మరో సంచలానికి జయలలిత.. కేంద్రానికి లేఖ..
posted on Mar 3, 2016 @ 11:42AM
రాజీవీ గాందీ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు ఎల్టీటీ ఉగ్రవాదులు ఇప్పటికే యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరి వ్యవహారంపై తమిళనాడు సర్కార్ మరో సంచలానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలోనే జయలలిత సర్కార్ 24 ఏళ్లుగా వారు జైల్లోనే మగ్గుతున్నారు అంటూ దయ చూపగా.. నాటి యూపీఎ హయాంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ మాత్రం ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జయలలిత మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే రాజీవ్ హత్య కేసులో నిందితులు గత 24 ఏళ్లుగా జైల్లోనే మగ్గిపోతున్నారు.. వారి విడుదల చేయడానికి నిర్ణయించుకున్నాం.. దీనిపై మీరేమంటారు?అంటూ జయలలిత కేంద్రానికి లేఖ రాశారు. మరి ఈ లేఖపై కేంద్రం ఏలా స్పందిస్తుందో.. అసలు ఈ లేఖపై కాంగ్రెస్ పార్టీ ఎంత రచ్చ చేస్తుందో చూడాలి.