ఒలింపిక్స్ నుంచి గుత్తా జ్వాలా జోడి అవుట్
posted on Jul 31, 2012 @ 5:31PM
ఒలింపిక్స్ నుంచి బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ జోడీ గుత్తా జ్వాలా, దిజులు ఉత్త చేతులతో వెనుదిరిగారు. గ్రూప్ సిలో ఆడిన మూడో మ్యాచ్‌లోనూ ఓడారు. కొరియా జోడీ డే లీ, హున్ హాతో జరిగిన మూడో మ్యాచ్‌లో 15-21, 15-21 తేడాతో భారత జోడి పరాజయం పాలైంది.. గ్రూప్ స్టేజ్‌లో అన్ని మ్యాచ్‌లూ ఓడటంతో కనీసం ప్రి క్వార్టర్స్‌కు కూడా చేరకుండానే ఇంటిదారి పట్టారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఈ ఇద్దరూ ఇంతకుముందు ఇండోనేషియా, డెన్మార్క్‌లతోనూ ఓడిపోయారు.