స్వోత్కర్ష.. పరనింద.. పేర్నినానికి ఇదే పనా?

పేర్ని నాని.. వైసీపీలో అందరూ మాటలు ఆపేసిన వేళ పేర్ని నాని మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ  సొంత నియోజకవర్గ ప్రజలకు మాంఛి వినోదం అందిస్తున్నారు. ఓటమి భయం కప్పిపుచ్చుకోవడానికి మాటలను కోటలు దాటిస్తున్నారు. బందరులో తన కుమారుడు విజయం సాధిస్తారో లేదో చెప్పడానికి ఆయన దగ్గర సరైన గణాంకాలు లేవు కానీ మాచర్లలో మాత్రం పిన్నెల్లి విజయం ఖాయమని ఢంకా బజాయిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి కంచుకోట అని చెబుతూ అందుకు ఉదాహరణలు చెబుతున్నారు. ఒక వైపు పిన్నెల్లి సోదరుల దౌర్జన్యం, దుర్మార్గాలను ప్రపంచం అంతా వీక్షిస్తున్న సమయంలో పేర్ని నాని పిన్నెల్లికి వత్తాసు పలుకుతూ, అసలు సినిమా జూన్ 4 తరువాత చూస్తారని బెదరిస్తున్నారు.  ఇప్పుడు కాదు.. 2019లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే వైసీపీలో మేధో శూన్యత ఉందనీ, స్వోత్కర్ష, పర నిందే ఆ పార్టీ సిద్ధాంతమనీ అందరికీ అర్ధమైపోయింది. నిస్సిగ్గుగా తమ తప్పులను సమర్ధించుకోవడమే కాకుండా.. తమ వైఫల్యాలను కూడా విపక్షంపై నెట్టివేసి చప్పట్లు కొట్టే విద్యలో  వైసీపీ ఆరితేరిపోయింది. ఇప్పుడు అదే ఆరితేరిన విద్యను కొత్తగా పేర్ని నాని మరోసారి మొదలెట్టేశారు.  ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నేల్లినే బాధితుడిగా అభివర్ణించడానికి పేర్ని నాని ఎక్కడా సంకోచించడం లేదు. మీడియా ముందుకు వచ్చి పిన్నెల్లి హత్యకు తెలుగుదేశం కుట్రపన్నిందంటూ ఆరోపణలు గుప్పించారు. ఆ కుట్రకు ఎన్నికల సంఘంన, పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ గగ్గోలు పెట్టేశారు.   ఇంత కాలం ఎవరి అండ చూసుకునైతే వైసీపీ నేతలూ, మూకలూ రెచ్చిపోయాయో అదే పోలీసులు పాపం వైసీపీ నేతలకు వ్యతిరేకంగా మారిపోయారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఓటమికి సాకులు వెతుక్కునే వారే ఇటువంటి బేల మాటలు మాట్లాడతారు. ఇంత బేలగా, ఇంత దిగజారి ఆరోపణలు గుప్పిస్తున్న పేర్ని నాని అదే నోటితో పిన్నెల్లి విజయం ఖాయమంటూ జోస్యం చెబుతున్నారు. విజయం ఖాయం అయితే ఈవీఎం ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, దాడులకు, దౌర్జన్యాలకు దిగి, ఓటర్లను ఎందుకు భయభ్రాంతులకు గురి చేయాల్సి వచ్చింది అన్న దానికి మాత్రం పేర్ని సమాధానం చెప్పరు. అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమిటి? మేం చెబుతాం మీరు వినండి అన్నట్లుగా సాగింది పేర్ని ధోరణి.   ఇంతకీ పిన్నెల్లి హత్యకు తెలుగుదేశం కుట్ర అంటూ ఆరోపణలు చేసిన పేర్ని మాటల సారాంశం.. జూన్ 4 వరకూ ఎదురు చూడటం ఎందుకు.. మేం ఓడిపోయాం.. మా ప్రాణాలకు భద్రత కల్పిస్తే చాలు అని వేడుకోవడంలాగే  ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వాస్తవానికి  ముందస్తు బెయిల్ తెచ్చుకున్న పిన్నెల్లి కోర్టు షరతులను ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన నరసరావు పేటలోనే ఉండాలి. కానీ ఆయన నరసరావు పేటలో ఉండటం లేదు. కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి అజ్ణాతంలోనే ఉన్నారు.  ఈ విషయాన్ని దాచిపెట్టి ఎదురు ఆయన హత్యకు తెలుగుదేశం కుట్ర పన్నిందనీ, ఆ కుట్రకు పోలీసులు సహకరిస్తున్నారనీ ఆరోపణలు మొదలెట్టేసింది. అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా వైసీపీ తీరు ఉందన్న మాట. పేర్ని నాని ఎంతగా గొంతు చించుకున్నా పిన్నెల్లి విధ్వంస, దౌర్జన్య కాండ గురించి తెలిసిన ఏ ఒక్కరూ పిన్నెల్లిని కానీ, ఆయనకు వత్తాసుగా గొంతుచించుకు గగ్గోలు పెడుతున్న పేర్ని నానిని కానీ ఇసుమంతైనా నమ్మడం లేదు. అజ్ణాతంలో ఉన్న పిన్నెల్లి కౌంటింగ్ రోజున మరింత విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఆదివారం పల్నాడులో జరిగిన దాడే నిదర్శనంగా నిలుస్తుంది. 

వైసీపీకి జనం రాసిన మరణశాసనం?

