50 ఏళ్ళు దాటిన మహిళలు యోగా చేయవచ్చా..?
50 ఏళ్ళు దాటిన మహిళలు యోగా చేయవచ్చా..?
యోగ, జిమ్, ఎక్సర్సైజ్ వంటివన్నీ కేవలం వయసులో ఉన్నవాళ్లకే అనుకుంటారు చాలామంది. మరీ ముఖ్యంగా వయసు పెరిగేకొద్దీ అలా నడవడం తప్ప వేరే పనులేమీ చేయరు. ఆడవారిలో 40 సంవత్సరాల తరువాత మెనోపాజ్ దశ దాటిపోగానే వారిలో మానసిక, శారీరక ఆరోగ్యం గురించి సహజంగానే శ్రద్ధ తగ్గుతుంది. వయసు వల్ల కాళ్ళు, చేతుల ఎముకలు, కండరాల పటుత్వం తగ్గి సాధారణ పనులు, చిప్పటి దూరానికి నడకను తమ రోజువారీ ఆరోగ్యం జాబితాలో చేర్చేస్తారు. కానీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. యోగ అనేది వయసుతో సంబంధం లేకుండా చేయగలిగే ఒక గొప్ప చర్య. అయితే వయసుకు తగిన విధంగా యోగాను చేయవచ్చు.
50 సంవత్సరాలు దాటిన మహిళలు యోగా చేయడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వయసు పెరిగినా చలాకీగా, అందంగా, మరెంతో శరీర దృఢత్వంతో ఉండటానికి యోగానే బెస్ట్. అలాంటి యోగా చేయడంలో ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవి.
వార్మప్ చాలా ముఖ్యం!!
ఏ వయసు వారు అయినా వార్మప్ చేయకుండా వ్యాయామం కానీ, యోగ కానీ చేయకూడదు.మరీ ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన వారి శరీరం చాలా తొందరగా ఇబ్బందులకు గురవుతుంది. ఆ తరువాత కోలుకోవడం కూడా కష్టమవుతుంది. వయసు పెరిగిన తరువాత శరీరంలో కీళ్ల సామర్థ్యము కాస్త తగ్గుతుంది. వార్మప్ లేకుండా ఒకేసారి యోగా కానీ వ్యాయామం కానీ చేయకూడదు. వార్మప్ వ్యాయామానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
బేసిక్ మూవ్ మెంట్స్ అనుసరించాలి!!
యోగాలో బేసిక్ మూవ్ మెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో అన్ని అవయవాలు మూవ్ అవ్వడానికి ప్రాథమిక సూత్రాలు లాగా ఉపయోగపడతాయి. కొందరు మహిళలు యోగ క్లాస్ కి వెళదాం అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్లి చాలా ఇబ్బందులు పడాలి అనే ఆలోచనతో మానేస్తారు. అదే ఈ బేసిక్ మూవ్ మెంట్స్ ను ఇంట్లో మెల్లిగా చేస్తూ ఉంటే యోగా ఎంతో సులువు అవుతుంది.
సెలక్షన్!!
యోగ క్లాస్ కు వెళ్ళడానికి ఏదో ఒకటి అనుకుని వెళ్ళిపోయి డబ్బు కట్టేసి తీరా అక్కడ సరిగా నేర్పడం లేదనో, ఆ వాతావరణం బాగలేదనో ఫీలవడం, డబ్బు పోయిందని కూడా బాధపడటం కంటే మీకున్న స్నేహితులు, తెలిసినవారితో మంచి యోగ సెంటర్ గురించి విచారించి తెలుసుకుని ఆ తరువాత సెలెక్ట్ చేసుకోవడం ఒకసారి అక్కడికి వెళ్లి అంతా గమనించి తరువాత జాయిన్ కావడం మంచిది.
సమస్య ఉంటే….!!
యోగ చేయడానికి శరీరంలో ఎక్కడైనా ఏదైనా గాయం లేదా నొప్పి వంటివి ఉన్నప్పుడు యోగా సెంటర్ కు కొంచెం ముందుగానే వెళ్లి సమస్యను చెప్పాలి. యోగ శిక్షకులు శరీర స్థితిని బట్టి, నొప్పి లేదా గాయం మానడానికి కూడా పరిష్కారాలు చెబుతారు.
అవసరమైనవి మరచిపోవద్దు!!
యోగ నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు కావలసిన వస్తువులు ఉంటాయి. వాటిని తీసుకెళ్లడం మరచిపోకూడదు. యోగ మ్యాట్, వాటర్ బాటిల్, సరైన దుస్తులు మొదలైనవి ముఖ్యం. మెత్తగా ఉన్న యోగ మ్యాట్ తో పాటు యోగ చేసేటప్పుడు శరీరం తగిన విధంగా మూవ్ అవ్వడానికి మంచి కంఫర్ట్ గా ఉన్న యోగ ప్యాంట్స్ వాడటం మంచిది.
ప్రాక్టీస్!!
ప్రాక్టీస్ కెన్ మేక్స్ ఈసీ అంటారు. ప్రాక్టీస్ చేయడం వల్ల అన్నీ సులభంగా అనిపిస్తాయి. అయితే యోగా క్లాసులు మొదటి రెండు మూడు సార్లు వెళ్లిన తరువాత అన్ని భంగిమలు సులభంగా ఉండవని అర్థమవుతుంది. అందుకే కష్టంగా అనిపించినవి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తుండాలి. అలా చేయడం వల్ల యోగ క్లాసులో ఒకదాని తరువాత ఒకటి పూర్తి చేయడం సులభం అవుతుంది.
ఈ విధంగా పై టిప్స్ పాటిస్తే 50 సంవత్సరాలు దాటినా హాయిగా యోగ చేయచ్చు.
◆నిశ్శబ్ద.