతే, ఆంధ్రా జనం.. ముఖ్యంగా రైతులు ఆ పాయింట్ గట్టిగా పట్టుకున్నారు. జగన్ ముఖం, పేడ అనే రెండు పదాలు వాళ్ళ మనసులలో ఫిక్స్ అయిపోయాయి. రేపు జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడి జగన్ ప్రభుత్వం తుడిచిపెట్టుకుని పోగానే ప్రశాంత్ కిషోర్ ఏదైతే చెప్పాడో ఆ పని చేయడానికి రైతులు రెడీ అవుతున్నారు.  ఐదేళ్ళ పదవీకాలంలో రైతుల్ని జగన్ పెట్టిన హింస అంతా ఇంతా కాదు. రైతులకు ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు. రైతులకు వారసత్వంగా వచ్చిన భూములు, కష్లపడి సంపదించుకున్న భూముల పట్టాదార్ పాస్ పుస్తకాల మీద జగన్ ఫొటో ప్రింట్ చేయడం, భూముల సర్వే పేరుతో సరిహద్దు రాళ్ళ మీద జగన్ పొటో ప్రింట్ చేయడం.. అనేక రైతు వ్యతిరేక విధానాలను అవలంబించడం, ముఖ్యంగా అమరావతి రైతులను దారుణంగా అవమానించడం లాంటి కారణాలతో జగన్ మీద రైతులు చాలా గుర్రుగా వున్నారు. ఇప్పటి వరకూ అధికారంలో వున్నాడు కాబట్టి రైతులు ఎందుకొచ్చిన గొడవ అని ఊరుకున్నారు. జూన్ 4న జగన్ ప్రభుత్వం ఖతమ్ అయిపోయిన తర్వాత రైతులు తమ కార్యాచరణను మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా జగన్ ఫొటోనే ఆ ఫొటోలన్నిటి మీదా పేడ కొట్టాలని రైతులు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఐదేళ్ళపాటు పీడకలగా దాపురించిన జగన్‌కి పిడకలతో వీడ్కోలు చెప్పాలని కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తన పొలాలకు సరిహద్దులుగా నాటిన రాళ్ళమీద వున్న జగన్ ముఖం మీద పిడకలు కొట్టడంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రైతులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పిడకల సంగతి అలా వుంచితే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తే, జగన్ ఫొటో వున్న పాస్ పుస్తకాలను కసిదీరా చించేయడానికి కూడా రైతులు ఎదురుచూస్తున్నారు.