జూనియర్ ఎన్టీఆర్  నటించిన అదుర్స్ అనే సినిమాలో  కొవ్వు ఎక్కువై తెలియలేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలా సేపైంది అని ఓ డైలాగ్ ఉంటుంది. ప్రస్తుతం ఆ డైలాగ్ వైసీపీకి అతికినట్లుగా సరిపోతుంది. అధికార మదం తలకెక్కి అర్ధం కావడం లేదు కానీ.. వైసీపీ ఓటమి ఖరారై చాలా కాలమైంది.  నిజమే.. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేది ఎవరో అధికారికంగా తేలడానికి ఇక ఎనిమిది రోజులు మాత్రమే ఉంది. అయితే ఓట్ల లెక్కింపు పూర్తై ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే జనం తీర్పు ఏమిటన్నది వైసీపీతో సహా అందరికీ పోలింగ్ రోజునే అవగతమైపోయింది.  అధికారమదం తలకెక్కి అర్ధం కాలేదు కానీ.. వైసీపీ ఓటమి కోసం జనం ఎప్పుడో తమ ఆయుధానికి పదును పెట్టేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా జగన్ కు మరో చాన్స్ ఇచ్చేది లేదని డిసైడైపోయారు. తమ ఓటు భద్రంగా ఉందో లేదో అనుక్షణం వెరిఫై చేసుకుంటూ వచ్చారు. దొంగ ఓట్ల నమోదును అడ్డుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే ఇదంతా జనం నిశ్శబ్దంగా చేశారు. ఈ నిశ్శబ్దం వెనుక ప్రభుత్వ వ్యతిరేకత వారిలో నివురుగప్పిన నిప్పులా ఉంది. గడప గడపకు నుంచి వైసీపీ నాయకులకు నిరసన సెగ తగిలినా.. ఆ ఏముందిలే అనుకున్నారు. వైనాట్ 175 ధీమా వ్యక్తం చేశారు. ఆ ధీమా వెనుక ప్రజలు వ్యతిరేకించినా, అవినీతికి అలవాటుపడ్డ కొందరు ఉన్నతాధికారులు, పోలీసుల సహకారంతో వారిణి భయపెట్టి పబ్బం గడిపేసుకోగలమని భావించారు.  అయితే అది సాధ్యం కాదు.   రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు ఏ మాత్రం సుముఖంగా లేరన్న సంకేతాలు ఏడాది ముందు నుంచే స్పష్టంగా కనిపించాయి. ఎన్నికలలో జగన్ రెడ్డి  బొక్కబోర్లా పడడం ఘయమని ఎప్పుడో తేలిపోయింది.  సంక్షేమ పథకాల పేరిట క్రమం తప్ప కుండా ప్రజల ఖాతాల్లో . పైసలు వేస్తున్నాము కాబట్టి, ప్రజలు చచ్చుకుంటూ మళ్ళీ  తమకే ఓటేస్తారని, తమనే గెలిపిస్తారని వైసీపీ నేతలు పగటి కలలు కన్నారు. గాలిలో మేడలు కట్టుకున్నారు. ఆశల పల్లకిలో ఊరేగారు.   ప్రజలు సంక్షేమం అంటూ జగన్ సర్కార్ ఇచ్చిందేదో పుచ్చుకున్నారు. అయితే జగన్ కు మరో చాన్స్ ఇచ్చే ప్రశక్తే లేదన్న నిర్ణయం ఎప్పుడో తీసేసుకున్నారు. విధ్వంసం తప్ప విజన్ లేని పాలకుడు ఇక వద్దే వద్దని నిర్ణయానికి వచ్చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అంటే ఏమిటో అనుకున్నామనీ, జగన్ అధికారంలోకి వచ్చి రివర్స్ పాలన ప్రారంభించిన తరువాత కానీ    జగన్ రెడ్డి మాటలను కూడా రివర్స్ గానే అర్ధం చేసుకోవాలని అర్ధం కాలేదని వాపోయారు. అప్పులు చేయడం సంక్షేమం అంటూ చిల్లర విసరడం తప్ప జగన్ హయాంలో రాష్ట్రంలో వీసమొత్తు అభివృద్ధి జరగలేదు.   చేసిన పనులకు కాంట్రాక్టర్లు బిల్లులు అందలేదు. దీంతో   రాష్ట్రంలో చిన్నా పెద్ద పనులకు టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు ఎవరూ, ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.  కాంట్రాక్టర్లకే కాదు పార్టీ క్యాడర్ కు మేలు చేయడం కోసం అంటూ కేటాయించిన నామినేషన్ పనులకు కూడా పార్టీ క్యాడర్, నేతలు ముందుకు రావడం మానేశారు. అంటే పార్టీ క్యాడర్ లోనే   జగన్ రెడ్డి విశ్వాస స్థాయి  దిగజారింది. అంతెందుకు  ప్రభుత్వ భూములు  ప్లాట్స్ వేసి అమ్ముదామంటే కొనే నాథుడే లేకుండా పోయారు.   ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రీమ్ కాపిటల్  వైజాగ్ లో   జగనన్నస్మార్ట్ టౌన్ షిప్ లో  సుమారు 2000 ప్లాట్లను వేలం ద్వారా అమ్మకానికి పెడితే ప్రజల నుంచి స్పందన లేదు.  వాస్తవానికి   ప్రభుత్వం నేరుగా అమ్ముతోందంటే దానికో క్రేజ్ ఉంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రావు. క్లియర్ టైటిల్ ఉంటుంది అన్న నమ్మకంతో జనం ముందుకు రావాలి.  చంద్రబాబు హయాంలో   అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే గంటల్లో బిజినెస్ క్లోజ్ అయింది. అదీ విశ్వాసం అంటే. కానీ జగన్ సర్కార్ కు ప్రజలలో విశ్వసనీయత లేదనడానికి జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో ప్లాట్ లు కొనడానికి ఎవరూ రాకపోవడమే నిదర్శనం అని అప్పుడే తేలిపోయింది. ఇలా ఒకరని కాదు, అన్ని వర్గాల ప్రజలూ, చివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్న సామాన్య జనం కూడా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా లేమని చెప్పకనే చెప్పేశారు. అయినా వైసీపీ మాత్రం సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలు ఆ విశ్వాసంతో తమకే ఓటు వేస్తారని నమ్మింది. మే 13న పోలింగ్ సరళి చూసిన తరువాత కానీ వైసీపీ నేతలకు అర్ధం కాలేదు. వాస్తవం బోధపడలేదు. హింస, దౌర్జన్యం, దుర్మార్గాలతో జనాలను భయపెట్టి ఓట్లేయించుకోలేమని. ప్రజలు తమ పార్టీని తిరస్కరించారని.  అందుకే వైసీపీలో ఇంత కాలం నోరెట్టుకు పడిపోయిన ఏ నాయకుడూ కూడా ఇప్పుడు నోరు మెదపడం లేదు. వైసీపీ ఓటమి ఖాయమని చెప్పడానికి ఇదే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

‘జయ జయహే తెలంగాణ’ గీతం వరస మారుతున్నది!

‘జయ జయహే తెలంగాణ’ అంటూ సాగే తెలంగాణ రాష్ట్ర గీతంలో సంగీత దర్శకుడు కీరవాణి ఆధ్వర్యంలో స్పల్ప మార్పులు, చేర్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాయదుర్గంలో వున్న కీరవాణి మ్యూజిక్ స్టూడియోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ గీతంలో చేయాల్సిన మార్పులు, చేర్పుల గురించి గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో చర్చించారు. తెలంగాణ గీతంలో జిల్లాల ప్రస్తావన, మరికొన్ని మార్చాల్సిన అంశాలు వున్నాయి. ఆయా అంశాలను మార్చి, వాటి స్థానంలో ఏయే అంశాలను ప్రస్తావించాలన్న పాయింట్ మీద వీరి మధ్య డిస్కషన్ జరిగింది. కీరవాణి బాణీ కట్టిన పాటను సీఎం రేవంత్ రెడ్డి రెండు మూడుసార్లు విని, ఆ పాటలోని అంశాలను చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు వున్నాయి. అందెశ్రీ రాసిన పాటలో పది జిల్లాలు అని వుంటుంది. ఆ పదాన్ని తొలగించి, ఆ స్థానంలో పద.. పద.. అనే పదాన్ని చేర్చినట్టు తెలుస్తోంది.

