వాస్తుని గట్టిగా నమ్ముతున్న కేసీఆర్.. సచివాలయానికి 3సార్లే

 

తెలంగాణ సీఎం కేసీఆర్ సచివాలయం వాస్తు బాలేదని దానిని వేరే చోటికి మార్చాలని అప్పట్లో చాలానే ప్రయత్నించారు. మొదట్లో దానిని ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలోకి మార్చాలని అనుకున్నారు కానీ అక్కడ దానికి వ్యతిరేకత రావడంతో సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ లోకి మార్చాలని అనుకున్నారు. కానీ అది కూడా ఇంతవరకూ జరగలేదు. అయితే ఇప్పుడు కేసీఆర్ మాత్రం సచివాలయ వాస్తు బాలేదన్న కారణంతో సచివాలయానికి అరుదుగా వస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కువ సమయాన్ని తన క్యాంపు కార్యాలయంలోనే గడుపుతున్నారట. లేకపోతే జూబ్లీహిల్స్‌లోని హెచ్ఆర్డీ కార్యాలయం నుంచి రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గత నెలరోజులలో కేవలం మూడుసార్లు మాత్రమే సచివాలయానికి వెళ్లారు.. ఇదిలా ఉండగా రాజ్ భవన్ ను ఎక్కువసార్లు సందర్శించినట్టు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. కేసీఆర్ సచివాలయానికి సరిగా వెళ్లకపోవడం వల్ల చాలా ఫైళ్లు పెండింగ్ లో ఉన్నట్టు చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ వాస్తును బలంగా నమ్ముతున్నారన్నది అర్ధమవుతోంది.

Teluguone gnews banner