కన్ఫమ్.. పెనమలూరు విజేత... బోడె ప్రసాద్!
posted on May 27, 2024 @ 2:41PM
కృష్ణాజిల్లా పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థి బోడె ప్రసాద్ విక్టరీ ఖాయమైంది. పెడన నుంచి పారిపోయి వచ్చి, ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జోగి రమేష్ పెడన నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి, ఇంతకాలం రౌడీరాజ్యం నడిపించారు. అక్కడ నుంచి ప్రజలు తరిమిన నేపథ్యంలో పెనమలూరు స్థానం నుంచి రంగంలోకి దిగారు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బోడె ప్రసాద్‌ని రంగంలో నిలపడంతోనే ఓటర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఒక పర్యాయం ఎమ్మెల్యేగా సేవలు చేసి, ఆ తర్వాతి కాలంలో ఓడిపోయినా నియోజకవర్గ ప్రజల సేవలోనే వున్న బోడె ప్రసాద్ మరోసారి టీడీపీ నుంచి పోటీ చేయడం నియోజకవర్గ ఓటర్లకు సంతోషాన్ని కలిగించింది. ఎక్కడి నుంచో పారిపోయి తమ నియోజకవర్గానికి వచ్చిన దుష్టగ్రహాన్ని వదిలించుకునే మార్గం దొరికిందని సంతోషించారు. మే పదమూడున తమ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళిని గమనించిన రాజకీయ పరిశీలకులు ఈ స్థానం నుంచి బోడె ప్రసాద్ విక్టరి కన్ఫమ్ అని క్లియర్‌గా చెబుతున్నారు. తెలుగుదేశం నాయకత్వం పెనమలూరు స్థానం నుంచి బోడె ప్రసాద్‌ని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు జోగి రమేష్ మైండ్ గేమ్ ప్రదర్శించారు. ఇక తన విజయం ఫిక్సయిపోయిందని బిల్డప్పు ఇస్తూ బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. అయితే అదంతా వాపే తప్ప బలుపు కాదని ఆ తర్వాత జోగి రమేష్‌కి అర్థమైంది. జనంలో తనకు బలం లేదని ప్రచారం సందర్బంగా పూర్తిగా అర్థం చేసుకున్న ఆయన జనబలం ఎలాగూ లేదు కాబట్టి, ధనబలం, అధికార బలం, రౌడీల బలంతో అయినా విజయం సాధించాలని ఫిక్సయ్యారు. జనాన్ని ప్రలోభాలకు గురిచేయడం, అధికార దుర్వినియోగం చేయడం దగ్గర్నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు జరపడం వరకు జోగి రమేష్ చేయని అడ్డదారి ప్రయత్నాలు లేవు. గత 20 ఏళ్ళ చరిత్రలో పెనమలూరు నియోజకవర్గంలో ఏనాడూ ఘర్షణలు జరగలేదు. పెడన నుంచి పారిపోయి వచ్చిన జోగి రమేష్ పుణ్యమా అని ఇక్కడ కూడా ఘర్షణల సంస్కృతి ప్రవేశించింది.
జోగి రమేష్ తరహాలో అడ్డుగోలు వ్యవహారాల్లో తలదూర్చకుండా, స్ట్రెయిట్ ఫార్వర్డ్.గా వుండే బోడె ప్రసాద్ వైపు పెనమలూరు ప్రజలు నిలిచారు. ఆయన ప్రచారం చేస్తున్న సమయంలోనే ఆయన ఏ స్థాయి విజయం సాధించబోతున్నారనేది స్పష్టంగా అర్థమైంది. అది చూసి ఓర్చుకోలేని జోగి రమేష్ టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద భౌతిక దాడులకు తన గూండాలను ప్రోత్సహించారు. ఆ దాడులను కూడా టీడీపీ కేడర్ విజయవంతంగా తిప్పికొట్టారు. మాటకు మాట, చేతకు చేత అన్నట్టుగా బోడె ప్రసాద్ బలంగా నిలవడంతో జోగి రమేష్‌కి తోక ముడవక తప్పలేదు. నియోజకవర్గంలో పోలింగ్ సరళిని గమనించిన జోగి రమేష్ తన ఓటమి ఖాయమని ఫిక్సయ్యారు. అందుకే అప్పటి నుంచి అయ్యగారి నోటి నుంచి వాయిస్ లేదు. ఫలితాలు వచ్చిన తర్వాత నియోజకవర్గం నుంచి పెట్టేబేడా సర్దుకుని నియోజకవర్గం నుంచి వెళ్ళిపోయే ఆలోచనలో జోగి రమేష్ ఉన్నట్టు తెలుస్తోంది.