2 వేల మంది సజీవ సమాధి: విరిగి పడిన కొండ చరియలు!

పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలోని ఎన్గా ప్రావిన్స్‌.లో కొండ చరియలు విరిగిపడి 2 వేల మంది మరణించారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన ‘అంతర్జాతీయ వలస సంస్థ’ ప్రకటించింది. ప్రమాద సమయంలో తొలుత కొండ చరియల కింద 60 ఇళ్ళు కూరుకుపోయాయని భావించారు. కానీ, మొత్తం 150 ఇళ్ళు శిథిలాల కింద కూరుకుపోయాయని ఆ తర్వాత తెలిసింది. శిథిలాల కింద 2 వేల మందికి పైగా జీవ సమాధి అయిపోయారని భావిస్తున్నారు. ఆరు నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తున వున్న బురదలో కూరుకుపోయిన వారు బతికే అవకాశం లేదని తెలుస్తోంది. ఆదివారం నాటికి కేవలం 5 మృతదేహాలను మాత్రమే బయటకి తీయగలిగారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుఝామున అందరూ గాఢ నిద్రలో వున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో వున్న ప్రజలు పారిపోయే అవకాశం కూడా లేకుండా సజీవ సమాధి అయ్యారు.

బీభత్సం సృష్టించనున్న రెమాల్‌ తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను,  తీవ్ర తుఫానుగా మారి బీభత్సం సృష్టించనుంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కేపుపారా కూ దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్ సాగర్ ఐలాండ్స్క 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న రెమాల్ ఉత్తర దిశగా కదులుతూ  మరింత బలపడుతున్నది. ఆదివారం ( మే 26)  అర్ధరాత్రి బంగ్లాదేశ్ కేపూపారా, వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య   తీరం దాటే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో  గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ గాలుల తీవ్రత   135 కిలోమీటర్ల వేగానికి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.  తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్, నికోబార్‌ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ   అప్రమత్తం చేసింది.  ఈ క్రమంలో సోమవారం వరకూ మత్స్యకారులు ఎవరూ సముద్రంలో   వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. రెమాల్ తుపాను ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ మీదుగ ఆవర్తనం.. కేరళ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో  పశ్చిమ దిశ నుంచి ఏపీ వైపు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల చెదురు మొదురు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  బంగాళాఖాతంలో తుఫాను నేపథ్యంలో పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.  తుఫాను ప్రభావం వల్ల శనివారం (మే 25) ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అనంతపురం, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. అనంతపురంలో శుక్రవారం రాత్రి భారీవర్షం కురిసింది. అత్యధికంగా కళ్యాణదుర్గం మండలంలో 86.4, కణేకల్లులో 70, ఉరవకొండలో 62 మి.మీ.లు వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర మండలంలో 72.2 మి.మీ.లు, కనగానపల్లి మండలంలో 63 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఆదివారం కూడా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో వరుసగా కురుస్తున్న వర్షాల ధాటికి పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీంతో చేతికి వచ్చిన పంట వర్షం పాలు కావడంతో రైతన్నలు కన్నీరు పెట్టుకుంటున్నారు.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల కారణంగా దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోసం తండోపతండాలుగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచిఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీసీ వరకూ సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్ధం శిలాతోరణం వరకూ   ఉచిత బస్సులను అందుబాటులో ఉంచింది. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక శనివారం శ్రీవారిని మొత్తం 83 వేల 866 మంది దర్శించుకున్నారు. వారిలో 44 వేల 479 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 15లక్షల రూపాయలు వచ్చింది. 

ఏపీ సీఎస్ కుమారుడి భూభాగోతం..? ధ‌ర్మాన హెచ్చ‌రిక‌లు అందుకేనా?

