Read more!

దసరా వేడుకలు - బతుకమ్మ ఆట (Telangana Batukamma Celebrations)

 

దసరా వేడుకలు - బతుకమ్మ ఆట

(Telangana Batukamma Celebrations)

దసరా పండుగ సందర్భంగా తెలంగాణా ప్రాంతీయులు బతుకమ్మ ఆట ఆడతారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ నవమి వరకు బతుకమ్మ ఆటలతో తెలంగాణా ప్రాంతాలు సందడిగా ఉంటాయి. నవరాత్రుల్లో ఆరవరోజు బతుకమ్మ ఆడరు. ఎక్కువమంది ఆశ్వయుజ అష్టమి నాడు అంటే దుర్గాష్టమి రోజున బతుకమ్మ ఆట ఆడతారు. ఈరోజును బతుకమ్మ పండుగ లేదా సుద్దుల పండుగ అంటారు.

 

బతుకమ్మను అలంకరించడం ఒక కళ. బంతి, చేమంతి లాంటి అయిదు రకాల పుష్పాలతో అందంగా తయారుచేస్తారు. ముఖ్యంగా తంగేడు, గునగ పూలు, ఆకులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఒక విశాలమైన పళ్ళెంలో రంగురంగుల పూలను ఒక క్రమపద్ధతిలో పేరుస్తారు. పసుపుముద్దతో రూపొందించిన గౌరీదేవిని కూడా పళ్ళెంలో ఉంచుతారు. ఈ బతుకమ్మను పూజామందిరంలో ఉంచి పూజ చేసిన తర్వాత ఖాళీ స్థలంలో పెడతారు. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కూడా ఇదే మాదిరిగా బతుకమ్మలను ఒకచోట పేర్చుతారు. ఇక అందరూ కలిసి సందడి చేస్తూ బతుకమ్మ ఆడతారు. పేలప్పిండి, బెల్లం, పిండివంటలతో కూడిన వాయనాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు.

 

నవరాత్రి ఉత్సవాల్లో ఏరోజుకారోజు బతుకమ్మను రూపొందించి, సుమాలతో అందంగా అలంకరించి, చుట్టూ తిరుగుతూ ''బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..'' అంటూ పాటలు పాడుతూ వేడుక చేసుకుంటారు. ఏరోజుకారోజు బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. అన్నిరోజులూ బతుకమ్మ ఆడటం కుదరనివారు దుర్గాష్టమి రోజున తప్పక ఆడి, దగ్గర్లో ఉన్న చెరువు లేదా నదిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ నిమజ్జనం తర్వాత దసరా పండుగ జరుపుకుంటారు.. జమ్మి ఆకులను పెద్దల చేతికి ఇచ్చి, వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. బతుకమ్మ పూజల సందర్భాన్ని పురస్కరించుకుని ఆడపడుచులు పుట్టింటికి వెళ్ళడం ఆనవాయితీ.

 

బతుకమ్మ పండుగ తెలంగాణా ప్రాంతాల్లో పెద్ద పండుగ. శరన్నవరాత్రుల్లో ఇళ్లే కాకుండా వీధులు కూడా కళకళలాడతాయి.

Telangana Bathukamma Festival, Telangana Bathukamma Celebration, Telangana Bathukamma Panduga,Telangana Festival Batukamma,Bathukamma Festival in Telangana, Telangana batukamma sambaralu

Durgashtami

Mahanavami

Batukamma songs

Vijaya Dasami

Sakthi Peethas

Dussehra Greetings