వేణుస్వామి లెక్క తప్పుతుందా? హైదరాబాద్ టీం కూడా పాయే!
posted on May 27, 2024 @ 12:11PM
తెలుగు రాష్ట్రాల్లో జాతకాలు, జోతిష్యం చెబుతూ సంచలన కామెంట్స్ చేస్తూ మీడియాలో నిత్యం కనిపించే స్వామి వేణుస్వామి. సినీ తారల జీవితాలను టార్గెట్ చేసుకొని ఆయన చెప్పే జోతిష్యం ట్రెండింగ్, ట్రోలింగ్ అవుతుంటాయి. జాతకాల పేరుతో తనకు ఇష్టం లేని వాళ్లపై పిచ్చికూతలు కూసే వేణుస్వామి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. ఆ హీరో చనిపోతాడని.. ఈ హీరోయిన్ చనిపోతుందని ఇలా చావు జోస్యాలు చెప్పిన చరిత్ర కూడా ఈ స్వామిది.
అయితే ఏపీ ఎన్నికల ఫలితాలపై కూడా ఆయన నోటి దూల తీర్చుకుంటున్నారు. డబ్బుల కోసం ఎలా కావాలంటే అలా జాతకాలు చెబుతాడని పేరు తెచ్చుకున్న ఆయన, వైసీపీ పెయిడ్ చానల్స్ లో జగన్ గెలుస్తాడని జోస్యాలు చెబుతూ హడావుడి చేస్తున్నారు. ఏపీకి మళ్లీ జగనే సీఎం అవుతారంటూ, పేరు మోసిన జ్యోతిష్యుడు వేణుస్వామి పలు ఇంటర్వ్యూలో చెబుతూనే వున్నారు. నేను రోజుకో మాట మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకుడిని కాదు, జ్యోతిష్యుడిననే దబాయిస్తుంటారాయన. ఒక్కసారి చెప్పిన మాట మీదే నేను నిలబడతాను. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న తర్వాత వైసీపీ విజయం ఖాయమైందనేది ఆయన జోస్యం.
ఇటీవల స్వామి చెప్పిన జోస్యం కనీసం ఒక్కటైనా నిజమైందా అంటే.....వేణుస్వామి కేసీఆర్ గెలుస్తారని చెప్పారు. ఏం అయింది.... కేసీఆర్ ఓడిపోయారు. వేణుస్వామీ హైదరాబాద్ టీం, ఐపీఎల్ గెలుస్తుందని జోస్యం చెప్పారు.. కానీ కనీస పోటీ ఇవ్వలేదు. ఇదే వేణుస్వామి గత మూడు నెలలుగా జగన్ గెలుస్తాడని చెబుతున్నారు.. అది విషయం... ఇప్పుడీ స్వామి పరిస్థితి ఎలా వుందంటే ఆ స్వామివి, పిచ్చికూతలని వైసీపీ ఫ్యాన్స్ కూడా కొట్టి పడేస్తున్నారు. స్వామి మాటలు నమ్మి ఎవరూ బెట్టింగ్ పెట్టవద్దని జగన్ అభిమానులే చెబుతున్నారు. సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి, రాజకీయాల వరకూ ట్రెండింగ్ అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ ఫేమస్ అయ్యానని చెబుతుంటారు ఈ స్వామి. వాస్తవానికి ఆయన చెప్పినవాటిల్లో జరిగినవి ఏమైనా ఉన్నాయా అంటే వాటిని వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. జరగనవైతే లెక్కబెట్టలేనంత ఉంటాయి.
వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి రాజకీయ నేతల జాతకాలు నా వద్ద ఉన్నాయి. అయితే ఆయన జాతకం ప్రకారం వైఎస్ జగన్‌కు తిరుగు ఉండదు. చంద్రబాబుకు కొన్ని గ్రహాల అనుకూలత లేదు. కాబట్టి ఆయనకు ఎలాంటి రాజయోగం లేదు. పవన్ కల్యాణ్ ఎప్పటికీ ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి రాలేడు. కానీ ఓ పార్టీ మాత్రం ఏపీలో ఉండదు అంటూ వేణుస్వామి జోస్యం పేరుతో ఇలా తన నోటి దూల తీర్చుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం వేణుస్వామి చెప్పిన పరిస్థితులకు భిన్నంగా క్షేత్రస్థాయిలో అభిప్రాయలు విభిన్నంగా కనిపిస్తున్నాయి.
- ఎం.కె. ఫజల్