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు ఆదర్శంగా నిలవాల్సిన‌ ఏపీ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి భూబ‌కాసురుడిలా మారారా? విశాఖలో దళితుల అసైన్డ్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు అప్ప‌నంగా మింగేయాలని ప్రయత్నించాడా?    2వేల కోట్ల రూపాయల భూముల‌ను కాజేసేందుకు స్కెచ్ వేశారా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. జ‌వ‌హ‌ర్ రెడ్డి మ‌రో నెల‌రోజుల్లో సీఎస్ ప‌ద‌వి నుంచి రిటైర్డ్ కానున్నారు.. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హాయ‌ స‌హ‌కారాల‌తో జ‌వ‌హ‌ర్ రెడ్డి కుమారుడు, ప‌లువురు వైసీపీ ముఖ్య‌నేత‌లు అసైన్డ్ భుముల‌ను కాజేసే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  ఏకంగా 800 ఎక‌రాల‌ను అప్ప‌నంగా కొట్టేసేందుకు కుమారుడికి జ‌వ‌హ‌ర్ రెడ్డి స‌హ‌క‌రించారని జ‌న‌సేన నేత పీత‌ల మూర్తి యాద‌వ్ ఆరోపించారు. జ‌వ‌హ‌ర్ రెడ్డి  అధికారిక కార్య‌క్ర‌మాలు లేకుండా అనేక ప‌ర్యాయాలు దొంగ‌చాటున విశాఖ న‌గ‌రానికి ఎందుకు వెళ్తున్నారు? అంత‌ గోప్యంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను ఉంచాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏముంద‌ని జ‌న‌సేన నేత ప్ర‌శ్నించారు. పేద‌లు అసైన్డ్ భూములు, డీ ప‌ట్టా భూములు అమ్ముకునేందుకు వైసీపీ ప్ర‌భుత్వం ఓ చ‌ట్టాన్ని చేసింద‌నీ, ఈ చ‌ట్టాన్ని అడ్డుపెట్టుకొని భోగాపురం చుట్టుప‌క్క‌ల ఉన్న‌టువంటి ప్ర‌ధాన ప్రాంతాల్లో 800 ఎక‌రాలు జ‌వ‌హ‌ర్ రెడ్డి నేతృత్వంలో ఆయ‌న‌ కుమారుడు పేద రైతుల ద‌గ్గ‌ర నుంచి అక్ర‌మంగా దొడ్డిదారిన రాయించుకున్న‌ట్లు జ‌నసేన నేత ఆరోప‌ణ‌లు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వానికి కాలం చెల్లింద‌ని గ‌మ‌నించి రాత్రికి రాత్రే ప‌ట్టాల‌ను త‌మ పేర్ల‌పై రిజిస్ల్రేఫన్లు చేయించుకుంటున్నార‌ని పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.  సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి, ఆయ‌న కుమారుడిపై జ‌న‌సేన నేత చేసిన ఆరోప‌ణ‌ల్లో ఎంత వ‌ర‌కు వాస్త‌వం ఉంద‌నే విష‌యం ప‌క్క‌న పెడితే.. గ‌తంలో వైసీపీ నేత‌, మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద్‌రావు చేసిన హెచ్చ‌రిక‌లు ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఎన్నికల‌కు ముందు ధ‌ర్మాన ప్ర‌సాద్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌డ‌ప నుంచి ఎవ‌రో వ‌చ్చి శ్రీకాకుళం జిల్లా, చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో భూదందాలకు పాల్పడుతున్నారు. శ్రీకాకుళంలో కడప రెడ్లు పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోను.. అది ఏ పార్టీ వారు అయినా స‌రే అంటూ ధ‌ర్మాన హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అప్ప‌ట్లో ధ‌ర్మాన చేసిన వ్యాఖ్య‌లు జ‌వ‌హ‌ర్ రెడ్డి కుమారుడి భూదందాను ఉద్దేశించి చేసిన‌వేన‌ని ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతున్నది. అప్ప‌టి నుంచే జ‌వ‌హ‌ర్ రెడ్డి కుమారుడు భారీ ఎత్తున భోగాపురం ప‌రిస‌ర ప్రాంతాల్లో భూదందాకు తెర‌ లేపార‌ని, సీఎస్ స‌హ‌కారం, ప్ర‌భుత్వ పెద్ద‌ల అండదండలు కూడా పుష్క‌లంగా ఉండ‌టంతో ధ‌ర్మాన అప్పట్లో హెచ్చ‌రిక‌లు చేశార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.  ఏపీ సీఎస్‌ జ‌వ‌హ‌ర్ రెడ్డి స‌హ‌కారంతో ఆయ‌న కుమారుడు భూదందాకు పాల్ప‌డిన‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై తెలుగుదేశం నేత‌లు స్పందించారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ  సీఎస్ జవహర్ రెడ్డి ఈరోజు నుండి ఏ ఫైల్ చూడకుండా, ముఖ్యంగా భూ వ్యవహారాలకు చెందిన ఫైల్స్ చూడకుండా ఎన్నికల సంఘం కట్టడి చేయాల‌ని కోరారు. విశాఖకు చెందిన ఏ అధికారి కూడా ఆయనను కలవకుండా నిరోధించాలన్నారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలెర్ట్ చేసి సీఎస్ జవహర్ రెడ్డి విదేశాలకు పోకుండా పాస్ పోర్ట్‌ను స్వాధీన పరుచుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన కదలికలపై నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎస్‌, ఆయ‌న కుమారుడి భూభాగోతంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని,  జవహర్ రెడ్డి పదవీవిరమణ చేయకముందే  ఆయనను విచారించి, ఆయన భూభాగోతాలను ప్రజలకు తెలియజేయాల‌ని వ‌ర్ల రామ‌య్య సీఈసీని కోరారు.  సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి, ఆయ‌న కుమారుడి భూదందాకు ప్ర‌భుత్వ స‌హ‌కారం ఉంద‌ని అన‌డంలో ఎలాంటి అతిశయోక్తి లేద‌ని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఏపీ సీఎస్ గా జ‌వ‌హ‌ర్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి ప్ర‌భుత్వ అధికారిలా కాకుండా వైసీపీ కార్య‌క‌ర్త‌లా ప‌నిచేస్తున్నారని విప‌క్ష పార్టీల నేత‌లు మొత్తుకుంటున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏది చెబితే అది చేయ‌డంతో పాటు,  ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌రువాత‌కూడా ఆయ‌న వైసీపీ కార్య‌క‌ర్త‌గానే ప్ర‌వ‌ర్తించార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇందులో భాగంగా పెన్ష‌న్లు పంపిణీ విష‌యంలో, వాలంటీర్ల విష‌యంలో జ‌వ‌హ‌ర్ రెడ్డి తీరు వైసీపీ ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉంద‌ని తెలుగుదేశం నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు.  సీఎస్ ప‌ద‌వి నుంచి జ‌వ‌హ‌ర్ రెడ్డిని తొల‌గించాల‌ని ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నాటి నుంచి విప‌క్ష పార్టీల నేత‌లు కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని కోరుతూ వ‌స్తున్నారు. జ‌గ‌న్ చెప్పింద‌ల్లా సీఎస్ చేయ‌డంతో అత‌ని కుమారుడు భూదందాకు ప్ర‌భుత్వ పెద్ద‌లు స‌హ‌క‌రించార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  త‌న‌పై, త‌న కుమారుడిపై వ‌స్తున్న భూదందా ఆరోప‌ణ‌ల‌పై సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి స్పందించారు. విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు గత ఐదేళ్లలో విశాఖలో గాని, ఉత్తరాంధ్రలో గాని ఏ జిల్లాకు వెళ్లలేదు. తన కుమారుడిని అడ్డం పెట్టుకుని బినామీల పేరిట భూములు చేజిక్కించుకున్నట్లు చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. మరో 400 ఎకరాలపైగా భూములను పెద్ద ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అధికారులను పరుగులు పెట్టించినట్లు చేసిన ఆరోపణ ఏమాత్రం వాస్తవం కాదు. ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి మీద రెండు నెలలుగా ఒక పథకం ప్రకారం వ్యక్తిత్వ ఖననం చేసే తీవ్ర కుట్రలో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. కార్పొరేటర్ మూర్తి యాదవ్ తనపై నాపై చేసిన తప్పుడు ఆరోపణలను వెనక్కి తీసుకుని మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేయడంతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటానని జ‌వ‌హ‌ర్ రెడ్డి హెచ్చ‌రించారు. ఏది ఏమైనా సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడి భూదందా వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఆరోపణలను ఆయన ఖండించడం పక్కన పెడితే..ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలనీ, అంత వరకూ సీఎస్ ను విధులకు దూరంగా ఉంచాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఎన్నికల సంఘం వెంటనే ఈ విషయంపై స్పందించి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. 

గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం: 35 మంది మృతి

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాజ్‌కోట్‌లో వున్న టి.ఆర్.పి. గేమ్ జోన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఎక్కువమంది చిన్నపిల్లలు వున్నారు. మంటల్లో చిక్కుకున్న చాలామంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతాయన్న భయం వ్యక్తమవుతోంది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ అగ్నిప్రమాదం పట్ల ప్రధాని నరేంద్రమోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. మృతులకు సంతాపం, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

మీ రాజకీయాలు తగలెయ్య.. నా కూతుర్ని కాపాడండయ్యా!

కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకు వెళ్ళి రెండు నెలలు దాటిపోయింది. కవిత ఎన్నిరకాల కారణాలు చెప్పి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఎప్పటికప్పుడు వినాయకుడి పెళ్ళిలాగా వాయిదా పడుతూనే వుంది. అంతేకాకుండా..  పురుగుమీద పుట్రలాగా ఈడీ కేసుకు తోడు, సీబీఐ కేసు కూడా చేరి మూలిగే అక్క మీద తాటికాయ పడ్డట్టుగా పరిస్థితి మారింది. తల్లి దగ్గర లేకుండానే కవిత పిల్లల పరీక్షలు ముగిశాయి. బీఆర్ఎస్‌కి స్టార్ కాంపైనర్ లేకుండానే ఎలక్షన్లు ముగిశాయి. తెలంగాణ ప్రజలు కవిత అనే ఒక కేరెక్టర్ వుంది అనే విషయం కూడా మెల్లగా మర్చిపోతున్నారు. ఈడీ, మోడీ, బోడి ఎవరొచ్చినా మమ్మల్నేమీ చేయలేరు...  మా జోలికి వస్తే తెలంగాణ సమాజం మొత్తం తిరగబడుతుంది. మీద పడి రక్కుతుంది అని బిల్డప్పు ఇచ్చుకున్న కవితను ప్రస్తుతం జనం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. మందుబాబులు మందు కొట్టడం ఎంతమాత్రం మానలేదు.. అరె.. మన మందు కోసం కవితమ్మ జైల్లోకి వెళ్ళింది కదా.. ఆమెకి మద్దతుగా మందు కొట్టడం ఆపేద్దాం అని ఎవరూ అనుకోవడం లేదు. తెలంగాణ జనం కవిత అరెస్టుని లైట్‌గా తీసుకున్నారు.. ఓకే.. కవితని జనం పట్టించుకోకపో్తే పట్టించుకోకపోయారు.. వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి.  చివరికి కవిత తండ్రి కేసీఆర్, కవిత అన్న కేటీఆర్ కూడా కవిత అరెస్టుని లైట్‌గా తీసుకున్నట్టు అనిపిస్తోంది.  ఢిల్లీలో చక్రం తిప్పుతా, నేను లేస్తే మనిషిని కాదు అన్నట్టుగా మాట్లాడిన కేసీఆర్, తన కుమార్తెని విడిపించుకునే విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు తప్ప, కవితని విడిపించడానికి రాజకీయంగా చాణక్యం ఏదైనా చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టులేరు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే, అసలు తన కూతురు అరెస్టు కాలేదు అన్నట్టుగానే వుంది. మరోవైపు కేటీఆర్ అయితే, పాపం ఆయనకి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అర్జెంటుగా ఎలా కూలదోయాలా అన్న ఆలోచనలోనే వున్నారు తప్ప, తోబుట్టువును బయటకి తీసుకురావడానికి తన తండ్రి మీద ఒత్తిడి తేవాలన్న ఆలోచనలో ఉన్నట్టులేరు. ఇక హరీష్‌రావుకి, గానీ సంతోష్‌రావుకి గానీ కవిత జైల్లో వుండటం పెద్ద బాధ కలిగించే విషయం కాదు. వీళ్ళంతా కవిత విషయంలో చాలా రిలాక్స్.గా వున్నారు. కానీ, ఒక్క మనిషి మాత్రం కవిత అరెస్టు అయినప్పటి నుంచి కుమిలిపోతూ వున్నారు. ఆమె ఎవరో కాదు.. కవిత మాతృమూర్తి శోభ! అల్లారుముద్దుగా పెంచిన కన్న కూతురు జైల్లో వుంటే, ఇటు భర్త, అటు కొడుకు ఇద్దరూ కవితని విడిపించడానికి రాజకీయంగా ఏం చేయాలన్నది ఆలోచించకుండా మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలా అనే ఆలోచిస్తూ వుండటం ఆమెకు ఎంతమాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది. ఇద్దర్నీ ఎంత బతిమాలినా కొంచెం వెయిట్ చెయ్యి, పరిస్థితులు అన్నీ అవే సర్దుకుంటాయి అని చెబుతున్నారట. ఎంత ఒత్తిడి చేసినా ఎలక్షన్లు అయ్యాక పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారతాయి. అప్పుడు కవితని విడిపించడం ఈజీ అవుతుందని చెబుతూ ఆమెని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారట. ఆమె మాత్రం జైల్లో కూతురు ఎలా వుందో, ఎన్ని బాధలు పడుతోందో అని మనోవేదనతో కుమిలిపోతూ వున్నట్టు సమాచారం.

సోనియా, రాహుల్ కాంగ్రెస్ కు ఓటు వేయలేదు!

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా శనివారం (మే 25) జరిగిన ఆరో విడత పోలింగ్ లో కాంగ్రెస్ అగ్రనేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. న్యూఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో  తల్లీ కుమారులిద్దరూ తమ ఓటు వేశారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు. తమ జీవితంలో తొలి సారిగా కాంగ్రెస్సేతర పార్టీకి తమ ఓటు వేశారు. అయితే ఇందులో వారిని తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఎందుకంటే పొత్తులో భాగంగా  ఈ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అంటే ఇండియా కూటమి అభ్యర్థిగా ఆప్ నాయకుడు సోమనాథ్ భారతి నిలబడ్డారు. దీంతో సోనియాగాంధీ,  రాహుల్ గాంధీ తమ ఓటును సోమనాథ్ భారతికి వేశారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిందేమిటంటే వీరిరువురూ  కాంగ్రెస్ కు కాకుండా మరో పార్టీకి ఓటు వేసిన సందర్భం ఇదే మొదటిది. 

విభ‌జ‌న గాయాలు ఇప్ప‌టికీ ప‌చ్చిగానే ఉన్నాయి! న‌ష్ట‌పోతోంది సీమాంధ్ర ప్ర‌జ‌లే!

