ఆరోజు మహిళా ఎంపీలే మాట్లాడాలి.. మోడీ
posted on Mar 3, 2016 @ 3:17PM
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో జెఎన్ యూ, హెచ్ సీయూ ఘటనలపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. అధికార పక్ష, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ఈ విషయాలపై మోడీ ఎలా స్పందిస్తారు.. విపక్ష నేతలకు ఎలా సమాధానమిస్తారు అని ఆసక్తిగా ఎదురుచూశారు. ఈనేపథ్యంలోనే తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ మొదట రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం.. సభను అడ్డుకోవటం సరికాదంటూ పలు కోట్ చేసిన ఆయన.. అవన్నీ దివంగత ప్రధానులు నెహ్రు.. ఇందిరా.. రాజీవ్ గాంధీల కొటేషన్లు చెబుతూ కాంగ్రెస్ కు చురక పెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. కమ్యూనిస్ట్ సీనియర్ నేత సోమ్నాథ్ చటర్జీ కోట్ లను ప్రస్తావిస్తూ.. వామపక్షాలకు డిఫెన్స్ లో పడే ప్రయత్నం చేశారు. ఇంకా ఈనెల 8వ తేదీ మహిళా దినోత్సవం కావడంతో ఆరోజు మహిళా ఎంపీలే మాట్లాడితే బావుంటుందని సూచించార. అంతేకాదు కొత్తగా ఎన్నికై తొలిసారి సభకు వచ్చే ఎంపీలకు చాలానే ఐడియాలు ఉంటాయని.. వారి భావాలు వినేందుకు ఒక వారం పాటు వారు మాత్రమే మాట్లాడే అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్నను సందించారు.