లండన్ ఒలింపిక్స్‌లో ఫ్రీ క్వార్టర్స్ లోకి కశ్యప్
posted on Jul 31, 2012 @ 5:03PM
లండన్ ఒలింపిక్స్‌లో తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ జోరు కొనసాగుతోంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కశ్యప్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్న వియత్నాం ఆటగాడు నుయెన్‌పై 21-9 , 21-14 స్కోర్ తేడాతో గెలుపొందాడు. మ్యాచ్ ప్రారంభం నుండి ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచిన ఈ హైదరాబాదీ రెండో సెట్‌లో కాస్త తడబడ్డాడు. అయినప్పటకీ పుంజుకుని ప్రత్యర్థిని నిలువరించాడు. ఈ విజయంతో కష్యప్ ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టాడు.