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే ప‌దేళ్ల త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలోని ప‌లు అంశాల‌కు కాలం చెల్లుతుంది. అయితే ఏపీ నేత‌లు త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు త‌డిబ‌ట్ట వేసుకొని నిద్దుర‌పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ రాజధాని నగరం పూర్తిగా తెలంగాణకు చెందుతుంది. అధికారిక వర్గాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో జాబితా చేసిన వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన, అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విభ‌జ‌న పూర్తి కాలేదు.  1. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు తొమ్మిదో షెడ్యూల్‌లో జాబితా చేశారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కంపెనీలు, కార్పొరేషన్‌లు ఉన్నాయి.  చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి 107 శిక్షణా సంస్థలు ఉన్నాయి. రిటైర్డ్ బ్యూరోక్రాట్ షీలా భిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9, 10 షెడ్యూల్ సంస్థల విభజనపై సిఫార్సులు చేసినప్పటికీ, ఈ అంశం అపరిష్కృతంగానే ఉంది.  2. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ ఈ ఏడాది జూన్ 2వతేదీ నుంచి తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ, 2016వ సంవత్సరంలోనే అప్పటి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయం, దాదాపు రాష్ట్ర పరిపాలన కార్యాలయాలను ఏపీలోని అమరావతికి మార్చారు. అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ ప్రపంచ స్థాయి రాజధానిని అభివృద్ధి చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు.  ఏపీకి ఇప్ప‌టికీ పూర్తిస్థాయి రాజ‌ధాని అందుబాటులోకి రాలేదు.  మ‌రో వైపు ఉమ్మ‌డి రాజ‌ధాని విష‌యంపై ఏపీ చేతులు ఎత్తేసింది. 3. ఆర్టీసీ ఆస్తుల వివాదం ఇప్ప‌టి వ‌ర‌కు తేల‌లేదు. విభ‌జ‌న చ‌ట్టంలో ఆర్టీసీ ఆస్తుల‌ను 10 ఏళ్ల‌లోగా ప‌రిష్క‌రించుకోవాలని.. చెప్పారు. ఆ త‌ర్వాత‌.. అని ఎక్క‌డా చెప్ప‌లేదు. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకున్న తెలంగాణ ప్ర‌భుత్వం తెలంగాణాలోని ఆర్టీసీ ఆస్తుల్ని పూర్తిగా తీసుకునేలా చ‌క్రం తిప్పుతోంది. ఇది ఏపీ ఆర్టీసీకి ఇబ్బందిక‌రంగా మారింది. హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ కోరింది. దానికి టీఎస్‌ఆర్‌టీసీ నిరాకరించింది. షీలా భిడే ప్యానెల్ ఇచ్చిన హెడ్‌క్వార్టర్స్ నిర్వచనం ప్రకారం ఆర్టీసీ ఆస్తులు తమకు చెందినవని టీఎస్ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ ఆస్తులు తెలంగాణకు చెందినవేనని, తెలంగాణ గడ్డపై ఉన్న ఆస్తుల్లో ఏపీకి వాటా ఎలా ఇస్తామని తెలంగాణా నేత‌లు చెబుతున్నారు.  ఆర్టీసీ ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం వాటా ఇవ్వాల్సిందేనని ఏపీ నేత‌లు చెబుతున్నారు. ఆర్టీసీ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఓ కొలిక్కి రాలేదు.  4. హైద‌రాబాద్‌లోని ఏపీ భ‌వ‌నాలు.. కార్యాల‌యాల విష‌యం కూడా తేల‌లేదు. 5. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు, తెలంగాణా నుంచి  6,111 కోట్ల రూపాయల విద్యుత్ బ‌కాయిలు రావాల్సి ఉంది. విభజన తర్వాత విద్యుత్ సరఫరాకు సంబంధించి బకాయిల చెల్లింపు విషయంలో  రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు.  6. ఉద్యోగుల పంపిణీ కూడా అలానే ఉంది.  రాష్ట్ర విభజన తర్వాత 144 మంది తెలంగాణ ఉద్యోగులు 2014 నుంచి ఏపీలో పనిచేస్తున్నారు. వీరిని వెనక్కి తీసుకురావాలని, తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ అధికారుల సంఘం మే 18వతేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందించింది.  7. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవ‌ల‌ సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చారు. అదేమిటంటే,  జూన్ 2 త‌ర్వాత‌ త‌మ ప‌రిధిలో ఉన్న అన్ని కార్యాల‌యాల‌ను తెలంగాణ‌లో క‌లిపేయాలని లిఖిత పూర్వ‌క ఆదేశాలు ఇచ్చారు. ఏపీకు పదేళ్లపాటు ఇచ్చిన హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ ప్రభుత్వ అతిథి గృహం వంటి భవనాలను జూన్ 2వతేదీ తర్వాత స్వాధీనం చేసుకోవాలని సి.ఎం. అధికారులకు ఆదేశించారు.  ఆంధ్ర రాష్ట్ర సమస్యలను జగన్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదు. వైసీపీ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్‌లో నోరెత్తలేదు.  విభజన హామీల‌న్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య ఆస్తుల విభజన, విద్యుత్‌ బిల్లుల బకాయిలు వంటి అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. విభ‌జిత రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. అలా ప‌దేళ్ళు గ‌డిచిపోయాయి.  అయితే రాష్ట్రం ఇబ్బందులు త‌న‌కేమీ ప‌ట్ట‌నట్టుగా కేంద్రం ఉద్దేశ‌పూర్వ‌కంగానే నిర్లక్ష్య వైఖ‌రి అవ‌లంభిస్తోంది.  తెలుగువారు రెండు ముక్క‌లు కావ‌డం. త‌ద్వారా ఢిల్లీ స్థాయిలో వారి ప‌లుకుబ‌డి, ప్రాభ‌వం త‌గ్గింది. అస‌లు ప్రాంతీయ పార్టీల‌ను క‌నుమ‌రుగు చేసేందుకు జాతీయ పార్టీలు  ఉమ్మ‌డిగా చేసిన కుట్ర‌లో భాగ‌మే రాష్ట్ర విభ‌జ‌న  అని ఆంధ్ర మేధావులు చెబుతున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీలు రెండు రాష్ట్రాల‌ను త‌మ రాజ‌కీయ ప్ర‌యోగ‌శాల‌లుగా మార్చేశాయి. అయితే ఈ ఆట‌లో కాంగ్రెస్ తీవ్రంగా న‌ష్ట‌పోయింది.  బీజేపీ ఏమాత్రం ప్ర‌యోజ‌నం పొంద‌గ‌ల‌దనేది భ‌విష్య‌త్తులో తేల‌నుంది. ఒక‌టి మాత్రం నిజం ఈ క్రూర‌మైన రాజ‌కీయ క్రీడ‌లో దారుణంగా న‌ష్ట‌పోయింది మాత్రం సీమాంధ్ర ప్ర‌జ‌లు. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

మోడీకి ఆర్ఎస్ఎస్ సెగ?.. మెజారిటీ తగ్గితే రిప్లేస్ మెంటేనా?

