కాపులను ‘దరిద్రపు జాతి' అన్న ముద్రగడ..
posted on Mar 3, 2016 @ 1:31PM
కాపులకు అన్యాయం జరుగుతుంది.. కాపులకు న్యాయం చేయాలి.. కాపులకు రిజర్వేషన్లు కల్పించండి అంటూ పోరాటం చేసిన ముద్రగడ.. ఇప్పుడు కాపులను ఉద్దేశించి అన్న ఒక మాటకు కాపులే తెగ ఫీలవుతున్నారంట. అదేంటి అనుకుంటున్నారా.. ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని హామీలు కూడా ఇచ్చింది. అయితే వాటిపై ముద్రగడ నిన్న మీడియాతో మాట్లాడుతూ దీక్ష సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడంలేదని.. హామీలు నెరవేరక నేను సిగ్గుపడుతున్నాని.. దీనిపై రెండు మూడు రోజుల్లో కాపు నేతలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. అంతేకాదు దీనిపై సీఎం చంద్రబాబుకి కూడా ఒక లేఖ రాశారు. అయితే ఆలేఖలో ముద్రగడ తన కులాన్ని ఉద్దేశించి ‘దరిద్రపు జాతి’’ అంటూ రాశారు.
అయితే ఈ మా ను ఆయన ఒక్కసారి కాదు నాలుగుసార్లు ఉపయోగించారంట. ఇప్పుడు ముద్రగడ ఈ పదాన్ని పదే పదే వినియోగించటంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. ‘‘దరిద్రపు జాతి’’అని తమను తాము కించపర్చుకునేలా.. తక్కువ చేసుకునేలా అనుకోవటం ఏ మాత్రం సబబు కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.