తండ్రి హత్య విషయంలో నో కామెంట్స్ అంటున్న రాహుల్..
posted on Mar 3, 2016 @ 4:04PM
ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏం జరిగినా నేనున్నానంటూ వెంటనే అక్కడికి వెళ్లిపోతున్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ. ఇక జెఎన్ యూ, హెచ్ సీయూ ఘటనలు జరిగినప్పుడైతే చెప్పనవసరం లేదు.. ఆ యూనివర్శిటీల్లోకి వెళ్లి విద్యార్ధులకు మద్దతు పలికారు కూడా. రోహిత్ ఆత్మహత్య ఘటనలో రెండుసార్లు ఢిల్లీ నుండి వచ్చి మరీ దీక్షలో పాల్గొన్నారు. ఇక ఈ వ్యవహారంలో స్మృతీ ఇరానీపై కూడా ఆరోపణలు వస్తుండటంలో రాహుల్ రెచ్చిపోయారు. అయితే ఎవరో సామాన్య వ్యక్తుల కోసం ఇంతలా స్పందిస్తున్న రాహుల్ తన తండ్రి విషయంలో మాత్రం ఎందుకు నోరు తెరవడంలేదు అన్న సందేహాలు వస్తున్నాయి.
రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులను విడుదల చేయాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించాలని రాహుల్ ను కోరినప్పుడు మాత్రం నో కామెంట్ అని నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అంతేకాదు కొడుకుగా తాను ఈ విషయం మీద మాట్లాడలేనని చెప్పారు. దీంతో ఇప్పుడు కన్న తండ్రి వ్యవహారంలో మాట్లాడలేరు కానీ.. వేరే వ్యక్తుల విషయంలో మాత్రం మాట్లాడతారా అంటూ కామెంట్లు విసురుతున్నారు. అసలు ఎందుకు ఈ విషయంలో మాట్లాడటం లేదు అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి రాహుల్ ఎందుకు మాట్లాడటంలేదో వివరణ ఇస్తే బావుంటుంది.