ఈ సారి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో ఎన్డీయే కూటమి కొలువుదీరినా ప్రధానిగా మోడీకి గతంలో ఉన్నంత సీన్ ఉండదా? అంటే ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి ఔనన్న మాటే వినిపిస్తోంది. గత ఎన్నికలలో  బీజేపీ సొంతంగా గెలుచుకున్న సీట్ల కంటే ఈ సారి ఏ మాత్రం తగ్గినా మోడీ రీప్లేస్ మెంట్ విషయంలో బీజేపీలో, బీజేపీ పొలిటికల్ మెంటార్ అయిన ఆర్ఎస్ఎస్ లో విస్తృత చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారాన్ని అందుకునే స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న ప్రబలమైన శక్తి ఆర్ఎస్ఎస్ అన్న విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదు. అందుకే రైటిస్టుల్లో లెఫ్టిస్టుగా పేరు పొందిన వాజ్ పేయి కూడా తన నిర్ణయాలు, విధానాల అమలు విషయంలో ఆర్ఎస్ఎస్ అనుమతి, సలహాలు, సూచనలూ తీసుకునే వారని ఆయన కేబినెట్ లో పని చేసిన వారే కాదు, ఆయన సహచరుడిగా గుర్తింపు పొందిన అద్వానీ కూడా పలు సందర్భాలలో చెప్పారు.  ఇక ప్రస్తుతానికి వస్తే గత పదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పలు నిర్ణయాల విషయంలో ఆర్ఎస్ఎస్ సలహాలూ, సూచనలనూ ఇసుమంతైనా ఖాతరు చేయకుండా వ్యవహరించిందని బీజేపీ వర్గాలే అంటుంటాయి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ తో రాజకీయంగా ఎదిగిన వారిని ఒక్కొక్కరినీ మెల్లిమెల్లిగా పక్కన పెడుతూ మోడీ పార్టీలో ఏకైక నేతగా ఎదిగేందుకు ప్రయత్నించారనీ, అందుకు ఆయనకు అమిత్ షా పూర్తిగా సహకరించారనీ అంటారు. మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉన్న అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను పక్కన పెట్టే విషయంలో ఆర్ఎస్ఎస్ అభ్యంతరాలను ఇసుమంతైనా పట్టించుకోలేదని చెబుతారు. వయస్సు సాకుగా చూపి అద్వానీ, జోషీలను పక్కన పెట్టేసిన మోడీ, షా ద్వయం.. ఇప్పుడు ఏడు పదుల వయస్సుకు చేరువైన మోడీ విషయంలో మాత్రం వయస్సు విషయానికి పట్టింపు లేదన్నట్లుగా మాట్లాడడాన్ని ప్రత్యేకంగా ఎత్తి చూపుతున్నారు.  ఇంత కాలం వేచి చూసే ధోరణి అవలంబించిన ఆర్ఎస్ఎస్ ఇక మోడీ విషయంలో సీరియస్ గా ఆలోచించకతప్పదన్న నిర్ణయానికి వచ్చిందన్న అభిప్రాయం బీజేపీ వర్గాలలో బలంగా వ్యక్తం అవుతోంది.  ప్రస్తుత ఎన్నికలలో బీజేపీ పెర్మార్మెన్స్ ఏ మాత్రం తగ్గినా ఆ ప్రభావం నేరుగా మోడీపైనే పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అన్నిటికీ మించి ఈ సారి బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సాధించడంలో విఫలమై.. అధికారం కోసం మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి వస్తే ఆర్ఎస్ఎస్ కచ్చితంగా ప్రత్యామ్నాయ నేతను తెరపైకి తీసుకువచ్చే అవకాశలే మెండుగా ఉన్నాయని రాజకీయవర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మంద బలం ఉంటే భయంతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు అణిగిమణిగి ఉంటాయే తప్ప.. బీజేపీ సొంత బలం  సన్నగిల్లితే మాత్రం భాగస్వామ్య పక్షాలేవీ కూడా మోడీ నాయకత్వాన్ని అంగీకరించే అవకాశాలు లేవని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ సారి సార్వత్రిక ఎన్నికలలో ఇప్పటి వరకూ జరిగిన ఆరు విడతల పోలింగ్ లో బీజేపీ పెద్దగా పెర్మార్మ్ చేయలేదనే పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. యోగేంద్ర యాదవ్ వంటి స్ట్రాటజిస్టులు అయితే బీజేపీ సొంతంగా గెలుచుకునే స్థానాలు గణనీయంగా తగ్గుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల తరువాత బీజేపీలో పెనుమార్పులు సంభవించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.  

రోజా @ చంద్రముఖి-3

మనందకీ ఒక పదం బాగా తెలుసు... ‘‘పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగ’. ఈ పదాన్ని ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న పరిస్థితులతో ముడివేసి ‘పూర్తిగా చంద్రముఖి-3లా మారబోతున్న రోజా’ అని మార్చి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ నాయకురాలు రోజా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలోకి జంప్ అవబోతున్నారు. జగన్ చెవిలో రోజాపువ్వు పెట్టి, తాను చంద్రముఖి-3లా మారి ‘లక లక లక’ అనబోతున్నారు. రోజా అంటే ఒక చంద్రముఖి కాదు.. మొత్తం ముగ్గురు చంద్రముఖులూ రోజాలోనే కొలువై వున్నారు. తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు రోజా చంద్రముఖి-1లా వుండేవారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన తర్వాత ఆమె చంద్రముఖి-2లా మారారు. ఈ దశలో ఆమె ఏ రేంజ్‌లో విశ్వరూపం చూపారో అందరికీ తెలిసిందే. రోజా చంద్రముఖి-2 వెర్షన్ ముగియబోతోంది. త్వరలో ఆమె చంద్రముఖి-3లా మారనున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, మాంఛి ఓటమి చవిచూసిన తర్వాత రోజా చంద్రముఖి-3లా మారి బీజేపీలోకి ప్రవేశించబోతున్నారు. తనతోపాటు వైసీపీ కూడా ఓడిపోబోతోందన్న క్లారిటీకి వచ్చిన రోజా, తన రాజకీయ మనుగడ కొనసాగాలంటే, తాను ఇంతకాలం వేసిన వెర్రి వేషాలకు పడే శిక్ష నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరడం తప్ప మరో గత్యంతరం లేదని ఫిక్సయినట్టు తెలుస్తోంది. రోగికి కావల్సింది అదే, వైద్యుడు చెప్పిందీ అదే అన్నట్టుగా... బీజేపీకి కూడా కావలసింది వైసీపీ నుంచి ఇలాంటి నాయకులే. అందువల్ల రోజాకి చంద్రముఖి-3 హోదా ఇవ్వడానికి బీజేపీ నాయకత్వం సుముఖంగా వున్నట్టు సమాచారం. రోజా బీజేపీలో చేరే విషయమై కేంద్రంలోని అగ్ర నాయకత్వంతో కూడా మాటామంతీ జరిగినట్టు తెలుస్తోంది. అయితే అతి త్వరలో ‘పూర్తిగా చంద్రముఖి-3లా మారిన రోజా’ని చూడబోతున్నామన్నమాట!

