సెల్ఫీ తీసుకోబోయి.... ఐదుగురికి తీవ్ర గాయాలు!
posted on Mar 3, 2016 @ 3:49PM
సెల్ఫీల పిచ్చిలో ప్రాణాల మీదకు తెచ్చుకునే వార్తలకు అంతులేకుండా పోతోంది. తాజాగా గోవాలోని ఒక కొండ మీద సెల్పీని తీసుకోబోయిన అయిదుగురు తీవ్ర గాయాలకు లోనయ్యారు. కొండ చరియ మీద ఉన్న ఒక తలుపుకి ఆనుకుని, సెల్ఫీని తీసుకుంటుండగా, అకస్మాత్తుగా తలుపు తెరుచుకోవడంతో.... అంతా కిందకి పడిపోయారు. వీరిలో ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది. వీరి వెన్నెముకకి తీవ్రగాయాలు కావడంతో మున్ముందు ఒకవేళ కోలుకున్నా, లేచి నడవడం అసాధ్యమని చెబుతున్నారు వైద్యులు. ఇలా ఉండగా గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీలు తీసుకోబోయి కనీసం 27 మందన్నా మరణించి ఉంటారని వాషింగ్టన్ పోస్టు అనే పత్రిక పేర్కొంది. వీరిలో దాదాపు సగం మంది భారతీయులే అని తెలుస్తోంది. వీరంతా సముద్రాలలోనూ, కొండచరియల మీదా, రైళ్లు వస్తుండగా.... సెల్ఫీలు తీసుకోబోయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.