లులియాకి హిందీ ట్యూషన్ పెట్టించిన సల్మాన్ ఖాన్.. ఎందుకో..?
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి ప్రేమాయణాలకు కొదువే లేదు. గతంలో చాలా మంది హీరోయిన్స్ తో రూమర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రొమేనియన్ మోడల్, టీవీ స్టార్ లులియా వంటూర్‌ని ప్రేమిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న వీరిద్దరి వ్యవహారం మరోసారి వార్తల్కోకి ఎక్కింది. అందేంటంటే అసలేమాత్రం హిందీ రాని లులియాకి చక్కటి హిందీ నేర్పడానికి సల్మాన్ ట్యూషన్ పెట్టించాడట. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. లులియా ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో అడుగుపెడుతుంది. ఈ నేపథ్యంలోనే హిందీ రాక ఇబ్బంది పడుతున్నందుకు ట్యూషన్ పెట్టించాడని అంటున్నారు. అయితే హిందీ సినిమాల్లో నటించేందుకా, లేక సల్మాన్ కుటుంబీకులతో కలిసిపోవడానికా అన్నది బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. మరి ఎందుకో సల్మాన్ కి, లులియాకే తెలియాలి.