జగన్‌ది బినామీ బతుకు.. జగన్ కూడా మగాడైతే..
టీడీపీ నేతలకు రాజధానిలో భూములున్నాయని.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పత్రిక అయిన సాక్షిలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే మంత్రి నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, గంటా జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన పయ్యావుల కేశవ్ మాత్రం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్‌ది బినామీ బతుకు అని, తాను అతనిలా బినామీ పేర్ల మీద ఆస్తులు కొనలేదని, మగాడిలా ఆస్తులు కొన్నానని వ్యాఖ్యానించారు. జగన్‌ది బినామీ బతుకు జగన్ కూడా మగాడైతే, ఆయన ఒంట్లో రాయలసీమ రక్తమే ఉంటే, బినామీ బతుకు కాకుంటే... రాజధాని నడిబొడ్డున తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు.