ఎవరెస్ట్ మీద టీడీపీ పతాకం రెపరెప!

ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పతాకం రెపరెపలాడనుంది. దీనికి సింబాలిక్‌గా టీడీపీ ఫ్లాగ్ గ్రేట్ ఎవరెస్ట్ శిఖరం మీద రెపరెపలాడింది. అనంతపురం జిల్లాకి చెందిన మత్స్యకార కుటుంబానికి చెందిన ఉపేంద్ర ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాడు. ఎవరెస్ట్ శిఖరం అంచులకు చేరుకున్న తర్వాత ఆయన అక్కడ మన భారత జాతీయ పతాకాన్ని ఎగరేశాడు. ఆ తర్వాత తెలుగుజాతి పతాకం అయిన తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేశారు. ఈ ఫొటోలను టీడీపీ అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తమ ఎక్స్ అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఎంతో పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఉపేంద్ర నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. తెలుగుదేశం పతాకం ఎవరెస్ట్ శిఖరం మీద రెపరెపలాడటం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

గతంలో చాలాసార్లు తెలుగుదేశం పతాకం ఎవరెస్ట్ శిఖరం మీద రెపరెపలాడింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు యువకులు భారత జాతీయ పతాకం తర్వాత తెలుగుదేశం పతాకాన్నే ఎగురవేస్తూ వచ్చారు. తెలుగుజాతి గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలిపింది, తెలుగుజాతికి జాతీయ స్థాయిలో ప్రత్యేక స్థాయిని ఏర్పరచింది ఎన్టీఆర్ అయితే, ఆ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్నికల సమరంలో జయాపజయాలు సాధారణం. అయితే తెలుగు కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేయడంలోగానీ, యువతకు అత్యుత్తమమైన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో గానీ చంద్రబాబు చేసిన కృషిని ఎవరూ విస్మరించరు. ముఖ్యంగా తెలుగు యువతరం పురోగతిని ఒక పెద్ద మలుపు తిప్పిన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచారు. ఆ గౌరవంతోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు యువతీ యువకులు అక్కడ టీడీపీ పతాకాన్ని కూడా ఎగరేస్తూ వుంటారు.

అయితే, ఇప్పుడు అనంతపురానికి చెందిన మత్యకార యువకుడు ఉపేంద్ర ఎవరెస్ట్ మీద టీడీపీ పతాకాన్ని ఎగురవేయడం అనేది ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. యావత్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళలో, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రాబోతోందని అందరిలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్న వేళలో... ఎవరెస్ట్ శిఖరం మీద మరోసారి తెలుగుదేశం పతాకం రెపరెపలాడటం ఒక శుభసూచకంగా భావించవచ్చు.

ఎవరెస్ట్ శిఖరం మీద టీడీపీ పతాకం రెపరెపలాడించిన అనంతరం ఉపేంద్ర ఆక్సిజన్ మాస్క్ పెట్టుకునే మాట్లాడారు. తనకు ఎవరెస్ట్ ఎక్కే అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థాంక్యూ సోమచ్ అని ఉపేంద్ర అన్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Teluguone gnews banner