అధికారం తలకెక్కి జనాలను విస్మరిస్తే.. జరిగేదదే!

రాజకీయ నాయకులు అధికారం తలకెక్కి ప్రజలను విస్మరిస్తే.. ఎంతటి నాయకుడికైనా పరాభవం తప్పదు. ప్రతిష్ట మసకబారక తప్పదు.  అధకారంలో ఉండగా తనను తాను కారణజన్ముడిగా మిలినిన మనుషులంతా మామూలు జీవులేనన్న భావన తలకెక్కి వారిని చులకనగా చూస్తే.. జనం తగిన బుద్ధి చెబుతారు. అధికారం నుంచి ఓటు అనే ఆయుధంతో కిందకి దించి వాళ్ల కళ్లు నేలమీదకు వచ్చేలా చేస్తారు. అధికార మదంతో  ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎందరో నాయకులు ఎన్నికలలో పరాజయంతో  తత్వం బోధపరుచుకున్నారు. కొందరికి తత్వం బోధపడదనుకోండి అది వేరే సంగతి. అలాంటి వారు ప్రజా జీవితానికి శాశ్వతంగా దూరం అవుతారు. అధికారంలో ఉండగా నా మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరించిన నేతలకు ప్రజాస్వామ్యం వారి స్థానం ఏమిటో తప్పకుండా చూపుతుంది.  తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి2014లో రాష్ట్రం సాధించే వరకూ అవిశ్రాంతంగా రాజకీయ పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇందకు తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్ లో అధికార పగ్గాలు చేసట్టి.. ఐదేళ్ల కాలంలో జగన్ అహంకారంతో వ్యవహరించిన తీరుపై ప్రజా తీర్పు ఏమిటన్నది మరో పది రోజుల్లో వెల్లడి కానున్నది. కేసీఆర్ విషయానికి వస్తే తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఆయన రాష్ట్రంలో విపక్షం ఎందుకు నేనుండగా అన్నట్లుగా వ్యవహరించారు. ప్రజలు తన పాలనలో సుభిక్షంగా ఉన్నారని ఆయనకు ఆయనే నిర్ణయించుకుని.. ఇంకా నిరసనలూ, ఆందోళనలేమిటని హుంకరించారు. ధర్నా చౌక్ అవసరమే లేదన్నారు. విపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడమే పాలన అన్నట్లుగా వ్యవహరించారు. కూసీఆర్ వైఖరికి జనం సరైన రీతిలో బుద్ధి చెప్పారు. ఎన్నికలలో ఓడించి అధికారం నుంచి దింపేశారు. తెలంగాణ జాతి పితగా కితాబులందుకున్న ఆయన ఓటమి తరువాత సొంత పార్టీ నేతల నుంచే ధిక్కారాన్ని ఎదుర్కొన్నారంటే అందుకు ఆయన వ్యవహరించిన తీరే కారణం.   తెలంగాణ సాధన ఉద్యమమే ఊపిరిగా ఉద్యమకారులకు ఆదర్శంగా నిలిచారు. బలిదానాలను ఆపలేకపోయినా వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానని ఆయనే చెప్పుకున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత ఆయనలోని మరో కోణం బయటపడింది.  తీరు మారింది. వైఖరి మారింది.ప్రతిపక్షం లేకుండా చేయడానికి చాణిక్యనీతి వాడారు. బలిదానం చేసిన కుటుంబాలకు  ఇచ్చిన హామీలను విస్మరించారు. నీళ్లు, నియామకాలు అన్న తెలంగాణ ఆకాంక్ష సారాన్ని విస్మరించారు.  ఉద్యమ సమయంలో తాను స్వయంగా తెలంగాణ ద్రోహులుగా విమర్శలు చేసిన వారికి తన కొలువులో పెద్ద పీట వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే పదేళ్లలో ప్రజానేతగా కేసీఆర్ తన ప్రభను తానే మసక బార్చు కున్నారు. ప్రజా తిరస్కారానికి గురయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2019లో పగ్గాలు చేపట్టిన జగన్ అయితే స్వల్ప కాలంలోనే ప్రజలకు దూరమయ్యారు. వారిని చూడటం ఇష్టం లేకో, లేక ప్రశ్నించి నిలదీస్తారన్న వెరుపో కానీ పరదాలు కట్టుకుని మరీ తిరిగారు. ఎక్కడికక్కడ వందిమాగధులను పెట్టుకుని భజన చేయించుకున్నారు. బటన్ నొక్కి సొమ్ములు విదిలిస్తే ప్రజలు విశ్వాసంగా ఉంటారని తలచారు. అన్ని విధాలుగా ప్రజలను చులకన చేశారు.  ఎవరైనా తన విధానాలను విమర్శిస్తే కేసులు, అరెస్టులు, అవీ కాకపోతే దాడులతో వేధించారు. ఇప్పుడు ప్రజా తీర్పు వ్యతిరేకంగా ఉంటుందన్న భయంతో వణికిపోతున్నారు. 

  రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు 

రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27వ తేదీన సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. హేమతో పాటు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, అశీరాయ్, రిషి చౌదరి, ప్రసన్న, శివానీ జైశ్వాల్, వరుణ్ చౌదరి తదితరులకు నోటీసులు జారీ చేశారు. మొత్తం 86 మందికి ఈ నోటీసులు జారీ అయ్యాయి.  బెంగళూరు రేవ్ పార్టీ కేసును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఏ2 నిందితుడు అరుణ్‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ పార్టీని ఆర్గనైజ్ చేసిన వాసుతో పాటు పార్టీకి హాజరైన వ్యక్తులకు సంబంధించి పోలీసులు అన్ని వివరాలు సేకరిస్తున్నారు.బెంగుళూరులో హేమ పట్టుబడిన నేపథ్యంలో  హేమ చేసే వీడియోలు వివాస్పమౌతున్నాయి. తాను హైదరాబాద్ లోని  ఒక ఫామ్ హౌజ్ లో చిల్ అవుతున్నానని ఒకసారి, తాను బిర్యానీ వండినట్టు మరోసారి వీడియో విడుదల చేశారు. ఇవి ఫేక్ వీడియోలను పలువురు అనుమానం వ్యక్ల చేశారు. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానని హేమ చెబుతున్నా