కొడాలి నాని పరిస్థితి డౌటే?!
వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్యం దెబ్బతిందన్న వార్తలు నాలుగు రోజుల క్రితం వచ్చిన సంగతి తెలిసిందే. నాన్‌స్టాప్ మద్యం తీర్థం, గుట్కా ప్రసాదం కారణంగా నాని ఆరోగ్యం చాలా టూమచ్‌గా డ్యామేజ్ అయిపోయిందన్న వార్తలు వచ్చాయి. అనుచరులతో మాట్లాడుతున్న నాని అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో ఆయనకు ఇంటిదగ్గరే చికిత్స జరుగుతోందని ఆ వార్తల సారాశం. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఆరోగ్యం రాయిలాగా వుందని, ఆయన ఉక్కుముక్కలా, టేకు చెక్కలా, చింతపిక్కలా వున్నారని ఆయన అనుచరులు చెబుతూ వచ్చారు. ‘నానికి అనారోగ్యం’ అనే వార్తలను వారు ఖండించారు. అలాగే కొడాలి నాని ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌లో ఒక వీడియో పోస్టు అయింది. ఒక కుర్చీలో అడ్డదిడ్డంగా కూలబడి వున్న కొడాలి నాని ఫోన్ చూసుకుంటున్నట్టుగా ఆ ఎనిమిది క్షణాల వీడియో వుంది. ‘తనపై వచ్చిన అనారోగ్య వార్తలకు వీడియోతో చెక్ పెట్టిన కొడాలి నాని’ అనే వార్తలను జగన్ అనుకూల మీడియా భారీ స్థాయిలో వ్యాప్తి చేసింది. సరేలే.. మనిషి ఆరోగ్యంగానే వున్నాడుగా అని అందరూ అనుకున్నారు. కానీ, తాజాగా తెలుస్తున్న విషయం ఏమిటంటే, అది పాత వీడియో!
ఎప్పటిలో పాత వీడియో ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసి నాని ఇప్పుడు ఆరోగ్యంగానే వున్నాడు అనే కలరింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాని వున్న సైజుకి, ఆ వీడియోలో వున్న సంబంధం లేదు. తన ఆరోగ్యం బాగాలేదని వార్తలు భారీ స్థాయిలో వస్తే, ‘అయ్యా నేను బాగానే వున్నాను. నా ఆరోగ్యం మీద వస్తున్న పుకార్లని నమ్మొద్దు’ అని నాలుగు ముక్కలు చెప్తే సరిపోతుంది కదా.. అలా చెప్పకుండా ఒక అడ్డదిడ్డంగా కూర్చున్న ఎనిమిది క్షణాల నిడివి వున్న వీడియో పోస్టు చేశారంటే అర్థమేంటి? ఏదో సమ్‌థింగ్ రాంగ్ వుందని! అయినా ప్రజలకు తన నుంచి ఒక వీడియో మెసేజ్ పంపుతున్నామంటే ఎంత పద్ధతిగా వుండాలి? కొడాలి నాని ఎక్స్ అకౌంట్లో పెట్టిన ఆ వీడియోలో పద్ధతీ పాడూ లాంటివేవైనా వున్నాయా?
కొడాలి నాని ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. గుడివాడ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎన్నికల ప్రచారంలో ముక్కుతూనో, మూలుగుతూనో నియోజకవర్గం అంతా తిరిగాడు. ఎన్నికల ముగిసిన తర్వాత ప్రజల్లో తిరగడం గానీ, పోనీ బయటకి వెళ్ళడానికి ఏమైనా ఇబ్బంది వుంటే, తన ఇంట్లోనే ప్రజలతో, కార్యకర్తలతో కలసి మాట్లాడ్డం అంటూ జరగాలిగా.. అలాంటిదేమీ జరగడం లేదు. ఈయన బయటకి వెళ్ళడం లేదు.. ఇంట్లోకి ఎవరినీ రానివ్వడం లేదు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి డౌట్‌గానే వున్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో చేరిస్తే భారీ స్థాయిలో ప్రచారం, ట్రోలింగ్ మొదలైపోతుంది కాబట్టి, ఇంట్లోనే ట్రీట్‌మెంట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కౌంటింగ్ జరిగే జూన్ నాలుగో తేదీ నాటికి కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళి కాసేపు కూర్చునే స్థాయి ఆరోగ్యాన్ని అయినా తిరిగి అందించడానికి డాక్టర్లు తంటాలు పడుతున్నట్టు సమాచారం. కొడాలి నాని ఆరోగ్యం పాడైపోతే పాడైపోయి వుండొచ్చుగానీ, ప్రాణానికేం ప్రమాదం వుండకపోవచ్చు.. ఎందుకంటే, ఆయన కోలుకోవాలని, ప్రాణాలతో వుండాలని రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నాయి మరి!