ఈ రోజే పౌర్ణమి.. రాత్రి వెన్నెలలో ఈ ఒక్క పని చేస్తే అమ్మవారి అనుగ్రహం అపారం..!

 

ఈ రోజే పౌర్ణమి.. రాత్రి వెన్నెలలో ఈ ఒక్క పని చేస్తే అమ్మవారి అనుగ్రహం అపారం..!


పౌర్ణమి,  చతుర్థశి,  అమావాస్య,  పంచమి, అష్టమి లాంటి తిథులు సాధారణ తిథుల కంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఈ తిథులు అమ్మవారి ఆరాధనకు  చాలా శ్రేష్టమైనవి.  ఆశ్వయుజ మాసంలో అమ్మవారి శరన్నవరాత్రులు ముగిసిన తరువాత పౌర్ణమి వస్తుంది.  ఈ పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. సాధారణంగానే పౌర్ణమి రోజు అమ్మవారి శక్తి అధికంగా ఉంటుందని,  పౌర్ణమి రోజు లలితా సహస్రనామ పారాయణ చేయడం గొప్ప ఫలితాలు ఇస్తుందని అంటారు. అలాంటిది ఆశ్వయుజ పౌర్ణమి మరింత ప్రత్యేకం అని కూడా అంటున్నారు. దీని వెనుక ఆధ్యాత్మిక, దైవిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..

ఆశ్వయుజ మాసం ప్రత్యేకత..

ఆశ్వయుజ మాసం నవరాత్రులు, దుర్గాపూజ, శరన్నవరాత్రి వంటి శక్తి ఆరాధనకు ప్రసిద్ధినది. ఈ మాసంలోని పౌర్ణమి రోజు శక్తి తత్త్వం అత్యధికంగా ప్రబలుతుందని నమ్మకం.

చంద్రుడు–శక్తి సంబంధం..

పౌర్ణమి రోజున చంద్రుడు సంపూర్ణ కాంతితో ప్రకాశిస్తాడు. చంద్రుడు మనసుకు అధిపతి. శక్తి ఆరాధన (లలితాంబికా) తో కలిపినప్పుడు మనసు ప్రశాంతమవుతుంది, ఆత్మస్ఫూర్తి కలుగుతుంది.

లలితా సహస్రనామం శక్తి..

లలిత సహస్రనామం శ్రీచక్రం, త్రిపురసుందరి మహాదేవి మహిమలను వర్ణిస్తుంది. ప్రతి నామం ఒక బీజమంత్రముగా, యంత్ర–తంత్ర–మంత్రాల తత్త్వాన్ని కలిగివుంటుంది. పౌర్ణమి రోజున వీటి జపం మరింత ఫలప్రదం అవుతుంది.

ఆధ్యాత్మిక ప్రయోజనాలు..

పౌర్ణమి రోజు లలితా పారాయణం చేస్తే మనోశాంతి, చిత్తశుద్ధి కలుగుతుంది. జ్ఞానం, భక్తి, ఐశ్వర్యం అనే మూడు వరాలను ప్రసాదిస్తుంది. భయాలు, మానసిక అస్థిరతలు తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధ్యానం, జపం, ఆరాధనకు సులభమైన స్థితి కలుగుతుంది.

దైవిక ప్రయోజనాలు..

సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యం ఇవన్నీ లభిస్తాయి. ఎందుకంటే లలితా దేవి “ఐశ్వర్యప్రదాయినీ” అని స్తుతించబడింది. ఆశ్వయుజ పౌర్ణమి రోజున చేసిన పారాయణం ఇంటిలో సౌఖ్యం, ఆర్థిక ప్రగతి కలిగిస్తుందని చెబుతారు.

ఆరోగ్య రక్షణ..

సహస్రనామం శరీరంలో ప్రాణశక్తిని పెంచి రోగనివారణ శక్తిని ఇస్తుంది.

పాపక్షయము, దుష్ట నివారణ..

సహస్రనామ పారాయణం వలన పూర్వకర్మల పాపాలు క్షీణిస్తాయి, దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది.

కుటుంబ కలహాల నివారణ..

ఇంట్లో  సామరస్యాన్ని, అనురాగాన్ని పెంచుతుంది. భార్యభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను కలిగిస్తుంది.

పారాయణ చేస్తే..

ఆశ్వయుజ పౌర్ణమి రోజున లలితా సహస్రనామాన్ని పారాయణం చేస్తే  శ్రీచక్రారాధనకు  సమానంగా ఫలితం ఇస్తుంది. శక్తి, భక్తి, శాంతి, సంపద  ఈ నాలుగు సిద్ధిస్తాయని “బ్రహ్మాండ పురాణం” లో, శ్రీవిద్య ఆగమాలలో చెప్పబడింది.

                                 *రూపశ్రీ.