దీపిక పదుకొనేకు స్మితా పాటిల్ స్మారక అవార్డు
posted on Jul 31, 2012 @ 4:46PM
చిత్ర పరిశ్రమలో అందించిన సేవలకు గుర్తుగా ఇచ్చే స్మితా పాటిల్ స్మారక అవార్డుకు బాలీవుడ్ తార దీపికా పదుకొనే ఎంపికైంది. ఈ అవార్డును స్మితాపాటిల్ 28వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 18 తేదిన పదుకొనేకు అందచేస్తారు. రెండు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే ఈ అవార్డును ప్రియదర్శిని అకాడమి నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో ఆయా రంగాల్లో విశిష్ట సేవలందించిన కుమార మంగళం బిర్లా, సమీర్ బ్రహ్మచారి, నీరజ్ దేవా, ఆదిత్యపురి, మిలింద్ దియోరాలను సన్మానించనున్నారు