విద్యార్థినులపై టీచర్ లైంగిక వేధింపులు
posted on Jul 31, 2012 @ 2:47PM
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడుగా మారాడు. కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. హైదరాబాద్ అంబర్‌పేటలోని నాలెడ్జీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసే ప్రేమ్‌రాజ్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.విషయం తెల్సుకున్న తల్లిదండ్రులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. అయితే సదరు మాస్టారి ఫోటో, వివరాలు కూడా స్కూల్‌లో లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్కూల్ ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రిన్సిపల్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని, స్కూల్‌కు తాళం వేశారు. పరారీలో ఉన్న ప్రేమ్‌రాజ్ కోసం గాలిస్తున్నారు.