దేవి నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఇష్టమైన ఈ పువ్వులను సమర్పించండి..!
దేవి నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఇష్టమైన ఈ పువ్వులను సమర్పించండి..!
సనాతన ధర్మంలో నవరాత్రి చాలా పవిత్రమైన పండుగగా పరిగణించబడుతుంది. నవరాత్రి పండుగ సంవత్సరానికి నాలుగు సార్లు వస్తుంది. వీటిలో రెండు గుప్త నవరాత్రులు, ఒక చైత్ర నవరాత్రి లేదా వసంత నవరాత్రి. రెండవది శారదయ నవరాత్రి లేదా శరన్నవరాత్రి. వీటిలో శరన్నవరాత్రి అత్యంత ముఖ్యమైనది. శరన్నవరాత్రి వేడుకలు చాలా గొప్పవిగా పరిగణించబడతాయి. చాలా ప్రాంతాలలో భక్తులు తమ ఇళ్లలో, దేవాలయాలలో, పూజ మండపాలలో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి, తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల దేవతలను పూజిస్తారు. అచ్చం వినాయకుడి నవరాత్రులను ఇలాగే చేస్తారు. ఈ సంవత్సరం నవరాత్రి పండుగ సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తుంది. సాధారణంగా పూజలో పువ్వులు సమర్పించడం సహజం. అయితే ఆయా దేవతలకు ఇష్టమైన పువ్వులతో పూజ చేయడం వల్ల దేవతల అనుగ్రహం మరింత తొందరగా, మెరుగ్గా ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు పొందడానికి నవరాత్రులలో ఏ పువ్వులను సమర్పించాలో తెలుసుకుంటే..
పువ్వుల ప్రాముఖ్యత..
దేవుని పూజలో కొన్ని పువ్వులను దేవతలకు పెట్టకూడదని, మరికొన్నింటిని సమర్పించినప్పుడు దేవతలు సంతోషిస్తారని, భక్తుల కోరికలను తీరుస్తారని నమ్ముతారు. వీటిలో ఎర్రటి పువ్వులు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి, ముఖ్యంగా దుర్గాదేవికి ఇష్టమైన పువ్వుగా ఎర్ర మందారం పరిగణించబడుతుంది. ఈ పువ్వుకు అమ్మవారి పూజలో చాలా ప్రాధాన్యత ఉంది.
అమ్మవారిని ఇలా అర్చించాలి..
నవరాత్రి సమయంలో భక్తులు ఉపవాసం ఉండి, దుర్గాదేవిని భక్తితో పూజిస్తే అమ్మ వారు జీవితాల్లోని అన్ని కష్టాలను తొలగించి, వారిని రక్షిస్తుందని నమ్ముతారు. అందుకే నవరాత్రి సమయంలో అమ్మవారికి ఇష్టమైన పువ్వులు, నైవేద్యం, దుస్తులను సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అమ్మవారిని ఇట్లా పూజించడం ఎప్పటినుండో ఆనవాయితీ గా వస్తోంది.
ఎర్ర మందారం..
ఎర్రమందారం పువ్వులు నవరాత్రి సమయంలో పూజలో ఉంచాలి. ఒకవేళ ఎర్ర మందారం లభించకపోతే ఎరుపు రంగులో ఉండే పువ్వులను తప్పక ఉండేలా చూసుకోవాలి. ఎరుపు రంగు శక్తికి ప్రతీక. అమ్మవారు శక్తి స్వరూపిణి. అందుకే అమ్మవారికి ఎరుపు రంగులో ఉండే మందారం లేదా ఏవైనా ఇతర పువ్వులను అయినా సమర్పిస్తారు.
అపరాజిత లేదా శంఖు పువ్వులు..
దుర్గాదేవి పూజ సమయంలో అపరాజిత పువ్వును కూడా సమర్పించవచ్చు. ఈ పువ్వు అమ్మవారిని సంతోషపరుస్తుంది. భక్తుల కోరికలన్నింటినీ నెరవేరుస్తుంది. దుర్గా సప్తశతిలో కూడా ఈ పువ్వు గురించి ప్రస్తావించబడింది. ఎరుపు రంగు శక్తి, శౌర్యం, శ్రేయస్సును సూచిస్తుంది, కాబట్టి దీనికి దేవత ఆరాధనలో ప్రత్యేక స్థానం ఇవ్వబడుతుంది.
*రూపశ్రీ.