ఇంజనీరింగ్ సీట్ల ఫీజులపై డిప్యూటీ సిఎం వివరణ
posted on Aug 1, 2012 @ 11:48AM
తెలంగాణాలో మెడికల్ కాలేజీలలో మెడికల్ సీట్లు పెంచాలని, ఫీజులు పెంచాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజీ
యాజమాన్యాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న అనగా 31-07-12 ప్రైవేట్ ఇంజనీరింగ్ మరియు
మెడికల్ కాలీజీ యాజమాన్యాలు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ విషయంపై చర్చలు జరిపి సాయంత్రం ఈ సంవత్సరం
ఇంజనీరింగ్ ఫీజు పెంచే యోచనను మానుకున్నారు. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫీజులు యథాతథంగా
వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ స్పందిస్తూ సుప్రీంకోర్టు
తీర్పు ప్రకారమే ఇంజనీరింగ్ ఫీజులు తీసుకోవాలని, మెడికల్ సీట్లు రాకపోవడంలో వైఫల్యానికి సమిష్ట బాధ్యత తమదేనని
వివరణ ఇచ్చారు.